25 : 32
وَقَالَ ٱلَّذِينَ كَفَرُواْ لَوۡلَا نُزِّلَ عَلَيۡهِ ٱلۡقُرۡءَانُ جُمۡلَةٗ وَٰحِدَةٗۚ كَذَٰلِكَ لِنُثَبِّتَ بِهِۦ فُؤَادَكَۖ وَرَتَّلۡنَٰهُ تَرۡتِيلٗا
మరియు సత్యతిరస్కారులు అంటారు: "ఇతని (ముహమ్మద్) మీద ఈ ఖుర్ఆన్ పూర్తిగా ఒకేసారి ఎందుకు అవతరింపజేయబడలేదు?" మేము (ఈ ఖుర్ఆన్ ను) ఈ విధంగా (భాగాలుగా పంపింది) నీ హృదయాన్ని దృఢపరచడానికి మరియు మేము దీనిని క్రమక్రమంగా అవతరింపజేశాము.
Explanation & meanings · 1
- అల్లాహ్ (సు.తా.) అంటున్నాడు: 'మేము ఈ ఖుర్ఆన్ ను 23 సంవత్సరాలలో క్రమక్రమంగా అవతరింపజేశాము.' ఇంకా చూడండి, 17:106, 73:4.