Skip to content
సూరాల జాబితా /

لُقمَان

لُقمَان is chapter 31 of the Quran and has 34 verses. This page presents it in full in the Uthmani script, with a verse-by-verse translation of its meaning.

34 ఆయతులు సూరా సంఖ్య 31
ఆయత్‌కు వెళ్ళండి
తెలుగు · Muhammad
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ

الٓمٓ

అలిఫ్-లామ్-మీమ్.

Explanation & meanings · 1
  1. సూరతుల్ బఖరహ్ లోని మొదటి ఆయతు యొక్క ఫుట్‌నోట్ చూడండి.

تِلۡكَ ءَايَٰتُ ٱلۡكِتَٰبِ ٱلۡحَكِيمِ

ఇవి వివేకంతో నిండి ఉన్న గ్రంథ సూచనలు (ఆయాత్)

هُدٗى وَرَحۡمَةٗ لِّلۡمُحۡسِنِينَ

(ఇందులో) సజ్జనులకు మార్గదర్శకత్వమూ మరియు కారుణ్యమూ ఉన్నాయి.

Explanation & meanings · 1
  1. ము'హ్ సినీన్, ము'హ్ సిన్ (ఏ.వ.): దీనికి మూడు అర్థాలున్నాయి. 1) ఉపకారం చేసేవాడు; తన తల్లిదండ్రులకు, బంధువులకు, మొదలైనవారికి. 2) సత్కార్యాలు చేసేవాడు మరియు పాపాలనుండి దూరంగా ఉండేవాడు. 3) అల్లాహ్ (సు.తా.) యొక్క ఆరాధన - భక్తి, శ్రద్ధ, దైవభీతి మరియు ఏకాగ్రతతో - చేసేవాడు.

ٱلَّذِينَ يُقِيمُونَ ٱلصَّلَوٰةَ وَيُؤۡتُونَ ٱلزَّكَوٰةَ وَهُم بِٱلۡأٓخِرَةِ هُمۡ يُوقِنُونَ

(వారికే) ఎవరైతే నమాజ్ ను స్థాపించి విధిదానం (జకాత్) ఇస్తారో మరియు పరలోక జీవితం మీద దృఢమైన నమ్మకం కలిగి ఉంటారో;

Explanation & meanings · 1
  1. చూడండి, 2:2-4.

أُوْلَٰٓئِكَ عَلَىٰ هُدٗى مِّن رَّبِّهِمۡۖ وَأُوْلَٰٓئِكَ هُمُ ٱلۡمُفۡلِحُونَ

అలాంటి వారే, తమ ప్రభువు తరఫు నుండి (వచ్చిన) మార్గదర్శకత్వం మీద ఉన్నవారు. మరియు అలాంటి వారే సాఫల్యం పొందేవారు.