Skip to content
సూరాల జాబితా /

الأنبيَاء

الأنبيَاء is chapter 21 of the Quran and has 112 verses. This page presents it in full in the Uthmani script, with a verse-by-verse translation of its meaning.

112 ఆయతులు సూరా సంఖ్య 21
ఆయత్‌కు వెళ్ళండి
తెలుగు · Muhammad
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ

ٱقۡتَرَبَ لِلنَّاسِ حِسَابُهُمۡ وَهُمۡ فِي غَفۡلَةٖ مُّعۡرِضُونَ

మానవులతో లెక్క (తీసుకునే) సమయం సమీపించింది, అయినా వారు ఏమరుపాటులో పడి విముఖులై ఉన్నారు.

Explanation & meanings · 1
  1. అంటే పునరుత్థాన దినం.

مَا يَأۡتِيهِم مِّن ذِكۡرٖ مِّن رَّبِّهِم مُّحۡدَثٍ إِلَّا ٱسۡتَمَعُوهُ وَهُمۡ يَلۡعَبُونَ

(కావున) వారి ప్రభువు తరఫు నుండి వారి వద్దకు ఏ క్రొత్త సందేశం వచ్చినా, వారు దానిని పరిహసించకుండా వినలేరు.

لَاهِيَةٗ قُلُوبُهُمۡۗ وَأَسَرُّواْ ٱلنَّجۡوَى ٱلَّذِينَ ظَلَمُواْ هَلۡ هَٰذَآ إِلَّا بَشَرٞ مِّثۡلُكُمۡۖ أَفَتَأۡتُونَ ٱلسِّحۡرَ وَأَنتُمۡ تُبۡصِرُونَ

వారి హృదయాలు వినోద క్రీడలలో (అశ్రద్ధలో) మునిగి ఉన్నాయి. మరియు వారిలో దుర్మార్గానికి పాల్పడిన వారు రహస్య సంప్రదింపులు చేసుకొని (ఇలా అంటారు): "ఏమీ? ఇతను (ముహమ్మద్) మీలాంటి ఒక సాధారణ మానవుడు కాడా? అయినా మీరు చూస్తూ వుండి కూడా, ఇతని మంత్రజాలంలో చిక్కుకుపోయారా?"

Explanation & meanings · 2
  1. అంటే ఆ కాలపు మక్కా ముష్రికులు, వారి తోటి మానవుడు ప్రవక్త కావడం నమ్మ లేక పోయారు. కాని ఈ కాలంలో కొందరు ప్రవక్తలను దైవాలుగా చేసుకుంటున్నారు.
  2. అస్-సి'హ్రా: మంత్రజాలం, జాలవిద్య, మాయాజాలం. ఈ పదం ఖుర్ఆన్ అవతరణ క్రమంలో మొదటి సారి 74:24లో వచ్చింది.

قَالَ رَبِّي يَعۡلَمُ ٱلۡقَوۡلَ فِي ٱلسَّمَآءِ وَٱلۡأَرۡضِۖ وَهُوَ ٱلسَّمِيعُ ٱلۡعَلِيمُ

(ముహమ్మద్) ఇలా అన్నాడు: "నా ప్రభువుకు ఆకాశంలోను మరియు భూమిలోను పలుకబడే ప్రతి మాట తెలుసు. మరియు ఆయన సర్వం వినేవాడు, సర్వజ్ఞుడు.

بَلۡ قَالُوٓاْ أَضۡغَٰثُ أَحۡلَٰمِۭ بَلِ ٱفۡتَرَىٰهُ بَلۡ هُوَ شَاعِرٞ فَلۡيَأۡتِنَا بِـَٔايَةٖ كَمَآ أُرۡسِلَ ٱلۡأَوَّلُونَ

అలా కాదు! వారన్నారు: "ఇవి (ఈ సందేశాలు) కేవలం పీడకలలు మాత్రమే; కాదు కాదు! ఇతడే దీనిని కల్పించాడు; అలా కాదు! ఇతడొక కవి! (ఇతడు ప్రవక్తయే అయితే) పూర్వం పంపబడిన సందేశహరుల మాదిరిగా, ఇతనిని కూడా మా కొరకు ఒక అద్భుత సూచన (ఆయత్) ను తెమ్మను!"