42 : 38
وَٱلَّذِينَ ٱسۡتَجَابُواْ لِرَبِّهِمۡ وَأَقَامُواْ ٱلصَّلَوٰةَ وَأَمۡرُهُمۡ شُورَىٰ بَيۡنَهُمۡ وَمِمَّا رَزَقۡنَٰهُمۡ يُنفِقُونَ
మరియు అలాంటి వారు తమ ప్రభువు ఆజ్ఞాపాలన చేస్తారు మరియు నమాజ్ ను స్థాపిస్తారు మరియు తమ వ్యవహారాలను పరస్పర సంప్రదింపుల ద్వారా పరిష్కరించు కుంటారు మరియు మేము వారికి ప్రసాదించిన జీనవోపాధి నుండి ఇతరుల మీద ఖర్చు చేస్తారు;
Explanation & meanings · 2
- నమా'జ్ ను సరిగ్గా, దాని సమయంలో చేయటం విశ్వాసానికి ఆనవాలు.
- 'స'హాబా (ర'ది.'అన్హుమ్)లు తమ విషయాలలో పరస్పరం సంప్రదింపులు, సలహాలు చేసుకునేవారు. దైవప్రవక్త ('స'అస) కూడా ముఖ్యమైన విషయాలలో, యుద్ధ సన్నాహాలలో తమ అనుచరు(ర'ది.'అన్హుమ్)లతో సంప్రదింపులు చేసేవారు. ఒక పాలకుడు కూడ తనకు సలహాలివ్వటానికి నిపుణులను నియమించుకోవడం ఎంతో ముఖ్యం. చూడండి, 3:159.