Skip to content
الرُّوم /

ఆయత్ 28

30 : 28

ఆయత్ 28 of الرُّوم (30 : 28). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.

الرُّوم ఆయతులు 60
సూరా · الرُّوم
తెలుగు · Muhammad
30 : 28

ضَرَبَ لَكُم مَّثَلٗا مِّنۡ أَنفُسِكُمۡۖ هَل لَّكُم مِّن مَّا مَلَكَتۡ أَيۡمَٰنُكُم مِّن شُرَكَآءَ فِي مَا رَزَقۡنَٰكُمۡ فَأَنتُمۡ فِيهِ سَوَآءٞ تَخَافُونَهُمۡ كَخِيفَتِكُمۡ أَنفُسَكُمۡۚ كَذَٰلِكَ نُفَصِّلُ ٱلۡأٓيَٰتِ لِقَوۡمٖ يَعۡقِلُونَ

ఆయన, స్వయంగా మీకే చెందిన ఒక ఉపమానాన్ని మీకు తెలుపుతున్నాడు. ఏమీ? మేము మీకు జీవనోపాధిగా సమకూర్చిన దానిలో మీ బానిసలు మీతో పాటు సరిసమానులుగా, భాగస్వాములు కాగలరా? మీరు పరస్పరం ఒకరి పట్ల నొకరు భీతి కలిగి ఉన్నట్లు, వారి పట్ల కూడా భీతి కలిగి ఉంటారా? ఈ విధంగా మేము బుద్ధిమంతులకు మా సూచనలను వివరిస్తూ ఉంటాము.

Explanation & meanings · 1
  1. చూడండి, 16:75-76. ఇటువంటి సామెతలకు. మానవులు, తమతోటి మానవులైన బానిసలను తమతో పాటు సమానులుగా స్వీకరించలేరు. అయితే అల్లాహ్ (సు.తా.) సర్వసృష్టికర్త తాను సృష్టించిన దానిని తనకు సమానంగా ఏ విధంగా స్వీకరించగలడు. ఆయన (సు.తా.) ను వదలి, ఆయన పుట్టించిన వాటిని ఆరాధించటం ఎలా క్షమించగలడు. అందుకే ఆయన ఖుర్ఆన్ లో వ్యక్తం చేశాడు. షిర్క్ (అల్లాహ్ కు సాటి కల్పించడం) అల్లాహ్ (సు.తా.) ఎన్నటికీ క్షమించడు.