Skip to content
సూరాల జాబితా /

الفُرقَان

الفُرقَان is chapter 25 of the Quran and has 77 verses. This page presents it in full in the Uthmani script, with a verse-by-verse translation of its meaning.

77 ఆయతులు సూరా సంఖ్య 25
ఆయత్‌కు వెళ్ళండి
తెలుగు · Muhammad
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ

تَبَارَكَ ٱلَّذِي نَزَّلَ ٱلۡفُرۡقَانَ عَلَىٰ عَبۡدِهِۦ لِيَكُونَ لِلۡعَٰلَمِينَ نَذِيرًا

సర్వలోకాలకు హెచ్చరిక చేసేదిగా, ఈ గీటురాయిని (ఫుర్ఖాన్ ను) తన దాసునిపై క్రమక్రమంగా అవతరింపజేసిన ఆయన (అల్లాహ్) ఎంతో శుభదాయకుడు!

Explanation & meanings · 1
  1. దీనితో తెలిసేదేమిటంటే ఈ ఖుర్ఆన్ - ఏదైతే దైవప్రవక్త ము'హమ్మద్ ('స'అస)పై అవతరింప జేయబడిందో - సర్వలోకాల వారికి, అంటే మానవుల కొరకు మరియు జిన్నాతుల కొరకు గూడా మార్గదర్శినిగా అవతరింపజేయబడింది. కావున ము'హమ్మద్ ('స'అస) వారందరికీ సందేశహరుడు. అతను వారందరి కొరకు మార్గదర్శకునిగా పంపబడ్డారు. చూడండి 7:158. దైవప్రవక్త ('స'అస) ప్రవచనం: "నేను ఎర్ర-నల్ల అందరి వైపుకూ సందేశహరునిగా పంపబడ్డాను కాని పూర్వపు ప్రవక్తలు ('అలైహిమ్ స.) ఒక్క జాతివారి వైపుకు మాత్రమే పంపబడేవారు." ('స'హీ'హ్ బు'ఖారీ).

ٱلَّذِي لَهُۥ مُلۡكُ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضِ وَلَمۡ يَتَّخِذۡ وَلَدٗا وَلَمۡ يَكُن لَّهُۥ شَرِيكٞ فِي ٱلۡمُلۡكِ وَخَلَقَ كُلَّ شَيۡءٖ فَقَدَّرَهُۥ تَقۡدِيرٗا

భూమ్యాకాశాల విశ్వసామ్రాజ్యాధిపత్యం ఆయనకే చెందుతుంది. ఆయన ఎవ్వరినీ సంతానంగా చేసుకోలేదు. విశ్వసామ్రాజ్యాధిపత్యంలో ఆయనకు భాగస్వాములెవ్వరూ లేరు. మరియు ఆయన ప్రతి దానిని సృష్టించి, దానికొక విధిని నిర్ణయించాడు.

Explanation & meanings · 2
  1. చూడండి, 17:111.
  2. చూడండి, 87:3. అల్లాహ్ (సు.తా.) ప్రతిదాని విధిని, అంటే దాని జీవన విధానం మరియు దాని మరణం, మొదలైనవి అన్నీ మొదటనే వ్రాసిపెట్టి ఉన్నాడు. ఎందుకంటే ఆయనకు గడిచిపోయింది మరియు ముందు జరగనున్నది అంతా తెలుసు.

وَٱتَّخَذُواْ مِن دُونِهِۦٓ ءَالِهَةٗ لَّا يَخۡلُقُونَ شَيۡـٔٗا وَهُمۡ يُخۡلَقُونَ وَلَا يَمۡلِكُونَ لِأَنفُسِهِمۡ ضَرّٗا وَلَا نَفۡعٗا وَلَا يَمۡلِكُونَ مَوۡتٗا وَلَا حَيَوٰةٗ وَلَا نُشُورٗا

అయినా వారు ఆయనకు బదులుగా ఏమీ సృష్టించలేని మరియు తామే సృష్టింపబడిన వారిని ఆరాధ్యదైవాలుగా చేసుకున్నారు. మరియు వారు తమకు తాము ఎట్టి నష్టం గానీ, లాభం గానీ చేసుకోజాలరు. మరియు వారికి మరణం మీద గానీ, జీవితం మీద గానీ మరియు పునరుత్థాన దినం మీద గానీ, ఎలాంటి అధికారం లేదు.

وَقَالَ ٱلَّذِينَ كَفَرُوٓاْ إِنۡ هَٰذَآ إِلَّآ إِفۡكٌ ٱفۡتَرَىٰهُ وَأَعَانَهُۥ عَلَيۡهِ قَوۡمٌ ءَاخَرُونَۖ فَقَدۡ جَآءُو ظُلۡمٗا وَزُورٗا

మరియు సత్యతిరస్కారులు ఇలా అంటారు: "ఇది (ఈ ఖుర్ఆన్) కేవలం ఒక బూటక కల్పన; దీనిని ఇతనే కల్పించాడు. మరియు ఇతర జాతివారు కొందరు, ఇతనికి ఈ పనిలో సహాయపడ్డారు. కాని వాస్తవానికి వారు అన్యాయానికి మరియు అబద్ధానికి పూనుకున్నారు."

Explanation & meanings · 1
  1. చూడండి, 16:103. దైవప్రవక్త ('స'అస) ఈ గ్రంథాన్ని, అబూ ఫకీహా యసార్, 'అదాస్ మరియు జబర్ మొదలైన యూద విద్వాంసుల నుండి నేర్చుకున్నారని సత్యతిరస్కారులు ఆరోపించారు.

وَقَالُوٓاْ أَسَٰطِيرُ ٱلۡأَوَّلِينَ ٱكۡتَتَبَهَا فَهِيَ تُمۡلَىٰ عَلَيۡهِ بُكۡرَةٗ وَأَصِيلٗا

మరియు వారింకా ఇలా అంటారు: "ఇవి పూర్వీకుల గాథలు, వాటిని ఇతను వ్రాసుకున్నాడు, ఇవి ఇతనికి ఉదయం మరియు సాయంత్రం చెప్పి వ్రాయించబడుతున్నాయి."

Explanation & meanings · 1
  1. సత్యతిరస్కారుల నుండి.