Skip to content
సూరాల జాబితా /

الإنسَان

الإنسَان is chapter 76 of the Quran and has 31 verses. This page presents it in full in the Uthmani script, with a verse-by-verse translation of its meaning.

31 ఆయతులు సూరా సంఖ్య 76
ఆయత్‌కు వెళ్ళండి
తెలుగు · Muhammad
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ

هَلۡ أَتَىٰ عَلَى ٱلۡإِنسَٰنِ حِينٞ مِّنَ ٱلدَّهۡرِ لَمۡ يَكُن شَيۡـٔٗا مَّذۡكُورًا

అనంత కాలచక్రంలో, మానవుడు తాను చెప్పుకోదగిన వస్తువు కాకుండా ఉన్న సమయం గడవలేదా?

إِنَّا خَلَقۡنَا ٱلۡإِنسَٰنَ مِن نُّطۡفَةٍ أَمۡشَاجٖ نَّبۡتَلِيهِ فَجَعَلۡنَٰهُ سَمِيعَۢا بَصِيرًا

నిశ్చయంగా, మేము మానవుణ్ణి ఒక మిశ్రమ వీర్యబిందువుతో సృష్టించాము. అతనిని పరీక్షించటానికి, మేము అతనిని వినేవాడిగా, చూసేవాడిగా చేశాము.

Explanation & meanings · 2
  1. అంటే స్ర్తీ పురుషుల మిశ్రమంతో! అంటే పురుషుని రేతస్సు, లేక వీర్యబిందువు, లేక శుక్లం (Sperm), స్త్రీ బీజకణం (Ovum) చూడండి, 86:6-7.
  2. అంటే పరీక్షించటం, చూడండి, 67:2.

إِنَّا هَدَيۡنَٰهُ ٱلسَّبِيلَ إِمَّا شَاكِرٗا وَإِمَّا كَفُورًا

నిశ్చయంగా, మేము అతనికి మార్గం చూపాము. ఇక అతడు కృతజ్ఞుడు కావచ్చు, లేదా కృతఘ్నుడూ కావచ్చు!

Explanation & meanings · 1
  1. ప్రతి మానవుడు తన ఆత్మను వ్యాపారంలో పెడ్తాడు. దానిని నష్టంలో పడవేస్తాడు. లేక లాభంలో ('స. ముస్లిం). నష్టం అంటే నరకం, లాభం అంటే స్వర్గం. ఇంకా చూడండి, 90:10.

إِنَّآ أَعۡتَدۡنَا لِلۡكَٰفِرِينَ سَلَٰسِلَاْ وَأَغۡلَٰلٗا وَسَعِيرًا

నిశ్చయంగా, మేము సత్యతిరస్కారుల కొరకు సంకెళ్ళను, మెడలో పట్టాలను మరియు భగభగ మండే నరకాగ్నిని (సఈరాను0 సిద్ధపరచి ఉంటాము.

Explanation & meanings · 1
  1. ఇది అల్లాహ్ (సు.తా.) ప్రసాదించిన స్వేచ్ఛను చెడు మార్గంలో వినియోగించటం వల్ల లభించే ప్రతిఫలం. ఇంకా చూడండి, 73:12-13.

إِنَّ ٱلۡأَبۡرَارَ يَشۡرَبُونَ مِن كَأۡسٖ كَانَ مِزَاجُهَا كَافُورًا

నిశ్చయంగా, పుణ్యాత్ములు కాఫూర్ అనే ఒక చెలమ నుండి ఒక గిన్నెలో తెచ్చిన (పానీయాన్ని) త్రాగుతారు.

Explanation & meanings · 1
  1. చూడండి, 83:25-28.