మరియు ఎవరైతే ఇస్లాంలో ప్రవేశించాలని కోరుకుంటారో వారు : (అష్ హదు అన్ లాఇలాహ ఇల్లల్లాహు వ అష్ హదు అన్న ముహమ్మదన్ రసూలుల్లాహ్) నేను సాక్ష్యమిస్తున్నాను అల్లాహ్ తప్ప నిజఆరాధ్య దైవం ఎవ్వరూ లేరని మరియు నేను సాక్ష్యమిస్తున్నాను ముహమ్మద్ అల్లాహ్ యొక్క ప్రవక్త అని. దీని అర్ధాన్ని మరియు దీనిపై విశ్వాసాన్ని కలిగి పఠించాలి. ఈ విధంగా అతను ముస్లిం అవుతాడు. ఆతర్వాత అల్లాహ్ తనపై విధించిన వాటిని నెరవేర్చడానికి అతను ఇస్లాం యొక్క మిగిలిన చట్టాలను క్రమంగా నేర్చుకోవాలి.
మరియు ఎవరైతే ఇస్లాంలో ప్రవేశించాలని కోరుకుంటారో వారు : (అష్ హదు అన్ లాఇలాహ ఇల్లల్లాహు వ అష్ హదు అన్న ముహమ్మదన్ రసూలుల్లాహ్) నేను సాక్ష్యమిస్తున్నాను అల్లాహ్ తప్ప నిజఆరాధ్య దైవం ఎవ్వరూ లేరని మరియు నేను సాక్ష్యమిస్తున్నాను ముహమ్మద్ అల్లాహ్ యొక్క ప్రవక్త అని. దీని అర్ధాన్ని మరియు దీనిపై విశ్వాసాన్ని కలిగి పఠించాలి. ఈ విధంగా అతను ముస్లిం అవుతాడు. ఆతర్వాత అల్లాహ్ తనపై విధించిన వాటిని నెరవేర్చడానికి అతను ఇస్లాం యొక్క మిగిలిన చట్టాలను క్రమంగా నేర్చుకోవాలి.
మరిన్ని వివరాలకు:
ప్రకృతి మరియు హేతుబద్ధమైన మరియు సౌజన్యమైన ధర్మము .
అనంత కరుణామయుడు అపార కరుణా ప్రధాత అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభం
మీరు ఎప్పుడైనా మీ స్వయాన్ని ప్రశ్నించుకున్నారా:
ఆకాశాలను, భూమిని, మరియు వాటిలోని గొప్ప జీవులన్నింటినీ సృష్టించినవాడు ఎవరు? మరియు వాటిలో ఈ సూక్ష్మమైన, పరిపూర్ణమైన వ్యవస్థను రూపొందించినవాడు ఎవరు?
ఈ అద్భుతమైన విశ్వం దాని నియమాలతో సంవత్సరాలు తరబడి ఇంత ఖచ్చితంగా ఎలా నియంత్రించబడుతోంది మరియు స్థిరంగా ఎలా ఉంది?
ఈ విశ్వం తనకు తానే సృష్టించుకుందా? లేదా ఇది శూన్యం నుండి ఉద్భవించిందా? లేదా ఇది యాదృచ్చికంగా ఏర్పడిందా?
నిన్ను ఎవరు సృష్టించారు?
ఈ సూక్ష్మమైన, ఖచ్చితమైన వ్యవస్థను మీ శరీరంలో మరియు ఇతర జీవుల శరీరాలలో ఎవరు ఏర్పాటు చేశారు?
ఈ గృహం ఎవ్వరూ నిర్మించకుండానే తయారైనది అని చెప్పినా లేదా ఈ గృహం శూన్యం నుంచి ఏర్పడింది అని చెప్పినా ఏ ఒక్కరూ అంగీకరించరు. మరి అలాంటప్పుడు కొంత మంది ఈ విశ్వం సృష్టికర్త లేకుండా ఏర్పడింది అంటే ఎలా నమ్ముతారు? ఒక బుద్ధిమంతుడు ఈ విశ్వం యొక్క నిర్ధిష్టమైన క్రమపద్ధతి యాదృచ్చికంగా ఏర్పడింది అంటే ఎలా నమ్మగలడు?
ఖచ్చితంగా, ఈ విశ్వం మరియు ఇందులోని ఉన్నటువంటి వాటికి గొప్ప సృష్టికర్త మరియు కార్యనిర్వహణకర్త ఉన్నాడు. ఆయనే అల్లాహ్ పవితృడు మరియు మహోన్నతుడు.
మరియు పవితృడైన ప్రభువు మన వద్దకు ప్రవక్తలను పంపాడు. మరియు వారిపై దైవ గ్రంధాలను అవతరింపజేశాడు. ఇందులో చిట్టచివరి గ్రంధం దివ్యఖుర్ఆన్, దీనిని అల్లాహ్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అవతరింపజేశాడు, ఆయన అల్లాహ్ యొక్క అంతిమ ప్రవక్త. మరియు ఆయన గ్రంధాలు మరియు ప్రవక్తల ద్వారా :
ఆయన్ను, ఆయన గుణగణాలను, మనపై ఆయనకున్న హక్కును, ఆయనపై మన హక్కును తెలియపరిచాడు.
మరియు సమస్త సృష్టిని సృష్టించిన ప్రభువు ఆయనేనని మరియు ఆయన సజీవుడు మరణం లేనివాడు అని మనకు మార్గనిర్దేశం చేశాడు. మరియు సృష్టి అంతా ఆయన ఆధీనంలో ఆయన ఆధిపత్యం క్రింద, ఆయన నియంత్రణలో ఉంది.
మరియు ఆయన గుణాలలో ఒకటి జ్ఞానము ఆయన జ్ఞానంతో ప్రతి వస్తువును పరివేష్టించి ఉన్నాడని మనకు తెలియజేయబడింది. మరియు ఆయన సమస్తమూ వినేవాడు అన్నీ చూసేవాడు భూమ్యాకాశాలలో ఆయన నుంచి ఏ విషయం దాగి ఉండదు.
మరియు ప్రభువు సజీవుడు ఆధారభూతుడు ఆయన నుండే ప్రతి జీవి జీవనాన్ని పొందుతుంది. మరియు సృష్టి యొక్క జీవనం ఆయనపైనే ఆధారపడి ఉంది. ఆయన ఇలా సెలవిచ్చాడు:అల్లాహ్ (మాత్రమే నిజానికి ఆరాధ్య దైవం). ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేనేలేడు. ఆయన సజీవుడు; అన్నింటికీ మూలాధారం. ఆయనకు కునుకుగానీ, నిద్రగానీ పట్టదు. భూమ్యాకాశాలలో ఉన్న సమస్తమూ ఆయన అధీనంలో ఉంది. ఆయన అనుమతి లేకుండా ఆయన సమక్షంలో సిఫారసు చేయగలవాడెవడు? వారికి ముందు ఉన్న దానినీ, వెనుక ఉన్నదానిని కూడా ఆయన ఎరుగు. ఆయన కోరినది తప్ప ఆయనకున్న జ్ఞానంలోని ఏ విషయమూ వారి గ్రాహ్యపరిధిలోకి రాదు. ఆయన కుర్చీ వైశాల్యం భూమ్యాకాశాలను చుట్టుముట్టి ఉంది. వాటిని రక్షించటానికి ఆయన ఎన్నడూ అలసిపోడు. ఆయన సర్వోన్నతుడు, గొప్పవాడు.[సూరతుల్ బఖరా: 255]
⦁ మరియు ఆయన సంపూర్ణ గుణాలతో కలగలసిన ప్రభువని మాకు తెలియజేశాడు. మరియు ఆయన సృష్టి అధ్బుతాలను మరియు ఆయన సామర్ధ్యాన్ని వీక్షించటానికి మనకు ఆయన బుద్ధిని మరియు ఇంద్రియాలను ప్రసాదించాడు. తద్వారా ఆయన గొప్పదనం మరియు ఆయన శక్తి మరియు ఆయన గుణాల పరిపూర్ణతను వెల్లడి చేశాడు మరియు ఆయన పరిపూర్ణతను సూచించే సహజమైన స్వభావాన్ని మనలో నాటాడు. మరియు అసంపూర్ణత ఆయనకు ఆపాదించటం అసాధ్యం.
⦁ మరియు ప్రభువు ఆకాశాలపైన ఉన్నాడని ఈ విశ్వంలోని భాగం కాదని మరియు ఈ విశ్వం ఆయనలో లీనం కాదని తెలియజేశాడు.
⦁ మహోన్నతుడైన అల్లాహ్ మన సృష్టికర్త, ఈ సృష్టి అంతటినీ రూపొందించినవాడు, మరియు దాని వ్యవస్థాపకుడు కూడా కాబట్టి – మనం ఆయనకు సంపూర్ణంగా లోబడి ఉండాలి అని ఆయన మనకు తెలియజేశాడు.
కనుక సృష్టికర్త గొప్ప గుణ గణాలు కలిగినవాడు మరియు ఏ విధమైన అసంపూర్ణతను , అవసరాన్ని ఆయనకు ఆపాదించటం(అసాధ్యం) తగదు. ఎందుకంటే ప్రభువు మరచిపోడు మరియు నిదురించడు మరియు అన్నపానియాలు సేవించడు. ఆయన భార్య లేదా సంతానం కలిగి ఉండటం అసాధ్యం. మరియు సృష్టికర్త యొక్క గొప్పతనానికి విరుద్ధమైన అన్ని గ్రంథాలు దేనినైతే ప్రవక్తలు (అల్లాహ్ యొక్క శాంతి వారిపై కలుగుగాక) తీసుకువచ్చారో అవి నిజమైన దైవవాణి కావు.
నీవు సృష్టికర్తయైన ప్రభువును నమ్ముతుంటే... నీ సృష్టి వెనుక ఉన్న ఉద్దేశ్యం ఏమిటి అని నీవు ఎప్పుడైనా ఆలోచించావా? అల్లాహ్ మన నుండి ఏమి ఆశిస్తున్నాడు, మరియు మన ఉనికికి ఉన్న లక్ష్యం ఏమిటి?
ఏమిటి అల్లాహ్ మనల్ని సృష్టించి ఆతరువాత నిర్లక్ష్యంగా వదలివేసాడా? అల్లాహ్ ఈ సమస్త సృష్టిని ఏవిధమైన లక్ష్యం మరియు ఉద్దేశ్యం లేకుండా సృష్టించాడా?
వాస్తవానికి మహోన్నతుడైన సృష్టికర్త ప్రభువు "అల్లాహ్" మనకు మన సృష్టి యొక్క ఉద్దేశ్యాన్ని తెలియజేశాడు, అది ఏకైక అల్లాహ్ యొక్క ఆరాధన. మరియు ఆయన మా నుంచి ఏమి కోరుతున్నాడో మనకు తెలియజేశాడు ఆయన మాత్రమే ఆరాధనలకు అర్హుడు. మరియు ఆయన ప్రవక్తల ద్వారా ఆయన్ని ఎలా ఆరాధించాలో వివరించాడు. మరియు ఆయన ఆదేశాలను ఆచరించి ఆయన నిషేధించిన వాటిని విడిచి ఎలా ఆయనకు దగ్గరవ్వాలో తెలియజేశాడు. మరియు ఆయన ప్రసన్నతను ఎలా పొందాలి? మరియు ఆయన శిక్ష నుండి ఎలా రక్షించుకోవాలి? మరియు మరణం తరువాత ఎక్కడకు చేరుతామో తెలియజేశాడు.
ఈ ఇహలోక జీవితం ఒక పరీక్ష మాత్రమే అని మరియు వాస్తవ సంపూర్ణ జీవితం మరణం తరువాత పరలోకంలో లభిస్తందని ఆయన మనకు తెలియజేశాడు.
మరియు ఎవరైతే ఆయన ఆదేశించినట్లుగా ఆరాధిస్తారో, ఆయన నిషేధించిన వాటికి దూరంగా ఉంటారో: వారికి ఇహలోకంలో మంచి జీవితం మరియు పరలోకంలో శాశ్వత అనుగ్రహం లభిస్తుందని ఆయన మనకు తెలియజేశాడు. మరియు ఎవరైతే ఆయనకు అవిధేయత చూపి, తిరస్కరించారో వారికి ఇహలోకంలో కష్టాలు మరియు పరలోకంలో శాశ్వత శిక్ష లభిస్తుంది.
ఈ రోజు అత్యధికంగా ప్రజలు దేనిని ఆరాధిస్తున్నారని చూస్తే, చూసేవారికి వారు మనుషిని ఆరాధిస్తున్నారని , ఇతరులు విగ్రహాలను ఆరాధిస్తున్నారని, నక్షత్రాలను ఆరాధిస్తున్నారని పొందుతారు. కానీ ఒక బుధ్దిగల మనిషి సంపూర్ణ గుణాలు కలిగిన సర్వలోకాల సృష్టికర్తను తప్ప ఇతరులను ఆరాధించకూడదు. మరి(అలాంటప్పుడు) తనలాంటి లేదా తనకంటే అధమమైన (సృష్టిని) ఎలా ఆరాధించగలడు! ఆరాధనకు అర్హుడైన దైవం మనిషి లేదా విగ్రహం లేదా చెట్టు లేదా జంతువు కాలేడు.
కనుక ఇస్లాం తప్ప నేడు ప్రజలు అనుసరించే మతాలు అన్నీ మానవుడు కల్పించిన మతాలు మరియు మానవ హస్తాలతో మర్చబడ్డ దైవధర్మాలు వీటిని అల్లాహ్ స్వీకరించడు. కానీ ఇస్లాం సర్వలోకాల సృష్టికర్త యొక్క ధర్మం, ఇది తారుమారు కానిది మరియు మార్చబడనిది. మరియు ఈ ధర్మం యొక్క గ్రంధం దివ్యఖుర్ఆన్ ఇది ఎలా అవతరించినదో అలాగే రక్షించబడినది. మరియు ఇది చిట్టచివరి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)పై ఏవిధంగా అవతరించినదో నేటికి అదే భాషలో ముస్లిముల చేతుల్లో ఉంది.
ఇస్లాం యొక్క మౌలిక సూత్రాలలో ఒకటి ఏమిటంటే, అల్లాహ్ పంపిన ప్రవక్తలందరినీ విశ్వసించడం. వారందరూ మానవులే. అల్లాహ్ వారికి అద్భుతాలు మరియు సూచనలు ప్రసాదించి వారిని బలపరిచాడు. వారు కేవలం అల్లాహ్ను మాత్రమే ఆరాధించమని, ఆయనకు భాగస్వాములు లేరని బోధించడానికి పంపబడ్డారు.
మరియు చిట్టచివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయనను అల్లాహ్ ఆయన తనకంటే ముందు అవతరించిన శాస్త్రాలను రద్దుచేసే అంతిమ ధర్మశాస్త్రంతో పంపాడు. మరియు గొప్ప సూచనల ద్వారా బలపరిచాడు. మరియు అందులో అతి గొప్పది దివ్యఖుర్ఆన్. ఇది సకలలోకాల సృష్టికర్త యొక్క వాక్కు, మానవాళికి సుపరిచతిమైన గొప్ప గ్రంధం. అంశాలలో, పదాలలో, శైలిలో మరియు ఆదేశాలలో అద్భుతమైన గ్రంధం. అందులో సత్యంతో కూడిన ఋజుమార్గం ఉంది మరియు ఇది ఇహపరలోకాలలో సంతోషానికి దారితీసే మార్గదర్శకత్వం కలిగి ఉంది, మరియు ఇది అరబీ భాషలో అవతరించినది.
ఇందులో అనేక హేతుబద్ధమైన మరియు జ్ఞానపరమైన ఆధారాలు ఉన్నాయి ఇవి ఈ ఖుర్ఆన్ ఏ విధమైన సందేహం లేని సృష్టికర్త యొక్క వాక్కు అని నిరూపిస్తున్నాయి. మరియు అది మానవులచే తయారు కాలేనిది.
మరియు దైవదూతల పట్ల విశ్వాసం మరియు పరలోకం పట్ల విశ్వాసం ఇస్లాం యొక్క మూలసిధ్దాంతాల లోనివి. ఎక్కడైతే అల్లాహ్ మనుషులను వారి కర్మల లెక్కల కొసం వారి సమాధుల నుంచి ప్రళయదినాన తిరిగి లేపుతాడు. మరి ఎవరైతే ఆయనపై విశ్వాసంతో సత్కార్యాలు చేసాడో అతనికి స్వర్గంలో శాశ్వత బహుమానం ఉంటుంది. మరియు ఎవరైతే ఆయన్ను తిసరస్కించాడో మరియు దుష్కార్యాలు చేసాడో అతనికి నరకంలో పెద్ద శిక్ష ఉంటుంది. మరియు ఇస్లాం యొక్క మూలసిధ్దాంతాలలో మరొకటి నీవు అల్లాహ్ యొక్క మంచి మరియు చెడు విధివ్రాత ను విశ్వసించాలి.
మనకు తెలిసిందే కదా, ఈ జీవితంలో ప్రతి ఒక్కరూ తాము చేసిన మంచి లేదా చెడు కర్మలకు తగిన ప్రతిఫలం పొందకుండా ముందుకు సాగడం అసాధ్యం. అలాంటప్పుడు, అన్యాయం చేసిన వారికి శిక్ష లేకుండా, మంచి చేసిన వారికి బహుమతి లేకుండా ఉండటం ఎలా సాధ్యం?
మరియు ఇస్లాం ధర్మం జీవితం కొరకు సంపూర్ణ విధానాన్నికలిగి ఉంది. ఇది సహజసిద్ధమైనది మరియు హేతుబద్ధమైనది. దీనిని సవ్యమైన ఆత్మలు తప్పక అంగీకరిస్తాయి. దీనిని మహోన్నతుడైన సృష్టికర్త తన సృష్టికోసం నియమించాడు. మరియు ఇది ప్రజలకు ఇహపరలోకాలలో మేలు మరియు సంతోషాన్ని కలిగిస్తుంది. ఇందులో జాతి లేదా రంగు ఆధారంగా వివక్షత లేదు. మరియు ఇందులో మానవులంతా సమానమే. ఇస్లాంలో ఒకరిపై మరొకరి మధ్య వ్యత్యాసం వారి సత్క్యార్యాల ఆధారంగా మాత్రమే ఉన్నది.
మరియు దివ్య ఖుర్ఆన్ ధృవీకరణలలో ఒకటేమిటంటే అల్లాహ్ ను ప్రభువు మరియు నిజఆరాధ్యదైవంగా మరియు ఇస్లాం ను ధర్మంగా, ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం)ను ప్రవక్తగా విశ్వసించాలి. మరియు ఇస్లాంలో ప్రవేశించడం తప్పనిసరి ఆదేశం ఇందులో మానవులకు వేరే అనుమతి లేదు. మరియు ప్రళయదినాన లెక్కతీసుకోవడం ప్రతిఫలం ఇవ్వడం జరుగుతుంది. ఇక ఎవరైతే సత్యవంతునిగా విశ్వాసిగా ఉంటాడో అతనికి సాఫల్యం మరియు గొప్ప విజయం లభిస్తుంది. మరియు ఎవరైతే తిరస్కారిగా ఉన్నాడో అతనికి స్పష్టమైన నష్టం కలుగుతుంది.
ఈ పుస్తకం ఇస్లాంను దాని సారాంశంలో ఒక స్వచ్ఛమైన తౌహీద్ ధర్మంగా సంగ్రహిస్తుంది; అది ఏకైక మరియు అద్వితీయుడైన అల్లాహ్ను, మరియు ప్రవక్తలందరిలో చివరివారైన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను విశ్వసిస్తుంది, న్యాయం మరియు సమానత్వం యొక్క విలువలను పాదుకొల్పుతుంది, మరియు దైవదూతలపై మరియు అంతిమ దినముపై విశ్వాసం ఉంచుతుంది. ఇది ప్రకృతి మరియు వివేకం యొక్క ధర్మం, ఇది అల్లాహ్కు పూర్తిగా లొంగిపోవాలని పిలుపునిస్తూ, ఇహపరలోకాల సౌభాగ్యాన్ని చేకూరుస్తుంది.
కూర్పు డాక్టర్ ముహమ్మద్ బిన్ అబ్దుల్లాహ్ బిన్ సాలెహ్ అ'స్సుహైమ్. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభం ముందుమాట ఇన్నల్’హంద లిల్లాహ్ నహ్మదుహూ వ నస్తయీనుహూ వ నస్తగ్ఫిరుహూ వ నవూజు బిల్లాహి మిన్ షురూరి’’అన్ ఫుసినా వమిన్ సయ్యిఆతి ఆమాలినా (సర్వస్తోత్రాలు,ప్రశంసలు అల్లాహ్’కు మాత్రమే చెందుతాయి,మేము ఆయనను స్తుతిస్తున్నాము,సహాయం ఆర్ధిస్తున్నాము,క్షమాపణ వేడుకుంటున్నాము మరియు ఆయనను మాత్రమే మా ఆత్మల కీడు నుండి,దుష్కర్మలనుండి శరణు వేడుచున్నాము.) మయ్యహ్దిహిల్లాహు ఫలా ముజిల్లలహూ వమయ్యుజ్’లిల్'హు ఫలా హాదియలహూ (అల్లాహ్ మార్గదర్శనం ప్రసాదించిన వాడికి ఎవరు మార్గబ్రష్టుడిగా మార్చలేరు,మరియు ఆయన…
నాస్తికునికి ఒక సంక్షిప్త సందేశం: విశ్వం యొక్క ఖచ్చితత్వం మరియు దాని వ్యవస్థ యాదృచ్ఛికతను తిరస్కరించి, ఒక వివేకవంతుడైన సృష్టికర్తను సూచిస్తాయి. అయితే, ఇదంతా శూన్యం నుండి ఉద్భవించిందని బుద్ధి ఎలా అంగీకరిస్తుంది? కాబట్టి, నీ హృదయాన్ని ఆలోచనకు, పరిశీలనకు తెరువు, సత్యాన్ని అన్వేషించు. బహుశా దానిలో నీకు మార్గనిర్దేశం చేసే జ్యోతి లభించవచ్చు.