Skip to content
837 హదీసులు

ప్రవక్త హదీసుల విజ్ఞాన సర్వస్వం

ఫలితాలను ఫిల్టర్ చేయండి

837 లో 23 కార్డులు

ఫిల్టర్లను తీసివేయి
“నేను ముస్లిములపై ఎక్కువ భారం వేస్తున్నానేమో అనే సందేహం లేకపోయినట్లయితే (జుబైర్ రదియల్లాహు అన్హు ఉల్లేఖించిన ఇదే హదీసులో “....నా ఉమ్మత్’పై ఎక్కువ భారం వేస్తున్నానేమో” అనే పదాలు ఉన్నాయి) నిశ్చయంగా ప్రతి నమాజు సమయాన ‘సివాక్’ (పలుదోము పుల్ల) వాడమని ఆదేశించి ఉండేవాడిని.”
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
“మీలో ఎవరైనా నాపై ‘సలాం’ పంపినట్లయితే, అతనిపై తిరిగి ‘సలాం’ పంపుటకుగానూ అల్లాహ్ నా ఆత్మను తిరిగి పంపుతాడు.”
దాని ఆధారాలు ప్రామాణికమైనవి. అబూదావూద్ మరియు అహ్మద్ నమోదు చేసినారు:
“మేము (హిజ్రత్ ప్రయాణంలో) గుహలో ఉన్నప్పుడు, బహుదైవారాధకుల పాదాలు మా తలలకు దగ్గరలోనే ఉండటాన్ని నేను చూసి, నేను ఇలా అన్నాను: ఓ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం! వారిలో ఎవరైనా ఒకడు తన పాదాల వైపు చూస్తే, అతడి పాదాల దగ్గర మనం అతడికి కనబడతాము”. దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు:"ఓ అబూ బకర్, ఆ ఇద్దరు వ్యక్తుల గురించి ఏమంటావు, ఎవరితోనైతే మూడవ వాడుగా అల్లాహ్ ఉంటాడో?"
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
“రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎపుడైనా తుమ్మినపుడు - తుమ్ము శబ్దాన్ని అణచివేయడానికి, లేదా తక్కువ చేయడానికి - తన చేతిని గానీ లేదా ఏదైనా వస్త్రాన్ని గానీ తన నోటికి అడ్డుగా పెట్టుకునేవారు.”
ప్రామాణికమైన హదీథు అబూదావూద్, అత్తిర్మిదీ మరియు అహ్మద్ నమోదు చేసినారు:
«నిశ్చయంగా నేను శపించేవానిగా పంపబడలేదు, దానికి బదులు కారుణ్యంగా పంపబడ్డాను»
ప్రామాణికమైన హదీథు ముస్లిం నమోదు చేసినారు:
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరణించినప్పుడు తన తెల్లని కంచరగాడిదను, తన ఆయుధాలను మరియు దానంగా ఇచ్చిన భూమిని మాత్రమే వదలి వెళ్ళారు. ఇవి తప్ప ఆయన ఒక్క దిర్హముగాని, దీనారుగాని, బానిసగాని, బానిసరాలిని గాని, మరే వస్తువును కూడా వదలి వెళ్ళలేదు.
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ నమోదు చేసినారు:
రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లంకు మరణం సమీపించినప్పుడు, ఆయన చివరిగా ముఖ్యమైన ఉపదేశం చేసినారు: "నమాజును (సలాత్) పాటించండి, మీ కుడి చేయి కలిగి ఉన్న వారిని (మీ ఆధీనంలో ఉన్న మీ సేవకులను, బానిసలను) దయగా చూడండి. నమాజును పాటించండి, మీ ఆధీనంలో ఉన్న వారిని దయగా చూడండి." రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం మరణదశలో కూడా ఆయన గుండెలో ఈ మాటలు ప్రతిధ్వనించాయి, ఆయన నాలుక మీద కూడా ఈ పదాలు చివరి వరకు వినిపించాయి.
ప్రామాణికమైన హదీథు رواه النسائي في السنن الكبرى وابن ماجه
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహాబాలలో నుండి ఒక బృందం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం భార్యల వద్దకు వచ్చి, "ఆయన సల్లల్లాహు అలైహి వ సల్లం ఏకాంతంలో ఏయే పనులు (ఆరాధనలు) చేస్తారు?" అని అడిగినారు, వారిలో కొందరు ఇలా అన్నారు: నేను స్త్రీలను వివాహం చేసుకోను. మరికొందరు ఇలా అన్నారు: నేను మాంసం తినను. మరికొందరు ఇలా అన్నారు: నేను మంచం మీద పడుకోను. ఇది తెలిసిన తరువాత ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం మొదట అల్లాహ్‌ను స్తుతించారు, తరువాత ఆయనను ప్రశంసించి, ఇలా పలికినారు: "నేను అలా చేయ్యను, నేను ఇలా చేయ్యను అని చెప్పిన వారి గతి ఏమిగాను? నిజానికి, నేను నమాజు చేస్తాను మరియు నిద్ర పోతాను, నేను ఉపవాసం ఉంటాను మరియు ఉపవాసం విరమిస్తాను మరియు నేను స్త్రీలను వివాహం చేసుకుంటాను. నా సున్నతు నుండి తప్పుకున్నవాడు నాకు చెందినవాడు కాదు."
ప్రామాణికమైన హదీథు అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు