“ఒక వ్యక్తి రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం సమక్షములో ఎడమ చేతితో తినసాగాడు. అపుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “కుడిచేతితో తిను”. దానికి అతడు “నేను అలా చేయలేను” అన్నాడు. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “నీవు అలా చేయకుండానే ఉండిపోవుదువుగాక”
సలమహ్ ఇబ్న్ అల్ అక్వఇ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం :
“ఒక వ్యక్తి రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం సమక్షములో ఎడమ చేతితో తినసాగాడు. అపుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “కుడిచేతితో తిను”. దానికి అతడు “నేను అలా చేయలేను” అన్నాడు. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “నీవు అలా చేయకుండానే ఉండిపోవుదువుగాక” అన్నారు. వాస్తవానికి అతడు అహంకారం కొద్దీ నిరాకరించినాడు. (అతణ్ణి గురించి) ఇలా అన్నారు: “ఆ తరువాత అతడు తన కుడి చేతిని ఎప్పుడూ నోటి వరకు ఎత్తలేక పొయినాడు.”
أَنَّ رَجُلًا أَكَلَ عِنْدَ رَسُولِ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ بِشِمَالِهِ، فَقَالَ: «كُلْ بِيَمِينِكَ»، قَالَ: لَا أَسْتَطِيعُ، قَالَ: «لَا اسْتَطَعْتَ»، مَا مَنَعَهُ إِلَّا الْكِبْرُ، قَالَ: فَمَا رَفَعَهَا إِلَى فِيهِ.
ఒక వ్యక్తి ఎడమ చేతితో తినడం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చూసినారు. అందుకని అతడిని కుడి చేతితో తినమని ఆదేశించినారు. ఆ వ్యక్తి అహంకారం కొద్దీ అలా చేయలేనని అబద్ధం చెప్పాడు. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతడు కుడి చేతితో తినడం నిషేధమైపోయేలా దుఆ చేసారు. అతడి కుడి చేతికి పక్షవాతం వచ్చేలా చేసి, అల్లాహ్ ఆయన దుఆను స్వీకరించాడు.
...:
ఈ హదీసు ద్వారా తినడం అనేది తప్పనిసరిగా కుడి చేతితో మాత్రమే చేయాలని మరియు ఎడమ చేతితో తినడం నిషేధమని తెలుస్తున్నది.
షరియత్ ఆదేశాలను అమలు చేయడంలో అహంకారం ప్రదర్శించడం శిక్షార్హము అని తెలుస్తున్నది.
ఇందులో – అల్లాహ్ తన సందేశహరుడైన మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క దుఆను వెంటనే ఆమోదించి ఆయనకు ఘనతనొసంగడం చూస్తాము.
అలాగే ఇందులో షరియత్ ప్రకారం - చివరికి బోజనం తినే విషయంలో నైనా సరే - మంచిని చేయమని ఆదేశించడం మరియు చెడును నిరోధించడం చేస్తూ ఉండాలని తెలియుచున్నది.
సహీహ్ ముస్లిం. (3/ 1599) (2021).
ఇంకా (6)
بهجة الناظرين شرح رياض الصالحين.
لسليم الهلالي (1/ 239).
نزهة المتقين شرح رياض الصالحين.
لمجموعة من الباحثين (1/ 183).
كنوز رياض الصالحين.
لمجموعة من الباحثين (3/ 396).