Skip to content

24వ ప్రశ్న: మహిమ (అద్భుతం) అంటే ఏమిటి ?

التصنيف الشرعي
العقيدة
الباب / الفصل
قسم العقيدة

السؤال

س٢٤: ما هي المعجزة؟

24వ ప్రశ్న: మహిమ (అద్భుతం) అంటే ఏమిటి ?

الجواب

ج:المعجزة: هي كل ما أعطاه الله لأنبيائه من خوارق العادات؛ للدلالة على صدقهم، مثل:

  • شق القمر للنبي صلى الله عليه وسلم.

قال تعالى:

﴿ٱقۡتَرَبَتِ ٱلسَّاعَةُ وَٱنشَقَّ ٱلۡقَمَرُ *

وَإِن يَرَوۡاْ ءَايَةٗ يُعۡرِضُواْ وَيَقُولُواْ سِحۡرٞ مُّسۡتَمِرّٞ*

وَكَذَّبُواْ وَٱتَّبَعُوٓاْ أَهۡوَآءَهُمۡۚ وَكُلُّ أَمۡرٖ مُّسۡتَقِرّٞ﴾

[القمر: ١-٣]

  • وشق البحر لموسى عَلَيْهِ السَّلَامُ، وإغراق فرعون وجنوده.

﴿وَإِذۡ فَرَقۡنَا بِكُمُ ٱلۡبَحۡرَ فَأَنجَيۡنَٰكُمۡ وَأَغۡرَقۡنَآ ءَالَ فِرۡعَوۡنَ وَأَنتُمۡ تَنظُرُونَ﴾

[البَقَرَةِ: ٥٠].

ప్రతి అసాధారణమైన, అస్వభావికమైన, మానవాతీతమైన, ప్రకృతికి అతీతమైన అతీంద్రియ చర్య లేదా సంఘటనను (మోజిజా) అంటే మహిమ లేదా అద్భుతం అంటారు. మహోన్నతుడైన అల్లాహ్ తన ప్రవక్తలకు తమ నిజాయితీని నిరూపించుకోవడానికి మద్దతుగా వారికి కొన్ని మహిమలు, అద్భుతాలు ప్రసాదించాడు. ఉదాహరణకు:

  • దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కొరకు చంద్రుడు రెండు ముక్కలవటం.

మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

[ఆ ఘడియ దగ్గరకు వచ్చింది మరియు చంద్రుడు పూర్తిగా చీలిపోయాడు.

అయినా (సత్యతిరస్కారులు), అద్భుత సూచనను చూసినా తమ ముఖాలను త్రిప్పుకుంటున్నారు. మరియు: "ఇది ఎప్పటినుంచో జరుగుతూ వస్తున్న మంత్రజాలమే." అని అంటున్నారు.

మరియు వారు దీనిని (ఈ ఖుర్ఆన్ ను) అసత్యమని తిరస్కరించారు. మరియు తమ మనోవాంఛలను అనుసరించారు. మరియు ప్రతి వ్యవహారం ఒక పర్యవసానానికి చేరవలసి ఉంటుంది.}

[అల్ ఖమర్: 49]

మూసా అలైహిస్సలాం (అల్లాహ్ ఆజ్ఞతో) సముద్రాన్ని రెండుగా చీల్చడం, ఫిరౌనును మరియు అతడి సైన్యాన్ని అందులో ముంచి వేయడం.

{మరియు మేము మీ కొరకు సముద్రాన్ని చీల్చి మిమ్మల్ని రక్షించి నప్పుడు మీరు చూస్తూ ఉండగానే ఫిర్ఔన్ జాతి వారిని ముంచి వేసిన సంఘటనను (గుర్తుకు తెచ్చుకోండి).}

[అల్ బఖర: 50]