30 : 43
فَأَقِمۡ وَجۡهَكَ لِلدِّينِ ٱلۡقَيِّمِ مِن قَبۡلِ أَن يَأۡتِيَ يَوۡمٞ لَّا مَرَدَّ لَهُۥ مِنَ ٱللَّهِۖ يَوۡمَئِذٖ يَصَّدَّعُونَ
కావున నీవు నీ ముఖాన్ని సరైన ధర్మం (ఇస్లాం) వైపునకే స్థిరంగా నిలుపు - అల్లాహ్ తరఫు నుండి - ఆ రోజు రాకముందే దేనినైతే ఎవ్వడూ తొలగించలేడో! ఆ రోజు వారు పరస్పరం చెదిరిపోయి వేరవుతారు.
Explanation & meanings · 2
- అల్లాహ్ (సు.తా.) దృష్టిలో సత్యధర్మం: అంటే అల్లాహ్ (సు.తా.) కు దాస్యం - తనను తాను అల్లాహ్ (సు.తా.) అభీష్టానికి అప్పగించడం (ఇస్లాం) - మాత్రమే. చూడండి, 3:19.
- ఒకటి విశ్వాసులది, రెండవది సత్యతిరస్కారులది.