21 : 8
وَمَا جَعَلۡنَٰهُمۡ جَسَدٗا لَّا يَأۡكُلُونَ ٱلطَّعَامَ وَمَا كَانُواْ خَٰلِدِينَ
మరియు మేము వారికి (ఆ ప్రవక్తలకు) ఆహారం తినే అవసరం లేని శరీరాలను ఇవ్వలేదు. మరియు వారు చిరంజీవులు కూడా కాలేదు.
Explanation & meanings · 1
- అంటే ఏ ప్రవక్తకు కూడా అమానుషమైన యోగ్యతలు ప్రసాదించబడలేదు. వారు ('అలైహిమ్. స.) సాధారణ మానవుల్లాగానే ఉండేవారు, కాని వారిపై అల్లాహ్ (సు.తా.) దివ్యజ్ఞానం (వ'హీ) అవతరింపజేయబడుతూ ఉండేది. వారికి అల్లాహ్ (సు.తా.) తెలిపినది తప్ప మరే అగోచర జ్ఞానం లేదు. ఇంకా చూడండి, 5:75, 3:164, 13:38, 25:20.