Skip to content
సూరాల జాబితా /

طه

طه is chapter 20 of the Quran and has 135 verses. This page presents it in full in the Uthmani script, with a verse-by-verse translation of its meaning.

135 ఆయతులు సూరా సంఖ్య 20
ఆయత్‌కు వెళ్ళండి
తెలుగు · Muhammad
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ

طه

తాహా!

Explanation & meanings · 1
  1. సూరతుల్ బఖరహ్ లోని మొదటి ఆయతు యొక్క ఫుట్‌నోట్ చూడండి.

مَآ أَنزَلۡنَا عَلَيۡكَ ٱلۡقُرۡءَانَ لِتَشۡقَىٰٓ

మేము ఈ ఖుర్ఆన్ ను నీపై అవతరింపజేసింది నిన్ను కష్టానికి గురి చేయటానికి కాదు.

Explanation & meanings · 1
  1. చూడండి, 18:6.

إِلَّا تَذۡكِرَةٗ لِّمَن يَخۡشَىٰ

కేవలం (అల్లాహ్ కు) భయపడే వారికి హితబోధ చేయటానికే!

تَنزِيلٗا مِّمَّنۡ خَلَقَ ٱلۡأَرۡضَ وَٱلسَّمَٰوَٰتِ ٱلۡعُلَى

ఇది (ఈ ఖుర్ఆన్) భూమినీ మరియు అత్యున్నతమైన ఆకాశాలనూ సృష్టించిన ఆయన (అల్లాహ్) తరఫు నుండి క్రమక్రమంగా అవతరింపజేయబడింది.

ٱلرَّحۡمَٰنُ عَلَى ٱلۡعَرۡشِ ٱسۡتَوَىٰ

ఆ కరుణామయుడు, సింహాసనం (అర్ష్)పై ఆసీనుడై ఉన్నాడు.

Explanation & meanings · 1
  1. తన గొప్పతనానికి అనుగుణంగా అల్లాహ్ (సు.తా.) 'అర్ష్ (విశ్వసామ్రాజ్యాధిపత్య పీఠం)పై అధిష్ఠుడై ఉన్నాడు. కాని ఎట్లు, ఏ విధంగా ఎవ్వరికీ తెలియదు.