33 : 72
إِنَّا عَرَضۡنَا ٱلۡأَمَانَةَ عَلَى ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضِ وَٱلۡجِبَالِ فَأَبَيۡنَ أَن يَحۡمِلۡنَهَا وَأَشۡفَقۡنَ مِنۡهَا وَحَمَلَهَا ٱلۡإِنسَٰنُۖ إِنَّهُۥ كَانَ ظَلُومٗا جَهُولٗا
నిశ్చయంగా, మేము బాధ్యతను ఆకాశాలకు, భూమికి మరియు పర్వతాలకు సమర్పించగోరాము, కాని అవి దానిని భరించటానికి సమ్మతించలేదు మరియు దానికి భయపడ్డాయి, కాని మానవుడు దానిని తన మీద మోపుకున్నాడు. నిశ్చయంగా అతడు దుర్మార్గుడు, మూఢుడు కూడాను.
Explanation & meanings · 1
- బాధ్యత అంటే, అల్లాహ్ (సు.తా.) ఆజ్ఞ పాఠించడం వల్ల కలిగే పుణ్యఫలాలు మరియు తిరస్కరించడం వల్ల కలిగే కష్టనష్టాలు. శిక్షలకు భయపడి, ఆకాశాలూ, భూమీ మరియు పర్వతాలు, దానిని భరించటానికి సమ్మతించలేదు. కాని మానవుడు తన మూఢత్వం వల్ల ఈ బాధ్యతను తన మీద మోపుకున్నాడు. బాధ్యత అంటే ఖుర్ఆన్ కూడా కావచ్చు!