27 : 82
۞ وَإِذَا وَقَعَ ٱلۡقَوۡلُ عَلَيۡهِمۡ أَخۡرَجۡنَا لَهُمۡ دَآبَّةٗ مِّنَ ٱلۡأَرۡضِ تُكَلِّمُهُمۡ أَنَّ ٱلنَّاسَ كَانُواْ بِـَٔايَٰتِنَا لَا يُوقِنُونَ
మరియు వారిని గురించిన (శిక్ష) వాగ్దానం పూర్తికానున్నప్పుడు, మేము వారి కొరకు భూమి నుండి ఒక జంతువును బయటికి తీస్తాము. అది వారితో నిశ్చయంగా, మానవులు మా సూచలను (ఆయాత్ లను) నమ్మేవారు కాదని చెబుతుంది.
Explanation & meanings · 2
- చూఎప్పుడైతే మంచిని ఆదేశించే వాడు మరియు చెడు నుండి నిరోధించే వాడు ఎవ్వడూ ఉండడో!
- దైవప్రవక్త ('స'అస) ప్రవచనం: 'పునరుత్థానదినం అంతవరకు రాదు, ఎంతవరకైతే మీరు పది సంకేతాలు చూడరో!' ఆ పది సంకేతాలలో ఈ జంతువు ఒకటి, ('స'హీ'హ్ ముస్లిం). మరొక 'హదీస్'లో ఉంది: అన్నిటి కంటే మొదటి సంకేతం, సూర్యుడు తూర్పునుండి గాక పడమర నుండి ఉదయించడం. ('స'హీ'హ్ ముస్లిం)