المناهج التعليمية - الصف الثاني
శీర్షిక: పాఠ్యాంశాలు, తౌహీద్ పుస్తకం (కితాబుత్తౌహీద్), విభాగము (రెండు). సంక్షిప్త సారాంశము: ఈ శాస్త్రీయ విషయం విద్యార్థులకు ఉద్దేశించిన సౌదీ అరేబియా రాజ్యంలో పాఠ్యప్రణాళిక యొక్క శుద్ధీకరణ మరియు సంక్షిప్తీకరణగా పరిగణించబడుతుంది మరియు ఇది అనేక స్థాయిలుగా విభజించబడింది. ఈ అంశంలో ఏకేశ్వరోపాసన (తౌహీద్ ) పాఠ్యాంశములకు సంబంధించి విషయాలు ఉంటాయి మరియు ఇది పన్నెండు (12) విభాగములుగా విభజించబడినాయి. రెండవ విభాగములో చేర్చబడిన ముఖ్యమైన అంశాలలో: ఒక వ్యక్తి తప్పనిసరిగా తెలుసుకోవలసిన మూడు ప్రాధమిక సూత్రాలు ఉన్నాయి, అవి : దాసుడికి తన ప్రభువు గురించిన పరిజ్ఞానం, మరియు మరెవరికీ కాకుండా ఆయనను మాత్రమే ఆరాధించే…
These files are generated automatically from the book's text; their layout may differ from the printed edition.
శీర్షిక: పాఠ్యాంశాలు, తౌహీద్ పుస్తకం (కితాబుత్తౌహీద్), విభాగము (రెండు).
సంక్షిప్త సారాంశము: ఈ శాస్త్రీయ విషయం విద్యార్థులకు ఉద్దేశించిన సౌదీ అరేబియా రాజ్యంలో పాఠ్యప్రణాళిక యొక్క శుద్ధీకరణ మరియు సంక్షిప్తీకరణగా పరిగణించబడుతుంది మరియు ఇది అనేక స్థాయిలుగా విభజించబడింది. ఈ అంశంలో ఏకేశ్వరోపాసన (తౌహీద్ ) పాఠ్యాంశములకు సంబంధించి విషయాలు ఉంటాయి మరియు ఇది పన్నెండు (12) విభాగములుగా విభజించబడినాయి. రెండవ విభాగములో చేర్చబడిన ముఖ్యమైన అంశాలలో: ఒక వ్యక్తి తప్పనిసరిగా తెలుసుకోవలసిన మూడు ప్రాధమిక సూత్రాలు ఉన్నాయి, అవి :
దాసుడికి తన ప్రభువు గురించిన పరిజ్ఞానం, మరియు మరెవరికీ కాకుండా ఆయనను మాత్రమే ఆరాధించే బాధ్యత.
దాసుడికి తన ధర్మం గురించిన పరిజ్ఞానం మరియు ఆ ధర్మం మూడు స్థాయిలను కలిగి ఉంటుంది, అవి : ఇస్లాం, ఈమాన్ మరియు ఇహ్సాన్, ప్రతి స్థాయి అర్థ వివరణతో పాటు దాని ఆధారాలు ఉంటాయి.
దాసుడికి తన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి పరిజ్ఞానం మరియు ఆయన విధేయత మరియు ప్రేమ యొక్క ఆదేశము యొక్క వివరణ.
రెండవ విభాగము
ముందుమాట
స్తుతులన్నీ కలముతో జ్ఞానమును బోధించిన అల్లాహ్ కొరకు. ఆయన మానవునికి తెలియని విషయాలను బోధించాడు. మరియు శుభాలు,శాంతి గౌరవోన్నతుడైన నిరక్షరాశ్యుడైన ప్రవక్తపై, అల్లాహ్ ప్రజలను చీకట్లలో నుంచి వెలుగులోకి తీసుకుని రావటానికి ఆయనను పంపించాడు. అమ్మా బాద్ :
నిశ్ఛయంగా సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ఏకశ్వరోపాసన విధుల్లో అత్యంత కీలకమైన విధి. దాని గురించి జ్ఞానం శాస్త్రాలలో అత్యంత గౌరవప్రదమైనది మరియు ఉత్తమమైనది. ఆచరణల యొక్క ప్రామాణికత మరియు వాటి స్వీకరణ నిర్మించబడే పునాది. మరియు దాసులకు దాని అవసరం ఇతర అవసరాల కంటే ఎక్కువ. ఎందుకంటే హృదయములకు తమ ప్రభువును,తమ ఆరాధ్య దైవమును,తమ సృష్టికర్తను అతని నామములు,అతని గుణములు,అతని చర్యల ద్వారా గుర్తించటంతోనే జీవితము,అనుగ్రహాలు మరియు మనశ్యాంతి కలదు.
అలాగే, ధర్మం విషయంలో అవగాహన కలిగిఉండటం మరియు ఆరాధనలను ఎలా నిర్వహించాలో తెలుసుకోవడం. తహారత్ (సుచీశుభ్రత),నమాజు వంటివి, మరియు అవే కాకుండా ఆనందం యొక్క సంకేతాలు. మరియు సర్వశక్తిమంతుడైన అల్లాహ్ తన దాసుడి కొరకు మంచిని ఉద్దేశించాడనే సూచన. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు :
మరియు ఈ దృక్కోణం నుండి, కమ్యూనిటీస్ అవేర్నెస్ కార్యాలయం అభ్యాసకుల హృదయాలలో సరైన అఖీదాను నాటటానికి మరియు వారికి ఫిఖా ఆదేశాలను బోధించానికి ఏకేశ్వరోపాసన గురించి బోధించడానికి ఆసక్తిని కలిగి ఉంది. తద్వారా వారు షరీఅత్ పరమైన పద్ధతిలో ఆరాధనలను నిర్వహించగలరు మరియు తమ ధర్మానికి సంబంధించిన విషయాల గురించి జ్ఞానోదయం మరియు అవగాహన కలిగి ఉంటారు.
మరియు ఏకేశ్వరోపాసన కోర్సు యొక్క ఈ విభాగము ధర్మం యొక్క స్థాయిలు మరియు ఒక వ్యక్తి తప్పనిసరిగా తెలుసుకోవలసిన ప్రాధమిక మూడు సూత్రాల యొక్క సరళీకృత వివరణను కలిగి ఉంది.
మరియు ఉపాధ్యాయునికి ఈ సూచనలు :
1- ఆచరణ స్వీకరించబడటానికి అల్లాహ్ కొరకు చిత్తశుద్ధి ఒక షరతు. కావున మీ ఆచరణను పరిశుద్ధుడైన ఆయన మన్నత కొరకు ప్రత్యేకించి చేయండి, మీరు ఇహలోకంలో మరియు పరలోకంలో లాభాన్ని పొందుతారు. దీనిని బుఖారీ ఉల్లేఖించారు సంఖ్య (7)
2- అమానత్ యొక్క పరిరక్షణ మోక్షానికి ఒక మార్గం - నీవు - ఓ నా ప్రియ సోదర అధ్యాపకుడా - ఇస్లాం యొక్క సరిహద్దులలో నుంచి ఒకదానిపై ఉన్నావు మరియు ముస్లింల పిల్లల మనస్సు మరియు స్వభావాన్ని అమానత్ గా పొందావు, కాబట్టి నీవు ఇహపరాలలో సాఫల్యం చెందటానికి అమానత్ ను పరిరక్షించు.
3- నిశ్ఛయంగా ఏకేశ్వరోపాసన (తౌహీద్) విషయం బోధించటం ఆచరణల నిమిత్తమే. కావున ఏకేశ్వరోపాసన జ్ఞానం మరియు దాని ప్రకారం ఆచరణ ద్వారా మాత్రమే దాసుల కొరకు ప్రయోజనం మరియు ఇహలోక పరాభవం నుండి,పరలోక శిక్ష నుండి మోక్షం కలుగును. కాబట్టి అభ్యాసకుల హృదయాలలో సరైన అఖీదాను నాటడానికి కష్టపడి పని చేయండి మరియు మీరు ఆహ్వానించే ఆదర్శాలు మరియు ఉన్నత విలువలకు నిజాయితీగల వ్యాఖ్యాతగా మరియు సజీవ ఉదాహరణగా ఉండండి.
4- ఆకాశం మధ్యలో మేఘాలు మబ్బులు కమ్ముకున్నప్పుడు, ఉరుముల మెరుపులు,పిడుగుల గర్జలున్నప్పుడు, వర్షం కురుస్తున్నప్పుడు మరియు అటువంటే ఒక ముస్లింలో విశ్వాసం యొక్క ఉద్దేశాలను ప్రేరేపించే ఇతర సంఘటనలు జరిగినప్పుడు అల్లాహ్ ఏకేశ్వరోపాసన మరియు అతని శక్తి గురించి మాట్లాడటానికి పరిస్థితులను ఉపయోగించుకోవడం.
5- నిశ్ఛయంగా ఉదాహరణలు ఇవ్వడం మరియు పాఠాన్ని వాస్తవికతతో అనుసంధానించడం ద్వారా విషయమును సులభతరం చేయడం, విషయం పట్ల అభ్యాసకుల ప్రేమపై గొప్ప ప్రభావాన్ని చూపుతుంది, ఆపై దానిని నేర్చుకోవడం మరియు దాని ప్రకారం ఆచరించడం. ముగింపులో, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన దాని ద్వారా మేము మీకు శుభవార్త అందిస్తున్నాము :
"నిశ్ఛయంగా ఒక విశ్వాసి మరణానంతరం అతనితో ముడిపడి ఉన్న ఆచరణ మరియు మంచి పనులలో అతను బోధించిన మరియు వ్యాప్తి చేసిన జ్ఞానం ఉంది."([3])
ఏకేశ్వరోపాసన యొక్క కోర్సు
అంశము
పేజీ
మొదటి పాఠం : ఇబ్నె మాజ దీనిని ఉల్లేఖించారు హదీసు సంఖ్య (242).
మొదటి విభాగంలో గతంలో చదివిన వాటి సమీక్షణ
రెండవ పాఠం :
త్రిసూత్రాలు
మూడవ పాఠం :
మొదటి ప్రాధమిక సూత్రము : దాసుడికి తన ప్రభువు గురించి పరిజ్ఞానం ఉండటం.
నాల్గవ పాఠం
మానవులను మరియు జిన్నాతులను సృష్టించడం వెనుకనున్న వివేకం.
ఐదవ పాఠం :
అల్లాహ్ ఒక్కడి ఆరాధన చేయటం విధి
ఆరవ పాఠం :
అల్లాహేతరుల ఆరాధన చేయటము షిర్కు (అల్లాహ్ తో ఇతరులను సాటి కల్పించటం) అవుతుంది.
ఏడవ పాఠం
రెండవ ప్రాధమిక సూత్రం : దాసుడికి తన ధర్మం గురించిన పరిజ్ఞానం ఉండటం.
ఎనిమిదవ పాఠం :
ధర్మం యొక్క స్థానాలు (మొదటి స్థానం : ఇస్లాం)
తొమ్మిదవ పాఠం :
షహాదతైన్ (రెండు సాక్ష్యాల) యొక్క అర్ధం
పదవ పాఠం :
రెండవ స్థానం (ఈమాన్)
పదకొండవ పాఠం :
మరణాంతరం లేపబడటము పై విశ్వాసం
పన్నెండవ పాఠం :
మూడవ స్థానం (ఇహ్సాన్)
పదమూడవ పాఠం :
మూడవ ప్రాధమిక సూత్రం : దాసునికి తన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క పరిజ్ఞానం ఉండటం.
మొదటి పాఠం
మొదటి విభాగంలో గతంలో చదివిన వాటి సమీక్షణ
1- నీ ప్రభువు ఎవరు?
2- అల్లాహ్ ఎక్కడ ఉన్నాడు ?
3- నిన్ను సృష్టించినదెవరు మరియు నీకు ఆహారోపాధిని ప్రసాదిస్తున్నది ఎవరు ?
4- మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:
{అల్లాహ్'యే ప్రతీది సృష్టించేవాడు}
[జుమర్ : 62]
మహోన్నతుడైన అల్లాహ్ యొక్క సృష్టిలో మూడింటిని పేర్కొనండి.
1-............... 2-............... 3-...............
5- వర్షమును కురుపించేది ఎవరు ?
6- ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎవరి వద్దకు ప్రవక్తగా పంపబడ్డారు?
7- క్రింది పదములలో నుంచి తగిన పదంతో ఖాళీలను పూరించండి :
[ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం - ఇస్లాం - నరకాగ్ని - అల్లాహ్ - స్వర్గము - దివ్య ఖుర్ఆన్]
అ - నేను అనారోగ్యానికి గురైనప్పుడు నాకు నయం చేసేవాడు ఆయనే . . . . . . . .
ఆ - నా ధర్మము . . . . . . . .
ఇ - నా ప్రవక్త . . . . . . . .
ఈ - అల్లాహ్ తన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై అవతరింపజేసిన గ్రంధము . . . . . . . .
ఉ - దైవప్రవక్తను అనుసరించినవాడు . . . . . . . . లో ప్రవేశిస్తాడు మరియు ఆయనకు అవిధేయత చూపేవాడు . . . . . . . . లో ప్రవేశిస్తాడు.
రెండవ పాఠం ([4])
త్రిసూత్రాలు ([5])
మనిషి అవగాహన చేసుకోవటం అవశ్యకమైన త్రిసూత్రాలు,అవి :
1-దాసుడికి తన ప్రభువు గురించి జ్ఞానం ఉండటం,2- దాసుడికి తన ధర్మం గురించిన జ్ఞానం ఉండటం,3- దాసునికి తన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క జ్ఞానం ఉండటం.
రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:
“అల్లాహ్’ను తన ప్రభువుగా, ఇస్లాంను తన ధర్మంగా మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ను తన సందేశహరునిగా సంతృప్తి చెందిన వ్యక్తి, విశ్వాసము యొక్క మాధుర్యాన్ని చవిచూసాడు.” పాఠం యొక్క లక్ష్యాలు : విద్యార్థి మూడు త్రిసూత్రాలను వివరించాలి,- విద్యార్థి తప్పనిసరిగా త్రిసూత్రాలకు సంబంధించిన ఆధారాలను ప్రస్తావించాలి,- విద్యార్థి ఇస్లాం ధర్మం గురించి గర్వపడాలి.
దీనిని ముస్లిం ఉల్లేఖించారు హదీసు సంఖ్య (34)
ప్రశ్నలు : ఉపాధ్యాయుని కోసం :- ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహ్హాబ్ రహిమహుల్లాహ్ పరిచయం- మరియు విద్యార్థుల బుద్ధులకు సరిపోయే విధంగా ఈ దేశంలో మరియు ఇతర ప్రాంతాలలో ఏకేశ్వరోపాసనను వ్యాప్తి చేయడంలో ఆయన చేసిన కృషికి ప్రశంసలు, మరింత సమాచారం కోసం చూడండి: ఇబ్నె బషర్ గారి (అల్ మజ్దు ఫీ తారీఖి నజ్ద్), ఇబ్నె గన్నామ్ గారి (తారీఖె నజ్ద్). - "మూలం" అనే పదాన్ని స్పష్టం చేయడం, ఇది దాసుడు తన సమాదిలో ప్రశ్నించబడే (నీ ప్రభువు ఎవరు?,నీ ధర్మం ఏమిటి?,నీ ప్రవక్త ఎవరు?.) ఈ మూడు ప్రాధమిక సూత్రలు నిలబడే పునాది. ఎవరైతే వాటికి సమాధానమిస్తారో అల్లాహ్ వారికి ఆనందకరమైన తోటలను ప్రతిఫలంగా ప్రసాదిస్తాడు మరియు ఎవరు వాటికి సమాధానం చెప్పరో వారికి బాధాకరమైన శిక్షను ప్రతిఫలంగా ఇస్తాడు. ఎలాగైతే ఇది బరా బిన్ ఆజిబ్ రజియల్లాహు అన్హు హదీసులో వచ్చినది,దానిని అబూదావుద్ ఉల్లేఖించారు హదీసు సంఖ్య (4753).
ప్ర1: కింది ఖాళీలను పూరించండి:
మనిషి అవగాహన చేసుకోవలసిన అవశ్యకమైన త్రిసూత్రాలు :
1- దాసుడికి ..... గురించి పరిజ్ఞానం ఉండటం. 2- దాసుడికి ..... గురించి పరిజ్ఞానం ఉండటం. 3- దాసుడికి ..... గురించి పరిజ్ఞానం ఉండటం.
ప్ర 2 : మనిషి అవగాహన చేసుకోవలసిన అవశ్యకమైన త్రిసూత్రాలపై సూచించే ఆధారం ఏమిటి ?
ప్ర 3: దాసుడికి అతని సమాధిలో అడగబడే మూడు ప్రశ్నలు :
నీ ప్రభువు ఎవరు?,నీ ధర్మం ఏమిటి?,నీ ప్రవక్త ఎవరు?.
రెండవ పాఠం ([6])
మొదటి ప్రాధమిక సూత్రము : దాసుడికి తన ప్రభువు గురించి పరిజ్ఞానం ఉండటం.([7])
త్రిసూత్రాలు :
1-దాసుడికి తన ప్రభువు గురించి పరిజ్ఞానం ఉండటం,2- దాసుడికి తన ధర్మం గురించిన పరిజ్ఞానం ఉండటం,3- దాసునికి తన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి పరిజ్ఞానం ఉండటం.
నా ప్రభువు అల్లాహ్ : సృష్టికర్త,ఆహార ప్రధాత,సమస్త వ్యవహారాల నిర్వాహకుడు,వేరే వారు కాకుండా ఆయన ఒక్కడే ఆరాధనకు హక్కుదారుడు.
* నా ప్రభువును ఆయన సూచనలు మరియు ఆయన సృష్టిరాసుల ద్వారా నాకు తెలుసు: ఉదాహరణకు రాత్రి మరియు పగలు, సూర్యుడు మరియు చంద్రుడు మరియు ఆకాశాలు మరియు భూమి వంటివి.
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:
{మరియు ఆయన సూచనలలో (ఆయాత్ లలో) రేయింబవళ్ళు మరియు సూర్యచంద్రులున్నాయి. మీరు సూర్యునికి గానీ చంద్రునికి గానీ సాష్టాంగం (సజ్దా) చేయకండి, కాని కేవలం వాటిని సృష్టించిన అల్లాహ్ కు మాత్రమే సాష్టాంగం (సజ్దా) చేయండి - నిజంగానే మీరు ఆయనను ఆరాధించేవారే అయితే}. పాఠం యొక్క లక్ష్యాలు: - విద్యార్థి త్రిసూత్రాలలో మొదటిదాన్ని పేర్కొనడం, - విద్యార్థి రబ్ (ప్రభువు) అర్థాన్ని వివరించాలి - విద్యార్థి అల్లాహ్ యొక్క కొన్ని సృష్టిరాసులను లెక్కించాలి.
నేను ఒక ముస్లింని, అల్లాహ్ సృష్టిని సృష్టించాడని మరియు వారికి ఆహారోపాధిని ప్రసాదించాడని నేను విశ్వసిస్తున్నాను మరియు ఈ విశ్వవ్యవహారాల నిర్వాహకుడు ఆయనే. ఆయన ఒక్కడు మాత్రమే ఆరాధనకు అర్హుడు. ఉపాధ్యాయుని కోసం:- ఆయతులు మరియు హదీసులను సూచించడం ద్వారా సర్వశక్తిమంతుడైన అల్లాహ్ సృష్టి గురించి విద్యార్థి యొక్క ఆలోచించే సామర్థ్యాన్ని పెంపొందించడానికి తరగతి వెలుపల పాఠాన్ని వివరించడం ఉత్తమం. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు : {ప్రజలారా! మిమ్మల్నీ, మీకు పూర్వం వారినీ పుట్టించిన మీ ప్రభువునే ఆరాధించండి-తద్వారానే మీరు (పాపాల నుండి) సురక్షితంగా ఉంటారు. ఆయనే మీ కోసం భూమిని పాన్పుగానూ, ఆకాశాన్ని కప్పు గానూ చేశాడు, ఆకాశం నుంచి వర్షాన్ని కురిపించి, తద్వారా పండ్లు ఫలాలను పండించి మీకు ఉపాధినొసగాడు. ఇది తెలిసి కూడా మీరు ఇతరులను అల్లాహ్ కు భాగస్వాములుగా నిలబెట్టకండి.} [బఖర : 21 - 22] ఇబ్నె కసీర్ రహిమహుల్లాహ్ ఇలా సెలవిచ్చారు : "వీటన్నిటి సృష్టికర్తే ఆరాధనకు అర్హుడు". - అల్లాహ్ సృష్టి గురించి ఆలోచించడం ఆరాధన అని చెప్పాలి. - కలిమిలో సర్వశక్తిమంతుడైన అల్లాహ్ను ప్రార్థించాలని (దుఆ చేయాలని) విద్యార్థులకు సూచించాలి (ఉదాహరణకు ప్రయోజనకరమైన ధార్మిక విద్యను,హలాల్ ఆహారోపాదిని అర్జించటం),లేమిలోను అల్లాహ్ను ప్రార్థించాలని (దుఆ చేయాలని) విద్యార్థులకు సూచించాలి (ఉదాహరణకు అనారోగ్యమును నయం చేయమని మరియు ఆపదను తొలగించమని కోరటం).- అల్లాహ్ యొక్క గొప్పఅనుగ్రహాలపై ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకోమని ప్రోత్సహించాలి,మరియు మానవులకు, జంతువులకు మరియు మొక్కలకు అనేక ప్రయోజనాలను కలిగి ఉన్న సూర్యుడు మరియు చంద్రుడు ఆ అనుగ్రహాలలో నుంచే.
ప్రశ్నలు :
ప్ర1: ప్రభువు (రబ్) యొక్క అర్ధం ఏమిటి?
ప్ర 2 : క్రింది ఖాళీలను పూరించండి :
- నేను నా ప్రభువును ............, మరియు ................ ద్వారా గుర్తించాను.
రేయింబవళ్ళను సృష్టించినవాడు అతడే ..................
ప్ర3 : మహోన్నతుడైన అల్లాహ్ యొక్క సృష్టిలో మూడింటిని పేర్కొనండి.
1- ............... .
2- ............... .
3- ............... .
ప్ర4: ఆయతులో పేర్కొన్న అల్లాహ్ సూచనల క్రింద ఒక గీత గీయండి :
మహోన్నతుడు ఇలా సెలవిస్తున్నాడు:
ప్ర5: అల్లాహ్ మనకు అనుగ్రహించిన అల్లాహ్ యొక్క గొప్ప సృష్టిరాసులలో సూర్యుడు మరియు చంద్రులు ఉన్నాయి. వాటిలో ప్రతిదానికీ ఒక ప్రయోజనాన్ని పేర్కొనండి.
మూడవ పాఠం ([8])
మానవులను మరియు జిన్నాతులను సృష్టించడం వెనుకనున్న వివేకం ([9])
అల్లాహ్ జిన్నులను,మానవులను కేవలం తన ఒక్కడి ఆరాధన కొరకు సృష్టించాడు.
మరియు ఆధారం అల్లాహ్ యొక్క వాక్యం :
ఇబాదత్ (ఆరాధన): అల్లాహ్ ఇష్టపడే మరియు సంతోషించే పలుకులు,చేతలలో నుంచి బాహ్యపరమైన,అంతర్గతపరమైన ప్రతిదానికీ ఇది ఒక సమగ్ర పేరు.
ఆరాధనకు ఉదాహరణలు: సర్వశక్తిమంతుడైన అల్లాహ్ పట్ల ప్రేమ, అల్లాహ్ పట్ల భయం, దుఆ,నమాజు, ఉపవాసం మరియు తల్లిదండ్రుల పట్ల ఉత్తమంగా మెలగటం.
మరియు ఆరాధన హృదయమును విశాలపరచటానికి,మనశ్శాంతికి కారణమగును.
ప్రశ్నలు : పాఠ్య లక్ష్యాలు: - విద్యార్థి జిన్నులు మరియు మానవుల సృష్టి వెనుక ఉన్న వివేకమును స్పష్టపరచటం. - విద్యార్థి ఆరాధన యొక్క అర్థాన్ని వివరింటం.
ప్ర1- అల్లాహ్ నిన్ను గొప్ప విజ్ఞత కొరకు సృష్టించాడు. దానిని ఆధారాలతో సహా పేర్కొనండి.
ప్ర 2 : క్రింది ఖాళీలను పూరించండి : ఉపాధ్యాయుని కోసం : - అల్లాహ్ సృష్టించిన లేదా ఆదేశించిన ప్రతి దానిలో విజ్ఞత ఉందని స్పష్టపరచటం ద్వారా అంశము కొరకు సిద్ధం చేయడం. వాటిలో నుంచి : మనిషి యొక్క సృష్టి; అతను వ్యర్థంగా సృష్టించబడలేదు, కానీ అతను ఒక గొప్ప విషయం కోసం సృష్టించబడ్డాడు. అది అంటే ఎటువంటి భాగస్వామి లేకుండా అల్లాహ్ ఒక్కడిని మాత్రమే ఆరాధించడం. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు : {"ఏమీ? వాస్తవానికి మేము మిమ్మల్ని వృధాగానే పుట్టించామని మరియు మీరు మా వైపునకు ఎన్నడూ మరలి రారని భావించారా?"} [అల్ మూమినూన్ : 115]. - జకాత్, హజ్ మరియు వదించటం వంటి బాహ్య ఆరాధనల (అవయవాల చర్యలు) యొక్క ఇతర ఉదాహరణలను పేర్కొనడం మరియు అంతర్గత ఆరాధనల (హృదయ చర్యలు) ఉదాహరణలు పేర్కొనటం ఉదాహరణకు : ప్రేమ, భయం, ఆశ మొదలగునవి. -ఆరాధన హృదయమును విశాలపరచటానికి కారణమని స్పష్టపరచటం. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు : {ఏ పురుషుడు గానీ, లేక స్త్రీ గానీ విశ్వాసులై, సత్కార్యాలు చేస్తే, అలాంటి వారిని మేము తప్పక (ఇహలోకంలో) మంచి జీవితం గడిపేలా చేస్తాము. మరియు వారికి (పరలోకంలో) వారు చేసిన సత్కార్యాలకు ఉత్తమ ప్రతిఫలం తప్పక ప్రసాదిస్తాము.}[నహల్ : 97]
- ఇబాదత్ (ఆరాధన): అల్లాహ్ ఇష్టపడే మరియు సంతోషించే . . . . . . . . . . . . . . . నుంచి బాహ్యపరమైన మరియు . . . . . . . . . . . . . . . ప్రతిదానికీ ఇది ఒక సమగ్రమైన పేరు.
ఆరాధన రకాలలో నుంచి : నమాజు మరియు . . . . . . . . . . మరియు . . . . . . . . . . మరియు . . . . . . . . . .
ప్ర3 : మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు :
{ఏ పురుషుడు గానీ, లేక స్త్రీ గానీ విశ్వాసులై, సత్కార్యాలు చేస్తే, అలాంటి వారిని మేము తప్పక (ఇహలోకంలో) మంచి జీవితం గడిపేలా చేస్తాము.}
- మంచి జీవితం దేని ద్వార లభిస్తుంది?
నాలుగవ పాఠం ([10])
అల్లాహ్ ఒక్కడి ఆరాధన చేయటం తప్పనిసరి ([11])
* అల్లాహ్ ఆదేశించిన వాటిలో ప్రధానమైన,ఉన్నతమైన ఆదేశం తౌహీద్. అది ఆరాధనను అల్లాహ్ ఒక్కడికే చేయడం.
మరియు అల్లాహ్ వారించిన వాటిలో ప్రధానమైనది షిర్క్. మరియు అది అల్లాహేతరులను ఆయనతో పాటు ఆరాధించటం.
అల్లాహ్ యొక్క ఈ వాక్యము దీనికి ఆధారం :
{వారితో ఇలా అను: "నిశ్చయంగా, నేను అల్లాహ్ ను మాత్రమే ఆరాధించాలని మరియు ఆయనకు సాటి (భాగస్వాములను) కల్పించరాదని ఆజ్ఞాపించబడ్డాను.}
ప్రశ్నలు :
1 ప్రశ్న: అల్లాహేతరుల ఆరాధన చేయటమును ఏమంటారు ?
ప్ర 2 : క్రింది ఖాళీలను పూరించండి :
- అల్లాహ్ ఆదేశించిన గొప్ప విషయం. . . . . . . . . . . . . . . . . . . . .
- అల్లాహ్ వారించిన పెద్ద విషయం. . . . . . . . . . . . . . . . . . . . పాఠం యొక్క లక్ష్యాలు: - విద్యార్థి ఏకేశ్వరోపాసన (తౌహీద్) కు విరుద్ధమైన బహుదైవారాధన పట్ల జాగ్రత్త వహించాలి. - ఆరాధనలు అల్లాహ్ కు ప్రత్యేకం చేయటం యొక్క ఆవశ్యకతకు విద్యార్థి ఆధారాలను ప్రస్తావించాలి. - విద్యార్థి ఏకేశ్వరోపాసన యొక్క గొప్ప ప్రాముఖ్యతను వివరించాలి.
ఏకేశ్వరోపాసన .. . . . . . . . . . . . . . . . . . . . . . .లో మరియు మరణానంతర జీవితం లో ఆనందానికి మార్గం..
బహుదైవారాధన ఈ ప్రపంచంలో దురద్రుష్టానికి, . . . . . . . . . .లో వేదనకు అతి పెద్ద కారణం. ఉపాధ్యాయునికి: - ప్రవక్తల సందేశం ఒక్కటే అని, అది ఏకదైవారాధనకు పిలుపునివ్వడం మరియు బహుదైవారాధన నుండి వారించటం అని, దానిపై సూచించే కొందరు ప్రవక్తలు అలైహిముస్సలాం గాధలను ప్రస్తావిస్తూ సూరతుల్ ఆరాఫ్ మరియు ఇతర సూరాలలో ఉన్న విధంగా స్పష్టపరచాలి.-ఏకేశ్వరోపాసన యొక్క ప్రాముఖ్యతను వివరించాలి, దాని ద్వారా తప్ప ఇహలోకంలో మరియు పరలోకంలో ఆనందానికి మార్గం లేదని వివరించాలి. - బహుదైవారాధన యొక్క ప్రమాదాన్ని స్పష్టపరచాలి, ఈ ప్రపంచంలో దురద్రుష్టానికి మరియు పరలోకంలో ఇది గొప్ప కారణం. అందుకనే ఇబ్రాహీమ్ అలైహిస్సలాం తన ప్రభువుతో ఇలా ప్రార్ధించారు : {మరియు నన్నూ నా సంతానాన్నీ విగ్రహారాధన నుండి రక్షించు.} [ఇబ్రాహీమ్ : 35]. - కొన్ని రకాల బహుదైవారాధనలను వివరించాలి, ఉదాహరణకు : అల్లాహేతరుల పేరుపై వధించడం, అల్లాహేతరుల పై ప్రమాణం చేయడం, తాయెత్తు, దారం లేదా పూస మరియు అటువంటి వాటిని బాధలను తొలగించడం కొరకు లేదా దానిని పారద్రోలడకొరకు ధరించడం వంటివి.
ప్ర3 : అల్లాహ్ ఒక్కడి ఆరాధన చేయటం తప్పనిసరి అవటం పై ఆధారమును పేర్కొనండి.
ఐదవ పాఠం ([12])
అల్లాహేతరుల ఆరాధన చేయటము (అల్లాహ్ తో ఇతరులను సాటి కల్పించటం) షిర్కు (బహుదైవారాధన) అగునను.([13])
అల్లాహేతరులను ఆరాధించేవాడు బహుదైవారాధకుడు అవుతాడు.
ఉదాహరణకు :
- అల్లాహేతరులను ప్రార్ధించేవాడు.- అల్లాహేతరుల పేరున వధించేవాడు.
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
బహుదైవారాధన ఈ ప్రపంచంలో దురద్రుష్టానికి ఒక కారణం.
ప్రశ్నలు :
ప్ర1 :అల్లాహేతరులను ఆరాధించేవాడు బహుదైవారాధకుడు అవుతాడు.
అ- దీని ఆధారం పేర్కొనండి.
ఆ - దీనికి ఒక ఉదాహరణ పేర్కొనండి.
ప్ర 2 : క్రింది ఖాళీను పూరించండి : పాఠం లక్ష్యాలు: - విద్యార్థి బహుదైవారాధన పట్ల జాగ్రత్త వహించాలి. - విద్యార్థి బహుదైవారాధన యొక్క కొన్ని రూపాలను పేర్కొనాలి. 2 - విద్యార్థి అల్లాహేతరుల కొరకు ఆరాధన రకాలలో నుంచి ఏ రకమైన ఆరాధనను చేసే వారిపై దైవ ఆదేశమును తెలపాలి. - అల్లాహేతరులను ఆరాధించడం బహుదైవారాధన అన్న దానిపై విద్యార్థి ఆధారాలను పేర్కొనాలి.
1- బహుదైవారాధకుని శిక్ష . . . . . . . . . . .లో శాశ్వతత్వం
2- ఆరాధనలలో నుంచి దేనినైన అల్లాహేతరుల కొరకు చేసేవాడు ఉదాహరణకు దుఆ చేయటం మరియు . . . . . . . . బహుదైవారాధకుడు అవుతాడు. ఉపాధ్యాయుని కొరకు : దుఆ,వధన,సాష్టాంగం చేయటం వంటి మొదలగు ఆరాధనలు అల్లాహేతరుల కొరకు చేసేవాడు బహుదైవారధకుడు,అవిశ్వాసపరుడు అవుతాడని స్పష్టపరచాలి; ఒకవేళ అతను నమాజు,ఉపవాసం,హజ్జ్,ఉమ్రా చేసినా మరియు తాను ముస్లిం అని ఊహించుకున్నా. దైవప్రక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలోని పూర్వపు బహుదైవారాధకులు కొందరు వివిధ రకాల ఆరాధనలు చేసినప్పటికి ఆ ఆరాధనలు బహుదేవతారాధన వల్ల వారికి ప్రయోజనం చేకూర్చలేదని స్పష్టపరచాలి. -బహుదైవారాధనకు శిక్ష నరకంలో శాశ్వతత్వం అని తెలపాలి,అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు : {ఎవడైతే అల్లాహ్'కు ఇతరులను సాటికల్పిస్తాడో అతని కొరకు అల్లాహ్ స్వర్గం' నిషేదించాడు,మరియు అతని నివాసం నరకాగ్ని అవుతుంది మరియు దౌర్జన్యపరులకు సహాయం చేసేవాడు ఎవడు ఉండడు}. [మాయిద : 72]. - మానవుని పట్ల షైతాను యొక్క శత్రుత్వం మరియు అతడు తనతోపాటు నరకంలో ఉండటానికి అతనిని బహుదైవారాధన మరియు తప్పుదారి పట్టించాలనే అతని ఆత్రుతను వివరించాలి.
ప్ర3- ప్రజలను బహుదైవారాధనలో పడవేయటానికి షైతాను ఎందుకు ఆసక్తిగా ఉన్నాడు?
ఆరవ పాఠం ([14])
రెండవ ప్రాధమిక సూత్రం : దాసుడికి తన ధర్మం గురించిన పరిజ్ఞానం ఉండటం ([15]). పాఠం యొక్క లక్ష్యాలు: - విద్యార్థి ధర్మ స్థాయిలను తెలపాలి. - విద్యార్థి ఇస్లాం అర్థాన్ని స్పష్టపరచాలి. - విద్యార్థి ఇస్లాం ధర్మం పై గర్వపడాలి.
త్రిసూత్రాలు :
1-దాసుడికి తన ప్రభువు గురించి జ్ఞానం ఉండటం,2- దాసుడికి తన ధర్మం గురించిన జ్ఞానం ఉండటం,3- దాసునికి తన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క జ్ఞానం ఉండటం. ఉపాధ్యాయుని కోసం: - విద్యార్థుల మనస్సులలో ఇస్లాం పట్ల ప్రేమను మరియు దాని పట్ల గర్వాన్ని నింపుతామని ప్రతిజ్ఞ చేయాలి. -ఇస్లాం సంతోషం, ప్రశాంతత మరియు హృదయ విశాలతను కలిగిస్తుందని, బహుదైవారాధన మరియు మార్గభ్రష్టత సంకుచితత్వము యొక్క ప్రధాన కారణాలలో ఒకటి. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు : {కావున నా మార్గదర్శకత్వాన్ని అనుసరించే వాడు, మార్గభ్రష్టుడూ కాడు మరియు దురవస్థకు గురికాడు. మరియు ఎవడైతే నా సందేశం నుండి విముఖుడవుతాడో నిశ్చయంగా, అతని జీవితం ఇరుకై పోతుంది మరియు పునరుత్థాన దినమున అతినిని అంధునిగా లేపుతాము.} [తాహ : 123-124]. - ఇస్లాంను స్వీకరించి మరియు దాని ఆలింగనంలో ఉపశమనం మరియు మనశ్సాంతి పొందిన కొంతమంది కథలను ప్రస్తావించటం.
ధర్మం యొక్క స్థానాలు మూడు
మొదటి స్థానం : ఇస్లాం
రెండవ స్థానం : ఈమాన్ (విశ్వాసం)
మూడవ స్థానం : ఇహ్సాన్
ఏడవ పాఠం
మొదటి స్థానం : ఇస్లాం
ఇస్లాం : అల్లాహ్ కొరకు ఏకత్వాన్ని స్వీకరించడం,విధేయత ద్వారా ఆయనను ఆరాధించడం,షిర్క్ మరియు ముష్రికుల నుంచి దూరంగా ఉండటం.
*నేను ముస్లింని, నేను నా ధర్మమైన ఇస్లాంను ప్రేమిస్తున్నాను, దాని పై నేను గర్విస్తున్నాను
ప్రశ్నలు :
ప్ర1: ధర్మం యొక్క ప్రతి స్థానమును దానికి తగిన దానితో జోడించండి :
ఇహ్సాన్ రెండవ స్థానము
ఈమాన్ మొదటి స్థానము
ఇస్లాం మూడవ స్థానము
ప్ర1: క్రింది నిర్వచనాన్ని పూర్తి చేయండి:
ఇస్లాం : అల్లాహ్ కొరకు ............... స్వీకరించడం,విధేయత ద్వారా ఆయనను...............,షిర్క్ నుంచి దూరంగా ఉండటం.
ఎనిమిదవ పాఠం ([16])
ఇస్లాం మూలస్తంభాలు ([17])
ఇస్లాం మూలస్తంభాలు ఐదు :
మొదటి మూలస్తంభము : అల్లాహ్ తప్ప వేరొక ఆరాధ్యుడు లేడని మరియు ముహమ్మద్ అల్లాహ్ యొక్క సందేశహరుడని సాక్ష్యమివ్వటం. పాఠం లక్ష్యాలు: - విద్యార్థి ఇస్లాం యొక్క ఐదు మూల స్తంభాలను పేర్కొనాలి. - విద్యార్థి ఈ ఐదు స్తంభాలను నిర్వహించడంపై అల్లాహ్ ఆదేశము వివరించాలి. - విద్యార్థి నమాజు యొక్క ప్రాముఖ్యతను మరియు దానిని సంరక్షించవలసిన అవసరాన్ని వివరించాలి.
రెండవ మూల స్తంభం : నమజును నెలకొల్పడం.
మూడవ మూలస్తంభము : జకాత్ చెల్లించడం ఉపాధ్యాయుని కొరకు : - ఐదు స్తంభాలతో తప్ప ఇస్లాం స్థాపించబడటం లేదా నిర్మించబడటం సాధ్యం కాదని వివరించడానికి గది యొక్క స్తంభాల ఉదాహరణను ఇవ్వడం ద్వారా స్తంభం యొక్క అర్ధాన్ని స్పష్టపరచాలి. ఈ ఐదు మూలస్తంభాలు విధిగా అల్లాహ్ వద్ద నుండి నిరూపితమైనది. ఏవిధంగా నైతే దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారో : ఇస్లాం ఐదు విషయములపై నిర్మితమైనది . . . . . దీనిని ముస్లిం ఉల్లేఖించారు. హదీసు సంఖ్య (16). -- సమయానికి నమాజు నిర్వహించడంపై ప్రోత్సహించాలి, పునరుత్థాన దినాన దాసునితో మొట్ట మొదట లెక్క తీసుకోబడేది దానిదే. ఏవిధంగా నైతే దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారో : ప్రళయదినాన దాసుడికి తన కర్మల్లోంచి అతని నమాజు గురించి మొట్టమొదట లెక్క తీసుకోవటం జరుగును. ఒక వేళ అది సరిగా ఉంటే అతడు సాఫల్యం చెందుతాడు,బ్రతికి బయటపడుతాడు. ఒక వేళ అది చెడితే అతడు నష్టపోతాడు. దీనిని తిర్మీజీ ఉల్లేఖించారు. హదీసు సంఖ్య (413). - నమాజును విడిచిపెట్టటం నుండి హెచ్చరించటం, మరియు దానిని విడిచిపెట్టిన వ్యక్తి యొక్క అవిశ్వాసాన్ని తెలపటం. ఏవిధంగా నైతే దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారో : "మనకు వారికి మధ్య ఉన్న ప్రమాణము సలాహ్ (నమాజు). దాన్ని వదిలిన వాడు అవిశ్వాసమునకు ఒడిగట్టాడు."దీనిని తిర్మిజీ ఉల్లేఖించారు. హదీసు సంఖ్య (2621).
నాల్గవ మూలస్తంభం : రమజాను మాసపు ఉపవాసములు ఉండటం.
ఐదవ మూలస్తంభం : స్థోమత గలవారు దైవ మార్గంలో బైతుల్లాహ్ యొక్క హజ్ చేయటం
* ఇస్లాం యొక్క ఐదు మూల స్తంభాలు ఒకదానితో ఒకటి అనుసంధానించబడి ఉన్నాయి, కాబట్టి ఒక వ్యక్తి స్వర్గాన్ని గెలుచుకోవడానికి వాటిని నెరవేర్చాలి.
ప్రశ్నలు :
ప్ర1: ఇస్లాం యొక్క మూలస్తంభాలు ఏమిటి?
ప్ర2: ఇస్లాం యొక్కమూల స్తంభాల క్రింద గీత గీయండి :
(రమజాన్ ఉపవాసాలు ఉండటం - తల్లిదండ్రుల పట్ల ఉత్తమంగా మెలగటం - స్థోమత గలవారు దైవ మార్గంలో బైతుల్లాహ్ యొక్క హజ్ చేయటం - దివ్యఖుర్ఆన్ పఠించడం- నమాజు నెలకోల్పటం- అల్లాహ్ తప్ప వేరొక ఆరాధ్యుడు లేడని మరియు ముహమ్మద్ అల్లాహ్ యొక్క సందేశహరుడని సాక్ష్యమివ్వటం - జకాత్ చెల్లించడం)
ప్ర 3 : క్రింది ఖాళీను పూరించండి :
ప్రళయదినాన దాసుడి లెక్క తీసుకోబడే మొట్టమొదటి ఆచరణ . . . . . . . . . . .
తొమ్మిదవ పాఠం ([18])
షహాదతైన్ (రెండు సాక్ష్యాల) యొక్క అర్ధం ([19])
“లా ఇలాహ ఇల్లల్లాహ్” అని సాక్ష్యమివ్వటం యొక్క అర్థం: ‘అల్లాహ్ తప్ప ఆరాధనకు అర్హుడైన నిజ ఆరాధ్యుడెవ్వరూ లేరు’
ముహమ్మద్ అల్లాహ్ ప్రవక్త అని సాక్ష్యం పలకటం యొక్క అర్ధం :
- ఆయన ఆదేశించిన వాటి విషయంలో ఆయనను అనుసరించటం.- ఆయన తెలియపరచిన వాటి విషయంలో ఆయనను నమ్మటం
-ఆయన వారించిన,మందలించిన వాటి నుండి దూరంగా ఉండటం.-ఆయన ధర్మశాసనం చేసిన వాటి ద్వారా మాత్రమే అల్లాహ్ ను ఆరాధించటం పాఠం యొక్క లక్ష్యాలు: - అల్లాహ్ తప్ప నిజ ఆరాధ్యదైవం లేడు అనే అర్థాన్ని విద్యార్థి స్పష్టపరచాలి. - ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ ప్రవక్త అనే సాక్ష్యం యొక్క అర్థాన్ని విద్యార్థి వివరించాలి. -విద్యార్థి దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ప్రేమించాలి మరియు ఆయనకు విధేయత చూపాలి. - దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆజ్ఞాపించిన దానికి అవిధేయత చూపకుండా విద్యార్థి జాగ్రత్త వహించాలి.
* రెండు సాక్ష్యాల (షహాదతైన్ ) ద్వారా నే ఒక వ్యక్తి ఇస్లాం ధర్మంలోకి ప్రవేశిస్తాడు.
ప్రశ్నలు : ఉపాధ్యాయుని కొరకు : - రెండు సాక్ష్యాల ప్రాముఖ్యతను వివరించాలి; ఎందుకంటే వాటి ద్వారా ఒక మనిషి ఇస్లాంలోకి ప్రవేశిస్తాడు. - ఇక్కడ అల్లాహ్ తో పాటు అసత్య పద్దతితో ఆరాధ్యదైవాలు ఉన్నాయని సూచించాలి, ఎవరైతే ప్రార్ధన, వధనను సమాధులలో ఉన్న దైవప్రవక్తలు, పుణ్యాత్ముల కొరకు చేస్తారో, అది అల్లాహ్ మరియు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారించిన పెద్ద షిర్క్ అవుతుంది. -అల్లాహ్ తప్ప నిజ ఆరాధ్యదైవం లేడనే సాక్ష్యం పలికిన వ్యక్తికి దాని అర్థం తెలిసి, దాని ప్రకారం నడుచుకుంటూ, దానికి విరుద్ధంగా ఉన్న వాటి నుండి సురక్షితంగా ఉంటే తప్ప ప్రయోజనం లేదని తెలపాలి.-ఉత్తమ స్మరణ: లా ఇలాహ ఇల్లల్లాహ్ అని,ఈ ప్రపంచ జీవితంలో ఎవరి చివరి పలుకులు లా ఇలాహ ఇల్లల్లాహ్ అవుతాయో అతడు స్వర్గంలో ప్రవేశిస్తాడని తెలపాలి. ముహమ్మద్ అల్లాహ్ ప్రవక్త అని సాక్ష్యం యొక్క అర్ధాన్ని ఇలా స్పష్టం చేయాలి : ఆయన ఆదేశించిన వాటి విషయంలో ఆయనను అనుసరించటం : నమాజు మరియు ఇతర విషయాల వంటి ఇస్లాం యొక్క స్తంభాలు మరియు విధులను నిర్వహించడం. -ఆయన తెలియపరచిన వాటి విషయంలో ఆయనను నమ్మటం : ఉదాహరణకు ప్రళయం ఏర్పడటం,స్వర్గము,నరకము మొదలైనవి.- ఆయన వారించిన,మందలించిన వాటి నుండి దూరంగా ఉండటం అంటే : మహా పాపాలు,చిన్న పాపాలు,మహా పాపాలలో షిర్కు. - ఆయన ధర్మశాసనం చేసిన వాటి ద్వారా మాత్రమే అల్లాహ్ ను ఆరాధించటం అంటే : విధేయత కార్యాలు, మరియు ప్రవక్త పుట్టినరోజు జరుపుకోవడం వంటి ఆవిష్కరణల నుండి జాగ్రత్తవహించటం. - వారించటం కంటే మందలింపు ఎక్కువ ప్రభావవంతంగా ఉంటుందని తెలపటం.
ప్ర1: కింది ఖాళీలను పూరించండి:
అ - నేను ముస్లింని . . . . . . . . . అని నేను సాక్ష్యం పలుకుతున్నాను. మరియు ముహమ్మద్ . . . . . . . . . అని నేను సాక్ష్యం పలుకుతున్నాను.
ఆ - లా ఇలాహ ఇల్లల్లాహ్ యొక్క అర్ధం . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .
ఇ - ఉత్తమ స్మరణ . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .
ప్ర2 : ముహమ్మద్, అల్లాహ్ యొక్క సందేశహరుడు అని సాక్ష్యం పలకటం' అంటే అర్ధం ఏమిటి?
ప్ర3: దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మాకు ఆజ్ఞాపించిన మూడు విషయాలను వ్రాయండి:
1-నమాజు నెలకొల్పటం 2- ...............
3- ............... 4- ...............
పదవ పాఠం ([20])
రెండవ స్థానం : ఈమాన్ (విశ్వాసం) ([21])
విశ్వాసము యొక్క మూల స్తంభములు ఆరు :
1- మీరు అల్లాహ్ ను,
2- ఆయన దూతలను,
3- ఆయన గ్రంధములను,
4- ఆయన ప్రవక్తలను,
5- అంతిమ దినమును విశ్వసించటం. పాఠం యొక్క లక్ష్యాలు: - విద్యార్థి ఈ స్తంభాలపై విశ్వాసంపై ఆదేశము పేర్కొనాలి. - విద్యార్థి విశ్వాసానికి సంబంధించిన ఆరు స్తంభాలను వివరించాలి. - విశ్వాసం అంటే మాటలు, పనులు మరియు నమ్మకాలు అని విద్యార్థి వివరించాలి.
6- మంచి,చెడు విధివ్రాతను విశ్వసించడం.
* ఆరు స్తంభాలపై విశ్వాసం ఇహపరలోకాలలో గొప్ప సంతోషమును కలిగిస్తుంది. ఉపాధ్యాయుని కొరకు : - విశ్వాసం యొక్క అర్ధాన్ని స్పష్టం చేయడం: ఇది మనస్సుతో విశ్వసించడం మరియు నాలుకతో పలకటం, అవయవములతో ఆచరించడం.-జిబ్రయీల్ యొక్క ప్రసిద్ధ హదీసును వివరించాలి, దానిలో: (ఈమాన్ (విశ్వాసం) గురించి నాకు తెలుపండి. దానికి ఆయన సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా పలికారు: "అల్లాహ్ ను, ఆయన దైవదూతలను, ఆయన గ్రంధాలను, ఆయన ప్రవక్తలను, అంతిమదినాన్ని మరియు విధివ్రాతను విశ్వసించుట."). దీనిని ముస్లిం ఉల్లేఖించారు. హదీసు సంఖ్య (8). - ఆరు మూలస్తంభాలపై విశ్వాసం కనబరచటం ఇహపరలోకాలలో గొప్ప సంతోషమును కలిగిస్తుందని తెలియజేయాలి.- మహోన్నతుడైన అల్లాహ్ పై ప్రేమ,ఆయనపై విధేయత - గోప్యంలో,బహిరంగంలో సర్వశక్తిమంతుడైన అల్లాహ్ పట్ల నిరంతరం శ్రద్ధ వహించడం -ఖుర్ఆనును కంఠస్థం చేయటం,దానిలో యోచనచేయటం మరియు దాని ప్రకారం ఆచరించటం - సత్కార్యములు చేయడం ద్వారా అంతిమ దినం కోసం సిద్ధమవటం - విధి,మరియు విధి తీర్పు పట్ల ప్రసన్నుడవటం విశ్వాసం యొక్క సూచనలలో నుంచి అని తెలియపరచాలి. - కొంత మంది దైవప్రవక్తలు,దైవదూతల పేర్లు మరియు అల్లాహ్ అవతరింపజేసిన దివ్యగ్రంధాలను పేర్కొనాలి. - విధి మరియు విధి తీర్పైపుపై విశ్వాసమును సూచించే కొన్ని పదబంధాలను విద్యార్థులకు బోధించాలి ఉదాహరణకు : "ఖద్దరల్లాహు వమా షాఅ ఫఅల" (అల్లాహ్ అదృష్టంలో వ్రాసిపెట్టాడు మరియు తాను తలచుకున్నదే చేసాడు). - ఈ ఆరు మూలస్తంభాలను విశ్వసించడం యొక్క ఆవశ్యకతను వివరించాలి, వాటిలో దేనినైనా ఎవరు తిరస్కరించినా అవిశ్వాసం చేసినట్లే.
ప్రశ్నలు :
ప్ర1: విశ్వాసం యొక్క మూల స్తంభాలు ఎన్ని?
ప్ర2: బ్రాకెట్ లో ప్రతి మూలస్తంబముకు తగిన సంఖ్యను వ్రాయండి:
అల్లాహ్ పై విశ్వాసం ( ). అంతిమ దినంపై విశ్వాసం ( )
మంచి,చెడు విధివ్రాత పై విశ్వాసం ( ) దైవదూతలపై విశ్వాసం ( )
దైవప్రవక్తలపై విశ్వాసం ( ) దివ్య గ్రంధములపై విశ్వాసం ( )
ప్ర3 : మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు :
మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
{ముహమ్మద్ అల్లాహ్ ప్రవక్త}
ప్ర4: ఆయతులో వచ్చిన ప్రవక్తల పేర్లను సంగ్రహించండి:
1- ............... 2- ...............
3- ............... 4- ...............
5- ...............
పదకొండవ పాఠం ([22])
మరణాంతరం లేపబడటము పై విశ్వాసం ([23])
మరణాంతరం లేపబడటము పై విశ్వాసం కలిగి ఉండటం అంతిమదినం పై విశ్వాసం లోని భాగము.
మరణాంతరం లేపబడటం యొక్క అర్ధం : అల్లాహ్ ప్రజలను వారి మరణానంతరం పునరుజ్జీవింపజేస్తాడు మరియు లెక్కతీసుకోవటం మరియు ప్రతిఫలం ప్రసాదించటం కోసం వారిని వారి సమాధుల నుండి బయటకు తీస్తాడు.
మరణాంతరం లేపబడటంపై విశ్వాసం చూపటం గురించి ఆదేశము : విధి, మహోన్నతుడు ఇలా సెలవిస్తున్నాడు:
{దాని (ఆ మట్టి) నుంచే మిమ్మల్ని సృష్టించాము, మరల మిమ్మల్ని దానిలోకే చేర్చుతాము మరియు దాని నుంచే మిమ్మల్ని మరొకసారి లేవుతాము.}
మరణాంతరం లేపబడటంను తిరస్కరించేవాడి గురించి ఆదేశం : మహోన్నతుడైన అల్లాహ్ పై అవిశ్వాసం చూపినవాడు.
* పునరుత్థాన దినాన ఎవరి కుడి చేతిలో అతని కర్మల పత్రాన్ని ఇవ్వబడుతుందో అతను విజేతలలో ఉంటాడు మరియు అతని లెక్క సులభం అవుతుంది, మరియు ఎవరి ఎడమ చేతిలో అతని కర్మల పత్రం ఇవ్వబడుతుందో అతను నష్టపోయిన వారిలో ఉంటాడు మరియు అతని లెక్క తీసుకోవటం కష్టం అవుతుంది.
ప్రశ్నలు : అధ్యయనం యొక్క లక్ష్యాలు: - విద్యార్ధి మరణాంతరం లేపబడటం యొక్క అర్థమును స్పష్టపరచాలి.- విద్యార్ధి మరణాంతరం లేపబడటంపై విశ్వాసం చూపటం గురించి ఆదేశమును తెలపాలి.- విద్యార్ధి మరణాంతరం లేపబడటంను తిరస్కరించేవాడి గురించి ఆదేశం తెలపాలి.
ప్ర1: మానవులను వారి మరణం తర్వాత ఎవరు బ్రతికిస్తారు?
ప్ర 2 : క్రింది ఖాళీలను పూరించండి : ఉపాధ్యాయుని కొరకు : - తాము అధ్యయనం చేసిన సూరాల నుండి ఆయతులను ఆధారాలుగా చూపుతూ అంతిమ దినం, మరణాంతరం లేపబడటం, లెక్కతీసుకోబడటం మరియు ప్రతిఫలం పై విశ్వావసం యొక్క ఆవశ్యకతను నిరూపించాలి మరియు ఆ రోజు యొక్క కొన్ని భయానక విషయాలను,అల్లాహ్ యొక్క విశ్వాసపరులైన తన దాసుల రక్షణను ప్రస్తావించాలి, ఉదాహరణకు : {అప్పుడు తన కర్మపత్రం కుడిచేతిలో ఇవ్వబడినవాడి నుండి; అతని లెక్క అతి తేలికగా తీసుకోబడగలదు.} [ఇన్షిఖాఖ్ : 7-8]. - విద్యార్థుల మనసులలో మరణంతర జీవితం కోసం సంసిద్ధతను కలిగించాలి.-మరణం తరువాత సమాధుల నుండి పునరుత్థానం యొక్క వాస్తవికతను మరియు సర్వశక్తిమంతుడైన అల్లాహ్ శక్తి యొక్క గొప్పతనాన్ని నిరూపించాలి.
మరణాంతరం లేపబడటము పై విశ్వాసం . . . . . . . . . . . . . . . . . . . . మరియు దానిని తిరస్కరించేవాడి గురించి ఆదేశం . . . . . . . . . . . . . . . . . . . .
ప్ర3: సర్వశక్తిమంతుడి సూక్తిని పూర్తి చేయండి: (مِنْهَا خَلَقْنَاكُمْ"దాని నుండి మేము మిమ్మల్ని సృష్టించాము." . . . .. . . . . )
ప్ర4: సర్వశక్తిమంతుడైన అల్లాహ్ శక్తి ఏమిటంటే, ఆయన ఒక గొప్ప విషయం కోసం ప్రజలను వారి మరణానంతరం పునరుజ్జీవింపజేస్తాడు, మరియు ఆయన . . . . . . . . . .
పన్నెండవ పాఠం ([24])
మూడవ స్థానం : ఇహ్సాన్ ([25])
ఇహ్సాన్ : అంటే నీవు అల్లాహ్ ను చూస్తున్నట్లు ఆయనను ఆరాధించటం. ఒకవేళ నీవు ఆయనను చూడకపోయిన ఆయన నిన్ను చూస్తున్నాడు.
అల్లాహ్ యొక్క ఈ వాక్యము దీనికి ఆధారం :
* నేను ఎప్పుడూ అల్లాహ్ ను కనిపెట్టుకుని ఉంటాను. మరియు చాటుగా లేదా బహిరంగంగా పాపం చేయను.
* నేను సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ప్రసన్నతను కోరుతూ ఆరాదన కార్యక్రమాలను నిర్వహిస్తాను.
ప్రశ్నలు :
ప్ర1: కింది ఖాళీలను పూరించండి:
ఇహ్సాన్ : అంటే నీవు అల్లాహ్ ను చూస్తున్నట్లు . . . . . .. . . . . ఒకవేళ . . . . . .. . . . .
ఆయన నిన్ను చూస్తున్నాడు. పాఠం లక్ష్యాలు: - విద్యార్థి ఇహ్సాన్ యొక్క అర్థాన్ని స్పష్టపరచాలి.- ఇహ్సాన్ గురించి ఏదైన ఆధారమును పెర్కొనాలి.- - ఆరాధనను చిత్తశుద్ధితో నిర్వహించేందుకు విద్యార్థి ఆసక్తి కలిగి ఉండాలి.
ధర్మము యొక్క స్థానములలో నుంచి మూడవ స్థానము . . . . . . . . . . . . . . . మరియు అది వాటిలో ఉన్నతమైనది.
ప్ర2: ఇహ్సాన్ కి సంబంధించిన రుజువు ఇవ్వండి. ఉపాధ్యాయుని కొరకు : ఇహ్సాన్ యొక్క స్థానము ధర్మము యొక్క స్థానములలో ఉన్నతమైనదని తెలియపరచాలి.-సర్వశక్తిమంతుడైన అల్లాహ్ తన దాసులపై పర్యవేక్షిస్తున్నట్లు భావించేలా ప్రజలను ప్రోత్సహించాలి. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు: { అల్లాహ్ మిమ్మల్ని సదా కనిపెట్టుకొని ఉన్నాడు.} [నిసా : 1].-మహోన్నతుడైన అల్లాహ్ యొక్క పర్యవేక్షణను వారి అనుభూతి విషయంలో పుణ్యాత్ముల గాధలను పేర్కొనాలి, ఉదాహరణకు అల్లాహ్ కు బయపడి పాలలో నీళ్ళను కలపటాన్ని నిరాకరించిన స్త్రీతో ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు గాధ.
. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .ప్ర3: పూర్తి విశ్వాసం ఉన్న విశ్వాసి ఒకవేళ అతనిని ఎవరూ చూడకపోయినా దొంగిలించడు.ఎందుకు?
. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .
పదమూడవ పాఠం ([26])
మూడవ ప్రాధమిక సూత్రం : దాసునికి తన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క పరిజ్ఞానం ఉండటం. ([27])
త్రిసూత్రాలు :
1-దాసుడికి తన ప్రభువు గురించి పరిజ్ఞానం ఉండటం,2- దాసుడికి తన ధర్మం గురించిన పరిజ్ఞానం ఉండటం,3- దాసునికి తన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క పరిజ్ఞానం ఉండటం.
* నా ప్రవక్త ముహమ్మద్ బిన్ అబ్దుల్లాహ్ బిన్ అబ్దుల్ ముత్తలిబ్ బిన్ హాషిమ్, మరియు హాషిమ్ ఖురేష్ కి చెందిన వారు. ఖురేష్ అరబ్ కు చెందినవారు.
* నా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఆయన ప్రవక్తల పరిసమాప్తి.
అల్లాహ్ యొక్క ఈ వాక్యము దీనికి ఆధారం :
ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంను ప్రేమిచటం మరియు ఆయనకు విధేయత చూపటం యొక్క ఆదేశం : ప్రతీ ముస్లిం పై విధి.
* నేను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ను ప్రేమిస్తున్నాను, మరియు నేను ఆయనకు విధేయత చూపుతాను.
ప్రశ్నలు :
ప్ర1: కింది ఖాళీలను పూరించండి:
అ - నా ప్రవక్త ముహమ్మద్ బిన్ . . . . . . . . . . . బిన్ అబ్దుల్ ముత్తలిబ్ బిన్ . . . . . . . . . . ., పాఠం లక్ష్యాలు: - విద్యార్థి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క వంశాన్ని ప్రస్తావించాలి. - విద్యార్థి అల్లాహ్ ప్రవక్తను ప్రేమించాలి, మరియు ఆయనకు విధేయత చూపాలి. -ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్తల పరిసమాప్తి అవటం పై విద్యార్థి రుజువును పేర్కొనాలి.- అల్లాహ్ వద్ద నుండి సలాత్ (దరూద్) : అత్యున్నత సభలో దాసుడిపై ప్రశంసలు.
ఆ - ప్రవక్త ముహమ్మద్ పై ప్రేమ మరియు విధేయత యొక్క ఆదేశం . . . . . . . . . . . . . . . . . . .
ఇ - ప్రవక్తల పరిసమాప్తి ఆయనే . . . . . . .. . . . . . . . . . . . . . . . . . . . . . . ఉపాధ్యాయుని కొరకు : మొదటి మరియు రెండవ మూల స్తంబములను సంక్షిప్తంగా సమీక్షించాలి మరియు వాటిని మూడవ మూల స్తంబానినికి జోడించాలి.- దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్తగా పంపించబడక మునుపు ప్రజలలో నుంచి చాలా మంది అజ్ఞానములో,మార్గభ్రష్టతలో ఉన్న విషయాన్ని తెలపటమును పాఠ్యమునకు తయారవ్వాలి.-దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వంశ ప్రతిష్టను తెలియపరచాలి. - ప్రవక్తల పరిసమాప్తి యొక్క అర్ధమును అంటే ఆయన వారిలో చివరివారని,ఆయన తరువాత ఏ ప్రవక్త రారని తెలపాలి.- ఎటువంటి అతిశయోక్తి లేకుండా ప్రవక్తను ప్రేమించటం అనివార్యము అని తెలపాలి.ఉదాహరణకు ఆయనను అర్ధించటం,ఆయనను ఆపదలో సహాయం కొసం పిలవటం.- దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లమును ప్రేమించటం ఆయన మాటల,ఆయన చర్యలలో ఆయనపై విధేయత చూపటమును,ఆయనను అనుసరించటమును తప్పనిసరి చేస్తుందని తెలపాలి. -
ఈ - నేను దైవప్రవక్తను ప్రేమిస్తున్నాను మరియు . . . . . . . . . మరియు నేను ఆయన మాటను అనుసరిస్తున్నాను మరియు . . . . . . . . .
ప్ర2: ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు:
మీరు జుమ్అ రోజున,జుమ్అ రాత్రి నా పై దరూద్ ను ఎక్కువగా పంపించండి. నాపై ఒకసారి దరూద్ పంపించే వారిపై అల్లాహ్ పది సార్లు దరూద్ పంపిస్తాడు.
దీనిని బైహిఖీ తన సునన్ లో ఉల్లేఖించారు (3/249).
హదీసును చదివి ఈ క్రింది వాటికి సమాధానం ఇవ్వండి:
దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై ఏ రోజు దరూద్,సలామ్ అధికంగా పఠించటం సమ్మతము?
ఆ- ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కోసం, సహచరుల రజియల్లాహు అన్హుమ్ ప్రేమను వ్యక్తపరిచే గాధను చెప్పడంలో మీ గురువుకు సహకరించండి.
శీర్షిక: పాఠ్యాంశాలు, ఫిఖా జ్ఞానం (ధర్మశాస్త్ర జ్ఞానం), విభాగము (రెండు).
సంక్షిప్త సారాంశము: ఈ ధర్మశాస్త్రం సౌదీ అరేబియా రాజ్యంలో విద్యార్థులకు ఉద్దేశించిన పాఠ్యప్రణాళిక యొక్క శుద్ధీకరణ మరియు సంక్షిప్తీకరణగా పరిగణించబడుతుంది మరియు ఇది అనేక స్థాయిలుగా విభజించబడింది. ఈ అంశంలో ఫిఖా జ్ఞానం (ధర్మశాస్త్ర జ్ఞానం) పాఠ్యాంశములకు సంబంధించి విషయాలు ఉంటాయి.మరియు ఇది పన్నెండు (12) విభాగములుగా విభజించబడినాయి. రెండవ విభాగములో చేర్చబడిన ముఖ్యమైన అంశాలలో,సమస్యలలో ఈ క్రిందివి ఉన్నాయి:
కాలకృత్యములు తీర్చుకునే పద్దతుల విషయంలో సంభాషణ, ఇస్తింజా, ఇస్తిజ్మార్ అర్ధం వివరణ. దానితో పాటు ఇస్తిజ్మార్ సమ్మతమయ్యే మరియు సమ్మతం కాని పరిస్థితుల విషయంలో గమనిక.
వుజూ పద్దతి మరియు దానిని ఏవి చెల్లుబాటు కాకుండా చేస్తుందో వాటి వివరణ
పగలు,రాత్రి విధి నమాజుల సంఖ్య,వాటిలో నుంచి ప్రతి నమాజులో రకాతుల సంఖ్య వివరణ.
రెండవ విభాగము
మొదటి పాఠం ([2])
అల్ ఇస్తింజా (మలమూత్ర విసర్జన తర్వాత నీటితో పరిశుభ్రపరుచుకోవటం) మరియు అల్ ఇస్తిజ్మార్ (మలమూత్ర విసర్జన తర్వాత రాయితో పరిశుభ్రపరుచుకోవటం) ([3])
మూత్రం మరియు మలం అపరిశుభ్రమైనవి. మరియు శరీరాన్ని మలినం చేస్తాయి, కాబట్టి వాటి నుండి ఉపశమనం పొందిన తర్వాత వాటిని శుభ్రం చేయాలి.
అల్ ఇస్తింజా అనగా:
మలినం తొలగిపోయే వరకు మూత్ర విసర్జన ద్వారమును మరియు మల విసర్జన ద్వారమును స్వచ్ఛమైన నీటితో కడగటం. ఉపాధ్యాయుని కోసం: - మలవిసర్జన చేసిన వెంటనే మూత్ర మరియు మల ద్వారాలను శుభ్రపరచడంపై గట్టిగా చెప్పాలి. - రాయితో శుభ్రపరచడం అనుమతించదగిన సందర్భాలను సూచించాలి. - ఇస్తింజా మరియు ఇస్తిజ్మార్ చేసేటప్పుడు ఎడమ చేతిని ఉపయోగించమని మరియు ఆ తర్వాత చేతులు బాగా కడగమని సూచించాలి. ఏ వస్తువులతో ఇస్తిజ్మార్ చేయకూడడదో వాటి ఉదాహరణలు పేర్కొనాలి.
ఇస్తిజ్మార్ అంటే :
మల,మూత్ర ద్వారమును మలినము తొలగేవరకు వరకు రాయి లేదా రుమాలుతో తుడవడం. పాఠం లక్ష్యాలు: - కాలకృత్యములు తీర్చుకున్న తర్వాత ఏమి చేయటం అవశ్యకమో విద్యార్థి పేర్కొనాలి. - విద్యార్థి ఇస్తింజా' మరియు ఇస్తిజ్మార్ అర్దమును తెలపాలి- విద్యార్థి ఇస్తిజ్మార్ చేయడానికి అనుమతించబడిన మూడు వస్తువులను పేర్కొనాలి.
ప్రశ్నలు :
ప్ర1 : కాలకృత్యములు తీర్చుకున్న తరువాత మీరు తప్పనిసరి చేయవలసిన విషయం ఏమిటి?
ప్ర 2: కింది వాటిని పూర్తి చేయండి:
అ - ఇస్తింజా అంటే : . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .
ఇస్తిజ్మార్ అంటే : . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .
ప్ర3: సరైన సమాధానాన్ని ఎంచుకోండి:
అ- దీనితో ఇస్తిజ్మార్ చేయటం సమ్మతమగును.
రాయి,నీళ్లు,రుమాలు
ఆ - మలిన వస్తువులు :
మూత్రం. చెమట. లాలాజలం.
ఇ- వస్త్రంపై మలినాన్నినేను ................... తో తొలగిస్తాను.
రాయి. నీరు. మట్టి.
ప్ర4: సముచితమైన వాటితో ఖాళీని పూరించండి:
మూత్ర, లేదా మల ద్వారము నుండి మలినమును నేను ..................... ద్వారా తొలగిస్తాను.
నీరు లేదా........................................................................ లేదా ........................................................................
ప్ర5: కింది వాక్యాలను వ్రాయండి:
కాలకృత్యములు తీర్చుకున్న తరువాత నేను మల,మూత్ర ద్వారములను శుభ్రపరచుకుంటాను. ఆ తరువాత వుజూను ఆరంభిస్తాను.
- ........................................................................
- ........................................................................
నేను కాలకృత్యములు తీర్చుకున్న తర్వాత చేతులు బాగా కడుక్కుంటాను.
- ........................................................................
- ........................................................................
కాలకృత్యములు తీర్చుకునే సమయంలో నేను మాట్లాడను.
- ........................................................................
- ........................................................................
* ఈ రెండు దుఆలను కంఠస్తం చేసుకోండి :
1- మరుగు దొడ్లోకి ప్రవేశించేటప్పుడు నేను ఇలా పలుకుతాను :
(బిస్మిల్లాహ్),(అల్లాహుమ్మ ఇన్నీ అఊజుబిక మినల్ ఖుబ్సి వల్ ఖబాయిస్.) "అల్లాహ్ పేరుతో" ఓ అల్లాహ్ నేను అపరిశుభ్రమైన స్త్రీ పురుష జిన్నుల నుండీ నీ శరణు వేడుకుంటున్నాను.([4])
మరుగుదొడ్డి నుండి వెలుపలికి వచ్చిన తరువాత నేను ఇలా పలుకుతాను: (గుఫ్రానక) ఓ అల్లాహ్ నన్ను క్షమించు. ([5])
రెండవ పాఠం ([6])
వుజూ పద్దతి ([7])
నేను నా హృదయంలో వుజూ చేయాలని సంకల్పించుకుంటాను ఆ తరువాత ఈ క్రింది వాటిని చేస్తాను :
1- బిస్మిల్లాహ్ అని పలుకుతాను.
2-నేను నా అరచేతులను మూడుసార్లు కడుగుతాను. దీనిని బుఖారీ (142) ఉల్లేఖించారు,అదనంగా బిస్మిల్లాహ్ చూడండి : ఫత్హుల్ బారీ (1/244).
3- నేను మూడు సార్లు నీటిని నోటిలో తీసుకుని పుక్కిలిస్తాను,ముక్కులో నీళ్ళను తీసుకుంటాను,ముక్కుని ఛీదరిస్తాను.
4- మూడు సార్లు నేను నా ముఖమును కడుగుతాను. దీనిని తిర్మిజీ ఉల్లేఖించారు (7).
5- నేను వేళ్ళ చివరి నుండి మోచేయి వరకు మూడు సార్లు చేతులు కడుక్కుంటాను.
6- నేను నా మొత్తం తలపై చెవులతో సహా ఒకసారి మసహ్ చేస్తాను. ఉపాధ్యాయుని కొరకు : -అల్లాహ్ పరిశుభ్రంగా ఉండేవారిని ఇష్టపడతాడని తెలియజేయాలి.నీటిని వృథా చేయవద్దని విద్యార్థులను హెచ్చరించాలి; ఎందుకంటే ఇది అనుగ్రహము,దానిని పరిరక్షించటం తప్పనిసరి.-శరీర భాగాలను మూడుసార్లు కడుక్కోవడం, తల మరియు చెవులను ఒకసారి మసహ్ చేయటం సున్నత్ అని తెలియజేయాలి.-పుక్కిలించటం మరియు ముక్కులో నీళ్ళను తీసుకుని ఛీదరించటం యొక్క అర్ధము స్పష్టపరచాలి. పుక్కిలించటం ఎలాగంటే నోటిలో నీటిని తిప్పటం,ముక్కులోకి నీళ్ళను తీసుకోవటం ఎలాగంటే ముక్కులోకి నీటిని చొప్పించడం మరియు దానిని శ్వాసతో బయటకు తీయడం తద్వారా ముక్కులో ఉన్నది బయటకు రావటానికి. ఛీదరించటం ఎలాగంటే ముక్కులో నీళ్ళను తీసుకున్న తరువాత శ్వాసతో ముక్కు నుండి బయటకు పంపటం.-విద్యార్థులందరినీ వుజూ ప్రక్టికల్ గా చేయడానికి నియమించడం , అందులో వారి నైపుణ్యాన్ని నిర్ధారించడం మరియు విద్యార్థులను వుజూమరియు నమాజు చేయటమును నేర్పించినందుకు ఉపాధ్యాయుల కొరకు గొప్ప ప్రతిఫలం ఉన్నదని తెలియజేయడం. ఎవరైతే జ్ఞానాన్ని బోధిస్తారో వారు దానిని ఆచరించినందుకు ప్రతిఫలం పొందుతారు.
7- నా కుడి పాదాన్ని చీలమండల వరకు మూడు సార్లు కడుగుతాను, ఆ తరువాత అలాగే ఎడమ పాదాన్ని కూడా కడుగుతాను.
* చేతులకు ముందు కాళ్ళు కడగడం సమ్మతమా? పాఠం లక్ష్యాలు:- విధ్యార్ధి సంకల్పము యొక్క ప్రదేశమును నిర్ణయించాలి.- విధ్యార్ది వుజూ విధానంను ప్రాక్టికల్ గా చేసి చూపించాలి.- విద్యార్థి మోచేతులు మరియు అరచేతుల మధ్య తేడాను గుర్తించాలి.
సమ్మతం కాదు. ఎందుకంటే నేను నా వుజూ పద్దతిలో పేర్కొన్నట్లు క్రమ పద్దతి తప్పనిసరి.
* నేను నా ముఖము చేతులను కడుక్కుని ఫోన్ ఆన్సర్ చేయడానికి వెళ్లి ఆలస్యం చేసి ఆ తరువాత మళ్లీ వచ్చి తల చెవులతో సహా మసహ్ చేసుకున్నాను. నా వుజూ చెల్లుతుందా?
ఆ వుజూ చెల్లదు. ఎందుకంటే అన్ని వుజూ అవయవాలను కడగడం ఎటువంటి అంతరాయం లేకుండా కొనసాగించాల్సిన అవసరం ఉంది.
ప్రశ్నలు :
ప్ర1: సంకల్పము చేసే ప్రదేశం ఏది.
ప్ర2: కింది వాక్యాలను పూర్తి చేయండి:
నేను నా అరచేతులను కడుగుతాను, ఆ తరువాత నోటిలో నీటిని తీసుకుని పుక్కిలిస్తాను. మరియు... ...........................మరియు ........ .............. ...................
- నేను ................................................ వరకు నా కుడి పాదంను కడుగుతాను. ఆ తరువాత ........................ ................................ ... ...............................................
ప్ర3: కాలమ్ (A)లోని పదాన్ని కాలమ్ (B)లోని తగిన పదంతో జోడించండి:
కాలమ్ (A)
కాలమ్ (B)
నేను కడుగుతాను
నా తలను
నేను కడుగుతాను
నా ముఖమును
నేను మసహ్ చేస్తాను
నా రెండు కాళ్లను
ప్ర4: వుజూ సమయంలో మీరు చేసే చివరి పనిని ఎంచుకోండి:
రెండు చేతులను కడగటం - రెండు కాళ్ళను కడగటం - తల మసహ్ చేయటం - ముఖమును కడగటం.
ప్ర5: సరైన స్థలంలో సంఖ్యను ఉంచడం ద్వారా వుజూ భాగాలను అమర్చండి:
రెండు కాళ్ళు - రెండు చేతులు - తల - ముఖము - అర చేతులు.
ప్ర6: సరైన సమాధానానికి గుర్తు (✔), మరియు తప్పు సమాధానానికి గుర్తు (✖) వేయండి.
- నేను నా కుడి పాదాన్ని నా కుడి చేతికి ముందు కడుగుతాను.
- నా పాదాలు కడుక్కున్న తర్వాత నా తలపై మసహ్ చేస్తాను
- నా ముఖం ఆ తరువాత నా చేతులు కడగుతాను
ప్ర7: క్రింది వాక్యాలను వ్రాయండి:
- నేను వుజూ అవయవాలలో నుంచి దేనిని నీరు చేరకుండా వదలను.
- ........................................................................
- ........................................................................
- నేను ఆలస్యం చేయకుండా అవయవాల మధ్య వుజూను కొనసాగిస్తాను.
- ........................................................................
- ........................................................................
- నేను వుజూ భాగముల మధ్య క్రమమును పాటిస్తాను.
- ........................................................................
- ........................................................................
మూడవ పాఠం ([8])
వుజూను చెల్లుబాటు అవకుండా చేసేవి ([9])
* వుజూ అనేక విషయాల వలన చెల్లదు, వాటిలో నుంచి :
1- మల,మూత్ర ద్వారాల గుండా వెలువడే వాటి వలన : (మూత్రము,గాలి,మలము)
2-నిద్ర వలన.
3 - ఒంటె మాంసం తినటం వలన.
* ఈ చెల్లుబాటు కానీకుండా చేసే వాటిలో నుంచి ఏ ఒకదానితో మీ వుజూ చెల్లుబాటు కాకుండా ఉంటే, మీరు దానిని పునరావృతం చేయటం తప్పనిసరి.
ప్రశ్నలు :
ప్ర1: వుజూను చెల్లుబాటు కాకుండా చేసేవాటి క్రింద అండర్లైన్ చేయండి:
(నవ్వు - నిద్ర - మాట్లాడటం - మల,మూత్ర ద్వారాల నుండి ఏదైన వెలువడటం - ఒంటె మాంసం తినడం).
ప్ర2: నేను వుజూ చేసి ఆ తరువాత గొర్రెల మాంసం తిన్నాను, నా వుజూ చెల్లుబాటవుతుందా? మరి ఎందుకు? ఉపాధ్యాయుని కొరకు : - వుజూను చెల్లుబాటు చేయని విషయాల యొక్క అర్థాన్ని వివరించాలి - ఒంటె మాంసం తిన్న వ్యక్తికి నమాజు తరువాత తెలిస్తే అతను నమాజును పునరావృతం చేయాలన్న ఆదేశమును తెలియజేయాలి.
ప్ర3 : మీరు నమాజు చేయటానికి నిలబడినప్పుడు మీ వుజూ భంగమైతే మీరు ఏమి చేస్తారు?
గుర్తు వేయడం ద్వారా తగిన సమాధానాన్ని ఎంచుకోండి. పాఠం లక్ష్యాలు: - వుజూ చెల్లుబాటు చేయని విషయాలను విద్యార్థి పేర్కొనాలి - వుజూ భంగమైనప్పుడు ఏమి చేయాలో విద్యార్థి స్పష్టపరచాలి.
నమాజును,వుజూను పునరావృతం చేయాలి. వుజూను పునరావృతం చేయాలి.
ప్ర4: మీరు ఏదైన మాంసం తిన్నారు. నమాజు ముగిసే వరకు అది ఒంటె మాంసం అని మీకు తెలియదు.
అప్పుడు మీరు ఎమి చేస్తారు? (జవాబును తెలపండి) ........................................................................
ప్ర5: క్రింది వాక్యాన్ని వ్రాయండి:
- వుజూను చెల్లుబాటు కాకుండా చేసే విషయాలు వాటిల్లినప్పుడు నేను వుజూను పునరావృతం చేస్తాను.
- ........................................................................
- ........................................................................
నాలుగవ పాఠం ([10])
నమాజు ప్రారంభమున పఠించు దుఆ ([11])
నమాజులో షరిఅత్ పరమైన దుఆలలో నుంచి నమాజు ప్రారంభమున దుఆను పఠించటం,అది :
(సుబ్హానకల్లాహుమ్మ వబిహమ్దిక వతబారకస్ముక వతఆలా జద్దుక వలా ఇలాహ గైరుక.)
* తక్బీరె తహ్రిమా తరువాత ఈ దుఆను పఠించాలి.
ప్రశ్నలు :
ప్ర1: తగిన పదంతో ఖాళీలను పూరించండి:
(గైరక - ఇస్ముక - జద్దిక - వబిహమ్దిక).
సుబహానకల్లాహుమ్మ .........................................., వతబారక ..........................................,వతఆలా ..........................................,వలా ఇలాహ ..........................................
ప్ర2 : నమాజు ప్రారంభమున పఠించు దుఆ ప్రదేశమును తెలియజేయండి.
ప్ర3: సరైన సమాధానాన్ని ఎంచుకోండి:
నమాజు ప్రారంభమున పఠించు దుఆను నేను పఠిస్తాను :
ఫాతిహ సూర పఠించిన తరువాత. తక్బీర తహ్రిమ తరువాత ఉపాధ్యాయుని కొరకు : నమాజు ప్రారంభమున పఠించు దుఆ ప్రదేశము స్పష్టపరచాలి,అది నమాజులో కేవలం మొదటి రకాతులో పఠించబడును.-నమాజు ప్రారంభమున పఠించు దుఆ అర్ధాలను వివరించాలి, అవి : (సుబ్హానకల్లాహుమ్మ వబిహమ్దిక) : అంటే దేవా, నీకు తగని లోటుపాట్ల నుండి, దుర్గుణాల నుండి నేను నీ పవిత్రతను కొనియాడుతున్నాను. (వబిహమ్దిక) : అంటే నేను నీ పరిశుద్ధతను కొనియాడుతున్నాను. (తబారకస్ముక) : నీ శుభాలు అధికముగా ఉన్నాయి. (వ తఆలా జద్దుక) : అంటే నీ స్థానం ఉన్నతమైనది మరియు గొప్పది. (వలా ఇలాహ గైరుక) : అంటే నీవు కాకుండా ఆరాధనకు అర్హుడైన దేవుడు లేడు.
ప్ర4: తగిన పదాన్ని ఎంచుకుని, తగిన ఖాళీలో ఉంచండి:
(మూడవ, నాల్గవ, మొదటి). పాఠం లక్ష్యాలు: - విద్యార్థి నమాజు ప్రారంభమున పఠించు దుఆను పేర్కొనాలి. - విధ్యార్ధి నమాజులో నమాజు ప్రారంభమున పఠించు దుఆను యొక్క స్థానాన్ని నిర్ణయించాలి.
తక్బీరె తహ్రిమా అది నమాజులో .......................................... తక్బీర్.
ప్రర5 :నమాజు ప్రారంభమున పఠించు దుఆను పేర్కొనండి.
ప్ర6: (✔)గుర్తును, (✖) గుర్తును సరైన స్థానంలో ఉంచండి :
- నమాజు ప్రారంభమున పఠించు దుఆను నేను ప్రతి రకాతులో పఠిస్తాను.
- నమాజు ప్రారంభమున పఠించు దుఆ మొదటి రకాతులో పఠించబడును.
ప్ర7: క్రింది వాక్యాన్ని వ్రాయండి:
- నమాజు ప్రారంభమున పఠించు దుఆను నేను తక్బీరె తహ్రిమ తరువాత పఠిస్తాను.
- ..........................................
- ..........................................
ఐదవ పాఠం ([12])
ఫర్జ్ నమాజులు ([13]) ఉపాధ్యాయుని కొరకు : - ఇస్లాం యొక్క ఐదు స్తంభాలకు నమాజు యొక్క అంశాన్ని జతచేయాలి. -విధ్యార్ధులను వారి నిర్ణీత సమయాల్లో ఐదు పూటల నమాజులను పరిరక్షించటంపై ప్రోత్సహించాలి; ఎందుకంటే ఇది ఇస్లాం యొక్క మూలస్థంభం, మరియు దానిని విడిచిపెట్టిన వారు అవిశ్వాసమునకు పాల్పడినవారు అవుతారు. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు : "మనకు వారికి మధ్య ఉన్న ఒప్పందము సలాహ్ (నమాజు). దాన్ని వదిలిన వాడు అవిశ్వాసమునకు ఒడిగట్టాడు."దీనిని తిర్మిజీ ఉల్లేఖించారు హదీసు సంఖ్య (2621).
* నమాజు ఇది షహాదతైన్ (రెండు సాక్ష్యాలు) తరువాత ఇస్లాం మూలస్తంభముల్లో రెండవది.
* నమాజును పరిరక్షించటం స్వర్గంలో ప్రవేశించటమునకు ఒక కారణం. పాఠం యొక్క లక్ష్యాలు: - విద్యార్థికి ఇస్లాంలో నమాజు యొక్క స్థానం ఏమిటో తెలియపరచాలి.- విద్యార్థి పగలు మరియు రాత్రిలోని విధి నమాజుల సంఖ్యను పేర్కొనాలి - ప్రతి విద్యార్థి తప్పనిసరి విధి నమాజులలోని రకాతుల సంఖ్యను పేర్కొనాలి.
* దానిని విడిచిపెట్టడం నరకంలో ప్రవేశించటానికి ఒక కారణం.
* పగలు మరియు రాత్రిలోని విధి నమాజులు ఐదు. అవి :
1- ఫజర్
2- జుహర్
3- అసర్
4- మగ్రిబ్
5- ఇషా
(రెండు రకాతులు)
(నాలుగు రకాతులు)
(నాలుగు రకాతులు)
(మూడు రకాతులు)
(నాలుగు రకాతులు)
ప్రశ్నలు :
ప్ర1: ఖాళీలను పూరించండి :
ఇస్లాం మూలస్తంభాలు ఐదు.అవి :
1- రెండు సాక్ష్యాలు.2-.......................................... 3- జకాతు చెల్లించటం.4- రమజాను మాసపు ఉపవాసములు ఉండటం.5-హజ్ చేయటం.
నమాజును పరిరక్షించటం .......................................... ప్రవేశించటమునకు ఒక కారణం. దానిని విడిచిపెట్టడం.......................................... ప్రవేశించటానికి ఒక కారణం.
ప్ర2: రేయింబవళ్లలోని విధి నమామాజులను పేర్కొనండి.
Q3: కాలమ్ (B)లో నుంచి తగిన రకాతుల సంఖ్యను కాలమ్ (A)లోని ప్రతి నమాజుకు జతచేయండి.
కాలమ్ (A)
కాలమ్ (B)`
ఫజర్ నమాజు
నాలుగు రకాతులు
జుహర్ నమాజు
రెండు రకాతులు
మగ్రిబ్ నమాజు
మూడు రకాతులు
ఒక రకాతు
ప్ర4: అర్ధపూరిత వాక్యాన్ని రూపొందించడానికి క్రింది పదాలను జోడించండి :
(పరిరక్షిస్తాడు - వాటి నిర్ణీత సమయంలో - నమాజును ఆచరించటమును - జైద్)
.......................................... .......................................... ..........................................
(మూల స్తంభములో నుంచి - నమాజు ఇది - ఇస్లాం - మూలస్తంభము - రెండవ)
.......................................... ....................................................................................
ప్ర5: నాలుగు రకాతుల నమాజుల పై ఒక వృత్తం గీయండి:
(ఫజర్ - జుహర్ - అసర్ - మగ్రిబ్ - ఇషా)
ఆరవ పాఠం ([14])
తషహ్హుద్ ([15])
(అత్తహియ్యాతు లిల్లాహి, వస్సలవాతు వత్తయ్యిబాతు, అస్సలాము అలైక అయ్యుహన్నబియ్యు వ రహ్మతుల్లాహి వ బరకాతుహు, అస్సలాము అలైనా వ అలా ఇబాదిల్లాహిస్సాలిహీన్, అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు, వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహూ వ రసూలుహు."సకల శరీర సంబంధమైన, ధన సంబంధమైన మరియు నోటి సంబంధమైన ఆరాధనలు అల్లాహ్ కు మాత్రమే చెందుతాయి. ఓ ప్రవక్తా! అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యాలు మరియు శుభాలు నీపై కురియుగాక! అలాగే మా పైనా మరియు పుణ్యాత్ములైన అల్లాహ్ దాసుల పైనా కురియుగాక. అల్లాహ్ తప్ప నిజమైన ఆరాధ్యుడు ఎవడూ లేడని నేను సాక్ష్యమిస్తున్నాను ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం అల్లాహ్ దాసుడు మరియు సందేశహరుడు అని నేను సాక్ష్యమిస్తున్నాను". )
తషహ్హుద్ ప్రదేశము : ఉపాధ్యాయుని కొరకు : - తషహ్హుద్ యొక్క అర్థాలను విద్యార్థులకు సులభమైన పద్దతిలో తెలపాలి: (అత్తహియ్యాతు లిల్లాహి): అంటే సర్వశక్తిమంతుడైన అల్లాహ్ కొరకు శాంతి, సార్వభౌమత్వం, మనుగడ మరియు గొప్పతనాన్ని సూచించే పదాలు. (వస్సలవాతు): అంటే,విధి నమాజులు మరియు స్వచ్ఛంద నమాజులు సర్వశక్తిమంతుడైన అల్లాహ్ కొరకే. (వత్తయ్యిబాతు): అంటే, సత్కర్మలు సర్వశక్తిమంతుడైన అల్లాహ్ కొరకే, ఎందుకంటే అల్లాహ్ మంచివాడు మరియు మంచిని మాత్రమే అంగీకరిస్తాడు - ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రేమను నొక్కిచెప్పడం మరియు నీతిమంతులైన అల్లాహ్ దాసులను,వారి ప్రేమను నిర్ధారించటం.
- మూడు, నాలుగు రకాతుల నమాజుల రెండవ రకాతు తరువాత తషహ్హుద్ ను మొదటి తషహ్హుద్ అని అంటారు.
ప్రతీ నమాజు యొక్క చివరి రకాతులోని తషహ్హుద్ ను చివరి తషహ్హుద్ అంటారు. పాఠం యొక్క లక్ష్యాలు: - విద్యార్థి తషహ్హుద్ ను కంఠస్థం చేసుకోవాలి - నమాజులో తషహ్హుద్ స్థానాన్ని ప్రతి విధ్యార్ధి నిర్ణయించాలి.
ప్రశ్నలు :
ప్ర1 : తషహ్హుద్ ను పేర్కొనండి.
ప్ర 2 : క్రింది ఖాళీలను పూర్తిచేయండి :
మూడు,నాలుగు రకాతుల నమాజుల రెండవ రకాతు తరువాత తషహ్హుద్ ను.......................................... అని అంటారు.
ప్రతీ నమాజు యొక్క చివరి రకాతులోని తషహ్హుద్ ను .......................................... అంటారు.
ప్ర3: తషహ్హుద్ లో ఇస్లాం యొక్క మూలస్తంభాలలో నుంచి ఒక మూలస్తంభం ఉన్నది దానిని వెలికితీసి వ్రాయండి.
ప్ర4: సరైన సమాధానాన్ని ఎంచుకోండి:
అ -దీని తరువాత మొదటి తషహ్హుద్ ఉంటుంది :
మొదటి రకాతు. రెండవ రకాతు.
ఆ - చివరి తషహ్హుద్ పఠించబడును :
దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై దరూద్ పఠించిన తరువాత.
దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై దరూద్ పఠించక ముందు.
ప్ర5: ఒక కాలమ్ లో రెండు తషహ్హుద్ లు ఉన్న నమాజులను మరియు ఇంకొక కాలమ్ లో ఒకే ఒక తషహ్హుద్ ఉన్న నమాజులను ఉంచండి.
(ఇషా నమాజు - అసర్ నమాజు - మగ్రిబ్ నమాజు - ఫజర్ నమాజు - జుహర్ నమాజు)
కాలమ్ (ఎ)
కాలమ్ (బి)
1- ..........................................
1-..........................................
2- ..........................................
2- ..........................................
3- ..........................................
3 - ..........................................
4- ..........................................
4- ..........................................
ఏడవ పాఠం ([16])
దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై దరూద్ పఠించటం ([17])
(‘అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మద్ వ అలా ఆలీ ముహమ్మద్,కమా సల్లైత అలా ఇబ్రాహీమ వఅలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదుమ్మజీద్’ అల్లాహుమ్మ బారిక్ అలా ముహమ్మద్ వ అలా ఆలీ ముహమ్మద్ కమా బారక్త అలా ఇబ్రాహీమ వఅలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదుమ్మజీద్ (ఓ అల్లాహ్ !నీవు ఇబ్రాహీం పై ఆయన కుటుంబం పై శుభాలు కరుణించినట్లుగానే ముహమ్మద్' పై మరియు ఆయన కుటుంబం పై కరుణించు. 'నిశ్చయంగా, నీవు స్తుతింపదగిన వాడవు, మహోన్నతుడవు. 'ఓ అల్లాహ్ !ఇబ్రాహీం పై ఆయన కుటుంబం పై శుభాలు కరుణించినట్లుగానే ముహమ్మద్' మరియు ఆయన కుటుంబంపై శుభాలు కురూపించు. నిశ్చయంగా, నీవు స్తుతింపదగిన వాడవు, మహోన్నతుడవు.)
* ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం'పై దరూద్ పఠించే స్థలము : చివరి తషహ్హుద్ తరువాత,రెండు సలాంలు తిరగక ముందు.
ప్రశ్నలు :
ప్ర1: ప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం పై పఠించే దరూద్ ను పేర్కొనండి. ఉపాధ్యాయుని కొరకు :- దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై అధికంగా దరూద్ పఠించటముపై విధ్యార్ధులను ప్రోత్సహించటం. ప్రత్యేకించి ఆయన పేరు ప్రస్తావన వచ్చినప్పుడు. - దరూద్ అల్లాహ్ తరపునుంచి అని,ఇది అత్యున్నత సభలో దాసుడిపై ప్రశంసలు కురిపించటని తెలిపరచాలి.- . బర్కత్ (శుభాలు) అంటే: పూర్తి మంచితనం యొక్క శాశ్వతత్వం మరియు సమృద్ధి అని, మరియు అల్లాహ్ మంచితనం కంటే ఎక్కువ మరియు శాశ్వతమైనది ఏదీ లేదు అని తెలియపరచాలి.
ప్ర2: కింది ఖాళీలను ఆధారపూరిత పదాలతో పూరించండి:
అ- సర్వశక్తిమంతుడైన అల్లాహ్ యొక్క పేర్లలో నుంచి .................................. పాఠం యొక్క లక్ష్యాలు: - విద్యార్థి ప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం పై దరూద్ పఠించటమును పేర్కొనాలి. - నమాజులో ప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం పై దరూద్ పఠించే స్థలమును విధ్యార్ధి పేర్కొనాలి.
ఆ - ప్రవక్తల నామములలో నుంచి ..........................................
ప్ర3: సరైన సమాధానాన్ని సర్కిల్ చేయండి:
దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై దరూద్ పఠించబడును :
(రుకూలో - సజ్దాలలో - చివరి తషహ్హుద్ తరువాత)
ఎనిమిదవ పాఠం ([18])
తషహ్హుద్ లో కూర్చున్నప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై దరూద్ పఠించిన తర్వాత శరణు వేడుకునే విషయాలు ([19]
ఒక ముస్లిం తషహ్హుద్ లో కూర్చున్ప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై దరూద్ పఠించిన తర్వాత నాలుగు విషయాల నుండి శరణు పొందుతూ ఇలా పలుకుతాడు :
1- ఓ అల్లాహ్! నరక శిక్ష నుండి,(అల్లాహుమ్మఇన్నీఅవూజూబిక మిన్ అజాబి జహన్నమ).
2- సమాది శిక్ష నుండి.
3- జీవితపు, మరణపు ఉపద్రవాల నుండి.
4- మసీహుద్దజ్జాల్ ఉపద్రవాల నుండి. నీ శరణు వేడుకుంటున్నాను.
ప్రశ్నలు : ఉపాధ్యాయుని కొరకు : - ఏ సమయంలోనైనా, ముఖ్యంగా నమాజు సమయంలో ఈ నాలుగు విషయాల నుండి శరణు వేడుకోవాలని విద్యార్థులకు ఉద్ఘాటించాలి. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వాటి నుండి శరణు వేడుకోవాలని ఆజ్ఞాపించారు. పాఠంలో పేర్కొన్న శరణు వేడుకునే నాలుగు పదాల వివరణ: (అఊజు) అంటే నేను మనవి చేస్తున్నాను మరియు రక్షణ కోరుతున్నాను. (ఫిత్నతిల్ మహ్యా వల్ మమాతి): (ఫిత్నతిల్ మహ్యా) అంటే ఇవి ఒక వ్యక్తికి అతని జీవితాంతం ఎదురయ్యే ఇహలోక పరీక్షలు మరియు దాని విషయంలో మనోవాంఛలు. (ఫిత్నతిల్ మమాతి: మరణం సమయంలో వాటిల్లేవి లేదా సమాది ఉపద్రవాలు మరియు శిక్షలు, వాటిలో నుంచి ఇదద్దరు దైవదూతలు (మున్కిర్,నకీర్) ప్రశ్నించటం అని చెప్పబడినది. (ఫిత్నతిల్ మసీహిద్దజ్జాల్): (మసీహుద్దజ్జాల్) అతను అబద్ధాలు చెప్పేవాడు, అవిశ్వాసి, అతడు చివరి కాలంలో ప్రభుతను కలిగి ఉన్నట్లు వాదిస్తూ బయటకు వస్తాడు. అల్లాహ్ అతని చేతుల మీదుగా ఎన్నో అద్భుతాలను జారీ చేస్తాడు. ఉదాహరణకు అతనిని దృవీకరించే వారిపై వర్షం కురిపించడం మరియు అతనిని తిరస్కరించేవారిపై కురిపించక పోవడం. చాలా మంది అతనిచే మోసపోయి అతనిని అనుసరిస్తారు, మరియు అతను మక్కా మరియు మదీనా మినహా అన్ని దేశాలను పర్యటిస్తాడు. ఆ తరువాత ఈసా అలైహిస్సలాం అతనిని హతమారుస్తారు.అతని ప్రలోభాల నుండి తప్పించుకునే మార్గాలలో: బలమైన విశ్వాసం, అతని ప్రలోభాల నుండి దేవుని శరణు కోరడం మరియు సూరా అల్-కహఫ్ ప్రారంభం నుండి పది ఆయతులను కంఠస్థం చేయడం. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు : ఎవరైతే సూరతుల్ కహఫ్ యొక్క మొదటి పది ఆయతులు కంఠస్తపరుచుకుంటారో దజ్జాల్ ఉపద్రవం నుండి రక్షింపబడతారు. దీనిని ముస్లిం ఉల్లేఖించారు హదీసు సంఖ్య (809).
ప్ర1 : తషహ్హుద్ లో కూర్చున్నప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై దరూద్ పఠించిన తర్వాత శరణు వేడుకునే నాలుగు విషయాలను పేర్కొనండి.
.............................................................................................................................. పాఠం యొక్క లక్ష్యాలు: - ముస్లిం తన నమాజులో శరణు వేడుకునే వాటిని విధ్యార్ధి పేర్కొనాలి. - విద్యార్థి ఈ నాలుగు శరణు వేడుకునే ప్రదేశాన్ని నమాజులో నిర్ణయించాలి.
..............................................................................................................................
ప్ర 2: కింది వాటిని పూర్తి చేయండి:
మసీహుద్దజ్జాల్ ప్రలోభాల నుండి విముక్తి పొందే మార్గములలో నుంచి :
- ......................................... నుండి అల్లాహ్ తో శరణు వేడుకోవటం.
- .......................................... యొక్క మొదటి పది ఆయతులు కంఠస్తపరుచుకోవటం.
తొమ్మిదవ పాఠం ([20])
నమాజు విధానం ([21])
1- నేను ఖిబ్లాకి అభిముఖమై ఆ తరువాత నేను సజదా చేసే ప్రదేశము వైపు చూస్తూ అల్లాహు అక్బర్ అని తక్బీరె తహ్రిమ పలుకుతాను. ఆతరువాత నమాజు ప్రారంభమున పఠించు దుఆ చదువుతాను.
2- అఊజు బిల్లాహి మినష్షైతానిర్రజీమ్,బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీమ్ (శాపగ్రస్తుడైన షైతాన్ నుండి అల్లాహ్ శరణు కోరుతున్నాను,అనంత కరుణామయుడు అపార కరుణా ప్రదాత అయిన అల్లాహ్ పేరుతో) అని నేను పలుకుతాను. ఆ తరువాత సూరతుల్ ఫాతిహ చదువుతాను. మరియు ఖుర్ఆన్ నుండి నేను కంఠస్తం చేసిన ఆయతులను చదువుతాను.
3- నేను నా రెండు చేతులను పైకి లేపి అల్లాహు అక్బర్ (అల్లాహ్ అందరి కంటే గొప్పవాడు) అని పలుకుతాను,ఆ తరువాత రుకూ చేసి సుబహాన రబ్బియల్ అజీమ్ (మహోన్నతుడైన నా ప్రభువు పరిశుద్ధుడు) అని మూడు సార్లు పలుకుతాను.
4- సమిఅల్లాహులిమన్ హమిదహ్,రబ్బనా వలకల్ హమ్దు హమ్దన్ కసీరన్ తయ్యిబన్ ముబారకన్ ఫీహి (అల్లాహ్ తనను స్థుతించిన వాడిని విన్నాడు,ఓ మా ప్రభూ! సకల స్తోత్రములు నీకే శోభిస్తాయి - అందులో అపరిమితమైనవి, పరమ పవిత్రమైనవి, శుభమైనవి ఉన్నాయి) అని పలుకుతూ నేను రుకూ నుండి పైకి లేస్తాను.)
5- నేను తక్బీర్ ని పలికి ఏడు శరీర భాగములపై నేను సజ్దా చేస్తాను. సజ్దాలో సుబహాన రబ్బియల్ ఆలా (మహోన్నతుడైన నా ప్రభువు పరిశుద్ధుడు) అని మూడు సార్లు పలుకుతాను.
6-నేను సజ్దా నుండి అల్లాహు అక్బర్ (అల్లాహ్ అందరి కంటే గొప్పవాడు) అని పలుకుతూ సమాంతరంగా అయిపోతాను. రెండు సజ్దాల మధ్య నేను రబ్బిగ్ఫిర్లీ (ఓ నా ప్రభువా నన్ను క్షమించు) అని పలుకుతాను.
7- అల్లాహు అక్బర్ (అల్లాహ్ అందరి కంటే గొప్పవాడు) అని పలుకుతూ రెండవ సజ్దా చేస్తాను. సజ్దాలో సుబహాన రబ్బియల్ ఆలా (మహోన్నతుడైన నా ప్రభువు పరిశుద్ధుడు) అని మూడు సార్లు పలుకుతాను.
8- అల్లాహు అక్బర్ (అల్లాహ్ అందరి కంటే గొప్పవాడు) అని పలుకుతూ రెండవ రకాతు కొరకు నిలబడుతాను. అందులో నేను మొదటి రకాతులో చేసిన విధంగా చేస్తాను. ఉపాధ్యాయుని కొరకు : - విద్యార్థుల ముందు ఉపాధ్యాయుడునమాజును ప్రాక్టికల్ గా చేసి చూపించాలి.- ప్రతీ విధ్యార్ధిని తన తోటి విధ్యార్ధుల ముందు నమాజు చదవమని బాధ్యతను అప్పజెప్పాలి,దానితో పాటు అందులో వాటిల్లే తప్పులను సరిదిద్దాలి. -నమాజు పాటించే సమయంలో విధ్యార్ధుల నుండి తప్పులు జరిగే పరిస్థితిలో నమాజు ప్రాక్టిస్ ను పునరవృతం చేయాలి. - (సుబహాన రబ్బియల్ అజీమ్) మరియు (సుబహాన రబ్బియల్ ఆలా) అని ఒకేసారి పలకటంలో కనీస పరిపూర్ణత ఉన్నదని సూచించాలి. -ఆమిర్ బిన్ సఅద్,ఆయన తండ్రి నుండి ఉల్లేఖనంలో వచ్చిన హదీసు ద్వారా దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నమాజు విధానమును స్పష్టపరచాలి. ఆయన ఇలా పలికారు : నేను దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను చూసేవాడిని ఆయన తన కుడి యడమల వైపు సలాం తిరిగేవారు చివరికి నేను ఆయన చెంప తెల్లదనాన్ని చూసేవాడిని. దీనిని ముస్లిం ఉల్లేఖించారు హదీసు సంఖ్య (582). స్త్రీ పరాీయి వ్యక్తులు హాజరు కాని పక్షంలో నమాజులో తన ముఖము,రెండు అర చేతులు తప్ప పూర్తి శరీరమును కప్పి ఉంచాలని తెలియపరచాలి.
9- రెండవ రకాతు తరువాత నేను మొదటి తషహ్హుద్ కొరకు కూర్చుంటాను.
10- నేను మునుపటి రెండు రకాతులలో చేసిన విధంగా మిగిలిన నామాజులో చేస్తాను. పాఠం యొక్క లక్ష్యాలు: - విద్యార్థి నమాజు యొక్క విధానమును స్పష్టపరచాలి. - విద్యార్థి సరైన విధానంలో (ప్రాక్టిస్) సాధన చేయాలి.
11- నేను నా నమాజు చివరిలో చివరి తషహ్హుద్ కొరకు,దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై దరూద్ చదవటం కొరకు మరియు దుఆ చేయటం కొరకు కూర్చుంటాను. ఆ తరువాత అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహ్ (మీపై అల్లాహ్ యొక్క శాంతి మరియు కారుణ్యములు కురియుగాక) అని పలుకుతూ సలాం తిరుగుతాను.
ప్రశ్నలు :
ప్ర1: నమాజు విధానమును తెలపండి.
ప్ర2: క్రింది వచ్చే వాటిలో నుంచి ప్రతి పదమును లేదా ప్రతి పదబంధాన్ని వాటికి తగిన స్థలంలో ఉంచండి:
(ఫాతిహ, అల్లాహు అక్బర్, ఖిబ్లా, ఖుర్ఆన్ నుంచి కంఠస్తం చేసిన వాటిలో నుంచి).
-ముస్లిం నమాజు వేళ .......................................... కు అభిముఖమై నిలబడుతాడు మరియు అతడు నమాజు ఆరంభంలో ..........................................అని పలుకుతాడు. ఆ తరువాత ..........................................సూరాను చదువుతాడు. మరియు దాని తరువాత ..........................................చదువుతాడు.
ప్ర3: కవి ఇలా అన్నాడు:
(బునయ్య తవజ్జ వఖుమ్ లిస్సలాతి) ప్రియ కుమారా వుజూ చేసి నమాజు కొరకు నిలబడు
**
(వసల్లి లిరబ్బిక తక్సిబ్ రిజాహు) నీవు నీ ప్రభువు కొరకు నమాజు చదువు ఆయన మన్నతను పొందుతావు.
(బునయ్య తవజ్జ బిమాయిన్ తహూరిన్) ప్రియ కుమారా నీవు పరిశుభ్రమైన నీటితో వుజూ చేయి.
**
(ఫమాఉల్ వుజూయి లి వజ్హిక నూరున్) వుజూ నీరు నీ ముఖము కొరకు వెలుగు.
(ఇజా రజియల్లాహు అన్ ముస్లిమిన్) అల్లాహ్ ఒక ముస్లిం నుండి ప్రసన్నుడైనప్పుడు.
**
(యనాలుస్సఆదత తూలల్ హయాతి) అతను తన జీవితాంతం ఆనందాన్ని పొందుతాడు.
మునుపటి పధ్యమును చదివి, ఈ క్రింది వాటికి సమాధానం ఇవ్వండి:
1- ఒక ముస్లిం దేనితో వుజూ చేస్తాడు? 2-నమాజు చేయడం వల్ల కలిగే ఫలాలలో ఒకదాన్ని పేర్కొనండి?
ప్ర4: క్రింది వాటిలో సరైన సమాధానాన్ని ఎంచుకోండి:
అ- నేను నమాజు నా దృష్టిని దీని వైపు కేంద్రీకరిస్తాను:
కప్పు,గోడ,సజ్దా చేసే ప్రదేశము.
ఆ - రుకూ చేస్తున్నప్పుడు నేను నా చేతులను వీటిపై పెడతాను :
నా రెండు మొకాళ్ళపై. నా రెండు పిక్కలపై
ఇ- సజ్దాలో నేను ఇలా పలుకుతాను :
సుబహాన రబ్బియల్ ఆలా,సుబహాన రబ్బియల్ అజీమ్
ప్ర5: కాలమ్ (ఎ)లోని పదబంధాలను కాలమ్ (బి)లోని పదబందాలతో జోడించండి:
కాలమ్ (ఎ)
కాలమ్ (బి)
నేను నా సజ్దాలలో ఇలా పలుకుతాను
సుబహానల్లాహి రబ్బియల్ అజీమ్ (మహోన్నతుడైన నా ప్రభువు పరిశుద్ధుడు)
నేను నా రకూలో ఇలా పలుకుతాను
సుబహాన రబ్బియల్ ఆలా (మహోన్నతుడైన నా ప్రభువు పరిశుద్ధుడు)
నేను రెండు సజ్దాల మధ్య ఇలా పలుకుతాను
సమిఅల్లాహు లిమన్ హమిదహ్ (స్థుతించిన వాడిని అల్లాహ్ విన్నాడు)
రుకూ నుండి పైకి లేచేటప్పుడు నేను ఇలా పలుకుతాను
రబ్బిగ్ఫిర్లీ (ఓ నా ప్రభువా నన్ను క్షమించు)
అల్లాహు అక్బర్ (అల్లాహ్ గొప్పవాడు.)
పదవ పాఠం ([22])
నమాజు భంగపరిచే విషయాలు ([23])
కొన్ని విషయాల వలన నమాజు భంగమగును వాటిలో నుంచి :
1- తినటం 2- త్రాగటం 3- మాట్లాడటం
4- నవ్వటం 5- మూత్రము లేదా మలము లేదా అపానవాయువు వలన వజూ విరిగిపోవటం 6 - అధికంగా కదలటం
* నమాజు మధ్యలో ఈ భంగపరిచే విషయాలలో నుంచి ఏదైన సంభవిస్తే నమాజు భంగమగును. దానిని తప్పనిసరిగా పునరావృతం చేయాలి.
* నమజులో వినయం కోసం ఆశించండి.
ప్రశ్నలు :
ప్ర1: నమాజును భంగపరిచే విషయాలను తెలపండి.
ప్ర2: నమాజు చేసే వ్యక్తి తన నమాజు భంగమైతే ఏమి చేయాలి?
ప్ర3: కింది సంధర్భాలలో నుంచి ప్రతి సందర్భంలో వచ్చిన నమాజును భంగపరిచే విషయాలను గుర్తించండి:
అ- విద్యార్థి నమాజు చేస్తూ తన సోదరుడు అనస్ తన పెన్సిల్ కేస్ తీయడం చూసి అతనితో ఇలా అన్నాడు: (నా పెన్సిల్ కేస్ వదిలివేయండి)? ( ) ఉపాధ్యాయుని కొరకు : విధ్యార్ధులతో వుజూను భంగపరిచే విషయాలను పదేపదే తెలపాలి.-నమాజులో వినయం యొక్క ప్రాముఖ్యత పై గట్టిగా చెప్పాలి. - అనేక మంది విద్యార్థులను వారి స్నేహితుల ముందు నమాజును చేయడానికి కేటాయించాలి, మిగిలిన వారిని తప్పులు సరిదిద్దుకోమని కోరాలి. - వుజూను భంగపరిచే వాటిలో నుంచి ప్రతి ఒక్క దానితో వుజూ భంగమయ్యిద్దని తెలపాలి ఉదాహరణకు శబ్దము లేదా గాలి వంటివి.- నమాజు సమయంలో ఉద్దేశపూర్వకంగా మాట్లాడటం దానిని భంగపరుస్తుంది.
ఆ- విద్యార్థి ఇంటిలో నమాజు చేస్తున్నప్పుడు ఇంటి బయటి డోర్బెల్ విని తలుపు తెరవడానికి వెళ్లి, నమాజును పూర్తి చేయడానికి తిరిగి వచ్చాడు.
ఇ - విద్యార్థి నమాజు చేస్తున్నప్పుడు తన చిన్న సోదరుడు నడవడానికి ప్రయత్నిస్తూ నేలమీద పడిపోటమును చూసి నవ్వాడు. -1016635-102298500 ( ) పాఠం యొక్క లక్ష్యాలు: - విద్యార్థి నమాజును భంగపరిచే విషయాలను తెలపాలి.-నమాజు చేసే వ్యక్తి తన నమాజు భంగమైనప్పుడు ఏమి చేయాలో విధ్యార్ధి తెలపాలి.
Related books
All books
المناهج التعليمية - الصف الأول13 భాషలుالمناهجالتعليميةالمناهج التعليمية - الصف الأول
గ్రంథ వివరాలను చూడటానికి క్లిక్ చేయండి.
المناهج التعليمية - الصف الثالث11 భాషలుالمناهجالتعليميةالمناهج التعليمية - الصف الثالث
గ్రంథ వివరాలను చూడటానికి క్లిక్ చేయండి.
المناهج التعليمية - الصف الرابع11 భాషలుالمناهجالتعليميةالمناهج التعليمية - الصف الرابع
గ్రంథ వివరాలను చూడటానికి క్లిక్ చేయండి.
శీర్షిక: పాఠ్యాంశాలు, తౌహీద్ పుస్తకం (కితాబుత్తౌహీద్), విభాగము (ఆరు).8 భాషలుశీర్షిక: పాఠ్యాంశాలు, తౌహీద్ పుస్తకం (కితాబుత్తౌహీద్), విభాగము (ఆరు).
సంక్షిప్త సారాంశము: ఈ ధర్మశాస్త్రం సౌదీ అరేబియా రాజ్యంలో విద్యార్థులకు ఉద్దేశించిన పాఠ్యప్రణాళిక యొక్క శుద్ధీకరణ మరియు సంక్షిప్తీకరణగా పరిగణించబడుతుంది మరియు ఇది అనేక స్థాయిలుగా విభజించబడింది. ఈ అంశంలో ఏకేశ్వరోపాసన (తౌహీద్ ) పాఠ్యాంశములకు సంబంధించి విషయాలు ఉంటాయి మరియు ఇది పన్నెండు (12) విభాగములుగా విభజించబడ్డాయి. ఆరవ విభాగములో చేర్చబడిన ముఖ్యమైన అంశాలలో: నాలుగు నియమాల వివరణ, వాటి వెలుగులో కేవలం తౌహీదె రుబూబియత్ ను అంగీకరించటం ఇస్లాంలో ప్రవేశింపజేయదని,తౌహీదె ఉలూహియత్ అంటే ఆరాధన మహోన్నతుడైన అల్లాహ్ కు ప్రత్యేకించడం తప్పనిసరి అని ఒక విధ్యార్ధి తెలుసుకుంటాడు. బహుదైవారాధన నిర్వచనం, దాని రకాల…