Skip to content
సూరాల జాబితా /

الرُّوم

الرُّوم is chapter 30 of the Quran and has 60 verses. This page presents it in full in the Uthmani script, with a verse-by-verse translation of its meaning.

60 ఆయతులు సూరా సంఖ్య 30
ఆయత్‌కు వెళ్ళండి
తెలుగు · Muhammad
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ

الٓمٓ

అలిఫ్-లామ్-మీమ్

Explanation & meanings · 1
  1. సూరతుల్ బఖరహ్ లోని మొదటి ఆయతు యొక్క ఫుట్‌నోట్ చూడండి.

غُلِبَتِ ٱلرُّومُ

రోమన్ లు పరాజితులయ్యారు.

فِيٓ أَدۡنَى ٱلۡأَرۡضِ وَهُم مِّنۢ بَعۡدِ غَلَبِهِمۡ سَيَغۡلِبُونَ

తమ పొరుగు భూభాగంలోనే! మరియు వారు తమ ఈ పరాజయం తరువాత, తిరిగి విజేతలు కాగలరు -

Explanation & meanings · 1
  1. పొరుగు నేల అంటే షామ్ మరియు ఫలస్తీన్.

فِي بِضۡعِ سِنِينَۗ لِلَّهِ ٱلۡأَمۡرُ مِن قَبۡلُ وَمِنۢ بَعۡدُۚ وَيَوۡمَئِذٖ يَفۡرَحُ ٱلۡمُؤۡمِنُونَ

(రాబోయే) కొన్ని సంవత్సరాలలోనే. మొదట నయినా, తరువాత నయినా నిర్ణయాధికారం కేవలం అల్లాహ్ దే మరియు ఆ రోజు విశ్వాసులు సంతోష పడతారు;

Explanation & meanings · 1
  1. బి'ద్ ఇన్ : అంటే, 3 నుండి 10 అని అర్థం.

بِنَصۡرِ ٱللَّهِۚ يَنصُرُ مَن يَشَآءُۖ وَهُوَ ٱلۡعَزِيزُ ٱلرَّحِيمُ

అల్లాహ్ ప్రసాదించిన సహాయానికి. ఆయన తనకు ఇష్టమైన వారికి సహాయం చేస్తాడు. మరియు ఆయనే సర్వశక్తి మంతుడు, అపార కరుణా ప్రదాత.

Explanation & meanings · 1
  1. ఇది దాదాపు ఎనిమిది సంవత్సరాల తరువాత 2 హిజ్రీలో (622 క్రీ.స్తు శకంలో) కాబోయే బద్ర్ యుద్ధం గురించి చెప్పుతోంది.