Skip to content
الرُّوم /

ఆయత్ 29

30 : 29

ఆయత్ 29 of الرُّوم (30 : 29). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.

الرُّوم ఆయతులు 60
సూరా · الرُّوم
తెలుగు · Muhammad
30 : 29

بَلِ ٱتَّبَعَ ٱلَّذِينَ ظَلَمُوٓاْ أَهۡوَآءَهُم بِغَيۡرِ عِلۡمٖۖ فَمَن يَهۡدِي مَنۡ أَضَلَّ ٱللَّهُۖ وَمَا لَهُم مِّن نَّٰصِرِينَ

కాని దుర్మార్గులైనటువంటి వారు, తెలివి లేనిదే, తమ కోరికలను అనుసరిస్తారు. అల్లాహ్ మార్గభ్రష్టత్వంలో వదిలిన వ్యక్తికి మార్గదర్శకత్వం ఎవడు చేయగలడు? మరియు వారికి సహాయపడేవారు ఎవ్వరూ ఉండరు.

Explanation & meanings · 1
  1. ఎందుకంటే అల్లాహ్ (సు.తా.) తరఫు నుండి వారికే మార్గదర్శకత్వం లభిస్తుంది, ఎవరైతే మార్గదర్శకత్వాన్ని ఆపేక్షిస్తారో! ఇక ఎవరైతే హృదయపూర్వకంగా అల్లాహ్ (సు.తా.) మార్గదర్శకత్వాన్ని అపేక్షించరో ఆయన వారిని మార్గభ్రష్టత్వంలో వదలుతాడు. ఇదే సున్నతుల్లాహ్ - అల్లాహ్ (సు.తా.) సంప్రదాయం. ఈ విషయం ఖుర్ఆన్ లో ఎన్నోసార్లు విశదీకరించబడింది. అల్లాహ్ (సు.తా.) మానవులకు మరియు జిన్నాతులకు మంచి చెడుల మధ్య విచక్షణా జ్ఞాననాన్నొసంగి; విశ్వసించి, మంచి పనులు చేసేవారికి స్వర్గం మరియు చెడుదారి పట్టేవారికి నరకం, అని వ్యక్తం చేశాడు. మరియు ప్రతి యుగం వారికి, అల్లాహ్ (సు.తా.) ను మాత్రమే ఆరాధించమని మరియు మంచిని చేయమని ఆదేశించటానికి, చెడునుండి నివారించటానికి మార్గదర్శకులుగా ప్రవక్తలను పంపి, వారి వద్దకు దివ్యజ్ఞానం (వ'హీ) పంపుతూ వచ్చాడు. చూడండి, 14:4 మరియు 2:7.