Skip to content
సూరాల జాబితా /

الزُّخرُف

الزُّخرُف is chapter 43 of the Quran and has 89 verses. This page presents it in full in the Uthmani script, with a verse-by-verse translation of its meaning.

89 ఆయతులు సూరా సంఖ్య 43
ఆయత్‌కు వెళ్ళండి
తెలుగు · Muhammad
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ

حمٓ

హా - మీమ్.

Explanation & meanings · 1
  1. సూరతుల్ బఖరహ్ లోని మొదటి ఆయతు యొక్క ఫుట్‌నోట్ చూడండి.

وَٱلۡكِتَٰبِ ٱلۡمُبِينِ

స్పష్టమైన ఈ గ్రంథం (ఖుర్ఆన్) సాక్షిగా!

Explanation & meanings · 1
  1. చూడండి, 12:1.

إِنَّا جَعَلۡنَٰهُ قُرۡءَٰنًا عَرَبِيّٗا لَّعَلَّكُمۡ تَعۡقِلُونَ

నిశ్చయంగా, మీరు అర్థం చేసుకోగలగటానికి, మేము దీనిని అరబ్బీ భాషలో ఖుర్ఆన్ గా అవతరింపజేశాము.

Explanation & meanings · 1
  1. ఖుర్ఆనున్ / ఖుర్ఆనన్ : దీని పదార్థాలు సంభాషణ, ప్రసంగం, ఉపన్యాసం, పఠనగ్రంథం, Recitation, Talk, Lecture, Discourse, Sermon, అని ఉన్నాయి. అల్-ఖుర్ఆను అంటే ఈ ఖుర్ఆన్ గ్రంథం. అల్ ఖుర్ఆనుల్-కరీమ్ అంటే The Glorious Quran, ఈ దివ్యఖుర్ఆన్.

وَإِنَّهُۥ فِيٓ أُمِّ ٱلۡكِتَٰبِ لَدَيۡنَا لَعَلِيٌّ حَكِيمٌ

మరియు నిశ్చయంగా, ఇది మా వద్ద నున్న మాతృ గ్రంథంలోనిదే! అది మహోన్నతమైనది, వివేకంతో నిండి ఉన్నది.

Explanation & meanings · 1
  1. ఉమ్ముల్ కితాబ్ : చూడండి, 13:39, 85:22 అంటే లౌ'హె మ'హ్ ఫూ''జ్. మాతృగ్రంథం, సురక్షితమైన ఫలకం, మూలగ్రంథం. అంటే యథాస్థితిలో, భద్రంగా ఉంచబడిన గ్రంథం.

أَفَنَضۡرِبُ عَنكُمُ ٱلذِّكۡرَ صَفۡحًا أَن كُنتُمۡ قَوۡمٗا مُّسۡرِفِينَ

ఏమిటి? మీరు మితిమీరి ప్రవర్తిస్తున్నారని, మేము ఈ హితోపదేశాన్ని (ఖుర్ఆన్ ను) మీ నుండి తొలగించాలా?

Explanation & meanings · 1
  1. మీరు మితిమీరి ప్రవర్తిస్తున్నారని మేము మీకు హితబోధ చేయటం మానుకుంటామని భావిస్తున్నారా? (ఇబ్నె-కసీ'ర్).