33 : 9
يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ ٱذۡكُرُواْ نِعۡمَةَ ٱللَّهِ عَلَيۡكُمۡ إِذۡ جَآءَتۡكُمۡ جُنُودٞ فَأَرۡسَلۡنَا عَلَيۡهِمۡ رِيحٗا وَجُنُودٗا لَّمۡ تَرَوۡهَاۚ وَكَانَ ٱللَّهُ بِمَا تَعۡمَلُونَ بَصِيرًا
ఓ విశ్వాసులారా! అల్లాహ్ మీకు చేసిన అనుగ్రహాన్ని జ్ఞాపకం చేసుకోండి. మీ పైకి సైన్యాలు (దండెత్తి) వచ్చినపుడు, మేము వారి పైకి ఒక తుఫాను గాలిని మరియు మీకు కనబడని సైన్యాలను పంపాము. మరియు అల్లాహ్ మీరు చేసేదంతా చూస్తున్నాడు.
Explanation & meanings · 1
- చూఈ సూరహ్ యొక్క 9-27 ఆయతులు కందక యుద్ధం ('గ'జ్వతుల్ అ'హ్జాబ్) గురించి ఉన్నాయి. ఇంకా చూడండి, 3:124-125.