ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల మనం ఎలాంటి మర్యాదలు కలిగి ఉండాలి?
- الباب / الفصل
- قسم الآداب الإسلامية
السؤال
س2: كيف يكون الأدب مع الرسول صلى الله عليه وسلم؟
ప్రశ్న2: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల మనం ఎలాంటి మర్యాదలు కలిగి ఉండాలి?
الجواب
ج:1. اتباعه والاقتداء به.
قال تعالى:
﴿لَّقَدۡ كَانَ لَكُمۡ فِي رَسُولِ ٱللَّهِ أُسۡوَةٌ حَسَنَةٞ لِّمَن كَانَ يَرۡجُواْ ٱللَّهَ وَٱلۡيَوۡمَ ٱلۡأٓخِرَ وَذَكَرَ ٱللَّهَ كَثِيرٗا﴾
[الأحزاب: ٢١].
- طاعته.
- ترك معصيته.
﴿مَّن يُطِعِ ٱلرَّسُولَ فَقَدۡ أَطَاعَ ٱللَّهَۖ وَمَن تَوَلَّىٰ فَمَآ أَرۡسَلۡنَٰكَ عَلَيۡهِمۡ حَفِيظٗا﴾
[النساء: ٨٠].
- تصديقه فيما أخبر.
﴿وَمَا يَنطِقُ عَنِ ٱلۡهَوَىٰٓ٣
إِنۡ هُوَ إِلَّا وَحۡيٞ يُوحَىٰ﴾
[النجم: ٣-٤].
- عدم الابتداع في الزيادة على سنته.
قال عليه الصلاة والسلام:
«من أحدث في أمرنا هذا ما ليس فيه فهو رد»
متفق عليه.
- محبته أكثر من النفس ومن كل الناس.
«لا يؤمن أحدكم حتى أكون أحب إليه من والده وولده، والناس أجمعين»
- تعظيمه ونصرته ونصرة سنته.
قال سبحانه:
﴿لِّتُؤۡمِنُواْ بِٱللَّهِ وَرَسُولِهِۦ وَتُعَزِّرُوهُ وَتُوَقِّرُوهُۚ ﴾
[الفتح: ٩].
జవాబు: 1- ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంను ఆదర్శంగా తీసుకుని, ఆయన జీవిత విధానాన్ని (సున్నతులను) మనస్పూర్తిగా అనుసరించడం.
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
{వాస్తవానికి, అల్లాహ్ యొక్క సందేశహరునిలో మీకు ఒక ఉత్తమమైన ఆదర్శం ఉంది, వారి కొరకు ఎవరైతే అల్లాహ్ మరియు అంతిమ దినాన్ని ఆశిస్తారో మరియు అల్లాహ్ ను అత్యధికంగా స్మరిస్తారో!}
[ అహ్జాబ్: 21]
- ఆయనకు విధేయత చూపడం
- ఆయనకు అవిధేయత చూపడం నుండి దూరంగా ఉండటం
{ఎవడు ప్రవక్తకు విధేయత చూపుతాడో వాస్తవంగా అతడు అల్లాహ్ కు విధేయత చూపినట్లే. మరియు కాదని వెనుదిరిగి పోతే వారిని అదుపులో ఉంచటానికి (కావలివానిగా) మేము నిన్ను పంపలేదు.}
[నిసా: 80]
- ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపిన దానిని విశ్వసించుట.
{మరియు అతను తన మనోవాంఛలను అనుసరించి కూడా మాట్లాడడు.
అది (అతను పలుకుతున్నది), అతనిపై అవతరింపజేయబడిన దివ్యజ్ఞానం (వహీ) మాత్రమే.(4)
[అన్ నజ్మ్ : 3 - 4]
- ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం సున్నతులకు కొత్త కల్పిత విషయాలను, నూతన పోకడలను చేర్చకుండా ఉండటం.
ఆయన అలైహిస్సలాతు వస్సలాం ఇలా తెలియ చేశారు:
“ఎవడయినా మా ఈ ధర్మం విషయంలో దీనికి సంబంధించని కొత్త విషయమేదైనా ఆవిష్కరిస్తే అది త్రోసిపుచ్చబడుతుంది”.
ముత్తఫఖున్ అలైహి
- స్వయం కంటే ఎక్కువగా మరియు మొత్తం మానవాళి కంటే (సృష్టిలోని ప్రతిదాని కంటే) ఎక్కువగా ఆయన ను ప్రేమించడం
“మీలో ఏ వ్యక్తి అయినా తన ఆలుబిడ్డలకన్నా, తన తల్లిదండ్రుల కన్నా, సమస్త మానవులకన్నా ఎక్కువగా నన్ను ప్రేమించనంత వరకూ అతను విశ్వాసి కాజాలడు".
- ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం సున్నతులను గౌరవించడం మరియు వాటికి పూర్తి మద్దతును ఇవ్వడం
అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
{ఎందుకంటే (ఓ ముస్లింలారా!) మీరు అల్లాహ్ ను మరియు ఆయన ప్రవక్తను విశ్వసించాలనీ మరియు మీరు అతనితో (ప్రవక్తతో) సహకరించాలనీ మరియు అతనిని గౌరవించాలనీ}
[ఫతహ్ : 29]