21 : 3
لَاهِيَةٗ قُلُوبُهُمۡۗ وَأَسَرُّواْ ٱلنَّجۡوَى ٱلَّذِينَ ظَلَمُواْ هَلۡ هَٰذَآ إِلَّا بَشَرٞ مِّثۡلُكُمۡۖ أَفَتَأۡتُونَ ٱلسِّحۡرَ وَأَنتُمۡ تُبۡصِرُونَ
వారి హృదయాలు వినోద క్రీడలలో (అశ్రద్ధలో) మునిగి ఉన్నాయి. మరియు వారిలో దుర్మార్గానికి పాల్పడిన వారు రహస్య సంప్రదింపులు చేసుకొని (ఇలా అంటారు): "ఏమీ? ఇతను (ముహమ్మద్) మీలాంటి ఒక సాధారణ మానవుడు కాడా? అయినా మీరు చూస్తూ వుండి కూడా, ఇతని మంత్రజాలంలో చిక్కుకుపోయారా?"
Explanation & meanings · 2
- అంటే ఆ కాలపు మక్కా ముష్రికులు, వారి తోటి మానవుడు ప్రవక్త కావడం నమ్మ లేక పోయారు. కాని ఈ కాలంలో కొందరు ప్రవక్తలను దైవాలుగా చేసుకుంటున్నారు.
- అస్-సి'హ్రా: మంత్రజాలం, జాలవిద్య, మాయాజాలం. ఈ పదం ఖుర్ఆన్ అవతరణ క్రమంలో మొదటి సారి 74:24లో వచ్చింది.