Skip to content
النَّمل /

ఆయత్ 87

27 : 87

ఆయత్ 87 of النَّمل (27 : 87). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.

النَّمل ఆయతులు 93
సూరా · النَّمل
తెలుగు · Muhammad
27 : 87

وَيَوۡمَ يُنفَخُ فِي ٱلصُّورِ فَفَزِعَ مَن فِي ٱلسَّمَٰوَٰتِ وَمَن فِي ٱلۡأَرۡضِ إِلَّا مَن شَآءَ ٱللَّهُۚ وَكُلٌّ أَتَوۡهُ دَٰخِرِينَ

మరియు (జ్ఞాపకముంచుకోండి) బాకా (సూర్) ఊదబడే దినమున - అల్లాహ్ కోరిన వారు తప్ప - ఆకాశాలలోను మరియు భూమిలోను ఉన్నవన్నీ భయంతో కంపించి పోతాయి. మరియు ఆన్నీ అత్యంత వినమ్రతతో ఆయన ముందు హాజరవుతాయి.

Explanation & meanings · 2
  1. ఎవరా అల్లాహ్ (సు.తా.) కోరినవారు? ఇమామ్ షౌకాని ప్రకారం: వారు దైవదూతలు, దైవప్రవక్తలు, అమరవీరులు (షుహదా') మరియు విశ్వాసులందరూ!
  2. 'సూర్: బాకా, కొమ్ము, దానిని ఇస్రాఫీల్ ('అ.స.) అల్లాహ్ (సు.తా.) ఆజ్ఞతో ఊదుతారు. ఇది రెండుసార్లు లేక అంతకంటే ఎక్కువ సారర్లు ఊదబడుతుంది. మొదట ఊదబడినప్పుడు సమస్త (జీవరాసులు) భయంతో స్పృహ కోల్పోతారు. రెండవసారి ఊదబడినప్పుడు అందరూ చనిపోతారు. మూడవసారి ఊదబడినప్పుడు అందరూ తమ గోరీల నుండి లేచి వస్తారు. మరికొందరి ప్రకారం నాలుగవసారి బాకా ఊదబడినప్పుడు అందరూ మైదానంలో సమీకరించబడతారు.