Skip to content
సూరాల జాబితా /

النَّبَإ

النَّبَإ is chapter 78 of the Quran and has 40 verses. This page presents it in full in the Uthmani script, with a verse-by-verse translation of its meaning.

40 ఆయతులు సూరా సంఖ్య 78
ఆయత్‌కు వెళ్ళండి
తెలుగు · Muhammad
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ

عَمَّ يَتَسَآءَلُونَ

ఏ విషయాన్ని గురించి వారు (ఒకరినొకరు) ప్రశ్నించుకుంటున్నారు?

Explanation & meanings · 1
  1. దైవప్రవక్త ('స'అస) పై అవతరింపజేయబడిన ఖుర్ఆన్ ను మరియు అతనిని ప్రవక్తగా అల్లాహ్ (సు.తా.) ఎన్నుకున్న విషయాన్ని నమ్మలేక సత్యతిరస్కారులు ఒకరితో నొకరు ఈ విధంగా ప్రశ్నించుకున్నారు: "ఏమీ? పునరుత్థానం నిజమేనా? ఇతడు వాస్తవంగానే ప్రవక్తనా?" మొదలైనవి. దానిని అల్లాహ్ (సు.తా.) స్వయంగా జవాబిచ్చాడు.

عَنِ ٱلنَّبَإِ ٱلۡعَظِيمِ

ఆ మహా వార్తను గురించేనా?

ٱلَّذِي هُمۡ فِيهِ مُخۡتَلِفُونَ

దేనిని గురించైతే వారు భేదాభిప్రాయాలను కలిగి ఉన్నారో?

كَلَّا سَيَعۡلَمُونَ

అది కాదు! వారు త్వరలోనే దానిని తెలుసుకోగలరు.

ثُمَّ كَلَّا سَيَعۡلَمُونَ

ఎంత మాత్రము కాదు! వారు త్వరలోనే దానిని తెలుసుకోగలరు.