يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ لَا تَدۡخُلُواْ بُيُوتَ ٱلنَّبِيِّ إِلَّآ أَن يُؤۡذَنَ لَكُمۡ إِلَىٰ طَعَامٍ غَيۡرَ نَٰظِرِينَ إِنَىٰهُ وَلَٰكِنۡ إِذَا دُعِيتُمۡ فَٱدۡخُلُواْ فَإِذَا طَعِمۡتُمۡ فَٱنتَشِرُواْ وَلَا مُسۡتَـٔۡنِسِينَ لِحَدِيثٍۚ إِنَّ ذَٰلِكُمۡ كَانَ يُؤۡذِي ٱلنَّبِيَّ فَيَسۡتَحۡيِۦ مِنكُمۡۖ وَٱللَّهُ لَا يَسۡتَحۡيِۦ مِنَ ٱلۡحَقِّۚ وَإِذَا سَأَلۡتُمُوهُنَّ مَتَٰعٗا فَسۡـَٔلُوهُنَّ مِن وَرَآءِ حِجَابٖۚ ذَٰلِكُمۡ أَطۡهَرُ لِقُلُوبِكُمۡ وَقُلُوبِهِنَّۚ وَمَا كَانَ لَكُمۡ أَن تُؤۡذُواْ رَسُولَ ٱللَّهِ وَلَآ أَن تَنكِحُوٓاْ أَزۡوَٰجَهُۥ مِنۢ بَعۡدِهِۦٓ أَبَدًاۚ إِنَّ ذَٰلِكُمۡ كَانَ عِندَ ٱللَّهِ عَظِيمًا
ఓ విశ్వాసులారా! ప్రవక్త యొక్క ఇండ్లలోకి అనుమతి లేకుండా ప్రవేశించకండి. భోజనార్థం (పిలువబడినపుడు) ఆహారం సిద్ధపరిచే సమయం కొరకు వేచి ఉండకండి, కాని మీరు పిలువబడి నప్పుడు తప్పకుండా వెళ్ళండి. అయితే భోజనం చేసిన వెంటనే వెళ్ళిపొండి మరియు సాధారణ సంభాషణలో కాలక్షేపం చేస్తూ కూర్చోకండి. నిశ్చయంగా, దీని వలన ప్రవక్తకు కష్టం కలుగుతుంది; కాని అతను మిమ్మల్ని (పొమ్మనటానికి) సంకోచిస్తాడు. మరియు అల్లాహ్ సత్యం చెప్పటానికి సంకోచించడు (సిగ్గు పడడు). మరియు మీరు ప్రవక్త భార్యలతో ఏదైనా అడగ వలసి వచ్చినప్పుడు తెరచాటు నుండి అడగండి. ఇది మీ హృదయాలను మరియు వారి హృదయాలను కూడా నిర్మలంగా ఉంచుతుంది. మరియు అల్లాహ్ సందేశహరునికి కష్టం కలిగించటం మీకు తగదు. మరియు అతని తరువాత అతని భార్యలతో మీరు ఎన్నటికీ వివాహం చేసుకోకండి. నిశ్చయంగా ఇది అల్లాహ్ దృష్టిలో మహా అపరాధం.
- దైవప్రవక్త ('స'అస) 'జైనబ్ (ర.'అన్హా) తో వివాహమాడి ఇచ్చిన వలీమా భోజనం సందర్భంలో ఈ ఆయత్ అవతరింపజేయబడింది. ఆ రోజు కొందరు 'స'హాబీలు భోజనం తరువాత కూర్చొని కాలక్షేపం చేయసాగారు. ('స.బు'ఖారీ).