20 : 10
إِذۡ رَءَا نَارٗا فَقَالَ لِأَهۡلِهِ ٱمۡكُثُوٓاْ إِنِّيٓ ءَانَسۡتُ نَارٗا لَّعَلِّيٓ ءَاتِيكُم مِّنۡهَا بِقَبَسٍ أَوۡ أَجِدُ عَلَى ٱلنَّارِ هُدٗى
అతను ఒక మంటను చూసినపుడు తన ఇంటి వారితో ఇలా అన్నాడు: "ఆగండి! నిశ్చయంగా, నాకొక మంట కనబడుతోంది; బహుశా నేను దాని నుండి మీ కొరకు ఒక కొరివిని తీసుకొని వస్తాను లేదా ఆ మంట దగ్గర, నాకేదైనా మార్గదర్శకత్వం లభించవచ్చు!"
Explanation & meanings · 1
- మూసా ('అ.స.) కొన్ని సంవత్సరాలు ఆయ్ కహ్ లో గడిపిన తరువాత - తన భార్యా పిల్లలతో సహా - తన తల్లి, సోదరుడు హారూన్ ('అ.స.) మరియు తన జాతి వారి వద్దకు వెళ్ళటానికి బయలుదేరుతారు. సినాయి ద్వీపకల్పం దక్షిణ ప్రాంతం గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ విషయం సంభవిస్తుంది. ఇంకా చూడండి, 27:78 మరియు 28:29.