27 : 31
أَلَّا تَعۡلُواْ عَلَيَّ وَأۡتُونِي مُسۡلِمِينَ
"(ఇందులో ఇలా వ్రాయబడి ఉంది): 'నా పై ఆధిక్యత చూపకండి. నా సన్నిధిలోకి అల్లాహ్ కు విధేయులు (ముస్లింలు) అయి రండి' "
Explanation & meanings · 1
- సబా' వాసులు అల్లాహ్ (సు.తా.) ను వదిలి సూర్యుణ్ణి పూజించేవారు. (ఆయతులు 24-25) కావున సులైమాన్ ('అ.స.) ఒక ప్రవక్త కాబట్టి వారిని అల్లాహ్ (సు.తా.)కు విధేయులవటానికి ఆహ్వానించారు. (చూడండి, 44:19) ఇదే విధంగా మహా ప్రవక్త ముహమ్మద్ ('స'అస) కూడా ఆయన కాలపు రాజులను ఇస్లాం స్వీకరించటానికి, ఆహ్వానపత్రాలు పంపారు.