25 : 1
تَبَارَكَ ٱلَّذِي نَزَّلَ ٱلۡفُرۡقَانَ عَلَىٰ عَبۡدِهِۦ لِيَكُونَ لِلۡعَٰلَمِينَ نَذِيرًا
సర్వలోకాలకు హెచ్చరిక చేసేదిగా, ఈ గీటురాయిని (ఫుర్ఖాన్ ను) తన దాసునిపై క్రమక్రమంగా అవతరింపజేసిన ఆయన (అల్లాహ్) ఎంతో శుభదాయకుడు!
Explanation & meanings · 1
- దీనితో తెలిసేదేమిటంటే ఈ ఖుర్ఆన్ - ఏదైతే దైవప్రవక్త ము'హమ్మద్ ('స'అస)పై అవతరింప జేయబడిందో - సర్వలోకాల వారికి, అంటే మానవుల కొరకు మరియు జిన్నాతుల కొరకు గూడా మార్గదర్శినిగా అవతరింపజేయబడింది. కావున ము'హమ్మద్ ('స'అస) వారందరికీ సందేశహరుడు. అతను వారందరి కొరకు మార్గదర్శకునిగా పంపబడ్డారు. చూడండి 7:158. దైవప్రవక్త ('స'అస) ప్రవచనం: "నేను ఎర్ర-నల్ల అందరి వైపుకూ సందేశహరునిగా పంపబడ్డాను కాని పూర్వపు ప్రవక్తలు ('అలైహిమ్ స.) ఒక్క జాతివారి వైపుకు మాత్రమే పంపబడేవారు." ('స'హీ'హ్ బు'ఖారీ).