Skip to content
సూరాల జాబితా /

الشُّورى

الشُّورى is chapter 42 of the Quran and has 53 verses. This page presents it in full in the Uthmani script, with a verse-by-verse translation of its meaning.

53 ఆయతులు సూరా సంఖ్య 42
ఆయత్‌కు వెళ్ళండి
తెలుగు · Muhammad
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ

حمٓ

హా - మీమ్.

Explanation & meanings · 1
  1. సూరతుల్ బఖరహ్ లోని మొదటి ఆయతు యొక్క ఫుట్‌నోట్ చూడండి.

عٓسٓقٓ

ఐన్ - సీన్ - ఖాఫ్,

Explanation & meanings · 1
  1. సూరతుల్ బఖరహ్ లోని మొదటి ఆయతు యొక్క ఫుట్‌నోట్ చూడండి.

كَذَٰلِكَ يُوحِيٓ إِلَيۡكَ وَإِلَى ٱلَّذِينَ مِن قَبۡلِكَ ٱللَّهُ ٱلۡعَزِيزُ ٱلۡحَكِيمُ

(ఓ ముహమ్మద్!) సర్వశక్తిమంతుడూ, మహావివేకవంతుడూ అయిన అల్లాహ్, ఇదే విధంగా నీకూ మరియు నీ కంటే ముందు వచ్చిన వారికి కూడా దివ్యజ్ఞానం (వహీ) అవతరింపజేశాడు.

Explanation & meanings · 1
  1. ఏ విధంగానైతే దైవప్రవక్త ('స'అస)పై దివ్యజ్ఞానం అవతరింపజేయబడిందో, అదే విధంగా అతనికి ముందు వచ్చిన ప్రవక్తలపై కూడా అవతరింపజేయబడింది. దైవప్రవక్త ('స'అస) పై వ'హీ అవతరణను గురించి, ఒక 'స'హాబీ (ర'ది.'అ), దైవప్రవక్త ('స'అస) ను ప్రశ్నించగా ఇలా అన్నారు : "కొన్ని సార్లు అది (వ'హీ) నా దగ్గరకు ఘంటల శబ్దం వలే వస్తుంది. ఇది చాలా కఠినతరమైనది. అది ఆగిన తరువాత నాకు అంతా కంఠస్తమైపోతుంది. కొన్నిసార్లు దైవదూత ('అ.స.) మానవరూపంలో వచ్చి నాకు చెబుతాడు. అతను చెప్పినదంతా నాకు జ్ఞాపకమైపోతుంది." 'ఆయిషహ్ (ర.'అన్హా) అన్నారు : "నేను విపరీతమైన చలికాలంలో కూడా, వ'హీ అవతరణ ముగిసిన తరువాత, దైవప్రవక్త ('స'అస) ను చెమటలో మునిగి పోవటాన్ని చూశాను. మరియు అతని నుదుటి నుండి చెమట బిందువులు కారటం కూడా చూశాను." ('స'హీ'హ్ బు'ఖారీ).

لَهُۥ مَا فِي ٱلسَّمَٰوَٰتِ وَمَا فِي ٱلۡأَرۡضِۖ وَهُوَ ٱلۡعَلِيُّ ٱلۡعَظِيمُ

ఆకాశాలలో మరియు భూమిలో ఉన్నదంతా ఆయనకు చెందినదే. ఆయన మహోన్నతుడు, సర్వోత్తముడు.

تَكَادُ ٱلسَّمَٰوَٰتُ يَتَفَطَّرۡنَ مِن فَوۡقِهِنَّۚ وَٱلۡمَلَٰٓئِكَةُ يُسَبِّحُونَ بِحَمۡدِ رَبِّهِمۡ وَيَسۡتَغۡفِرُونَ لِمَن فِي ٱلۡأَرۡضِۗ أَلَآ إِنَّ ٱللَّهَ هُوَ ٱلۡغَفُورُ ٱلرَّحِيمُ

ఆకాశాలు, పై నుండి దాదాపు ప్రేలి పోనున్నాయి. మరియు దేవదూతలు తమ ప్రభువు పవిత్రతను కొనియాడుతూ, ఆయనను స్తుతిస్తూ ఉన్నారు మరియు భూమిలో ఉన్నవారి కొరకు క్షమాపణ కోరుతున్నారు. చూడండి, నిశ్చయంగా అల్లాహ్! ఆయనే క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత.