Skip to content
సూరాల జాబితా /

فُصِّلَت

فُصِّلَت is chapter 41 of the Quran and has 54 verses. This page presents it in full in the Uthmani script, with a verse-by-verse translation of its meaning.

54 ఆయతులు సూరా సంఖ్య 41
ఆయత్‌కు వెళ్ళండి
తెలుగు · Muhammad
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ

حمٓ

హా - మీమ్.

Explanation & meanings · 1
  1. సూరతుల్ బఖరహ్ లోని మొదటి ఆయతు యొక్క ఫుట్‌నోట్ చూడండి.

تَنزِيلٞ مِّنَ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ

దీని (ఈ ఖుర్ఆన్) అవతరణ అనంత కరుణామయుడు, అపార కరుణా ప్రదాత తరఫు నుండి జరిగింది.

كِتَٰبٞ فُصِّلَتۡ ءَايَٰتُهُۥ قُرۡءَانًا عَرَبِيّٗا لِّقَوۡمٖ يَعۡلَمُونَ

ఇదొక గ్రంథం, దీని సూచనలు (ఆయాత్) తెలివి గలవారి కొరకు, అరబ్బీ భాషలో స్పష్టమైన ఉపన్యాసంగా (ఖుర్ఆన్ గా) వివరించబడ్డాయి.

Explanation & meanings · 1
  1. చూడండి, 12:2.

بَشِيرٗا وَنَذِيرٗا فَأَعۡرَضَ أَكۡثَرُهُمۡ فَهُمۡ لَا يَسۡمَعُونَ

(స్వర్గపు) శుభవార్తనిచ్చేదిగా మరియు హెచ్చరించేదిగా; అయినా చాలా మంది దీని పట్ల విముఖత చూపుతున్నారు, కాబట్టి వారు వినటం లేదు.

وَقَالُواْ قُلُوبُنَا فِيٓ أَكِنَّةٖ مِّمَّا تَدۡعُونَآ إِلَيۡهِ وَفِيٓ ءَاذَانِنَا وَقۡرٞ وَمِنۢ بَيۡنِنَا وَبَيۡنِكَ حِجَابٞ فَٱعۡمَلۡ إِنَّنَا عَٰمِلُونَ

మరియు వారు ఇలా అన్నారు: "నీవు దేనివైపునకైతే మమ్మల్ని పిలుస్తున్నావో, దాని పట్ల మా హృదయాల మీద తెరలు కప్పబడి ఉన్నాయి; మరియు మా చెవులలో చెవుడు ఉంది మరియు నీకూ మాకూ మధ్య ఒక అడ్డు తెర ఉంది; కావున నీవు నీ పని చేయి, మేము మా పని చేస్తాము."

Explanation & meanings · 1
  1. చూడండి, 7:46, 6:25.