Skip to content
సూరాల జాబితా /

المُرسَلات

المُرسَلات is chapter 77 of the Quran and has 50 verses. This page presents it in full in the Uthmani script, with a verse-by-verse translation of its meaning.

50 ఆయతులు సూరా సంఖ్య 77
ఆయత్‌కు వెళ్ళండి
తెలుగు · Muhammad
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ

وَٱلۡمُرۡسَلَٰتِ عُرۡفٗا

ఒకదాని తరువాత ఒకటి, వరుసగా పంపబడే వాయువుల సాక్షిగా!

Explanation & meanings · 1
  1. లేక దేవదూతల, లేక సందేశహరుల సాక్షిగా అని కొందరు వ్యాఖ్యాతల అభిప్రాయం. 'ఉర్ ఫన్ - అంటే దివ్యజ్ఞానం (వ'హీ) లేక షరీయత్ ఆజ్ఞలని కొందరు వ్యాఖ్యాతల అభిప్రాయం.

فَٱلۡعَٰصِفَٰتِ عَصۡفٗا

మరియు తీవ్రమైన వేగతో వీచే వాయువుల సాక్షిగా!

Explanation & meanings · 1
  1. లేక దేవదూతల సాక్షిగా! ఎవరైతే తీవ్రంగా వీచే గాలులతో సహా పంపబడతారో!

وَٱلنَّٰشِرَٰتِ نَشۡرٗا

మరియు మేఘాలను దూరదూరంగా వ్యాపింపజేసే వాయువుల సాక్షిగా!

Explanation & meanings · 1
  1. లేక దేవదూతల సాక్షిగా!' ఇబ్నె-కసీ'ర్, 'తబరీ మరియు ఇతర చాలా మంది వ్యాఖ్యాతలు కూడా (ర హ్మ). ఈ మూడు ఆయతులలో గాలుల ప్రస్తావన ఉందనే అభిప్రాయపడ్డారు.

فَٱلۡفَٰرِقَٰتِ فَرۡقٗا

మరియు మంచి చెడులను విశదపరచే (దైవదూతల) సాక్షిగా!

Explanation & meanings · 1
  1. లేక ఖుర్ఆన్ ఆయతుల లేక ప్రవక్తల సాక్షిగా.

فَٱلۡمُلۡقِيَٰتِ ذِكۡرًا

సందేశాలను ప్రవక్తల వద్దకు తెచ్చే (దైవదూత) సాక్షిగా!

Explanation & meanings · 1
  1. లేక అల్లాహ్ (సు.తా.) యొక్క వ'హీని ప్రజలకు అందజేసే ప్రవక్త ('అలైహిమ్ స.) ల సాక్షిగా! ఇమామ్ షౌకాని అభిప్రాయంలో - ముర్సలాత్, 'ఆ'సిఫాత్ మరియు నాషిరాత్ - గాలులను సంబోధిస్తున్నాయి మరియు ఫారిఖాత్, ముల్ ఖియాత్ - దేవదూతలను. ఈ వ్యాఖ్యానంతో కూడా చాలా మంది వ్యాఖ్యాతలు ఏకీభవిస్తున్నారు.