السؤال
س١٤: ما صور خُلق الرحمة؟
ప్రశ్న14: దయ గుణం యొక్క రూపాలు ఏమిటి ?
الجواب
ج:- رحمة كبار السن وتوقيرهم.
- رحمة صغار السن والأطفال.
في الحديث:
«لَيْسَ مِنَّا مَنْ لَمْ يُوَقِّرْ كَبِيرَنَا، وَيَرْحَمْ صَغِيرَنَا»
رواه أحمد.
- رحمة الفقير والمسكين والمحتاج.
- رحمة الحيوان بأن تطعمه ولا تؤذيه.
من ذلك قول النبي عَلَيْهِ الصَّلَاةُ وَالسَّلَامُ:
«تَرَى المُؤْمِنينَ في تَراحُمِهِم وتَوادِّهِم وتَعاطُفِهِم كمَثَلِ الجَسَدِ، إذا اشتَكَى عُضْوٌ تَداعَى لهُ سائِرُ جَسَدِهِ بالسَّهَرِ والحُمَّى»
متفق عليه.
- وقال رسولُ اللهِ ﷺ:
«الرَّاحِمونَ يَرحَمُهُمُ الرَّحمنُ، ارْحَمُوا أهْلَ الأَرضِ، يَرحَمُكُمْ مَن في السَّماءِ»
رواه أبو داود والترمذي.
జవాబు: వృద్ధుల పట్ల దయ చూపడం మరియు వారిని గౌరవించడం.
- పిన్న వయస్సు వారి పట్ల మరియు చిన్నపిల్లల పట్ల దయ చూపడం
హదీసులో ఇలా ఉన్నది :
«మనలో పెద్దలను గౌరవించనివారు, మనలో చిన్నరులపై దయ చూపనివారు మనలోవారు కాదు.»
దీనిని అహ్మద్ ఉల్లేఖించారు.
- పేదలు, అక్కరగలవారు మరియు దిక్కులేని నిరుపేదల పట్ల దయ చూపడం
- జంతువులకు ఆహారం ఇవ్వడం ద్వారా మరియు వాటికి హాని కలిగించకుండా ఉండటం ద్వారా వాటిపై దయ చూపడం.
దీని గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు:
విశ్వాసుల ఉపమానం వారి స్నేహం, ఐక్యత మరియు దయ, జాలి విషయాలలో ఒక శరీరం వంటిది. శరీరం లో ఏ భాగానికైనా బాధ కలిగితే ఆ బాధను పూర్తి శరీరం అనుభవిస్తుంది. నిద్రపట్టదు, జ్వరం వస్తుంది.
ముత్తఫఖున్ అలైహి
రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:
కరుణించే జనులపై కరుణామయుడు (అర్రహ్మాన్) కరుణిస్తాడు, మీరు భూవాసులపై కరుణించండి, ఆకాశంలో ఉన్న ప్రభువు మిమ్ములను కరుణిస్తాడు.
దీనిని అబూదావుద్,తిర్మిజీ ఉల్లేఖించారు.