Skip to content
الأحزَاب /

ఆయత్ 49

33 : 49

ఆయత్ 49 of الأحزَاب (33 : 49). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.

الأحزَاب ఆయతులు 73
సూరా · الأحزَاب
తెలుగు · Muhammad
33 : 49

يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوٓاْ إِذَا نَكَحۡتُمُ ٱلۡمُؤۡمِنَٰتِ ثُمَّ طَلَّقۡتُمُوهُنَّ مِن قَبۡلِ أَن تَمَسُّوهُنَّ فَمَا لَكُمۡ عَلَيۡهِنَّ مِنۡ عِدَّةٖ تَعۡتَدُّونَهَاۖ فَمَتِّعُوهُنَّ وَسَرِّحُوهُنَّ سَرَاحٗا جَمِيلٗا

ఓ విశ్వాసులారా! మీరు విశ్వాసినులైన స్త్రీలను వివాహమాడి, తరువాత - మీరు వారిని తాకక పూర్వమే - వారికి విడాకులిచ్చినట్లైతే, మీ కొరకు వేచి వుండే వ్యవధి (ఇద్దత్) పూర్తి చేయమని అడిగే హక్కు మీకు వారిపై లేదు. కనుక వారికి పారితోషికం ఇచ్చి, మంచితనంతో వారిని సాగనంపండి.

Explanation & meanings · 2
  1. వివాహం తరువాత స్త్రీతో సంభోగించి ఉంటే ఆమె వేచిఉండే గడువు ('ఇద్దత్) మూడు రుతుస్రావాలు. చూడండి, 2:228. కాని వివాహం తరువాత సంభోగించక ముందే విడాకులిస్తే ఆమె వేచిఉండక వెంటనే, మరొకనితో వివాహం చేసుకోవచ్చు. ఒకవేళ సంభోగం జరుగకముందే భర్త చనిపోతే 'ఇద్దత్ నాలుగు నెలల మీద పది రోజులు, (ఫ'త్హ్ అల్-ఖదీర్, ఇబ్నె-కసీ'ర్). నికా'హ్ జరిగిన తరువాతనే 'తలాఖ్, ఇవ్వవలసిన అవసరం ఉంటుంది. నికా'హ్ యే కాకుంటే 'తలాఖ్ ఇవ్వవలసిన అవసరం ఎక్కడ ఉంటుంది! "లా'తలాఖ ఖబ్ ల నికా'హ్." (ఇబ్నె-మాజా): "లా 'తలాఖ లి ఇబ్ని ఆదమ్ ఫీమా లా యమ్ లికు." (అబూ-దావూద్, తిర్మిజీ' మరియు అ'హ్మద్ - 2/189) అంటే పెండ్లి (నికా'హ్) కానిదే 'తలాఖ్ విషయమే రాదు.
  2. అంటే వారి మహ్ర్ నిర్ణయించబడి ఉంటే సగం ఇవ్వండి. లేకపోతే మీకు తోటినది ఇచ్చి మంచివిధంగా సాగనంపండి.