Skip to content
الفُرقَان /

ఆయత్ 61

25 : 61

ఆయత్ 61 of الفُرقَان (25 : 61). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.

الفُرقَان ఆయతులు 77
సూరా · الفُرقَان
తెలుగు · Muhammad
25 : 61

تَبَارَكَ ٱلَّذِي جَعَلَ فِي ٱلسَّمَآءِ بُرُوجٗا وَجَعَلَ فِيهَا سِرَٰجٗا وَقَمَرٗا مُّنِيرٗا

ఆకాశంలో నక్షత్రరాసులను (బురూజులను) నిర్మించి అందులో ఒక (ప్రకాశించే) సూర్యుణ్ణి మరియు వెలుగునిచ్చే (ప్రతిబింబింప జేసే) చంద్రుణ్ణి నియమించిన ఆయన (అల్లాహ్) శుభదాయకుడు.

Explanation & meanings · 2
  1. బురూజున్: మొట్టమొదటి వ్యాఖ్యాతలు బురూజున్, అంటే పెద్ద పెద్ద నక్షత్ర సముదాయాలన్నారు. తరువాత కాలపు వ్యాఖ్యాతలు పన్నెండు నక్షత్రరాసులు (సముదాయాలు) - మేషం, వృషభం, మిథునం, కర్కాట్కం, సింహ, కన్య, తుల, వృశ్చిక, ధనస్సు, మకరం, కుంభం, మీనం - అనేవి అన్నారు. (అయ్ సర్ అత్తఫాసీర్) ఇంకా చూడండి, 15:16.
  2. చూడండి, 10:5, ప్రకాశించే సూర్యుడు. సూర్యుని వెలుగును ప్రతిబింపజేసే చంద్రుడు.