Skip to content
సూరాల జాబితా /

الأحزَاب

الأحزَاب is chapter 33 of the Quran and has 73 verses. This page presents it in full in the Uthmani script, with a verse-by-verse translation of its meaning.

73 ఆయతులు సూరా సంఖ్య 33
ఆయత్‌కు వెళ్ళండి
తెలుగు · Muhammad
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ

يَٰٓأَيُّهَا ٱلنَّبِيُّ ٱتَّقِ ٱللَّهَ وَلَا تُطِعِ ٱلۡكَٰفِرِينَ وَٱلۡمُنَٰفِقِينَۚ إِنَّ ٱللَّهَ كَانَ عَلِيمًا حَكِيمٗا

ఓ ప్రవక్తా! అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండు మరియు సత్యతిరస్కారుల మరియు కపట విశ్వాసుల యొక్క అభిప్రాయాన్ని లక్ష్య పెట్టకు. నిశ్చయంగా, అల్లాహ్ సర్వజ్ఞుడు, మహా వివేచనా పరుడు.

وَٱتَّبِعۡ مَا يُوحَىٰٓ إِلَيۡكَ مِن رَّبِّكَۚ إِنَّ ٱللَّهَ كَانَ بِمَا تَعۡمَلُونَ خَبِيرٗا

మరియు నీ ప్రభువు తరఫు నుండి నీపై అవతరింప జేయబడిన దివ్యజ్ఞానం (వహీని) మాత్రమే అనుసరించు. నిశ్చయంగా, అల్లాహ్ మీరు చేసేదంతా ఎరుగును.

وَتَوَكَّلۡ عَلَى ٱللَّهِۚ وَكَفَىٰ بِٱللَّهِ وَكِيلٗا

కావున అల్లాహ్ పైననే నమ్మకం ఉంచుకో మరియు కార్యసాధకుడుగా అల్లాహ్ చాలు.

مَّا جَعَلَ ٱللَّهُ لِرَجُلٖ مِّن قَلۡبَيۡنِ فِي جَوۡفِهِۦۚ وَمَا جَعَلَ أَزۡوَٰجَكُمُ ٱلَّٰٓـِٔي تُظَٰهِرُونَ مِنۡهُنَّ أُمَّهَٰتِكُمۡۚ وَمَا جَعَلَ أَدۡعِيَآءَكُمۡ أَبۡنَآءَكُمۡۚ ذَٰلِكُمۡ قَوۡلُكُم بِأَفۡوَٰهِكُمۡۖ وَٱللَّهُ يَقُولُ ٱلۡحَقَّ وَهُوَ يَهۡدِي ٱلسَّبِيلَ

అల్లాహ్ ఏ వ్యక్తి ఎదలో కూడా రెండు హృదయాలు పెట్టలేదు. మరియు మీరు మీ భార్యలను 'తల్లులు' అని పలికి, జిహార్ చేసినంతటనే వారిని మీకు తల్లులుగా చేయలేదు. మరియు మీరు దత్త తీసుకొన్న వారిని మీ (కన్న) కుమారులుగా చేయలేదు. ఇవన్నీ మీరు మీ నోటితో పలికే మాటలు మాత్రమే! మరియు అల్లాహ్ సత్యం పలుకుతాడు మరియు ఆయన (ఋజు) మార్గం వైపునకు మార్గదర్శకత్వం చేస్తాడు.

Explanation & meanings · 1
  1. "జిహార్: అంటే భార్యను తల్లిగా ఎంచటం ఏ విధంగానైతే ఒక వక్షంలో రెండు హృదయాలు ఉండవో అదే విధంగా ఒక వ్యక్తికి ఇద్దరు తల్లులు ఉండరు. ఇద్దరు తండ్రులు కూడా ఉండరు. కావున ఇస్లాంకు ముందు, ముష్రికులు తమ భార్యను శిక్షించటానికి :"ఈ నాటి నుండి నేను నిన్ను తల్లిగా భావిస్తున్నాను." అని చెప్పి, ఆమెకు విడాకులివ్వకుండా తన ఇంట్లోనే ఉంచుకొని బాధించేవారు. ఇస్లాం దానిని నిషేధించింది. దత్తకుమారులు, మీ కుమారులు కారు. కాబట్టి వారిని వారి వాస్తవ తండ్రి పేరుతోనే కిలపి పిలవాలి అనే శాసనం కూడా ఇచ్చింది.

ٱدۡعُوهُمۡ لِأٓبَآئِهِمۡ هُوَ أَقۡسَطُ عِندَ ٱللَّهِۚ فَإِن لَّمۡ تَعۡلَمُوٓاْ ءَابَآءَهُمۡ فَإِخۡوَٰنُكُمۡ فِي ٱلدِّينِ وَمَوَٰلِيكُمۡۚ وَلَيۡسَ عَلَيۡكُمۡ جُنَاحٞ فِيمَآ أَخۡطَأۡتُم بِهِۦ وَلَٰكِن مَّا تَعَمَّدَتۡ قُلُوبُكُمۡۚ وَكَانَ ٱللَّهُ غَفُورٗا رَّحِيمًا

వారిని (మీ దత్త పిల్లలను), వారి (వాస్తవ) తండ్రుల పేర్లతోనే కలిపి పిలవండి. అల్లాహ్ దృష్టిలో ఇదే న్యాయమైనది. ఒకవేళ వారి తండ్రులెవరో మీకు తెలియక పోతే, అపుడు వారు మీ ధార్మిక సోదరులు మరియు మీ స్నేహితులు. మీరు ఈ విషయంలో (ఇంత వరకు) చేసిన పొరపాటు గురించి మీ కెలాంటి పాపం లేదు, కాని ఇక ముందు మీరు ఉద్దేశ్యపూర్వకంగా చేస్తే (పాపం) అవుతుంది. మరియు అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత.

Explanation & meanings · 2
  1. అంటే వారు వారి వాస్తవ తండ్రి పేరుతోనే పిలువబడాలి. దానితో వారి నిజ వ్యక్తిత్వం భద్రపరచబడుతుంది. వారిని మీ నిజ సంతానంగా పరిగణించకండి.
  2. ఒకవేళ దత్తపుత్రుని వాస్తవతండ్రి పేరు తెలియకుంటే, వారు మీ ధార్మిక సోదరులు అట్టి పక్షంలో కూడా వారిని పోషించండి, కాని మీ పుత్రులుగా చేసుకొని, మీ పేరు ఇవ్వకండి.