సాధారణంగా ఒకస్త్రీ యొక్క ఋతుకాలం ఏడు లేక ఎనిమిది రోజులు ఉంటుంది. అయితే ఒకటి, రెండు సార్లు ఎనిమిది దినాలకు మించి ఋతుకాలం కొనసాగితే, దాని ఆదేశం ఏమిటి?
- الموضوعات
- الطهارةأحكام الحيض والنفاس
- التصنيف الشرعي
- الفقهالطهارةالحيض والنفاس والاستحاضة
السؤال
1వ ప్రశ్న:
సాధారణంగా ఒకస్త్రీ యొక్క ఋతుకాలం ఏడు లేక ఎనిమిది రోజులు ఉంటుంది. అయితే ఒకటి, రెండు సార్లు ఎనిమిది దినాలకు మించి ఋతుకాలం కొనసాగితే, దాని ఆదేశం ఏమిటి?
س4: إذا كانت المرأة عادتها الشهرية ثمانية أيامٍ أو سبعة أيامٍ، ثم استمرت معها مرةً أو مرتين أكثر من ذلك، فما الحكم؟
الجواب
జవాబు:
సాధారణంగా ఒక స్త్రీ ఋతుకాలం 6 లేదా 7 రోజులు ఉంటుంది. కొన్నిసార్లు అది 8, 9, 10 లేదా 11 రోజుల వరకు కొనసాగ వచ్చు. ఆ సందర్భంలో ఆమె పరిశుద్ధత (తహారత్) పొందేంత వరకు సలాహ్ (నమాజు) చేయకూడదు, ఉపవాసం పాటించకూడదు.
ఎందుకంటే దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఋతుకాలానికి సంబంధించి ఒక నిర్దిష్ట సమయాన్ని ఖరారు చేయలేదు.
అల్లాహు తఆల ఇలా సెలవిచ్చాడు: {وَيَسْأَلُونَكَ عَنِ الْمَحِيضِ قُلْ هُوَ أَذًى} [البقرة:222] "మరియు వారు నిన్ను స్త్రీల ఋతుకాలం గురించి అడుగుతున్నారు. నీవు వారికి ఇలా తెలుపు: "అదొక అపరిశుద్ధ (హానికరమైన) స్థితి.
కనుక ఈ రక్తస్రావం ఎప్పటి వరకు కొనసాగుతూ ఉంటుందో, అప్పటి వరకు స్త్రీ అదే అపరిశుద్ధ స్థితిలో ఉంటుంది. చివరికి పరిశుద్ది పొంది, గుసుల్ ఆచరించే వరకు వేచి ఉండాలి. ఆ తరువాత మాత్రమే సలాహ్ (నమాజు) ఆచరించవలసి ఉంటుంది. తదుపరి నెలలో మునుపటి నెలసరి వ్యవధి కంటే ముందే శుద్ది పొందినట్లయితే, వెంటనే గుసుల్ ఆచరించాలి, అది మునుపటి నెలసరి సమయం కంటే తక్కువైనా సరే!
కావున స్త్రీ బహిష్టులో ఉన్నంత వరకు నమాజు చేయరాదు. ఆ ఋతుస్రావం మునుపటి నెల ప్రకారంగా ఉన్నా, పెరిగినా లేక తరిగినా సరే శుద్ది పొందగానే గుసుల్ చేసి సలాహ్ (నమాజు) ఆచరించ వలసి ఉంటుంది.
ﺟ4: إذا كانت عادة هذه المرأة ستة أيامٍ أو سبعةً، ثم طالت هذه المدة، وصارت ثمانيةً أو تسعةً أو عشرةً أو أحد عشر يومًا فإنها تبقى لا تصلّي حتى تطهر،
وذلك لأن النبي ﷺ لم يحد حدًّا معيّنًا في الحيض، وقد قال الله تعالى:
﴿وَيَسۡـَٔلُونَكَ عَنِ ٱلۡمَحِيضِۖ قُلۡ هُوَ أَذٗى...﴾
[البقرة:222]،
فمتى كان هذا الدم باقيًا فإن المرأة على حالها حتى تطهر، وتغتسل، ثم تصلّي، فإذا جاءها في الشهر الثاني ناقصًا عن ذلك فإنها تغتسل إذا طهرت وإن لم يكن على المدة السابقة.
والمهمّ أن المرأة متى كان الحيض معها موجودًا فإنها لا تصلّي، سواءٌ كان الحيض موافقًا للعادة السابقة، أو زائدًا عنها، أو ناقصًا، وإذا طهرت تصلّي.