الإسلام دين رسل الله
ఇస్లాం దైవప్రవక్తల ధర్మం.
ఇస్లాం దైవప్రవక్తల ధర్మం.
మస్జిద్ అల్-హరామ్ (మక్కా) మరియు మస్జిద్ అన్-నబవీ (మదీనా) యొక్క ధార్మిక వ్యవహారాల అధ్యక్షతలో ఉన్న అధికారిక ఉలేమాల కమిటీ
ఇస్లాం అంటే సృష్టికర్త, సృష్టి కార్యనిర్వహణకర్త అయిన అల్లాహ్ కు విధేయత చూపడం. మరియు ఆయనకు ప్రేమతో భక్తితో లొంగిపోవడం. మరియు ఇస్లాం యొక్క మూలం అల్లాహ్ పై విశ్వాసం. మరియు ఆయనే సృష్టికర్త అని ఆయన తప్ప ప్రతీది సృష్టించబడినదే. మరియు ఆయనే ఆరాధనకు అర్హుడు అందులో ఎవరి భాగశ్వామ్యం లేని వాడు, ఆయన తప్ప నిజఆరాధ్యదైవం ఎవ్వరూ లేరు, ఆయనకు సుందరమైన పేర్లు మరియు ఉన్నతమైన గుణాలు ఉన్నాయి, ఆయన పరిపూర్ణుడు మరియు దోషరహితుడు. ఆయనకు సంతానం లేదు మరియు ఆయన కూడా ఎవరి సంతానం కాదు, ఆయనకు సరిసమానులు ఎవ్వడూ లేడు. ఆయనలో ఎవ్వరూ అంతర్లీనం కాలేరు ఆయన కూడా తన సృష్టిలోని ఏ వస్తువులో అంతర్లీనం కాడు.
మరియు ఇస్లాం మహోన్నతుడైన అల్లాహ్ యొక్క ధర్మం ఆయన ప్రజల నుండి మరే ఇతర ధర్మాన్ని స్వీకరించడు. మరియు ఇది సమస్త ప్రవక్తలు తీసుకువచ్చిన ధర్మం.
మరియు ఇస్లాం యొక్క మూల సూత్రాలలో ఒకటి సమస్త ప్రవక్తలను విశ్వసించాలి. మరియు అల్లాహ్ యే తన ఆదేశాలను చేరవేయడానికి ప్రవక్తలను పంపాడు అని విశ్వాసించాలి. మరియు వారిపై గ్రంధాలను అవతరింపజేశాడు. మరియు వారిలో చివరివారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయనపై అంతిమ దైవధర్మాన్ని అల్లాహ్ అవతరింపచేశాడు అది తనకంటే ముందు అవతరించిన (షరియత్) శాస్త్రాలను రద్దు చేస్తుంది. మరియు ఆయనకు అల్లాహ్ తన గొప్ప నిదర్శనాల ద్వారా సహకరించాడు, అందులో గొప్ప అద్భుతం దివ్యఖుర్ఆన్, ఇది సకలకోకాల ప్రభువైన అల్లాహ్ యొక్క వాక్కు, మానవ జాతికి సుపరిచితమైన గొప్ప గ్రంధం. అంశాలలో, పదాలలో, శైలిలో మరియు ఆదేశాలలో అద్భుతమైన గ్రంధం, ఇందులో సత్యంతో కూడిన ఋజుమార్గం ఉంది, ఇది ఇహపరలోకాలలో సంతోషాన్ని ప్రాప్తింపచేస్తుంది. మరియు ఇది అరబీ భాషలో అవతరించినది, ఇందులో ఏ ఒక్క అక్షరం కూడా తారుమారు కాలేదు మరియు మార్చబడలేదు.
మరియు ఇస్లాం యొక్క మూల సూత్రాలలో భాగంగా దైవదూతల పట్ల విశ్వాసం మరియు అంతిమదినం పట్ల విశ్వాసం కలిగి ఉండాలి.అల్లాహ్ అంతిమ దినాన మానవులందరిని వారి కర్మల లెక్క కొసం వారి సమాధుల నుంచి తిరిగి లేపుతాడు. మరి ఎవరైతే ఆయనపై విశ్వాసంతో పాటు సత్కార్యాలు చేసారో వారికి స్వర్గంలో శాశ్వత బహుమానం ఉంటుంది. మరియు ఎవరైతే ఆయన్ను తిసరస్కించారో మరియు దుష్కార్యాలు చేసారో వారికి నరకంలో పెద్ద శిక్ష ఉంటుంది. మరియు ఇస్లాం యొక్క మూలసిధ్దాంతాలలో భాగంగా నీవు అల్లాహ్ యొక్క మంచి మరియు చెడు విధివ్రాత ను విశ్వసించాలి.
మరియు ముస్లిములు ఈసా అల్లాహ్ యొక్క దాసుడని దైవకుమారుడు కాదని విశ్వసిస్తారు. ఎందుకంటే అల్లాహ్ అత్యంత గొప్పవాడు ఆయనకు భార్య లేదా సంతానం ఉండటం తగదు. కానీ అల్లాహ్ ఈసా గురించి ఖుర్ఆన్ గ్రంధంలో మాకు ఆయన దైవప్రవక్త అని తెలియజేశాడు, ఆయనకు అల్లాహ్ అత్యధిక అద్భుతాలను ప్రసాదించాడు. మరియు ఆయనను అల్లాహ్ తన జాతి వద్దకు అల్లాహ్ యొక్క ఆరాధన వైపు పిలవడానికి పంపాడు ఆయన (అల్లాహ్) ఎవరి భాగశ్వామ్యం లేనివాడు. మరియు ఈసా తనను ఆరాధించమని ప్రజలను కోరలేదని మాకు తెలియజేశాడు, వాస్తవానికి ఆయన అల్లాహ్ ను ఆరాధించేవాడు.
మరియు ఇస్లాం ధర్మం సహజసిద్ధమైనది మరియు హేతుబద్ధమైనది. దీనిని సవ్యమైన ఆత్మలు తప్పక అంగీకరిస్తాయి. దీనిని మహోన్నతుడైన సృష్టికర్త తన సృష్టికోసం నియమించాడు. మరియు ఇది ప్రజలకు మేలు మరియు సంతోషాన్ని కలుగ చేస్తుంది, ఇందులో జాతి లేదా రంగు ఆధారంగా వివక్షత లేదు, ఇందులో మానవులంతా సమానమే. ఇస్లాంలో ఒకరిపై మరొకరికి ప్రాధాన్యత వారి సత్క్యార్యాల ఆధారంగా మాత్రమే ఉన్నది.
మరియు ప్రతి బుద్దిగల వానిపై అల్లాహ్ ను ప్రభువుగా విశ్వసించడం మరియు ఇస్లాం ను ధర్మంగా, ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం)ను ప్రవక్తగా విశ్వసించడం తప్పనిసరి. ఈ ఆదేశంలో మానవులకు వేరే ప్రత్యామ్నయాలు లేవు. ఎందుకంటే ప్రళయదినాన దైవప్రవక్తల(సందేశానికి) ఏవిధంగా జవాబిచ్చారని అల్లాహ్ ప్రశ్నిస్తాడు. ఒకవేళ సత్యవంతునిగా విశ్వాసిగా ఉంటే అతనికి సాఫల్యం మరియు గొప్ప విజయం లభిస్తుంది. మరియు ఒకవేళ తిరస్కరిగా ఉంటే అతనికి స్పష్టమైన నష్టం కలుగుతుంది.
మరియు ప్రతి బుద్దిగల వానిపై అల్లాహ్ ను ప్రభువుగా విశ్వసించడం మరియు ఇస్లాం ను ధర్మంగా, ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం)ను ప్రవక్తగా విశ్వసించడం తప్పనిసరి. ఈ ఆదేశంలో మానవులకు వేరే ప్రత్యామ్నయాలు లేవు. ఎందుకంటే ప్రళయదినాన దైవప్రవక్తల(సందేశానికి) ఏవిధంగా జవాబిచ్చారని అల్లాహ్ ప్రశ్నిస్తాడు. ఒకవేళ సత్యవంతునిగా విశ్వాసిగా ఉంటే అతనికి సాఫల్యం మరియు గొప్ప విజయం లభిస్తుంది. మరియు ఒకవేళ తిరస్కరిగా ఉంటే అతనికి స్పష్టమైన నష్టం కలుగుతుంది.