المناهج التعليمية - الصف الرابع
శీర్షిక: పాఠ్యాంశాలు, తౌహీద్ పుస్తకం (కితాబుత్తౌహీద్), విభాగము (నాలుగు). సంక్షిప్త సారాంశము: ఈ ధర్మశాస్త్రం సౌదీ అరేబియా రాజ్యంలో విద్యార్థులకు ఉద్దేశించిన పాఠ్యప్రణాళిక యొక్క శుద్ధీకరణ మరియు సంక్షిప్తీకరణగా పరిగణించబడుతుంది మరియు ఇది అనేక స్థాయిలుగా విభజించబడింది. ఈ అంశంలో ఏకేశ్వరోపాసన (తౌహీద్ ) పాఠ్యాంశములకు సంబంధించి విషయాలు ఉంటాయి మరియు ఇది పన్నెండు (12) విభాగములుగా విభజించబడ్డాయి. నాల్గవ విభాగములో చేర్చబడిన ముఖ్యమైన అంశాలలో: సృష్టిని సృష్టించిన విజ్ఞతను వివరించడం, ఆరాధన యొక్క నిర్వచనం మరియు కొన్ని రకాలను పేర్కొనడం. అలాగే, తౌహీద్ యొక్క విభాగాలను వివరిస్తూ, ప్రతి విభాగానికి ఉన్న ఆధారాన్ని…
These files are generated automatically from the book's text; their layout may differ from the printed edition.
శీర్షిక: పాఠ్యాంశాలు, తౌహీద్ పుస్తకం (కితాబుత్తౌహీద్), విభాగము (నాలుగు).
సంక్షిప్త సారాంశము: ఈ ధర్మశాస్త్రం సౌదీ అరేబియా రాజ్యంలో విద్యార్థులకు ఉద్దేశించిన పాఠ్యప్రణాళిక యొక్క శుద్ధీకరణ మరియు సంక్షిప్తీకరణగా పరిగణించబడుతుంది మరియు ఇది అనేక స్థాయిలుగా విభజించబడింది. ఈ అంశంలో ఏకేశ్వరోపాసన (తౌహీద్ ) పాఠ్యాంశములకు సంబంధించి విషయాలు ఉంటాయి మరియు ఇది పన్నెండు (12) విభాగములుగా విభజించబడ్డాయి. నాల్గవ విభాగములో చేర్చబడిన ముఖ్యమైన అంశాలలో: సృష్టిని సృష్టించిన విజ్ఞతను వివరించడం, ఆరాధన యొక్క నిర్వచనం మరియు కొన్ని రకాలను పేర్కొనడం. అలాగే, తౌహీద్ యొక్క విభాగాలను వివరిస్తూ, ప్రతి విభాగానికి ఉన్న ఆధారాన్ని ప్రస్తావించడం. అదనంగా, తాగూత్ అర్థాన్ని స్పష్టపరచటం, దాని రూపాలు మరియు రకాలను వివరించడం.
నాల్గవ విభాగము
తొలి పలుకులు
స్తుతులన్నీ కలముతో జ్ఞానమును బోధించిన అల్లాహ్ కొరకు. ఆయన మానవునికి తెలియని విషయాలను బోధించాడు. మరియు శుభాలు,శాంతి గౌరవోన్నతుడైన నిరక్షరాశ్యుడైన ప్రవక్తపై, అల్లాహ్ ప్రజలను చీకట్లలో నుంచి వెలుగులోకి తీసుకుని రావటానికి ఆయనను పంపించాడు. అమ్మా బాద్ :
నిశ్ఛయంగా సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ఏకశ్వరోపాసన విధుల్లో అత్యంత కీలకమైన విధి. దాని గురించి జ్ఞానం శాస్త్రాలలో అత్యంత గౌరవప్రదమైనది మరియు ఉత్తమమైనది. ఆచరణల యొక్క ప్రామాణికత మరియు వాటి స్వీకరణ నిర్మించబడే పునాది. మరియు దాసులకు దాని అవసరం ఇతర అవసరాల కంటే ఎక్కువ. ఎందుకంటే హృదయములకు తమ ప్రభువును, తమ ఆరాధ్య దైవమును, తమ సృష్టికర్తను ఆయన నామములు, ఆయన గుణములు, ఆయన చర్యల ద్వారా గుర్తించటంతోనే జీవితము, అనుగ్రహాలు మరియు మనశ్శాంతి కలదు. అలాగే, ధర్మం విషయంలో అవగాహన కలిగిఉండటం మరియు ఆరాధనలను ఎలా నిర్వహించాలో తెలుసుకోవడం. తహారత్ (సుచీశుభ్రత), నమాజు వంటివి, మరియు అవే కాకుండా ఆనందం యొక్క సంకేతాలు. మరియు సర్వశక్తిమంతుడైన అల్లాహ్ తన దాసుడి కొరకు మంచిని ఉద్దేశించాడనే సూచన. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు : ఎవరి పట్ల అల్లాహ్ మేలును కోరుకుంటాడో అతనికి ధర్మం విషయంలో అవగాహనను ప్రసాదిస్తాడు.([2])
ఈ దృక్పథాన్ని ఆధారంగా చేసుకొని, జాలియాత్ అవగాహన కార్యాలయం అభ్యాసకుల హృదయాలలో సరైన అఖీదాను నాటటానికి ఏకేశ్వరోపాసన గురించి బోధించడానికి ఆసక్తిని కలిగి ఉంది. తద్వారా వారు తమ ధర్మానికి సంబంధించిన విషయాల గురించి జ్ఞానోదయం మరియు అవగాహన కలిగి ఉంటారు.
ఈ తౌహీద్ పాఠ్యప్రణాళిక యొక్క నాలుగో విభాగములో, విద్యార్థులు సృష్టి సృష్టించబడటంలో ఉన్న విజ్ఞత, తౌహీద్ మరియు దాని రకాలను, అల్లాహ్ ప్రజలపై మొట్టమొదట విధిగావించిన విషయాన్ని, మరియు ప్రధాన తాగూతుల గురించి నేర్చుకుంటారు.
ప్రతి పాఠానికి, విషయ స్వభావం, సంక్షిప్తత, స్పష్టత, అంశాల క్రమం, మునుపటి అధ్యయనంతో సంబంధం వంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక లక్ష్యాలు నిర్దేశించబడ్డాయి. ప్రతి పాఠానికి ప్రశ్నలు మరియు అంచనాలను సాధించడానికి ఉపాధ్యాయులకు మార్గదర్శకాలు అందించబడ్డాయి. దీనిని బుఖారీ కితాబుల్ ఇల్మ్ లో మయ్యురిదిల్లాహు బిహి ఖైరన్ యుఫఖ్కిహ్ హు ఫిద్దీన్ లో హదీసు సంఖ్య (7) లో ఉల్లేఖించారు.
మరియు బోధకునికి ఈ సూచనలు:
1- ఆచరణ స్వీకరించబడటానికి అల్లాహ్ కొరకు చిత్తశుద్ధి ఒక షరతు. కావున మీ ఆచరణను పరిశుద్ధుడైన ఆయన మన్నత కొరకు ప్రత్యేకించి చేయండి, మీరు ఇహలోకంలో మరియు పరలోకంలో లాభాన్ని పొందుతారు.
2- అమానత్ యొక్క పరిరక్షణ మోక్షానికి ఒక మార్గం - నీవు - ఓ నా ప్రియ సోదర అధ్యాపకుడా - ఇస్లాం యొక్క సరిహద్దులలో నుంచి ఒకదానిపై ఉన్నావు మరియు ముస్లింల పిల్లల మనస్సు మరియు స్వభావాన్ని అమానత్ గా పొందావు, కాబట్టి నీవు ఇహపరాలలో సాఫల్యం చెందటానికి అమానత్ ను పరిరక్షించు.
3- నిశ్ఛయంగా ఏకేశ్వరోపాసన (తౌహీద్) విషయం బోధించటం ఆచరణల నిమిత్తమే. కావున ఏకేశ్వరోపాసన జ్ఞానం మరియు దాని ప్రకారం ఆచరణ ద్వారా మాత్రమే దాసుల కొరకు ప్రయోజనం మరియు ఇహలోక పరాభవం నుండి, పరలోక శిక్ష నుండి మోక్షం కలుగును. కాబట్టి అభ్యాసకుల హృదయాలలో సరైన అఖీదాను నాటడానికి కష్టపడి పని చేయండి మరియు మీరు ఆహ్వానించే ఆదర్శాలు మరియు ఉన్నత విలువలకు నిజాయితీగల వ్యాఖ్యాతగా మరియు సజీవ ఉదాహరణగా ఉండండి.
4- ఆకాశంలో మేఘాలు కమ్ముకున్నప్పుడు, మెరుపు మెరుస్తున్నప్పుడు, మెరుపుల గర్జన వినిపించినప్పుడు, వర్షాలు పడుతున్నప్పుడు, మరియు ఇలాంటి సంఘటనల సమయంలో అల్లాహ్ యొక్క ఏకత్వం మరియు శక్తి గురించి మాట్లాడటానికి అవకాశాలను ఉపయోగించాలి. ఈ సంఘటనలు ముస్లింలో విశ్వాసాన్ని ఉత్తేజపరచడానికి ప్రేరణగా ఉంటాయి.
5- నిశ్ఛయంగా ఉదాహరణలు ఇవ్వడం మరియు పాఠాన్ని వాస్తవికతతో అనుసంధానించడం ద్వారా విషయమును సులభతరం చేయడం, విషయం పట్ల అభ్యాసకుల ప్రేమపై గొప్ప ప్రభావాన్ని చూపుతుంది, ఆపై దానిని నేర్చుకోవడం మరియు దాని ప్రకారం ఆచరించడం. ముగింపులో, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన దాని ద్వారా మేము మీకు శుభవార్త అందిస్తున్నాము:
"నిశ్ఛయంగా ఒక విశ్వాసి మరణానంతరం అతనితో ముడిపడి ఉన్న ఆచరణ మరియు మంచి పనులలో అతను బోధించిన మరియు వ్యాప్తి చేసిన జ్ఞానం ఉంది."([3])
అల్లాహ్ మన ప్రవక్త అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, ఆయన కుటుంబముపై, ఆయన సహచరులందరిపై శుభాలను, శాంతిని కలిగించుగాక.
విషయ సూచిక :
అంశము
పేజీ ఇబ్నె మాజ దీనిని ఉల్లేఖించారు హదీసు సంఖ్య (242).
మొదటి పాఠం:
సృష్టిని సృష్టించటంలో ఉన్న విజ్ఞత.
రెండవ పాఠం:
ఆరాధన
మూడవ పాఠం:
తౌహీద్ మరియు దాని రకాలు
నాల్గవ పాఠం:
తౌహీదె రుబూబియ్యత్.
ఐదవ పాఠం:
తౌహీద్ అల్ ఉలూహియ్యత్
ఆరవ పాఠం:
తౌహీద్ అస్మా వ సిఫాత్.
ఏడవ పాఠం:
సృష్టి రాసుల వైపు అల్లాహ్ ప్రవక్తలు
ఎనిమిదవ పాఠం:
అల్లాహ్ ప్రజలపై మొదట విధిగావించిన విషయం.
తొమ్మిదవ పాఠం:
నిజమైన విశ్వాసం.
పదవ పాఠం:
షైతాన్ అనేవాడు ప్రధాన తాగూత్.
పదకొండవ పాఠం:
అల్లాహ్ అవతరింపచేసిన దానికి విరుద్ధంగా తీర్పు చెప్పడం
పన్నెండవ పాఠం:
ఇహ్సాన్ (الإحسان) యొక్క అర్థం ఇహ్సాన్ అంటే – ఆరాధనను బహిరంగంగా మరియు అంతరంగంగా పూర్తిగా పూర్తి చేయడం. ఇది ఇఖ్లాస్ (నిష్కపటత) యొక్క పరాకాష్ఠ.
పదమూడవ పాఠం:
ఒక నిజమైన విశ్వాసపరుడు తప్పనిసరిగా తాగూత్ను తిరస్కరించాలి.
మొదటి పాఠం
సృష్టిని సృష్టించటంలో ఉన్న విజ్ఞత
అల్లాహ్‌కు సమగ్రమైన ప్రశంసలు చెందును. ఆయన ఎంపికచేసుకున్న తన దాసులపై శాంతి కలుగు గాక, అమ్మా బాద్:
తెలుసుకో, అల్లాహ్ నీపై కరుణ చూపుగాక! అల్లాహ్ సృష్టిని తన ఆరాధన కోసం మాత్రమే సృష్టించాడు, మరియు వారు ఆయనతో దేనిని భాగస్వామ్యం చేయకూడదు.
మరియు అల్లాహ్ యొక్క వాక్కు నుండి ఆధారం:
పాఠ్య సూచనలు:
- జిన్నులు మరియు మనుషులు సృష్టించబడిన మహత్తరమైన లక్ష్యం: ఒక్క అల్లాహ్‌ను మాత్రమే ఆరాధించడం.
-మనిషి ఈ జీవితంలో ఎటువంటి లక్ష్యం లేదా ఉద్ధేశం లేకుండా సృష్టించబడలేదు, అతను దానిని సాధించేందుకు ప్రయత్నించాలి.
ఎవరైనా ప్రార్థన లేదా బలి ఇవ్వడం వంటి ఏదైనాఆరాధనను అల్లాహ్ తప్ప వేరెవరికి అర్పిస్తే, అతను అల్లాహ్ తోపాటు సాటి కల్పినవాడు అవుతాడు. అలాంటి స్థితిలో మరణిస్తే, అతని శిక్ష నరకం అవుతుంది, మరియు అతని పై స్వర్గం నిషిద్ధం.
మహోన్నతుడు అయిన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:
{ఎవడైతే అల్లాహ్'కు ఇతరులను సాటికల్పిస్తాడో అతని కొరకు అల్లాహ్ స్వర్గం' నిషేదించాడు, మరియు అతని నివాసం నరకాగ్ని అవుతుంది మరియు దౌర్జన్యపరులకు సహాయం చేసేవాడు ఎవడు ఉండడు}.
ప్రశ్నలు:
1- సృష్టిని సృష్టించటంలో విజ్ఞత ఏమిటి? మరియు దానికి ఆధారం ఏమిటి?
2- తినడం మరియు తాగడం ఈ జీవితంలో తప్పనిసరి, అయితే మనం వాటి కోసం సృష్టించబడ్డామా?
3 - కింది ఖాళీలను పూరించండి:
అల్లాహేతరులను ఆరాధించినవాడిని ................. అని పిలుస్తారు. మరియు అతని శిక్ష .......................
4- క్రింది క్రియలు అల్లాహ్‌కు కాకుండా వేరొకరికి అర్పించబడితే వాటి ఆదేశం ఏమిటి?:
నమాజు - దుఆ - భయము - వదించటం - తవాఫు
రెండవ పాఠం
ఆరాధన
ఇబాదత్ (ఆరాధన): అల్లాహ్ ఇష్టపడే మరియు సంతోషించే పలుకులు, చేతలలో నుంచి బాహ్యపరమైన, అంతర్గతపరమైన ప్రతిదానికీ ఇది ఒక సమగ్ర పేరు.
అల్లాహ్‌కు విధేయత ద్వారా ఆరాధనను సంపూర్ణంగా చేయాలి; అనగా, ఆయన ఆదేశాలను పాటించడం మరియు ఆయన నిషేధాల నుండి దూరంగా ఉండటం ద్వారా.
పాఠ్య సూచనలు:
ఆరాధనల రకాలు అనేకం ఉన్నాయి: బహిరంగ ఆరాధనలు: నమాజు, దువా, బలి, తల్లిదండ్రుల పట్ల ఉత్తమంగా మెలగటం, బంధువులతో సంబంధాలను నిలుపుకోవడం, పుణ్య మరియు భక్తి కార్యాలలో సహాయపడడం, అల్లాహ్ మార్గంలో జిహాద్ చేయడం, మంచి గురించి ఆదేశించడం మరియు చెడు నుండి వారించడం. అంతర్ముఖ ఆరాధనలు: అల్లాహ్ పట్ల ప్రేమ, భయం, భయభక్తి, మరియు ఆశ.
ఆరాధన అంతా అల్లాహ్ కోసం మాత్రమే చేయాలి. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
హునఫా అర్ధం: అంటే: అన్ని మతాలను విడిచి, పూర్తిగా ఇస్లాం మతం వైపు మళ్ళినవారు.
ఆబిద్ అనగా అల్లాహ్ తఆలా ఆదేశాలను పాటించి, ఆయన నిషేధించిన వాటిని విడిచిపెట్టినవాడు.
ప్రశ్నలు :
ప్రశ్న1: ప్రత్యక్ష ఆరాధనలు కింద ఒక గీత వేసి, అంతర్గత ఆరాధనల మధ్య తేడా చూపండి:
హజ్జ్ - భరోసా - దుఆ - నమాజు - భయము - అల్లాహ్ మార్గంలో జిహాద్.
ప్రశ్న2 : కింది ఖాళీలను పూరించండి:
ఎ - ఇబాదత్ (ఆరాధన) ..........................................................................................................................................................పేరు.
బి - అల్లాహ్‌కు ................................. పాటించడం మరియు ఆ..........................................దూరంగా ఉండటం ద్వారా విధేయతను సంపూర్ణంగా చేయాలి;
మూడవ పాఠం
తౌహీద్ మరియు దాని రకాలు
తౌహీదు అంటే పరమపవిత్రుడైన అల్లాహ్'ను మాత్రమే ఆరాధించడం' అని అర్ధం. తన దాసుల కోసం అల్లాహ్ సమస్త దైవసందేశహరులకు ఇచ్చి పంపిన ధర్మం కూడా ఇదియే. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
తాగూత్ అంటే అల్లాహ్ కాకుండా ఆరాధించబడే ప్రతీ ఒక్కరు. వారు దాని ఇష్డపడుతుంటారు.
తౌహీద్ యొక్క రకాలు మూడు అవి: తౌహీదె రుబూబియత్, తౌహీదె ఉలూహియత్, తౌహీదె అస్మా వస్సిఫాత్.
పాఠ్య సూచనలు:
- మనిషి అన్ని రకాల ఆరాధనలను అల్లాహ్ ఒక్కడి కొరకు చేయనంతవరకు అతడు మువహ్హిద్ (ఏకేశ్వరోపాసకుడు) కాజాలడు.
- అల్లాహ్ తన దాసులపై చేసిన కృపలలో ఒకటి ఏమిటంటే, ఆయన జనులకు మార్గదర్శకం చేయుటకై మరియు సరళమైన సన్మార్గాన్ని స్పష్టంగా తెలియజేయుటకై ప్రవక్తలను పంపాడు.
ప్రవక్తలు అందరూ తౌహీద్ వైపు పిలుస్తారు మరియు షిర్క్ నుంచి వారిస్తారు.
ప్రశ్నలు:
ప్రశ్న1 : తౌహీద్ ను నిర్వచించండి.
ప్రశ్న2: తౌహీద్ యొక్క రకాలను పేర్కొనండి.
ప్రశ్న3: ఒక వ్యక్తి అల్లాహ్ కు ఏకేశ్వరోపాసకుడుగా ఎప్పుడు ఉంటాడు?
నాల్గవ పాఠం
తౌహీదె రుబూబియ్యత్
మొదటి రకం: తౌహీదె రుబూబియత్:
ఇది మహోన్నతుడైన అల్లాహ్ ను ఆయన ఆచరణలలోో ఏకైకుడని విశ్వసిచడం.
అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో కాఫిరులు దీనిని అంగీకరించారు, కానీ ఇది వారిని ఇస్లాంలో ప్రవేశింపజేయలేదు. అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో యుద్ధం చేశారు మరియు వారి రక్తాన్ని, ఆస్తులను హలాల్‌గా చేసుకున్నారు.
మహోన్నతుడైన అల్లాహ్ యొక్క ఈ వాక్కు దీనికి ఆధారం:
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:
[అల్ ముమినూన్: 84 - 89].([4])
పాఠ్య సూచనలు:
అల్లాహ్‌ను ఆయన కృత్యాలలో ఏకీభవించటం అంటే అల్లాహ్ మాత్రమే సృష్టికర్త, పోషణకర్త, జీవం ప్రసాదించేవాడు, మృత్యువునిచ్చేవాడు మరియు ఇదే విధంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఇతర కృత్యాలను విశ్వసించటం.
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం అవిశ్వాసుల వద్దకు వచ్చినప్పుడు, కాఫిరులు తౌహీదె రుబూబియ్యతును విశ్వసించేవారు. అయితే, వారి ఈ విశ్వాసం వారికి ప్రయోజనం కలిగించలేదు; ఎందుకంటే వారు అల్లాహ్‌ను ఆరాధనలో ఒక్కడని విశ్వసించలేదు.
ఎవరైతే అల్లాహ్ తనను సృష్టించాడని, తనకు ఆహారోపాధిని కలిగించాడని విశ్వసించాడు, కానీ అల్లాహ్‌ను ఒక్కడినే ఆరాధించకుండా ఉంటే, అతడు షిర్క్ చేసే వాడవుతాడు. అందుకే, మునుపటి ఆయతులలో అల్లాహ్ ముష్రికులను గద్దించాడు.
ప్రశ్నలు: మలకూత్ అంటే రాజ్యం. అతడు రక్షించును: తన దాసులను చెడుల నుండి రక్షించును మరియు వారికి కష్టాలను తొలగించును. అతని మీద రక్షణ ఉండదు: అంటే ఎవరూ అల్లాహ్‌పై అధికారం కలిగి ఉండలేరు, మరియు అల్లాహ్ నిర్ణయించిన అపాయాన్ని ఎవరూ తొలగించలేరు. ఎవరు మాయచేయబడుతున్నారు: అంటే మీ బుద్ధి ఎక్కడికి పోయింది?
ప్రశ్న: అల్లాహ్ తన చర్యలలో ఏకైకుడని విశ్వసించటం యొక్క అర్ధం ఏమిటి?
ప్రశ్న2 : అవిశ్వాసపరులు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో ఏ తౌహీదును అంగీకరించారు? మరియు వారు దానిని అంగీకరించడం వారికి ప్రయోజనం కలిగించిందా?
ప్రశ్న3 : తౌహీదె రుబూబియత్ గురించి ఆధారం ఏమిటి ?
ప్రశ్న4: అల్లాహ్ మాత్రమే పోషకుడు, జీవం ఇచ్చేవాడు, మరణం ఇచ్చేవాడు అని ఒప్పుకున్న వ్యక్తి, అయితే అతను అల్లాహ్‌ను మాత్రమే ఆరాధించకుండా ఉంటే, అతను ముస్లింగా పరిగణించబడతాడా? ఎందుకు?
ఐదవ పాఠం
తౌహీద్ అల్ ఉలూహియ్యత్
రెండవ రకము: తౌహీదె ఉలూహియత్:
మరియు ఇది దాసుల ఆచరణల ద్వారా అల్లాహ్ యొక్క ఏకత్వము. ఉదాహరణకు దుఆ,మొక్కుబడులు, వధించటం, ఆశపెట్టుకోవటం, భయపడటం, ఆకాంక్షించటం, భీతి, పశ్ఛాత్తాపం, సహాయం అర్ధించటం, శరణం కోరటం మరియు గొప్పతనమును కొనియాడటం.
తౌహీద్ రకాలలో నుంచి ఈ రకం ప్రాచీన కాలంలోను, ఆధునిక కాలంలోను ప్రవక్తలు మరియు వారి జాతుల మధ్య విభేదానికి కారణమైంది.
దుఆ యొక్క ఆధారం : అల్లాహ్ యొక్క ఈ వాక్కు:
([5]) [గాఫిర్: 60]
పాఠ్య సూచనలు:
తౌహీదుల్-ఉలూహియ్యా, దీనిని తౌహీదుల్-ఇబాదా అని కూడా అంటారు, దీని కోసం ప్రవక్తలు పంపబడ్డారు, గ్రంథాలు అవతరింపబడ్డాయి. ప్రతి ప్రవక్త దీని గురించి ఆదేశము వలన తన జాతి కొరకు తన దావత్‌ను ప్రారంభించారు. నూహ్, హూద్, సాలెహ్, మరియు షుఐబ్ అలైహిముస్సలాం ఇలా సెలవిచ్చారు:
{'ఓ నాజాతి ప్రజలారా మీరు అల్లాహ్'ను ఆరాధించండి, ఆయన తప్ప మరొకరెవరూ మీకు ఆరాధ్యులు లేరు'}
దుఆ (ప్రార్థన) తౌహీద్ మరియు ఆరాధన యొక్క గొప్ప రూపాలలో ఒకటి. అందుకే అల్లాహ్ సుబ్హానహు తఆలా తన ఆయత్లో ఇలా సెలవిచ్చాడు:
{నిశ్చయంగా, ఎవరైతే నా ప్రార్థనల పట్ల దురహంకారం చూపుతారో} దాఖిరీన్: అంటే అవమానితులై, దిగజరిపోయినవారు.
అర్థం: నా దుఆ (ప్రార్థన) నుండి, దీనికి ఆధారంగా ఆయత్ ప్రారంభంలో ఉన్న అల్లాహ్ తఆలా యొక్క వాక్యం:
{మీరు నన్ను వేడుకోండి}
ప్రశ్నలు:
ప్రశ్న 1 : తౌహీదె ఉలూహియత్ ను నిర్వచించండి.
ప్రశ్న 2: ప్రవక్తలు తమ జాతులను మొదటగా ఏ విషయం వైపు పిలిచారు?
ప్ర3 : మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
ఆయత్లో దుఆ (ప్రార్థన) కూడా ఆరాధనలో భాగమని తెలిపే ఆధారం ఉంది.
ప్రశ్న 4: దాసుల ఆచరణలలో నుండి కేవలం అల్లాహ్‌కు మాత్రమే సమర్పించాల్సిన ఐదు ఆరాధనలను పేర్కొనండి.
ప్రశ్న 5: తౌహీద్ అర్-రుబూబియ్యా మరియు తౌహీద్ అల్-ఉలూహియ్యా మధ్య తేడా ఏమిటి? ఉదాహరణతో వివరించండి.
ఆరవ పాఠం
తౌహీద్ అల్ అస్మా వ సిఫాతు.
మూడవ రకము: తౌహీద్ అస్మా వ సిఫాత్:
అది: పవిత్ర ఖుర్ఆన్ మరియు సహీహ్ హదీస్లలో వచ్చిన అల్లాహ్ తాను తన గురించి వివరించిన లేదా ఆయన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయనను వివరించిన విధంగా నామాలు మరియు లక్షణాలను విశ్వసించడం. అల్లాహ్‌కు సమానం ఏదీ లేదు, మరియు ఆయన సమస్తాన్ని ఆలకించేవాడు, చూసేవాడు అని విశ్వసించడం. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:
మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
{ఆయనను పోలినదేదీ లేదు మరియు ఆయన సర్వం వినేవాడూ, సర్వం చూసేవాడూను}.
పాఠ్య సూచనలు:
అల్లాహ్ నామాలను గుణగణాలను విశ్వాసించటం అనివార్యమవుతుంది.
- అల్లాహ్ నామాలు మరియు లక్షణాలు పవిత్ర ఖుర్ఆన్ మరియు సహీహ్ హదీస్‌ల ద్వారా మాత్రమే తెలుసుకోవాలి, మరియు వీటిని సలఫ్ సాలిహీన్ యొక్క అవగాహన ప్రకారం అర్థం చేసుకోవాలి.
- అల్లాహ్ నామాలన్నీ అద్భుతమైనవే, మరియు అవి చాలా ఉన్నాయి. వాటిలో కొన్ని: అస్సమద్, అల్-బారి, అస్సమీఉ, అల్-బసీరు, అర్-రహ్మాను, అర్-రహీము. అలాగే అల్లాహ్‌కు అనేక లక్షణాలు ఉన్నాయి, వాటిలో కొన్ని: రహ్మ (కరుణ), ఖువ్వా (శక్తి), హిక్మతు (జ్ఞానం), హయాత్ (జీవితం), ఇజ్జత్ (గౌరవం), ఇల్మ్ (జ్ఞానం). అస్-సమద్: సర్వాధికారి, సర్వోన్నతుడు, సృష్టిలోని సమస్త ప్రాణులు ఆయనపై ఆధారపడతారు మరియు తమ అవసరాలను ఆయన వైపు లేపుతారు.
- ఒక ముస్లిం అల్లాహ్ యొక్క గుణాలను సృష్టికర్తల గుణాలకు పోల్చడం అనుమతించబడదు. అల్లాహ్ అత్యున్నతుడు, మరెవ్వరికీ పోల్చలేని గొప్పవాడు.
{ఆయనను పోలినదేదీ లేదు మరియు ఆయన సర్వం వినేవాడూ, సర్వం చూసేవాడూను}.
- ముస్లిం అల్లాహ్‌ను ఆయన ఉత్తమ నామాలతో పిలవడం తగినది. ఉదాహరణకు: "యా గఫూర్, నా పాపాన్ని క్షమించు!" "యా రహ్మాన్, నాపై కరుణ చూపు!" "యా అలీమ్, నాకు జ్ఞానం అనుగ్రహించు!" ఇదే విధంగా, అల్లాహ్ యొక్క నామాలను ఉపయోగించి ప్రార్థన చేయవచ్చు.
ప్రశ్నలు:
ప్రశ్న 1: అల్లాహ్ యొక్క నామాలు మరియు గుణాలను ఎక్కడి నుండి తెలుసుకుంటారు?
ప్రశ్న 2: మీకు తెలిసిన అల్లాహ్ యొక్క నామాలను తెలిచేయండి.
ప్రశ్న 3: మీకు తెలిసిన అల్లాహ్ యొక్క గుణాలను పేర్కొనండి.
ప్రశ్న 4: సృష్టిని సృష్టికర్తతో పోల్చడం సమ్మతమేనా? దానికిఆధారం ఏమిటి?
ప్రశ్న 5: మనం అల్లాహ్‌ను వేటి ద్వారా ప్రార్థించాలి?
ఏడవ పాఠం
సృష్టి వైపు అల్లాహ్ ప్రవక్తలు
ప్రవక్తలు: అల్లాహ్ తన ధర్మాన్ని ప్రజలకు తెలియజేయడానికి మరియు ఆయన్ను ఒంటరిగానే ఆరాధించమని పిలవడానికి, ఇతరుల ఆరాధనను విడిచిపెట్టమని ఉపదేశించడానికి అల్లాహ్ పంపిన వారే ప్రవక్తలు.
ప్రవక్తలను పంపించటంలో ఉన్న విజ్ఞత:
అల్లాహ్ వారిని దాసులపై సాక్ష్యంగా పంపాడు. వారు ప్రజలకు ధర్మాన్ని చేపవేయటానికి, విధేయులను స్వర్గం మరియు గొప్ప ప్రతిఫలం యొక్క శుభవార్త ఇవ్వటానికి, అలాగే అవిధేయులకు నరకం మరియు తీవ్ర శిక్ష నుండి హెచ్చరించటానికి పంపించాడు.
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:
ప్రవక్తలలో మొదటివారు మరియు వారిలో చివరివారు:
"వారిలో మొదటివారు నూహ్, చివరివారు ముహమ్మద్ అలైహిముస్సలాతు వస్సలాం.
పాఠ్య సూచనలు:
- "అల్లాహ్ ప్రతి సమాజం వైపు ఒక ప్రవక్తను పంపించాడు, చివరగా అల్లాహ్ మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి దైవదౌత్యముతో ప్రవక్తల పరంపరను ముగించాడు. కాబట్టి, ఆయన సమస్త మనుషులకూ మరియు జిన్నులకూ ప్రళయం సంభవించే వరకు అల్లాహ్ ప్రవక్తగా ఉంటారు."
"ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సందేశంలో మూడు ముఖ్యమైన విషయాలు ఉంటాయి:"
1- ప్రజలకు వారి ప్రభువు, ఆయన నామములు మరియు లక్షణాలను పరిచయం చేయడం."
2- అల్లాహ్ ను ఆరాధించడానికి సరైన విధానమును వివరణ చేయడం.
3- ప్రజలకు వారి కర్మలకు ప్రళయదినం నాడు పొందే ప్రతిఫలాన్ని వివరణ చేయడం.
ప్రశ్నలు:
"ప్రశ్న 1: ప్రవక్తలు అలైహిముస్సలాతు వస్సలాం తమ జాతులను దేని వైపు ఆహ్వానించారు ?
ప్రశ్న2 : కింది ఖాళీలను పూరించండి:
ఎ- ప్రవక్తలలో మొదటివారు ............................. మరియు వారిలో చివరివారు ..........................................
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి సందేశంలో మూడు ముఖ్యమైన విషయాలు ఉంటాయి అవి:
1-. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .. . .
2-. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .. . .
ఎనిమిదో పాఠం
అల్లాహ్ ప్రజలపై మొదట విధిగావించిన విషయం
తెలుసుకోండి ([7]) - అల్లాహ్ నీపై దయచూపుగాక - అల్లాహ్ ఆదమ్ సంతతిపై మొట్ట మొదటిగా విధిగావించిన విషయం: అల్లాహ్‌పై విశ్వాసం కలిగి ఉండటం మరియు తాగూత్ (మిథ్య)ను తిరస్కరించటం. మరియు అల్లాహ్ యొక్క ఈ వాక్కు దీనికి ఆధారం :
తాగూత్ (మిథ్య)ను తిరస్కరించే విధానం: ఈ పత్రిక శీర్షిక: "తాగూత్ యొక్క అర్ధం మరియు దాని ముఖ్య రకాలు".
తాగూత్ను తిరస్కరించే విధానం: అంటే అల్లాహ్ తప్ప మరొకరి ఆరాధన అబద్ధమైనదని విశ్వసించడం, దానిని పూర్తిగా వదిలేయడం, మరియు దాని పట్ల ద్వేషం కలిగి ఉండటం.
పాఠ్య సూచనలు:
తాగూత్ ను తిరస్కరిస్తే తప్ప దాసుని కొరకు విశ్వాసం స్థాపితమవదు, కాబట్టి, అల్లాహ్ ఆరాధనను ఆదేశించడంను తాగూత్ను దూరంగా ఉంచడం అనే ఆదేశంతో అనుసంధానించాడు. కాబట్టి ఆయన ఇలా సెలవిచ్చాడు :
{[ప్రజలారా ] కేవలం అల్లాహ్'ను ఆరాధించండి మరియు తాగూత్(మిథ్యాదైవాలు) కు దూరంగా ఉండండి}.
తాగూత్ను తిరస్కరించడం అనేక విషయాల ద్వారా స్థాపితమవుతుంది, వాటిలో:
1 - అల్లాహేతరులను ఆరాధించడం చెల్లదని విశ్వసించడం అది ఏ దైవదూత అయినా లేదా ప్రవక్త అయినా సరే.
2- అల్లాహేతరుల ఆరాధన నుండి దూరంగా ఉండటం; కాబట్టి, అల్లాహ్‌ను మాత్రమే ప్రార్థించాలి, అల్లాహ్‌పైనే భరోసా పెట్టాలి, అల్లాహ్ కొరకే బలిదానం చేయాలి, అల్లాహ్‌కే మొక్కుకోవాలి.
3- షిర్క్‌ను ద్వేషించడం మరియు ముష్రికులలో నుంచి ముస్లింలకు శత్రువులైన వారిని ద్వేషించడం.
4- అల్లాహ్ తోపాటు ఇతర దేవతలను భాగస్వామ్యం చేసే వారు కాఫిర్లు అని నమ్మడం.
- ప్రేమ మరియు ద్వేషం ధర్మంలో భాగం. కాబట్టి, ముస్లిం పై తౌహీద్ మరియు విధేయతలను ప్రేమించడం, షిర్క్ మరియు పాపాలను ద్వేషించడం అనివార్యం.
ప్రశ్నలు:
ప్రశ్న 1: అల్లాహ్ ఆదమ్ సంతానంపై మొదటగా విధించినది ఏమిటి? ఆధారముతో పేర్కొనండి.
ప్రశ్న2: తాగూత్ను తిరస్కరించడం ఎలా స్థాపితమవుతుంది?
ప్రశ్న 3: తాగూత్ను తిరస్కరించడం యొక్క లక్షణం ఏమిటి?
ప్రశ్న4: అల్లాహేతరులను ఆరాధించినవాని గురించి ఆదేశం ఏమిటి?
తొమ్మిదో పాఠం
నిజమైన విశ్వాసం
అల్లాహ్ పట్ల విశ్వాసం యొక్క అర్ధం:
ఇది: అల్లాహ్ ఒక్కడే ఆరాధనకు అర్హుడు అని నమ్మడం, అన్ని రకాల ఆరాధనలను పూర్తిగా అల్లాహ్ కోసం ప్రత్యేకించడం, మరియు అల్లాహ్‌ను తప్ప మరొకరి ఆరాధనలను నిరాకరించడం. అలాగే, అల్లాహ్ కోసం ప్రేమించడం, అల్లాహ్ కోసం ద్వేషించడం.
ఇది ఇబ్రాహీం అలైహిస్సలాం ధర్మం, దీనిని తిరస్కరించినవాడు తనను తాను మూర్ఖుడిగా చేసుకున్నవాడవుతాడు. ఇదే అల్లాహ్ తన ఈ వాక్యంలో ప్రస్తావించిన ఆదర్శం:
పాఠ్య సూచనలు:
1- విశ్వాసం మనిషి తన నాలుకతో పలికే మాట మాత్రమే కాదు, అది మాట, నమ్మకం మరియు ఆచరణ. మిల్లత్ అంటే ధర్మం, మరియు ఇబ్రాహీం అలైహిస్సలం మిల్లత్ అంటే తౌహీద్ ధర్మం.
నిజమైన విశ్వాసం అది:
- అల్లాహ్ ఏకైకుడు, ఆయనకు ఎవరూ భాగస్వాములు లేరూ, మరియు ఆయన మాత్రమే ఆరాధనకు అర్హుడు, ఆయన తప్ప మరెవ్వరూ ఆరాధనకు అర్హుడు లేరు అని విశ్వసించడం.
- మహోన్నతుడైన అల్లాహ్ కొరకు ఆరాధనను ప్రత్యేకించడం.
- విశ్వాసులను ప్రేమించాలి మరియు వారికి సహాయపడాలి.
- ముస్లింలకు శత్రువులైన అవిశ్వాసులను ద్వేషించాలి, కానీ వారికి అన్యాయం చేయకూడదు.
3- ఈ ధర్మాన్ని వదిలి, ఇబ్రాహీం అలైహిస్సలాం నుండి ముఖం తిప్పినవాడు తనను తానే అవమానించుకున్నవాడవుతాడు మరియు తన నాశనానికి, అపాయానికి కారణమవుతాడు. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
ప్రశ్నలు:
ప్రశ్న1: ఇబ్రాహీం అలైహిస్సలాం ప్రవక్తల తండ్రి. అల్లాహ్ ఆయనను ఆయన జాతివారి వద్దకు పంపి, వాళ్లను కేవలం అల్లాహ్‌ను మాత్రమే ఆరాధించమని పిలిచాడు. అయితే, వారు అల్లాహ్‌ను విడిచిపెట్టి విగ్రహారాధన చేస్తూ ఉన్నారు. అందువల్ల, ఇబ్రాహీం అలైహిస్సలాం వారిని కేవలం అల్లాహ్‌ను మాత్రమే ఆరాధించమని పిలిచారు. కానీ వారు అహంకారంతో నిరాకరించారు, విగ్రహారాధనను వదలకుండా పట్టుబట్టారు. అప్పుడు వారు తమ పండుగను జరుపుకోవడానికి బయలుదేరినప్పుడు, ఇబ్రాహీం అలైహిస్సలాం వారి విగ్రహాలను ధ్వంసం చేశారు. దీనిని తెలుసుకున్న వారు ఒక భారీ అగ్నిని రగిలించి, ఆయనను అందులో వేశారు. మీకు తెలుసా, ఇబ్రాహీం అలైహిస్సలాం కు ఏమైంది? ఆ అగ్ని ఆయనను కాల్చలేదు, అల్లాహ్ దాన్ని ఆయన కోసం చల్లగా మరియు సురక్షితంగా మార్చాడు.
ప్రశ్న1: ఇబ్రాహీం అలైహిస్సలాం గాధలో విశ్వాసం (ఇమాన్) యొక్క కొన్ని అర్థాలు ఉన్నాయి వాటిని వెలికితీయండి
ప్రశ్న2: నిజమైన ఇమాన్ (విశ్వాసం) వేటి ద్వారా పరిపూర్ణమవుతుంది?
ప్రశ్న3: ఇబ్రాహీం అలైహిస్సలాం ధర్మాన్ని వదిలేసినవాడు ఏమని పిలువబడతాడు?
ప్రశ్న: ఇబ్రాహీం అలైహిస్సలాం ధర్మాన్ని వదిలేసినవారు తమపై ఏమి నష్టాన్ని తెచ్చుకుంటారు?
ప్రశ్న: క్రింది పరిస్థితుల్లో ఈమాన్ సాధ్యమవుతుందా?
ఎ- ఒక వ్యక్తి నమాజు చదువుతున్నాడు, కానీ అతను సజ్జనులను ద్వేషిస్తున్నాడు.
బి- ఒక వ్యక్తి లా ఇలాహ ఇల్లల్లాహ్ అని సాక్ష్యమిస్తున్నాడు, కానీ అతను కాఫిరులను ప్రేమిస్తున్నాడు.
సి- ఒక వ్యక్తి అల్లాహ్ ఒక్కడినే ఆరాధిస్తున్నాడు మరియు విశ్వాసులను ప్రేమిస్తున్నాడు.
పదవ పాఠం
షైతాన్ అనేవాడు ప్రధాన తాగూత్
తాగూత్:
తాగూత్ అన్నది సామాన్య పదం; కాబట్టి, అల్లాహ్ తప్ప వేరెవరైనా పూజించబడితే మరియు ఆ పూజను స్వీకరించిన ఏదైనా ఆరాధ్యుడు, అనుసరించబడే వ్యక్తి లేదా అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కు విధేయతలో కాకుండా ఇతరులుకు విధేయత చూపిన ఏదైనా వ్యక్తి తాగూత్ అని పిలవబడతాడు.
తాగూత్ లు చాలా ఉన్నాయి. వాటిలో నుంచి:
మొదటి (తాగూత్): అల్లాహేతరుల ఆరాధన వైపు పిలిచే షైతాను. మరియు దానికి అల్లాహ్ యొక్క ఈ వాక్కు ఆధారం:
పాఠ్య సూచనలు:
1- తుగ్యాన్ అంటే హద్దు దాటిపోవడం. తాగూత్ అంటే: తన హద్దును దాటి, తాను ప్రజల కోసం దేవుడునని చెప్పుకున్నవాడు లేదా తనకు అగోచర విషయాల జ్ఞానం తెలుసు అని చెప్పేవాడు లేదా తాను సృష్టిని నియంత్రిస్తానని అనేవాడు లేదా ప్రజలను తమ ప్రభువు షరీయత్ను వదిలి ఇతరుల మార్గం వైపు పిలిచేవాడు.
2- ప్రజలు ఎవరినైనా ఆరాధిస్తే తనను వారు ఆరాధించటం అతనికి ఇష్టం లేకపోతే అతనిని తాగూత్ అని పిలవరు. ఉదాహరణకు దైవదూతలు,ఈసా బిన్ మర్యమ్ అలైహిస్సలాం.
3- షైతాను అన్ని తాగూతులలో ప్రధానుడు. ఎందుకంటే: అతను ప్రజలను వారి ప్రభువైన అల్లాహ్ ఆరాధన నుండి దారి మళ్లిస్తాడు. షిర్క్ మరియు కుఫ్ర్ను అందంగా చూపించి వారిని మోసగిస్తాడు.
4- షైతాను ఆదం సంతతికి తీవ్రమైన శత్రువు. ఎందుకంటే: అతను వారి తండ్రిని (ఆదం అలైహిస్సలాం) స్వర్గం నుండి బయటకు తీశాడు. మరియు ఆయన వర్గమును నరకవాసులుగా మారటానికి ఆహ్వానిస్తాడు.
5- సిరాతుల్ ముస్తఖీమ్: అంటే అల్లాహ్ ఒక్కడి ఆరాధన చేయడం మరియు షైతాను ఆరాధనను విడనాడటం.
ప్రశ్నలు:
ప్రశ్న1: తాగూత్ ను నిర్వచించండి.
ప్రశ్న2: ఇబ్లీసు పెద్ద తాగూత్ ఎందుకయ్యాడు?
ప్రశ్న3: సిరాతుల్ ముస్తఖీమ్ అంటే ఏమిటి?
ప్రశ్న4: అల్లాహ్ ఈ ఆయత్లో దేనిని నిషేధించాడు? మరియు ఏమి ఆదేశించాడు?
పదకొండవ పాఠం
అల్లాహ్ అవతరింపచేసిన దానికి విరుద్ధంగా తీర్పు చెప్పడం
రెండవది: అల్లాహ్ ఆదేశాలను మార్చిన పాలకుడు. మరియు ఆధారం అల్లాహ్ యొక్క వాక్యం:
పాఠ్య సూచనలు:
1- అల్లాహ్ షరీయతును మార్చి, ఆయన ఆదేశాలను మారుస్తూ, హరామును హలాలుగా మరియు హలాలును హరాముగా చేసినవాడు తాగూత్ అవుతాడు, అది పాలకుడైనా లేదా వేరేవారైనా ఒక్కటే.
2- అల్లాహ్ షరీయతుకన్నా తన విధానం ఉత్తమమైనదని విశ్వసించి, అల్లాహ్ షరీయతుకి విరుద్ధంగా తీర్పు ఇచ్చినవాడు తాగూత్ అవుతాడు మరియు ఇస్లాం ధర్మం నుండి వైదొలుగుతాడు.
3- ముస్లింల లక్షణం ఏమిటంటే, అతను తన ప్రభువు విధించిన హద్దుల్లోనే నిలిచి, అల్లాహ్ అవతరింపజేసిన దాని ప్రకారం తీర్పునివ్వాలి. అలాగే, అల్లాహ్ షరీయతులో ఏ విధమైన మార్పు లేదా వక్రీకరణ ద్వారా విముఖత చూపకూడదు.
ప్రశ్నలు:
ప్రశ్న1: అల్లాహ్ యొక్క ఆదేశాలను మార్చిన వానిని ఏమని పిలుస్తారు?
ప్రశ్న2 : అల్లాహ్ అవతరణ చేసిన షరీఅత్ కంటే తన తీర్పు ఉత్తమం అని నమ్మి, అల్లాహ్ అవతరణ చేసినదానిని తప్పించి తీర్పునిచ్చే వారిని ఏమని పిలుస్తారు?
పన్నెండవ పాఠం
ఎవరైతే అగోచర జ్ఞానాన్ని కలిగి ఉన్నానని దావా చేస్తాడో లేదా ప్రజలు తనను ఆరాదన చేయడాన్ని ఇష్టపడుతాడో అతను "తాగూత్" అవుతాడు.
మూడవది : ఎవరైతే అల్లాహ్ కే కాకుండా తనకు అగోచర జ్ఞానం ఉన్నదని దావా చేస్తాడో తాగూత్ అవుతాడు. మరియు దీని ఆధారం అల్లాహ్ యొక్క వాక్యం:
మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
నాల్గవది: అల్లాహ్ కి బదులుగా పూజింపబడి, ఆరాధనతో తృప్తి చెందేవాడు. మరియు దానికి అల్లాహ్ యొక్క ఈ వాక్కు ఆధారం:
పాఠ్య సూచనలు:
1- గాయిబ్ (అగోచర జ్ఞానం) గురించి తనంతట తానే తెలిసినట్టు చెప్పుకునే వ్యక్తి, ఉదాహరణకు కాహిన్ (భవిష్యవక్త), అర్రాఫ్ (జోస్యుడు), మునజ్జిమ్ (జ్యోతిష్కుడు) మరియు వీరి తరహా వ్యక్తులు, వీరందరూ తాగూత్ అనే విభాగంలోకి వస్తారు. ఎందుకంటే, వారు గాయిబ్ జ్ఞానం అల్లాహ్ హక్కు మాత్రమే అయినా, దానిపై అధికారం కలిగి ఉన్నట్టు పేర్కొనడం వల్ల అల్లాహ్ హక్కును ఉల్లంఘిస్తున్నారు. అల్లాహ్ తప్ప ఎవరూ అగోచర జ్ఞానం గురించి తెలియజేయలేరు.
2- ఒక ముస్లిం పై అనివార్యం అవుతుంది ఏమిటంటే అతడు కుహ్హాన్ (గతంలో జరిగిన అగోచర విషయాలను తెలుసునని వాదించువాడు) ల వద్దకు,అర్రాఫ్ (భవిష్యత్తు విషయాలను తెలుసునని వాదించువాడు) ల వద్దకు, మునజ్జిమ్ (నక్షత్రాలను పరిశీలించడం ద్వారా బ్రహ్మాండంలోని పరిస్థితులను తెలుసునని వాదించువాడు) ల వద్దకు వెళ్ళటం నుండి జాగ్రత్తపడాలి మరియు
వారి ఊహాగానాలను మరియు అబద్ధాలను నమ్మకూడదు.
3- తాగూతులలో కొందరు అటువంటి వారు కూడా ఉన్నారు, ఎవరినైతే ప్రజలు అర్ధిస్తారో మరియు అల్లాహ్ మాత్రమే తొలగించే శక్తి గల కష్టాలను తొలగించమని సహాయం కోరుతారు, అలాగే వారు తనకు చేయబడుతున్న ఆరాధనను సంతోషంగా అంగీకరిస్తారు. కాహిన్: గతంలో జరిగిన అగోచర విషయాలను తెలుసునని వాదిస్తాడు. అర్రాఫ్: భవిష్యత్తు విషయాలను తెలుసునని వాదిస్తాడు. మునజ్జిమ్: నక్షత్రాలను పరిశీలించడం ద్వారా బ్రహ్మాండంలోని పరిస్థితులను తెలుసునని వాదిస్తాడు.
ప్రశ్నలు:
ప్రశ్న 1: అగోచర జ్ఞానం ఎవరివద్ద ఉంది? దీనిపై ధృవీకరణ ఆధారమును పేర్కొనండి.
ప్రశ్న 2: మూడవ మరియు నాలుగవ తాగూత్‌లు ఏమిటి?
ప్రశ్న 3: "నేను అల్లాహ్ కాకుండా ఇంకొక దేవుడిని" అని చెప్పే వ్యక్తికి శిక్ష ఏమిటి?
ప్రశ్న 4: అల్లాహ్ కు తప్ప మరెవరికైనా అగోచర జ్ఞానం తెలుసునా?
ప్రశ్న 5: పవిత్ర ఆయత్లో పేర్కొనబడిన జుల్మ్ చేసే వారు (అత్యాచారులు) ఎవరు?
పదమూడవ పాఠం
ఒక నిజమైన విశ్వాసపరుడు తప్పనిసరిగా తాగూత్ను తిరస్కరించాలి
మానవుడు తాగూత్ను తిరస్కరించకుండా అల్లాహ్‌పై విశ్వాసి (మోమిన్) కాలేడు అని తెలుసుకోండి. మహోన్నతుడైన అల్లాహ్ యొక్క ఈ వాక్కు దీనికి ఆధారం:
అర్రుష్ద్: మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ధర్మము (ఇస్లాం). అల్-గయ్యు: అబూ జహ్ల్ యొక్క మతము (కుఫ్ర్ మరియు షిర్క్).
అల్ ఉర్వతుల్ వుస్ఖా (దృఢమయిన ఆధారము):
"లా ఇలాహా ఇల్లల్లాహ్" అని సాక్ష్యం పలకటం, ఇది నిరాకరణ మరియు స్థాపనను కలిగి ఉంటుంది. ఇది అల్లాహ్ తప్ప ఇతరులందరి పూజను పూర్తిగా తిరస్కరించడం. మరియు అల్లాహ్ ఒక్కడికే, ఆయనకు ఎటువంటి సాటి లేనివిధంగా, అన్ని రకాలైన ఆరాధనలను ప్రతిష్ఠించటం.
పాఠ్య సూచనలు:
1-తౌహీద్‌ను సంపూర్ణంగా స్థాపించడంలో అత్యంత ముఖ్యమైన విషయం అల్లాహ్ ఒక్కడికే ఆరాధనను ప్రత్యేకించటం.
2- తాగూత్ను తిరస్కరించకుండా మరియు దాన్ని పూజించిన వారిని త్యజించకుండా అల్లాహ్‌పై ఇమాన్ (విశ్వాసం) సంపూర్ణంగా పొందలేడు, తాగూత్ను తిరస్కరించకుండా మరియు దాన్ని పూజించిన వారిని త్యజించకుండా. కావున, ముందుగా తాగూత్ను తిరస్కరించడం తప్పనిసరి. పరిశుద్ధుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
{కనుక ఎవడయితే అల్లాహ్ తప్ప వేరితర ఆరాధ్యుల (తాగూత్)ను తిరస్కరించి, అల్లాహ్ ను మాత్రమే విశ్వసిస్తాడో (అతను దృఢమయిన ఆధారాన్ని పట్టుకున్నాడు).} "(తాగూత్ అర్థం మరియు దాని ప్రధాన రకాలు)" పత్రిక ముగిసింది.
3- అల్-ఊర్వతుల్ వుస్ఖా అంటే "లా ఇలాహా ఇల్లల్లాహ్" అని సాక్ష్యం పలకటం. ఎవరైతే దానిని దృఢంగా పట్టుకుంటాడో, అతడు విజయం సాధించి, నిరాశ, తప్పుడు మార్గం మరియు నష్టము నుండి రక్షించబడతాడు.
ప్రశ్నలు:
ప్రశ్న 1: ఖాళీలను అనువైన పదాలతో పూర్తి చేయండి :
ఎ)అల్-ఊర్వతుల్ వుస్ఖా (దృఢమైన బంధం)ను పట్టుకునే వ్యక్తి...............ను తిరస్కరించినవాడిగా ఉండాలి మరియు ..............పై విశ్వాసం ఉంచినవాడిగా ఉండాలి.
"లా ఇలాహా ఇల్లల్లాహ్" అనే సాక్ష్యం లో ............... మరియు ....................... ఇమిడి ఉన్నది.
ప్రశ్న 2: అల్-ఊర్వతుల్ వుథ్కా (దృఢమైన బంధం)ను పట్టుకున్నవానికి ఏమి ఫలితం?
ప్రశ్న 3: తాగూత్ను తిరస్కరించడం (కుఫ్ర్ బిత్-తాగూత్) తప్పనిసరినా? ఎందుకు?
శీర్షిక: పాఠ్యాంశాలు, ఫిఖా జ్ఞానం (ధర్మశాస్త్ర జ్ఞానం), విభాగము (నాలుగు).
సంక్షిప్త సారాంశము: ఈ ధర్మశాస్త్రం సౌదీ అరేబియా రాజ్యంలో విద్యార్థులకు ఉద్దేశించిన పాఠ్యప్రణాళిక యొక్క శుద్ధీకరణ మరియు సంక్షిప్తీకరణగా పరిగణించబడుతుంది మరియు ఇది అనేక స్థాయిలుగా విభజించబడింది. ఈ అంశంలో ఫిఖా జ్ఞానం (ధర్మశాస్త్ర జ్ఞానం) పాఠ్యాంశములకు సంబంధించి విషయాలు ఉంటాయి.మరియు ఇది పన్నెండు (12) విభాగములుగా విభజించబడ్డాయి. నాల్గవ విభాగములో చేర్చబడిన ముఖ్యమైన అంశాలలో, సమస్యలలో ఈ క్రిందివి ఉన్నాయి:
పరిశుద్ధత,దాని విశిష్టత గురించి వివరణ మరియు వుజూ యొక్క షరతులు, దాని ఫరాయిజులు, సున్నతులు మరియు దానిని భంగం చేసే విషయాల వివరణ.
అజాన్ మరియు ఇఖామత్ యొక్క విధానం వివరణ.
నమాజు సరైనదిగా కావాలంటే అనివార్యమైన షరతుల వివరణ.
విధి నమాజుల సమయాలు, వాటి రుకున్ లు మరియు వాటి వాజిబాతుల వివరణ.
సరళమైన మరియు సులభమైన శైలిలో సూరతుల్ ఫాతిహా యొక్క తఫ్సీర్ (వ్యాఖ్యానం) చేయడం.
నాల్గవ విభాగము
తొలి పలుకులు
సర్వ స్తోత్రాలు ఆ అల్లాహ్ కొరకే ఎవరైతే కలం ద్వారా నేర్పాడు, ఆయనే మానవుడికి తెలియని విషయాలను భోదించాడు. అలాగే గౌరవ ప్రవక్తపై శుభాలు మరియు శాంతి కలుగుగాక, ఆయన తన పై అవతరింపబడిన వాటిని చేరవేశారు మరియు తన ఉమ్మతుకు ధర్మ ఆదేశాలను మరియు వారి ఇహలోక మరియు పరలోక విషయాలలో అవసరమైన సమస్త విషయాలను స్పష్టపరిచారు. దాని తరువాత:
ఆయన అలైహిస్సలాతు వస్సలాం ఇలా తెలియచేశారు:
అందుకనే విద్యా మరియు బోధనా మంత్రిత్వ శాఖ తమ స్థాపన నుండీ అన్ని విద్యాసంస్థ స్థాయిల్లో ఫిఖ్ బోధనను ప్రవేశపెట్టింది. ఇది తమ బాధ్యతను భావించి, షరయీ ఆదేశాలను తెలుసుకోవలసిన గొప్ప అవసరాన్ని గ్రహించి చేసిన నిర్ణయమైంది. ఎందుకంటే, ఈ ధర్మాన్ని అర్థం చేసుకోవడం దాని ఆదేశాలను తెలుసుకోవడం మరియు అవగాహనతోనే సంబంధించబడింది. అలాగే, ముస్లిం తన ప్రభువును స్పష్టమైన జ్ఞానంతో ఆరాధించటానికి దీని అత్యవసరత ఉంది.
మేము ఉపాధ్యాయుడికి కొన్ని విషయాలను గుర్తు చేయదలిచాము, ఇవి షరయీ జ్ఞానాన్ని బోధించే తమ బాధ్యతను నిర్వర్తించటంలో మరియు విద్యార్ధులకు తమ వివరణను సులభంగా అర్థం చేసుకునేలా చేయటంలో సహాయపడతాయి. వాటిలో:
1- షరియత్ విజ్ఞానం (ధార్మిక జ్ఞానం) ధర్మము అని గుర్తుంచుకోవడం, మరియు విద్యార్థులకు దీన్ని బోధించడం ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రచారం చేయమని పిలిచిన సందేశంలో ఒక భాగము. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపారు:
« నా నుండి ఇతరులకు చేరవేయండి, అది ఒక్క వాక్యమైనా సరే» ([2]).
సర్వశక్తిమంతుడైన అల్లాహ్ తన కొరకు చిత్తశుద్ధితో చేసి ఉంటే తప్ప అంగీకరించని ఆరాధన కూడా అది.
2- అల్లాహ్ తో సహాయం కోరడం, అధికంగా జిక్ర్ చేయడం, దుఆ చేయడం మరియు ఇస్తిగ్ఫార్ చేయడం, అలాగే ఉపాధ్యాయుడిపై జ్ఞానానికి సంబంధించిన మార్గదర్శకత, ఆచరణ, అతని మాటల్లో, రూపంలో మరియు ప్రవర్తనలో ప్రదర్శించబడాలి.
3- విద్య యొక్క సాధారణ లక్ష్యాలు, ప్రతి దశలోని లక్ష్యాలు, మరియు విద్యార్థి అభ్యసిస్తున్న విషయానికి సంబంధించిన లక్ష్యాలను గ్రహించడం; ఎందుకంటే ఇది ఉపాధ్యాయుడికి ఆ పాఠాన్ని ఆ లక్ష్యాలకు అనుసంధానించడం, తగిన విషయం మరియు శైలిని ఎంపిక చేయడం, మరియు ఆ లక్ష్యాల ప్రకారం విద్యార్థిని అంచనా వేసే సామర్థ్యాన్ని అందిస్తుంది. దీన్ని బుఖారీ కితాబు 'అహాదీసుల్-అన్బియా' లో, మా జుకిర అన్ బనీ ఇస్రాయీల్' అనే అధ్యాయంలో హదీసు సంఖ్య (3461)లో ఉల్లేఖించారు.
4- విభిన్న బోధనా పద్ధతులను ఉపయోగించడం మరియు ప్రతి పాఠానికి తగిన పద్ధతిని ఎంచుకోవడం.
5- పాఠ్య విషయాన్ని వివరించేముందు సంబంధిత శాస్త్రీయ మూలాలను పునః పరిశీలించడం.
మరియు మేము అల్లాహ్ ను ఈ పనిని పూర్తిగా ఆయన కోసమే చేయమని మరియు దాని నుండి ప్రయోజనం పొందాలని అర్ధిస్తున్నాము. మరియు మన ప్రవక్త ముహమ్మద్ మరియు ఆయన కుటుంబం మరియు సహచరులపై అల్లాహ్ ఆశీర్వాదాలు మరియు శాంతిని కురిపించాలని మేము కోరుతున్నాము.
మొదటి పాఠం ([3])
వుజూ
పరిశుద్ధత మరియు దాని గొప్పతనం:
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు: ఉపాధ్యాయుని కొరకు : - ఉపాధ్యాయుడు వుజూ యొక్క ప్రాముఖ్యత మరియు దాని గొప్పతనాన్ని వివరించటానికి పేర్కొనబడిన రెండు ఆధారాలను వివరించాలి. - వుజూ మరియు ఇతర విషయాల్లో హద్దు మించి వ్యర్థంగా నీటిని ఉపయోగించడం నిషిద్ధం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు : "ఈ ఉమ్మత్‌లో కొందరు తహారత్ (పరిశుద్ధత) మరియు దుఆలో హద్దు మీరినవారు ఉంటారు." దీన్ని అబూ దావూద్ హదీసు సంఖ్య (96) లో ఉల్లేఖించారు. అందుకే ప్రవక్త (అలైహిస్సలాతు వస్సలాం) యొక్క మార్గదర్శకతలో వుజూ కోసం ముద్ తో (కొలత పరిమాణం) నీటిని ఉపయోగించటం ఉన్నది. - తహారత్ యొక్క ధర్మబద్ధత పరిశుభ్రత పట్ల ఇస్లాం యొక్క శ్రద్ధకు స్పష్టమైన ఆధారం. - బాహ్య తహారత్ పట్ల ఇస్లాం యొక్క శ్రద్ధ పాపాలు, ద్వేషం, అసూయ మరియు గుండె యొక్క ఇతర వ్యాధుల నుండి అంతర్గత తహారత్ పట్ల శ్రద్ధ ప్రాముఖ్యతను సూచిస్తుంది.
{నిశ్చయంగా అల్లాహ్ పశ్చాత్తాపపడేవారిని, పారిశుద్ధ్యాన్ని అవలంభించేవారిని ఇష్టపడతాడు.}
మరియు (ఆయన) సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:
“నేను ఒక విషయం వైపునకు మార్గదర్శనం చేయనా – దాని ద్వారా అల్లాహ్ (తన దాసుల) పాపాలను తుడిచి వేస్తాడు, మరియు (స్వర్గములో) వారి స్థానాలను ఉన్నతం చేస్తాడు?*”. దానికి సహాబాలందరూ “తప్పనిసరిగా ఓ రసూలుల్లాహ్!” అన్నారు. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “అనుకూలంగా లేని పరిస్థితులలోనూ పరిపూర్ణంగా వుజూను ఆచరించుట; కాలి నడకన మస్జిదునకు వెళ్ళుట (ప్రతిరోజూ ఐదు నమాజులను మస్జిదులో ఆచరించుట); ఒక నమాజు తరువాత మరొక నమాజు కొరకు వేచి చూచుట ([5]).
ముస్లింకు తహారత్ (పరిశుద్ధత) రెండు మార్గాల ద్వారా లభిస్తుంది:
1- వుజూ . 2- మాలీన్యములను తొలగించటం.
వుజూ చేయడం కొరకు అవసరమైన విషయాలు:
ముస్లింకు కింది పనుల్లో ఏదైనా చేయాలనుకుంటే వుజూ చేయడం తప్పనిసరి: 'మకారిహ్' అనగా 'మక్రూహ్' (అసహ్యకరమైన విషయం) యొక్క బహువచనం, ఇది మనిషికి అసహ్యంగా అనిపించే మరియు కష్టంగా భావించే విషయాలను సూచిస్తుంది, ఉదాహరణకు తీవ్రమైన చలిలో వుజూ చేయడం.
(నమాజు - ఖుర్ఆన్ ముట్టుకోవటం - తవాఫ్) దీనిని ముస్లిం 'కితాబుత్ తహారత్' లోని ' ఫజ్లు ఇస్బాగిల్ వజూయి అలల్ మకారిహి అనే అధ్యాయంలో (1/219), హదీస్ నంబర్ (251) లో ఉల్లేఖించారు.
వుజూలో అనివార్య విషయాలు:
వుజూకు ఒక అనివార్యమైన (వాజిబ్) అంశం ఉంది, అదే 'తస్మియా' అంటే "బిస్మిల్లాహ్" అని పలకడం.
- తస్మియా (బిస్మిల్లాహ్ పలకడం) వుజూ ప్రారంభంలో చేయాలి.
ఎవరైన తస్మియా చేయడం మరిచిపోయినా లేదా వుజూ మధ్యలో గుర్తించినా, వారు "బిస్మిల్లాహ్" అని పలికి తన వుజూను కొనసాగించాలి.
ఎవరైన తస్మియా చేయడం మరిచిపోయి వుజూ ముగించిన తరువాత గుర్తించిన, అతని వుజూ చెల్లుబాటు అవుతుంది మరియు అతనిపై ఏమీ లేదు.
ప్రశ్నలు:
ప్ర1: వుజూ విధానమును తెలపండి.
ప్ర2: ఈ క్రింది వాటిలో తప్పులను సరిచేయటంతో పాటు ఒప్పును (✔) తో లేదా తప్పును (✖) తో సమాధానమివ్వండి:
ఎ- ముస్లిం నమాజు చేయాలనుకుంటే అతనిపై వుజూ చేయడం తప్పనిసరి అవుతుంది.
బి- ముస్లిం ఖుర్ఆన్ కంఠస్తం కొరకు (చదవాలనుకుంటే) వుజూ చేయటం అతనిపై అనివార్యమవుతుంది.
సి- ముస్లిం కాబా తవాఫ్ చేయదలచుకుంటే అతనిపై వుజూ చేయడం తప్పనిసరి అవుతుంది.
డి- ఎవరైన తస్మియా చేయడం మరిచిపోయి వుజూ ముగించిన తరువాత గుర్తించినా, వారు తన వుజూను పునరావృతం చేయటం తప్పనిసరి అవుతుంది.
ఇ- తస్మియా చేసే స్థానం: వుజూ ప్రారంభంలో.
ప్ర3: సరైన సమాధానాన్ని సర్కిల్ చేయండి:
ఎ- వుజూ ని పూర్తిగా చేయడంలో గొప్ప ఘనత ఉంది, అది:
1- అల్లాహ్ దాని ద్వారా పాపాలను మాత్రమే తొలగిస్తాడు. 2- అల్లాహ్ దాని ద్వారా స్థాయిలను మాత్రమే పెంచుతాడు.
3- అల్లాహ్ దాని ద్వారా పాపాలను తొలగించి స్థాయిలను పెంచుతాడు.
బి -వుజూ తప్పనిసరి ఈ విషయాలలో:
1- ఖుర్ఆన్ ముట్టుకునేటప్పుడు.2- తినేటప్పుడు.3- నిదురించేటప్పుడు.
సి - ఎవరైనా బిస్మిల్లాహ్ పలకడం మర్చిపోయి వుజూ మధ్యలో అది గుర్తుకు వస్తే, అతను చేయవలసింది:
1- వుజూ మొదటి నుండి చేయాలి. 2- బిస్మిల్లాహ్ పలికి తన వుజూను కొనసాగించాలి.
3- తన వుజూను కొనసాగించాలి. మరియు బిస్మిల్లాహ్ పలకకూడదు.
రెండవ పాఠం ([6])
వుజూ షరతులు
వుజూ కొరకు కొన్ని షరతులు కలవు. వాటిలో నుంచి :
1- నీయ్యత్ (ఉద్దేశ్యం): అది ఇలా ఉండాలి —వుజూ ద్వారా హదథ్ (అశుద్దత)ను తొలగించాలని ఉద్దేశించడం, లేదా వుజూ ద్వారా నమాజు కొరకు పవిత్రత పొందాలని ఉద్దేశించడం, లేదా ఖుర్ఆన్ పఠనం కొరకు ఉద్దేశించడం, లేదా దీని తరహాలో ఉండే ఇతర విషయాలకు ఉద్దేశించడం.
2- అది పరిశుభ్రమైన నీటితో ఉండటం: నీరు తప్ప వేరే దేనితో వుజూ చేయడం సరైనది కాదు, అలాగే అపరిశుభ్రమైన నీటితో కూడా వుజూ చేయడం సరైనది కాదు.
3- నీరు అనుమతించబడినదై ఉండాలి: నిరోధితమైన నీటితో వుజూ చేయడం సరైనది కాదు, ఉదాహరణకు — దోచుకున్న నీరు లేదా ఈ తరహాలోని ఇతర నీరు.
4- నీరు అవయవానికి చేరడాన్ని అడ్డుకునే వస్తువులను తొలగించడం: ఉదాహరణకు పిండి, మట్టి, రంగులు మరియు ఈ తరహాలోని ఇతర వస్తువులు. ఉపాధ్యాయుని కొరకు : హదథ్: అర్థం: ఇది శరీరాన్ని ప్రభావితం చేస్తుంది , ఇది నమాజు మరియు దాని వంటి ఇతర కార్యాలను నిర్వహించడాన్ని అడ్డుకుంటుంది. దాని కారణం వుజూను భంగ పరిచే విషయాలు, ఇవి తరువాత వివరించబడతాయి.- నియ్యత్: భాషా పరంగా: ఉద్దేశం అని అర్థం. సాధారణంగా ఇది హృదయంలో ఏదైనా విషయమును ఉద్దేశించడం యొక్క అర్ధంలో ప్రత్యేకించబడింది. శాస్త్రీయ పరంగా: హదథ్ (అశుద్ధత)ను తొలగించాలని ఉద్దేశించడం, లేదా పవిత్రత అవసరమైన లేదా సున్నతమైన ఏదైన పవిత్రత ఉద్దేశించడం. ఉదాహరణకు — ఖుర్ఆన్ పఠనం కొరకు వుజూ చేయాలని హృదయపూర్వకంగా ఉద్దేశించి వుజూ చేస్తే (ఇది సున్నత్) ఆ వుజూతో ఫర్జ్ నమాజును చేయడం సరైనది అవుతుంది, ఎందుకంటే ఈ నీయ్యత్ ద్వారా అతని హదథ్ తొలగించబడింది. నియ్యత్ స్థానం: హృదయం. నీయ్యత్ను పలకడం బిద్అతుగా పరిగణించబడుతుంది. - సబీలైన్ను (మూత్ర మరియు మల మార్గాలను) శుభ్రపరచడం వుజూలో భాగం కాదు. ఇది మూత్రం లేదా మలం వెలువడిన వ్యక్తికే అవసరం, అయితే ప్రతి వుజూలో ఇది తప్పనిసరి కాదు. - మూత్ర విసర్జన చేసిన వ్యక్తి ఇస్తిన్జా చేయకుండా బట్టలు వేసుకోవడం కుదరదని, అలా చేసి ఇస్తింన్జా చేయకుండా వుజూ చేసినా అతని వుజూ చెల్లదని ఉపాధ్యాయుడు విద్యార్థులను హెచ్చరించాలి.
5- మూత్రం లేదా మలం వెలువడిన తర్వాత సబీలైన్ను (మూత్ర మరియు మల మార్గాలను) శుభ్రపరచడం.
ప్రశ్నలు:
ప్రశ్న 1: వుజూ షరతులను పేర్కొనండి.
ప్ర2: ఈ క్రింది వాటిలో తప్పులను సరిచేయటంతో పాటు ఒప్పును (✔) తో లేదా తప్పును (✖) తో సమాధానమివ్వండి :
ఎ- అపవిత్రమైన నీటితో వుజూ చేయడం సరైనది కాదు.
బి- దొంగలించబడిన నీటితో వుజూ చేయడం సరైనది కాదు.
సి - దోచుకున్న నీటితో వుజూ చేయడం సరైనది కాదు.
డి- టీ తో వుజూ చేయడం సరైనది కాదు.
ప్రశ్న 3: ఖాళీలను తగిన పదాలతో పూరించండి.
1- నియ్యత్ అంటే ...................................................................... ఉద్దేశించడం, లేదా .................................................................................................. ఉద్దేశించడం.
2- వుజూకు నీరు ఉపయోగించబడటానికి ............................................... మరియు ....................................... ఉండటం షరతు.
3- వుజూకు షరతుల్లో ఒకటి నీరు ............... చేరడాన్ని ................................. తొలగించుట, ఉదాహరణకు ........................ మరియు ................................ మరియు ....................................
మూడవ పాఠం ([7])
వుజూ విధులు
వుజూ కొరకు ఆరు విధులు కలవు అవి:
1- ముఖము కడగటం, మరియు అందులో భాగంగా మజ్మజా అంటే నోటిలో నీటిని తీసుకొని పుక్కిలించడం మరియు ఇస్తింషాఖ్ అంటే శ్వాస ద్వారా నీటిని ముక్కులోకి పీల్చుకోని శుభ్ర పరచటం.
2-మోచేతులతో పాటు రెండు చేతులను కడగటం.
3 - తడి అరచేతులతో తలపై నిమరడం (మసహ్) చేయడం, మరియు రెండు చెవులను శుభ్రం చేసుకోవడం.
4-రెండు కాళ్ళను చీలమండలాలతో పాటు కడగటం.
5- క్రమ పద్దతిలో చేయటం ఉపాధ్యాయుని కొరకు : - ఫురూద్: ఫర్ద్ అనే పదానికి బహువచనం. ఇది వాజిబ్ కంటే ఉన్నతమైనది; ఎందుకంటే ఇది ఉద్దేశపూర్వకంగా అయినా అనుకోకుండా జరిగినా రద్దుకాదు. దీనికి విరుద్ధంగా వాజిబ్ అనుకోకుండా జరిగితే రద్దవుతుంది. - ఉపాధ్యాయుడు విద్యార్ధులను ముఖాన్ని కడగడంలో ముఖావరణాన్ని పూర్తిగా కడగడం అవసరమని హెచ్చరించాలి. ఇది నుదిటి చివరల మొదలు మొఖానికి క్రిందకి ఉన్న దవడల వరకు పొడవునా మరియు ఒక చెవి నుండి మరో చెవి వరకు వెడల్పునా ఉండాలి. కేవలం ముఖం ముందు భాగాన్ని కడగటం సరిపోదు. - మోచేతులతో సహా చేతులను వేళ్ల చివర్ల నుండి ప్రారంభించి మణికట్టులోని మడమ వరకూ కడగాలి, కేవలం అర చేతి మడమ నుండి ప్రారంభించడం సరిపోదు.- తలను మరియు చెవులను తుడవడం: చేతులను నీటితో తడి చేసి, ఆ నీటితో తల ముందు భాగం నుండి వెనుక భాగం వరకు తుడవాలి, ఆపై తిరిగి ముందుభాగానికి ఒకసారి మాత్రమే తుడవాలి. ఆపై అదే నీటితో చెవులను తుడవాలి; చెవి రంధ్రాలను చూపుడు వ్రేలు ద్వారా తుడవాలి మరియు చెవి బయటి భాగాలను అంగుళి వ్రేలు ద్వారా ఒకసారి మాత్రమే తుడవాలి.
6- మువాలాత్ అంటే: ఒక అవయవాన్ని కడగడంలో ఆలస్యం చేయకపోవడం, అలా చేయడం వల్ల ముందుగా కడిగిన అవయవం ఆరిపోకుండా ఉండాలి.
ప్రశ్నలు:
ప్రశ్న 1: వుజూ విధులను పేర్కొనండి.
ప్ర2: ఈ క్రింది వాటిలో తప్పులను సరిచేయటంతో పాటు ఒప్పును (✔) తో లేదా తప్పును (✖) తో సమాధానమివ్వండి:
ఎ- వుజూ విధులలో ఒకటి మజ్మజా (పుక్కిలించడం) మరియు ఇస్తిన్షాఖ్, ఇవి తలను తుడచిన తర్వాత చేయాలి.
బి- నుదురు ముఖంలో భాగం కాదు, కాబట్టి వుజూలో దాన్ని కడగడం అవసరం లేదు.
సి- వుజూ విధులలో ఒకటి తలను తుడవడంతో పాటు చెవులను కూడా తుడవడం.
డి- వుజూలో చీలమండలములను కడగడం అవసరం లేదు.
ఇ- వుజూ విధులలో తలను కడగడం ఒకటి.
ప్ర3: సరైన సమాధానాన్ని సర్కిల్ చేయండి:
ఎ- మువాలాత్ అంటే:
1- వుజూలో అపవ్యయం (నీటిని హద్దుమీరి వాడటం).
2- వుజూలో నెమ్మదిగా చేయడం.
3- ఒక అవయవాన్ని, దానికి ముందు ఉన్న అవయవం ఇంకా తడి ఉండగానే కడగడం.
బి- వుజూలో క్రమవిధానం ఉండాలి:
1- కాళ్లు కడిగిన తర్వాత చేతులు, ఆపై ముఖాన్ని కడగడం.
2- ముఖాన్ని కడిగిన తర్వాత చేతులను మణికట్టుల వరకు కడగడం, ఆపై తలను తుడవడం, ఆపై కాళ్లు కడగడం.
3- ముఖాన్ని కడగడానికి ముందు చేతులను మణికట్టుల వరకు కడగడం ద్వారా ప్రారంభించడం.
నాలుగవ పాఠం ([8])
వజూ యొక్క సున్నత్ లు
వజూ యొక్క సున్నత్ లలో నుంచి:
1- వుజూ ప్రారంభంలో అరచేతులను మూడుసార్లు కడగడం.
2- మిస్వాక్ చేయడం మరియు దాని స్థానం: మజ్మజా సమయంలో.
3- ఉపవాసం చేయని వ్యక్తి మజ్మజా మరియు ఇస్తిన్షాక్లో ముబాలగా (అధికంగా) చేయటం.
4- చేతి వేళ్లలో మరియు కాలి వేళ్లలో ఖిలాల్ చేయడం
5- తయామున్: అంటే కుడి చేతిని ఎడమ చేతికి ముందు కడగడం, మరియు కుడి కాలిని ఎడమ కాలికి ముందు కడగడం.
6- ముఖం, చేతులు మరియు కాళ్లను రెండవ మరియు మూడవసారి కడగడం. ఉపాధ్యాయుని కొరకు : మజ్మజలో అధికం చేయడం అంటే: నోటిలో నీటిని చక్కగా తిప్పడం. - ఇస్తిన్షాఖ్ లో అధికం చేయటం : నీటిని శ్వాస ద్వారా ముక్కు లోపల అంతర్గత భాగాల వరకు చేర్చడం. - వేళ్ల ఖిలాల్ అంటే: తన చేతి వేళ్లను కాలి వేళ్ల మధ్యలో ప్రవేశపెట్టి వాటిని ఖిలాల్ చేయడం, అలాగే చేతి వేళ్లను పరస్పరంగా ప్రవేశపెట్టి ఖిలాల్ చేయడం. - ముఖం, చేతులు మరియు కాళ్లను రెండవ మరియు మూడవసారి కడగడం సున్నత్, అయితే అవి ఒక్కసారి కడగడం మాత్రమే వాజిబ్. అయితే తలను ఒకసారి కంటే ఎక్కువ తుడవడం అనుమతించబడదు.
7- వుజూ పూర్తైన తర్వాత ఇలా పలకటం:
అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వహదహూ లా షరీక లహూ వ అష్'హదు అన్న ముహమ్మదన్ అబ్'దుహూ వరసూలుహూ. వాస్తవానికి అల్లాహ్ తప్ప వేరొక ఆరాధ్యుడు లేడని,ఆయన ఏకైకుడు, ఆయనకు సాటి ఎవరు లేరని నేను సాక్ష్యమిస్తున్నాను మరియు ముహమ్మద్ అల్లాహ్ యొక్క సందేశహరుడు మరియు ఆయన దాసుడు అని నేను సాక్ష్యమిస్తున్నాను ([9]).
మరియు
అల్లాహుమ్మజ్ అల్నీ మినత్తవ్వాబీన వజ్అల్నీ మినల్ ముతతహ్హిరీన్ (ఓ అల్లాహ్ నీవు నన్ను తౌబా చేసే వారిలో నుంచి మరియు పరిశుద్ధత పొందే వారిలో నుంచి చేయి.
ప్రశ్నలు:
ప్రశ్న 1: వుజూ సున్నతులను పేర్కొనండి.
ప్రశ్న 2: కాలమ్ (ఎ)లోని పదానికి సరిపోలిన పదానికి కాలమ్ (బి) లోని పదం ముందు సంఖ్యను ఉంచండి:
కాలమ్ (ఎ)
కాలమ్ (బి)
1- లో అధికం చేయటం
మజ్మజ ( )
2- ఖిలాల్
మజ్మజ మరియు ఇస్తిన్షాఖ్ ( ) చూడండి: సహీహ్ ముస్లిం (1/209), హదీస్ సంఖ్య (234), మరియు సునన్ అబూ దావూద్ (1/43), హదీస్ సంఖ్య (169).
3- చేసేటప్పుడు మిస్వాక్ చేయటం దీనిని తిర్మిజీ తన జామీ లో ఉల్లేఖించారు (1/78) హదీసు సంఖ్య (55)
రెండొవ, మూడవసారి ( )
4- కడగటం
వేళ్ళు ( )
మూడుసార్లు ( )
ప్ర3: ఖాళీని పూరించండి:
1-.........................................లో అరచేతులను..................... కడగడం.
2 - తయామున్: అంటే ..........................................................................................................
3- వుజూ పూర్తైన తర్వాత చెప్పబడే దుఆ: .............................................................................................
ఐదవ పాఠం ([11])
వుజూ భంగపరిచే విషయాలు
వుజూ భంగపరిచే విషయాలలో నుంచి:
1- మలమూత్ర రెండు మార్గాల నుంచి బయటకు వచ్చేవి, ఉదాహరణకు: మూత్రం, మలము, గాలి లేదా ఇతరత్రా.
2- అపస్మారక స్థితి (మూర్ఛ)
3 - గాఢ నిద్ర
4- అడ్డు లేకుండా చేతితో రెండు మర్మావయవాల్లో దేనినైనా తాకడం.
5 - ఒంటె మాంసం తినటం.
ప్రశ్నలు:
ప్రశ్న 1: వుజూను భంగం చేసే మూడు విషయాలను పేర్కొనండి.
ప్ర2: సరైన సమాధానాన్ని సర్కిల్ చేయండి:
ఎ- వుజూ భంగపరిచే విషయాలలో నుంచి ఉపాధ్యాయుని కొరకు : - మూత్రం లేదా మలము రెండు మార్గాల నుండి కాకుండా ఇతర మార్గము నుండి వెలువడితే, అది వుజూను భంగపరుస్తుంది.. ఉదాహరణకు, ఎవరికైనా మూత్రం బయటకు వెళ్లేందుకు ప్రత్యేక రంధ్రం ఏర్పాటు చేయటం. - వుజూను భంగపరిచే నిద్ర అంటే గాఢమైన నిద్ర, ఇందులో వుజూ భంగమైన మనిషికి తెలియదు. అయితే గాఢనిద్ర కాకుండా ఉండే స్వల్ప నిద్ర వుజూను భంగం చేయదు. - అనుమానంతో వుజూ రద్దు కాదు. ఎవరైనా వుజూ చేసుకున్న తర్వాత తనకు ఏదైనా రద్దు జరిగిందా లేదా అనే అనుమానం కలిగితే, అతను ఇంకా పవిత్రత్వంలోనే ఉంటాడు. అదే విధంగా, ఎవరైనా ఏదైనా రద్దు జరిగాక వుజూ చేసుకున్నాడా లేదా అనే అనుమానం కలిగితే, అతను ఇంకా రద్దు స్థితిలోనే ఉంటాడు మరియు వుజూ చేయడం అతనిపై అవసరం. ఎందుకంటే, నమ్మకాన్ని అనుమానం తొలగించదు.
1- ఒంటె మాంసం తినడం. 2- గొర్రె మాంసం తినడం. 3- ఆవు మాంసం తినడం.
బి - వుజూను భంగపరిచే విషయాలలో నుంచి:
1- కునుకు. 2- నిద్ర. 3- త్రాగుట.
సి - నమాజ్ మధ్యలో వుజూ భంగమైతె, మీరు చేయవలసినది:
1- నమాజ్‌ను మధ్యలో నిలిపివేసి, ఆ తర్వాత వుజూ చేసి దానిని తిరిగి చేయాలి.
2- నమాజ్‌ను కొనసాగించి, ఆ తర్వాత వుజూ చేసి దానిని తిరిగి చేయాలి.
3- నమాజ్‌ను కొనసాగించి, దానిని తిరిగి చేయకూడదు.
ఆరవ పాఠం ([12])
అజాన్ మరియు ఇఖామత్
అజాన్ మారియు ఇఖామత్ నిర్వచనం:
అజాన్: నమాజ్ సమయం ప్రవేశించినట్లు తెలియజేయడం.
ఇఖామత్: నమాజ్‌కు నిలబడేందుకు సూచన ఇవ్వడం.
అజాన్‌లో పదిహేను వాక్యాలు ఉంటాయి, అవి:
అల్లాహు అక్బర్ (అల్లాహ్ గొప్పవాడు.)(2) అల్లాహు అక్బర్ (అల్లాహ్ గొప్పవాడు.)
అల్లాహు అక్బర్ (అల్లాహ్ గొప్పవాడు.)(2) అల్లాహు అక్బర్ (అల్లాహ్ గొప్పవాడు.)
అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్ (2) అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్ (అల్లాహ్ తప్ప వేరే వాస్తవ ఆరాధ్య దైవం లేడు)
అష్హదు అన్న ముహమ్మదన్ రసూలుల్లాహ్ (2) అష్హదు అన్న ముహమ్మదన్ రసూలుల్లాహ్ (ముహమ్మద్ అల్లాహ్ ప్రవక్త అని నేను సాక్ష్యం పలుకుతున్నా)
హయ్య అలస్సలాహ్ (2) హయ్య అలస్సలాహ్ (నమాజు వైపునకు తరలిరండి)
హయ్య అలల్‌ఫలాహ్ (2) హయ్య అలల్‌ఫలాహ్ (సాఫల్యం వైపు తరలి రండి)
అల్లాహు అక్బర్ (అల్లాహ్ గొప్పవాడు.)(2) అల్లాహు అక్బర్ (అల్లాహ్ గొప్పవాడు.) ఉపాధ్యాయుని కొరకు : - ఉపాధ్యాయుడు పాఠానికి ముందు అజాన్ విధానాన్ని సమర్ధించే కారణాన్ని వివరించాలి, అబ్దుల్లాహ్ బిన్ జైద్ రజియల్లాహు అన్హు చెప్పిన హదీస్ ప్రకారం. చూడండి: సునన్ అబూ దావూద్ (1/337), సంఖ్య (449), మరియు ముస్నద్ ఇమామ్ అహ్మద్ (4/43), సంఖ్య (16524). - ఉపాధ్యాయుడు విద్యార్ధులకు అజాన్ యొక్క గుణాన్ని వివరించాలి దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వచనములో ఉన్నట్లు: "ముఅద్ధిన్ ధ్వని ఎక్కడ వరకు వెళ్తుందో, దానిని ఏ జిన్న్ లేదా మనిషి లేదా ఏదైనా వస్తువు విన్నా, అది అతనికి ప్రళయదినాన సాక్ష్యమివ్వును." దీనిని బుఖారీ తన సహీహ్‌లో (609) సంఖ్యతో ఉల్లేఖించారు. ఇంకా, దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వచనములో ఉన్నట్లు: "ముఅద్ధిన్లు ప్రళయదినాన పొడువాటి మెడలు కలిగినవారు." దీనిని ముస్లిం తన సహీహ్‌లో (1/29), సంఖ్య (387) లో ఉల్లేఖించారు.
(1) అల్లాహ్ తప్ప వేరే ఆరాధ్యుడు లేడు.
ఫజ్ర్ అజాన్‌లో "హయ్య అలస్సలాహ్" అని చెప్పిన తర్వాత ఈ మాటను అధికం చేసి పలకాలి:
అస్సలాతు ఖైరుమ్మినన్‌నౌమ్ (2) అస్సలాతు ఖైరుమ్మినన్‌నౌమ్ (నమాజు నిద్ర కన్న మేలైనది)
ఇఖామత్ వాక్యాలు పదకొండు ఉన్నాయి, అవి:
అల్లాహు అక్బర్ (అల్లాహ్ గొప్పవాడు.)(2) అల్లాహు అక్బర్ (అల్లాహ్ గొప్పవాడు.)
అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్ (2) అష్హదు అన్న ముహమ్మదర్రసూలుల్లాహ్. (వాస్తవానికి అల్లాహ్ తప్ప వేరొక ఆరాధ్యుడు లేడని నేను సాక్ష్యమిస్తున్నాను మరియు ముహమ్మద్ అల్లాహ్ యొక్క సందేశహరుడని నేను సాక్ష్యమిస్తున్నాను.)
హయ్య అలస్సలాహ్ (2) (నమాజు వైపునకు తరలిరండి) హయ్య అలల్‌ఫలాహ్ (సాఫల్యం వైపు తరలి రండి)
ఖద్ ఖామతిస్సలాత్ (2) ఖద్ ఖామతిస్సలాత్ (నమాజ్ నెలకొల్పబడింది)
అల్లాహు అక్బర్ (అల్లాహ్ గొప్పవాడు.)(2) అల్లాహు అక్బర్ (అల్లాహ్ గొప్పవాడు.)
(1) లా ఇలాహ ఇల్లల్లాహ్ అల్లాహ్ తప్ప వేరే ఆరాధ్యుడు లేడు.
*అజాన్ అనేది వివేకవంతమైన ముస్లిం పురుషుడికి మాత్రమే చెల్లుతుంది, కానీ స్త్రీ అజాన్ ఇవ్వవలసిన అవసరం లేదు లేదా ఇఖామా చెప్పవలసిన అవసరం లేదు.
ప్రశ్నలు:
ప్ర1: ఖాళీలను పూరించండి:
1- అజాన్ అంటే: ...................................................................................................................................................................
2- ఇఖామత్ అంటే: .......................................................................................................................
ప్రశ్న 2: అజాన్ మరియు ఇఖామత్ వాక్యాలను పేర్కొనండి.
ప్ర3: ఈ క్రింది వాటిలో తప్పులను సరిచేయటంతో పాటు ఒప్పును (✔) తో లేదా తప్పును (✖) తో సమాధానమివ్వండి:
అజాన్‌లో పదిహేను వాక్యాలు ఉంటాయి,
ఇఖామత్ వాక్యాలు పది ఉన్నాయి
3- ముఅజ్జిన్ "హయ్య అలస్సలాహ్" అనిన తర్వాత: "అస్సలాతు ఖైరుమ్ మినన్నౌమ్" (నమాజు నిద్రకంటే మంచిది) అని చెప్పును.
4- ముఅజ్జిన్ "అస్సలాతు ఖైరుమ్ మినన్నౌమ్" (నమాజు నిద్రకంటే మంచిది) అనే మాటను ఫజ్ర్ నమాజులో మాత్రమే చెప్పును.
ఏడవ పాఠం ([13])
అజాన్ సున్నతులు
ముఅజ్జిన్ కొరకు సున్నత్:
1- ఖిబ్లాకి అభిముఖమై నిలబడటం.
2- తన రెండు చూపుడు వేళ్లను చెవుల్లో ఉంచడం.
3- అజాన్‌ను ఉద్ఘాటంగా పలకటం.
4- ప్రతి వాక్యము తర్వాత మౌనంగా ఉండి నెమ్మదిగా పలకటం.
5- "హయ్య అలస్సలాహ్" అని చెప్పినప్పుడు కుడివైపు తిరగడం, "హయ్య అలల్‌ఫలాహ్" అని చెప్పినప్పుడు ఎడమవైపు తిరగడం.
ముఅద్ధిన్ను వినిన వ్యక్తికి సున్నత్ పరమైనది:
1- ముఅద్ధిన్ చెప్పినదానిని అనుసరించడం, అయితే "హయ్య అలస్సలాహ్", "హయ్య అలల్‌ఫలాహ్" వద్ద మాత్రం "లా హౌల వలా కువ్వత ఇల్లా బిల్లాహ్" అని చెప్పడం.
2- అజాన్ పూర్తైన తర్వాత ముఅద్ధిన్ మరియు అతన్ని వినినవానికి సున్నత్ పరమైనది:
ఎ- ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)పై దురూద్ పలకటం.
2- జాబిర్ బిన్ అబ్దిల్లాహ్ రజియల్లాహు అన్హు గారిచే వరించిన హదీస్లో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పినదాన్ని చెప్పడం:
ఎవరైతే అజాన్ విన్న తరువాత ఈ దుఆ చదువుతారో :అల్లాహుమ్మ రబ్బ హాదిహిద్దఅ్ వతిత్తామ్మహ్ వస్సలాతిల్ ఖాయిమహ్,ఆతి ముహమ్మదనిల్ వశీలత వల్ ఫజీలహ్ ,వబ్ అస్’హు మఖామమ్ మహ్మూదనిల్లదీ వ అద్తహూ”-ప్రళయ దినాన నా సిఫారసుకు అతను అర్హుడవుతాడు ([14]). ఉపాధ్యామునికొరకు : - ఉపాధ్యాయుడు తన విద్యార్ధుల మధ్య ఫజ్ర్ నమాజు మరియు ఇతర నమాజుల కోసం అథాన్ మరియు ఇఖామత్ ను ఆచరణాత్మకంగా ప్రదర్శించాలి. - ఉపాధ్యాయుడు విద్యార్ధులను అజాన్ మరియు ఇఖామత్ను సున్నత్లతో పాటుగా ఆచరణలో చూపించాలని కోరాలి. - ఉపాధ్యాయుడు విద్యార్ధులను ఈ విషయంలో అప్రమత్తం చేయాలి: మహిళకు మస్జిద్లో నమాజు చేయడం అనుమతింపబడినదే, అయితే (పూర్తి హిజాబ్‌ను ధరించడం - సువాసనలను వాడకపోవడం) వంటి బయటకు వెళ్లే నియమాలను పాటించాలి. అయితే, ఆమె ఇంట్లో నమాజు చేయడం ఉత్తమమైనది.
- ముస్లింలు అజాను వినినప్పుడు మస్జిద్కు వెళ్లేందుకు ప్రాధాన్యత ఇవ్వాలి మరియు ఇతర పనులలో నిమగ్నమవకూడదు.
ముస్లిమ్ మహిళ తాను ఇంట్లోనే నమాజుకు త్వరపడాలి; ఎందుకంటే అదే ఉత్తమం. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు:
మరియు స్త్రీల విషయంలో వారి ఇల్లు నమాజ్ కొరకు ఎంతో ఉత్తమమైనది."([15]).
ప్రశ్నలు:
ప్రశ్న1: అజాన్ సున్నతులను పేర్కొనండి.
ప్రశ్న32: ఖాళీని పూరించండి:
1- అజాన్ పూర్తైన తరువాత ముఅజ్జిన్, ముఅజ్జిన్ ను విన్నవారు ఇలా పలకటం సున్నత్:
2- అజాన్ ముగిసిన తర్వాత చెప్పవలసిన దుఆ (ప్రార్థన) ఇలా ఉంది:
ప్రశ్న3: ఒక ముస్లిం వ్యక్తి అజాన్ వినినప్పుడు ....................................................................................
ఎనిమిదవ పాఠం ([16])
నమాజు షరతులు
నమాజుకు తొమ్మిది షరతులు ఉన్నాయి, ఇవి లేకుండా నమాజు సరికాదు, అవి:
1- ఇస్లాం: కాఫిర్ చేసిన నమాజు సరికాదు; ఎందుకంటే ఏ పనిని అల్లాహ్ అంగీకరించేందుకు ఉన్న షరతుల్లో ఒకటి — అల్లాహ్‌పై విశ్వాసం కలిగి ఉండడం. కాఫిర్‌కు విశ్వాసం ఉండదు, అందువల్ల అతని ఆచరణలు అంగీకరించబడవు.
2- బుద్ధి : పిచ్చివాడి వలె బుద్జి కోల్పోయిన వాడి నమాజు నెరవేరదు. దీనిని బుఖారీ తమ "కితాబుల్ అజాన్" (అజాన్ అధ్యాయం) లో, "అద్దుఆఉ ఇందన్నిదా" శీర్షికలో (హదీస్ నంబర్: 614) లో ఉల్లేఖించారు.
3- వివేచన శక్తి: బాలుడు వివేచనా వయస్సు వరకు చేరేవరకు అతని నమాజు సరైనది కాదు. అది ఏడు సంవత్సరాలు.
4- అపవిత్రత నుండి పవిత్రత: అపవిత్ర స్థితిలో ఉన్న వ్యక్తి వుజూ చేసుకునే వరకు నమాజు సరికాదు. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క వాక్కు దీని ఆధారం :
అల్ ముహ్దిసు : మూత్రం, మలం లేదా ఇతర వుజూను రద్దు చేసే విషయాల వల్ల వుజూ రద్దైనవారు. దీనిని అహ్మద్ ఉల్లేఖించారు (5471), మరియు దాని పరిశోధకులు "సహీ హదీస్"అని పేర్కొన్నారు.
5- అపవిత్రత నుండి పవిత్రత: అది ఎలా అంటే అపవిత్రతను నీటి ద్వారా తీసివేయడం (శరీరం, వస్త్రాలు, నమాజు చేసే స్థలం) నుండి.
6- సమయ ప్రవేశం: సమయం ప్రవేశించకముందు నమాజు చెల్లదు, మరియు కారణం లేకుండా దానిని ఆలస్యం చేయడం నిషిద్ధం. మహోన్నతుడు అయిన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:
{నిస్సందేహంగా నమాజును నిర్ధారిత వేళల్లో చేయటం విశ్వాసులకు విధిగా చేయబడింది.}
అంటే: నిర్ణీత సమయాల్లో ఫరజ్ చేయబడినది.
7- మర్మావయవాలను కప్పుకోవడం: ఎవరు తమ మర్మాఅవయవాలను వెల్లడిస్తారో వారి నమాజు చెల్లదు. పురుషుని మర్మాఅవయవాలు నాభి నుండి మోకాళ్ల వరకు కాగా, స్త్రీ అంతా మర్మాఅవయవమే కాని నమాజులో ముఖం మరియు అరచేతులు మినహా; అయితే పరాయి పురుషుల సమక్షంలో ఉంటే ఆమెకు తన ముఖం మరియు అరచేతులను కప్పుకోవాలి.
8- ఖిబ్లా వైపు అభిముఖమవటం: అది కాబా. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
{మరియు నీవు ఎక్కడికి బయలుదేరినా సరే! నీ ముఖాన్ని (నమాజ్ లో) మస్జిద్ అల్ హరామ్ వైపునకే త్రిప్పుకో} ఉపాధ్యాయుని కొరకు : - ముమయ్యిజ్: అంటే ఉపదేశాన్ని అర్థం చేసుకొని జవాబు ఇచ్చగలిగే వ్యక్తి. ప్రసిద్ధంగా తమ్మీజ్ వయస్సును ఏడు సంవత్సరాలుగా నిర్ణయించబడింది. -స్థలం యొక్క అపరిశుభ్రత అంటే ఏమిటంటే, నమాజు చేసే వ్యక్తికి అపరిశుభ్రత అతని శరీరంపై ఉన్న దేనినైనా తాకుతుంది, అయితే, ఉదాహరణకు, కార్పెట్ అంచున ఉన్నట్లయితే, అతను దానిని తాకకపోతే, అతనికి హాని లేదు. -అల్లాహ్ నమాజు సమయానికి అలంకరించుకోవాలని ఆదేశించాడు. అల్లాహ్ వాక్కు: {ఓ ఆదమ్ సంతానమా ప్రతి మస్జిదులో (నమాజ్ లో) మీ వస్త్రాలంకరణ పట్ల శ్రద్ధ వహించండి.} [అల్ అఅ్ రాఫ్ : 31] అంటే: ప్రతి నమాజు సమయానికి. అందువల్ల ముస్లింలు తమ ఉత్తమమైన మరియు అందమైన దుస్తులు నమాజు కొరకు ధరించాలి, మరియు అనుకూలం కాని దుస్తులతో నమాజుకు రాకూడదు.
- కాబట్టి నమాజు చేసే వ్యక్తి మస్జిద్ హరామ్లో ఉంటే, అతను నేరుగా కాబా వైపుకు తిరగాలి.
మరియు ఎవరైతే కాబా నుండి దూరంగా ఉంటారో, అతను కాబా ఉన్న దిశవైపు తిరగాలి.
9- నియ్యత్: అంటే, ఏ నమాజు చేయాలనుకుంటున్నాడో దానిని ఉద్దేశించడం, ఉదాహరణకు జుహ్ర్ లేదా అస్ర్ మరియు ఇదేవిధంగా ఇతర నమాజులు.
ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) యొక్క ఈ మాట దీనికి ఆధారం:
మరియు సంకల్పము యొక్క స్థానం హృదయం, దానిని నోటి పలకటం బిదఅత్.
ప్రశ్నలు:
ప్రశ్న1: నమాజు షరతులను పేర్కొనండి. దీనిని బుఖారీ తన "కితాబుల్ హియల్ ఫిస్ సలాహ్" లో హదీస్ నంబర్ (6954) లో ఉల్లేఖించారు.
ప్రశ్న 2: కింది విషయాల కోసం షరతుగా ఉండే ఆధారాన్ని పేర్కొనండి:
ఎ- హదస్ నుండి పవిత్రత కోసం ఆధారం:
బి- ఖిబ్లా వైపు అభిముఖమవటం గురించి ఆధారం.
సి- సంకల్పం గురించి ఆధారం.
ప్రశ్న 3: కింది విషయాలను వివరించండి:
ఎ- మలినాన్ని తొలగించే విషయాలు.
బి- నమాజును దాని సమయానంతరము ఆలస్యము చేయటం గురించి షరీఅత్ ఆదేశం:
సి- పురుషుని మర్మావయవాల పరిమితి:
డి- మస్జిద్ హరామ్లో ఉన్న నమాజు చేసే వ్యక్తి దిశ
ఇ- నమాజులో స్త్రీ మర్మావయవాల పరిమితి:
దీనిని బుఖారీ "కితాబు బద్ఉల్-వహ్య్" లో, "రసూల్ అల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం పై వహ్యి ఎలా ప్రారంభమైంది" అనే అధ్యాయంలో హదీస్ నంబర్ 1గా మరియు ముస్లిం వారు "కితాబుల్-ఇమారా" లో, దైవప్రవక్త సల్లల్లాహు అలైహివసల్లం అన్నారు: 'ఆచరణలు నియ్యత్ల ద్వారా మాత్రమే ఉంటాయి' " అనే అధ్యాయంలో హదీస్ నంబర్ 1907గా రివాయత్ చేశారు.
తొమ్మిదవ పాఠం ([19])
ఫర్జ్ నమాజుల వేళలు ([20]) ఉపాధ్యాయుని కొరకు : సూర్యుడు తూర్పు దిశ నుండి ఉదయించినప్పుడు ప్రతీ వస్తువుకు పొడవైన నీడ ఉంటుంది. సూర్యుడు పైకి ఎక్కిన కొద్దీ ఈ నీడ తగ్గుతూ ఉంటుంది. సూర్యుడు ఆకాశ మధ్యలో చేరినప్పుడు నీడ తగ్గటం ఆగిపోతుంది. ఆ తరువాత నీడ పెరగటం ప్రారంభమవుతుంది. ఈ సమయంలోనే జుహ్ర్ నమాజు సమయం ప్రారంభమవుతుంది. ఈ సమయం నీడ ప్రతి వస్తువు పొడవుతో సమానమైనంతవరకు కొనసాగుతుంది. అయితే, సూర్యుడు మధ్యలో చేరినప్పుడు ఏర్పడిన నీడను లెక్కించరు. నీడ తగ్గటం ఆగిన తర్వాత పెరుగటం ప్రారంభమయ్యే ప్రదేశంలో ఒక గుర్తు పెట్టాలి. ఆ గుర్తు నుండి ఆ వస్తువు పొడవుతో సమానమైన నీడ ఏర్పడినప్పుడు జుహ్ర్ సమయం ముగిసి అస్ర్ సమయం ప్రారంభమవుతుంది. ఫజ్ర్ రెండు రకాలుగా ఉంటుంది: మొదటి ఫజ్ర్: ఇది తూర్పు నుండి పడమర వరకు వ్యాపించిన పొడవైన తెల్ల వెలుతురు. దీనిపై ఎలాంటి తీర్పు ఆధారపడదు. రెండవ ఫజ్ర్: ఇది ఉత్తర దక్షిణ దిశలో అడ్డంగా కనిపించే తెల్ల వెలుతురు. దీనిపై ఫజ్ర్ సమయం ప్రారంభం, రోజా మొదలైన తీర్పులు ఆధారపడతాయి. షఫఖ్: ఇది సూర్యాస్తమయం అనంతరం అర్ధరాత్రి నమాజు (ఇషా) సమయం వరకు ఆకాశంలో కనిపించే ఎరుపు కాంతి.
ఫర్జ్ నమాజుల సమయాలు ఇవే:
ఫజ్ర్ ఉపాధ్యాయుడు విద్యార్థులను ఈ విషయాల పట్ల హెచ్చరించాలి: మస్జిదులో జమాఅతుతో సమయానికి నమాజు ఆచరించడంపై శ్రద్ధ వహించాలి; మహిళలు అయితే తమ ఇళ్లలోనే నమాజు ఆచరించాలి. సరైన విశ్రాంతి కోసం తొందరగా నిద్రించే అలవాటు చేసుకోవాలి, తద్వారా ఫజ్ర్ నమాజుకు ఉత్సాహంగా లేచి ఆచరించగలుగుతారు. అవసరం లేనప్పుడు అర్ధరాత్రివరకు మేలుగా ఉండటం వల్ల కలిగే నష్టాలను గుర్తించాలి.
1- ఫజ్ర్: రెండవ ఫజ్ర్ (తెల్ల వెలుతురు ఉత్తర దక్షిణ దిశలో అడ్డంగా కనిపించుట) ఉదయించినప్పుడు ప్రారంభమై సూర్యోదయం వరకు కొనసాగుతుంది.
2- జుహ్ర్ సూర్యుడు వాలినప్పుడు నుండి ప్రతి వస్తువు నీడ దాని అంతట అయ్యేవరకు.
3- అస్ర్: జుహ్ర్ సమయం ముగిసిన వెంటనే ప్రారంభమై ప్రతి వస్తువు నీడ తన పొడవుతో రెండింతలయ్యే వరకు కొనసాగుతుంది.
4-మగ్రిబ్ సమయం సూర్యస్తమయం నుండి సంధ్యారుణిమ అదృశ్యమయ్యేవరకు.
5-ఇషా నమాజు సమయం షఫఖె అహ్మర్ (ఎర్రని వెలుగు) మాయమై పోయిన తర్వాత నుండి అర్ధరాత్రి వరకు ఉంటుంది.
షఫఖ్ (సంధ్యారుణిమ) మాయమగుట
నమాజును దాని సమయానంతరము ఆలస్యము చేయుటం గురించి షరీఅత్ ఆదేశం:
నమాజును దాని సమయం నుండి ఆలస్యం చేయటం అనుమతించబడదు. ఎవరు అలాంటి పనిని చేస్తారో వారు పెద్ద పాపముకు ఒడిగట్టారు.మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:
అర్ధం: వారు నమాజును దాని సమయం నుండి ఆలస్యం చేస్తారు.
కోల్పోయిన నమాజును ఖజా చేయటం:
ఎవరైనా నమాజు వేళ నిద్రపోయినా లేదా మరిచిపోయినా, దాని సమయం ముగిసిన తర్వాత గుర్తుకు వస్తే లేదా లేచిన వెంటనే ఆ నమాజును చేయటం తప్పనిసరి. దీనిని మరింత ఆలస్యం చేయుట అనుమతించబడదు. దీనికి ఆధారం అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు తెలిపిన హదీసు ప్రకారం, అల్లాహ్ యొక్క ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు:
ఎవరైనా నమాజును మరిచిపోయినా లేదా నిద్రపోయినా, దాని కఫ్ఫారా (ప్రాయశ్చిత్తం) అతను దాని గుర్తు వచ్చిన వెంటనే ఆ నమాజును నెరవేర్చటమే."
ఆయనవే వేరే పదాలలో ఇలా ఉన్నది:
ఇషా నమాజుకు ముందు నిద్రపోవుట మరియు ఇషా నమాజుకు తర్వాత సంభాషణ జరుపుట గురించి షరీయత్ ఆదేశం:
ఇషా నమాజుకు ముందు నిద్రపోవుట మరియు ఇషా నమాజుకు తర్వాత సంభాషణ జరుపుట మక్రూహ్ (అనుచితం) కిందకు వస్తుంది, అయితే ఇది అవసరం కోసం ఉంటే అనుమతించబడుతుంది. ఈ నియమం రాత్రి నమాజుకు (తహజ్జుద్) అలసట కలగకూడదనే మరియు ఫజ్ర్ నమాజు వదల కూడదనే ఉద్దేశంతో ఉంది.
అబూ బర్జా రజియల్లాహు అన్హు కథనం: దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇషా నమాజుకు ముందు పడుకోవటాన్ని, ఇషా తర్వాత కబుర్లు చెప్పుకోవటాన్ని అసహ్యించుకునేవారు.([22]).
ప్రశ్నలు:
ప్ర1: ఖాళీలను పూరించండి:
1- ఫజర్ నమాజు సమయం .........................................2- జుహర్ నమాజు సమయం .........................................................
3- అసర్ నమాజు సమయం ...........................................................4- మగ్రిబ్ నమాజు సమయం ....................................................
5- ఇషా నమాజు సమయం ............................................. ...........................................................................
ప్రశ్న2: ఖాళీలను పూరించండి:
1-నమాజును దాని సమయం నుండి ఆలస్యం చేయటం ............................ ఎవరు అలాంటి పనిని చేస్తారో వారు ................................................ దానికి అల్లాహ్ యొక్క ఈ వాక్కు ఆధారం : (...................................................................... అశ్రద్ధ వహిస్తారో.(5) అంటే ....................................................
2- ఎవరైనా ఏదైన నమాజు వేళ నిద్రపోయినా లేదా మరిచిపోయినా, అది సమయం ముగిసిన తర్వాత ........................................................ అతనిపై తప్పనిసరి. ........................................... అతని కొరకు అనుమతించబడదు.
ప్రశ్న 3: క్రింది వాటికి కారణాలు తెలపండి:
1- ఇషా నమాజుకు ముందు నిద్రపోవుట మక్రూహ్ (అనుచితం) కిందకు వస్తుంది............................................... ................................................................
2- ఇషా నమాజుకు తర్వాత సంభాషణ జరుపుట మక్రూహ్ (అనుచితం) కిందకు వస్తుంది....................................... ..................................................
పదవ పాఠం ([23])
నమాజ్ విధులు
నమాజు యొక్క విధులు పద్నాలుగు ఉన్నాయి, అవి:
1- సామర్థ్యం ఉన్నప్పుడు ఫర్జ్ నమాజులో నిలబడటం. దీనికి ఆధారం ఇమ్రాన్ బిన్ హుస్సేన్ రజియల్లాహు అన్హు హదీసు ఆయన ఉల్లేఖిస్తూ తెలిపారు: నాకు మూలశంక వ్యాధి (పైల్స్) ఉండేది, నేను మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ తో నమాజు ఎలా చదవాలని అడిగాను,దానికి ఆయన:
2- నమాజు ప్రారంభంలో తక్బీరతుల్ ఇహ్రామ్ చెప్పడం, అంటే "అల్లాహు అక్బర్" అని పలకడం. ఎందుకంటే దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు:
3- ప్రతి రకాత్‌లో సూరతుల్ ఫాతిహా చదవడం. ఏందుకంటే దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు:
4- రకూ చేయటం. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సూక్తి:
«ఆ పై రుకు పూర్తిగా చేయీ.»
5- రుకూ నుంచి పైకి లేవటం మరియు పైకి లేచిన తర్వాత నేరుగా నిలబడటం. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సూక్తి: ఇది ముస్లింలో "మసాజిద్ మరియు నమాజు స్థలాల గురించి పుస్తకం" లో వచ్చిన హదీస్. అధ్యాయం: "తప్పిపోయిన నమాజును తీర్చడం మరియు దాన్ని త్వరగా తీర్చడం యొక్క ప్రాముఖ్యత" సూచిక సంఖ్య: (1/477), హదీస్ నం. 684
«ఆపై పైకి లేచి పూర్తిగా నిలువుగా నిలచుము».
6- ఏడు అవయవములపై సజ్దా చేయటం. అబ్దుల్లాహ్ ఇబ్న్ అబ్బాస్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం: రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:
ఏడు అవయవాలు అవి: ఇది బుఖారీ హదీసు సంకలనంలోని "నమాజుల సమయాల గ్రంథం" లో వచ్చిన హదీస్. అధ్యాయం: "ఇషా నమాజు ముందు నిద్రపోవడం అసహ్యమైనది" హదీస్ నంబర్: 568.
1
2-3
4-5
6-7
ముక్కుతో పాటు నుదుటిని
రెండు అర చేతులు
రెండు మోకాళ్ళు
రెండ కాళ్ల వేళ్ల అంచులు
7-సజ్దా నుండి పైకి లేవడం
8-రెండు సజ్దాల మధ్య కొంచెం సేపు కూర్చోవడం. సజ్దా నుంచి పైకి లేవటం మరియు రెండు సజ్దాల మధ్య కూర్చోవడానికి ఆధారం, నబి (సల్లల్లాహు అలైహి వసల్లం) వాక్కు:
9- చివరి తషహ్హుద్, అంటే తషహ్హుద్ చదవడం.
10- చివరి తషహ్హుద్ కోసం కూర్చోవడం. ఇబ్ను మసూద్ రజియల్లాహు అన్హు ఇలా తెలిపారు : "మాకు తషహ్హుద్ విధి అయ్యే ముందు, నమాజులో ఇలా చెప్పే వారం : ‘అల్లాహ్‌పై శాంతి కలుగుగాక, జిబ్రాయీల్ మరియు మీకాయీల్‌పై శాంతి కలుగుగాక.అప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలిపారు: ఉపాధ్యాయుని కొరకు: - తమానీన అంటే: - కనీసం అవసరమైన జిక్ర్ చెప్పేంత కాలం శాంతిగా, స్థిరంగా ఉండటం. ఇది ఖుషూకు భిన్నమైనది. ఖుషూఅ్ అంటే హృదయం పూర్తిగా హాజరుగా ఉండడం. ఇది నమాజులో ఆచరించాల్సిన ముఖ్యమైన విషయాల్లో ఒకటి. ఖుషూఅ్ అంటే నమాజుకు ప్రాణం, హృదయం. వ్యక్తికి తన నమాజులోనుంచి లభించే ప్రతిఫలం, అతను దానిని ఎంతగా అర్థం చేసుకున్నాడో అంతే. అందువల్ల ఉపాధ్యాయులు విద్యార్థులకు ఖుషూఅ్ యొక్క ప్రాముఖ్యత గురించి స్పష్టంగా చెప్పాలి మరియు దానిని పొందే మార్గాలను వివరించాలి. - "తన నమాజును తప్పుగా చేసిన వ్యక్తి" గురించి ఉన్న హదీస్, నమాజు యొక్క అనేక మూలాధారాలను (అర్కాన్) సంగ్రహించింది. కావున, ఉపాధ్యాయుడు ఈ హదీస్‌ను మొదట "తక్బీరతుల్ ఇహ్రామ్" ప్రస్తావన వచ్చే స్థలంలో పేర్కొనాలి. ఆ తర్వాత, ఈ హదీస్ ద్వారా ఆర్కాన్కు ఉన్న ఆధారాన్ని వివరిస్తూ, వాటి మధ్య సంబంధాన్ని స్పష్టంగా తెలియజేయాలి.
ఇలా చెప్పకండి; ఎందుకంటే అల్లాహ్ స్వయంగా అస్-సలామ్ (శాంతి). కానీ మీరు ఇలా చెప్పండి: అత్తహియ్యాతు లిల్లాహి, వస్సలవాతు వత్తయ్యిబాతు, అస్సలాము అలైక అయ్యుహన్నబియ్యు వ రహ్మతుల్లాహి వ బరకాతుహు, అస్సలాము అలైనా వ అలా ఇబాదిల్లాహిస్సాలిహీన్, అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు, వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహూ వ రసూలుహు."సకల శరీర సంబంధమైన, ధన సంబంధమైన మరియు నోటి సంబంధమైన ఆరాధనలు అల్లాహ్ కు మాత్రమే చెందుతాయి. ఓ ప్రవక్తా! అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యాలు మరియు శుభాలు నీపై కురియుగాక! అలాగే మా పైనా మరియు పుణ్యాత్ములైన అల్లాహ్ దాసుల పైనా కురియుగాక. అల్లాహ్ తప్ప నిజమైన ఆరాధ్యుడు ఎవడూ లేడని నేను సాక్ష్యమిస్తున్నాను ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం అల్లాహ్ దాసుడు మరియు సందేశహరుడు అని నేను సాక్ష్యమిస్తున్నాను"([29]).
11- చివరి తషహ్హుద్ తరువాత దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై దరూద్ చదవటం.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం'పై దరూద్ పఠించడం:
ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:
మీరు ఇలా పలకండి: ‘అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మద్ వ అలా ఆలీ ముహమ్మద్,కమా సల్లైత అలా ఇబ్రాహీమ వఅలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదుమ్మజీద్’ అల్లాహుమ్మ బారిక్ అలా ముహమ్మద్ వ అలా ఆలీ ముహమ్మద్ కమా బారక్త అలా ఇబ్రాహీమ వఅలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదుమ్మజీద్ (ఓ అల్లాహ్ !నీవు ఇబ్రాహీం ను ఆయన కుటుంబం వారిని కరుణించినట్లుగానే ముహమ్మద్'ను మరియు ఆయన కుటుంబాన్నికరుణించు'స్తోత్రానికి అర్హుడవు,ఘనత కలవాడవు నీవే'ఓ అల్లాహ్ !ఇబ్రాహీం పై ఆయన కుటుంబం పై శుభాలు కురిపించినట్లుగానే ముహమ్మద్' మరియు ఆయన కుటుంబం పై శుభాలు కురూపించు ([30]). ఇది బుఖారీ హదీసు సంకలనంలోని "తహజ్జుద్ గురించి పుస్తకం" లో వచ్చిన హదీస్. అధ్యాయం: "శక్తి లేనప్పుడు, వ్యక్తి కూర్చొని నమాజు చదవడం" హదీస్ నంబర్: 1117
12- రెండు సలాములు పలకటం. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సూక్తి:
నమాజును ముగించేది తస్లీమ్ (సలాం పలకడం) ([31]).
13- అన్ని అర్కాన్ లలో ప్రశాంతంగా ఉండటం. తమ నమాజులను సక్రమంగా చదవని వారికీ సంభందించిన హదీసు దీనికి ఆధారం. అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం: ఈ హదీస్‌ను బుఖారీ తన "అదాన్ పుస్తకం" లో "ఇమామ్ మరియు మామూమ్ ఇద్దరూ అన్ని నమాజుల్లో ఖిరాత్ చదవడం తప్పనిసరి" అనే అధ్యాయంలో (హదీస్ నం. 757) లో ఉల్లేఖించారు. అదే హదీస్‌ను ముస్లిం తన "నమాజు పుస్తకం" లో "ప్రతి రకాత్‌లో సూరతుల్ ఫాతిహా చదవడం తప్పనిసరి" అనే అధ్యాయంలో (హదీస్ నం. 397) ఉల్లేఖించారు.
ప్రవక్త సల్లల్లాహు అలైహివసల్లం మస్జిద్ లో ప్రవేశించారు పిదప ఒక వ్యక్తి ప్రవేశించి నమాజు చదివాడు దైవప్రవక్త వద్దకి వచ్చిసలాం చేశాడు అప్పుడు దైవప్రవక్త అతనితో నిశ్చయంగా నీ నమాజు కాలేదు వెళ్ళి నమాజు తిరిగి ఆచరించు" అన్నారు అతను వెళ్ళి మళ్ళీ నమాజు ఇంతకు ముందు లాగా ఆచరించాడు మళ్ళీ వచ్చి సలాం చేశాడు అప్పుడు దైవప్రవక్త అతనితో వెళ్ళి నమాజును తిరిగి ఆచరించు “నిశ్చయంగా నీ నమాజు కాలేదు’ అని మూడు సార్లు అన్నారు, అతను బదులిస్తూ‘ మిమ్మల్ని దైవ ప్రవక్తగా పంపిన దైవము సాక్షి దీనికంటే ఉత్తమంగా నమాజు నేను ఆచరించలేను మీరు నాకు నేర్పించండి అన్నాడు' దైవ ప్రవక్త బదులిస్తూ “నమాజు కోసం నిలబడినప్పుడు తక్బీర్ అల్లాహుఅక్బర్ చెప్పు ‘ఆ తరువాత నీకు తెలిసిన ఖురాన్ వాక్యాలను పటించు,ఆ పై రుకు పూర్తిగా చేయీ ,మళ్ళీ నిటారుగా నిలబడు, మళ్ళీ పూర్తిగా సజ్దా చేయి, సజ్దా నుండి లేసి శాంతంగా కూర్చో, ఇలా నీ నమాజు ను పూర్తిగా కొనసాగించు ([32]).
14- అన్ని అర్కాన్ లలో క్రమ పద్దతి పాటించడం. ఎందుకంటే దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తన నమాజును క్రమబద్ధంగా ఆచరించారు మరియు ఇలా సెలవిచ్చారు:
మీరు నన్ను ఏవిధంగా నమాజ్ పాటిస్తుండగ చూశారో ఆవిధంగా నమాజ్ పాటించండి ([33]). ఈ హదీస్‌ను బుఖారీ తన "అదాన్ పుస్తకం" లో "ఇమామ్ మరియు మామూమ్ ఇద్దరూ అన్ని నమాజుల్లో ఖిరాత్ చదవడం తప్పనిసరి" అనే అధ్యాయంలో (హదీస్ నం. 756) ఉల్లేఖించారు.
ప్రశ్నలు:
1:సలాహ్ (నమాజు)లోని రకాతుల సంఖ్యను పేర్కొనండి.
ప్రశ్న 2: క్రింది ప్రతి విషయం నమాజు యొక్క ఒక రుక్న్ (మూలభాగం) అని చూపించే ఆధారం పేర్కొనండి:
1- నిలబడటం. 2-సూరతుల్ ఫాతిహా పఠించడం. 3- సజ్దా చేయటం. 4- రెండు సలాములు పలకటం.
ప్రశ్న 3: కింది నమాజు యొక్క అర్కాన్ లను వాటి స్థానానికి అనుగుణంగా క్రమబద్ధంగా జోడించండి:
చివరి తషహ్హుద్ పఠించడం - సూరతుల్ ఫాతిహా పఠించడం - రెండు సజ్దాల మధ్య కొంచెం సేపు కూర్చోవడం - రుకూ చేయటం
ప్రశ్న 4: ఏడు అవయవాలు ఏమిటి? ఈ హదీస్‌ను బుఖారీ తన "అదాన్ పుస్తకం" లో "మూకు మీద సజ్దా చేయడం" అనే అధ్యాయంలో (హదీస్ నం. 812) ఉల్లేఖించారు. అదే హదీస్‌ను ముస్లిం తన "నమాజు పుస్తకం" లో "సజ్దాలో ఉపయోగించాల్సిన అవయవాలు మరియు నమాజులో జడలు గట్టడం, వస్త్రాన్ని కట్టివేయడం నిషేధించబడిన విషయం" అనే అధ్యాయంలో (హదీస్ నం. 490) ఉల్లేఖించారు.
..............................................................................................................................................................
ప్రశ్న 5: చివరి తషహ్హుద్‌ను వ్రాయండి.
................................................................................................................................................................
ప్రశ్న 6:దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పై చదివే దరూద్ ను వ్రాయండి.
...............................................................................................................................................................
పదకొండవ పాఠం ([34])
నమాజులోని తప్పనిసరి విషయాలు
నమాజులో ఎనిమిది తప్పనిసరి పనులు (వాజిబాత్) ఉన్నాయి అవి:
1- తక్బీరతుల్ ఇహ్రామ్ తప్ప, మిగతా అన్ని తక్బీర్లు (అల్లాహు అక్బర్ చెప్పడం) వాజిబ్. ఎందుకంటే : తక్బీరతుల్ ఇహ్రామ్ (ప్రారంభ తక్బీర్) అనేది రుక్న్ (నమాజు మూల భాగం).
2- "సమిఅల్లాహు లిమన్ హమిదహ్" అని చెప్పడం → ఇది ఇమామ్ మరియు ఒంటరిగా నమాజు చేసే వ్యక్తిపై అనివార్యం, కానీ మామూమ్ (ఇమామ్ వెనుక ఉండే వ్యక్తి) కు కాదు.
3 - ఇమామ్, మఖ్తదీ (అనుసరించేవాడు), మరియు ఒంటరిగా నమాజు చేసే వ్యక్తి రబ్బనా వలకల్ హమ్దు అనీ పలకడం.
4 - రుకూలో "సుబహాన రబ్బియల్ అజీమ్" అని పలకడం.
5 - సజ్దాలో "సుబహాన రబ్బియల్ ఆలా" అని పలకడం. ఈ హదీస్‌ను బుఖారీ తన "అదాన్ పుస్తకం" లో "ఇమామ్ మరియు మామూమ్ ఇద్దరూ అన్ని నమాజుల్లో ఖిరాత్ చదవడం తప్పనిసరి" అనే అధ్యాయంలో (హదీస్ నం. 757) లో ఉల్లేఖించారు. అదే హదీస్‌ను ముస్లిం తన "నమాజు పుస్తకం" లో "ప్రతి రకాత్‌లో సూరతుల్ ఫాతిహా చదవడం తప్పనిసరి" అనే అధ్యాయంలో (హదీస్ నం. 397) ఉల్లేఖించారు.
6 - రెండు సజ్దాల మధ్య విరామంలో (జల్సా భంగిమలో ప్రశాంతంగా కూర్చున్నప్పుడు), రబ్బిగ్ఫిర్లీ అని పలకడం.
7- మొదటి తషహ్హుద్ పఠించడం.
8 - తషహ్హుద్ మొదటి భాగాన్ని పఠించడం కొరకు కూర్చోవడం.
ప్రశ్నలు: ఈ హదీస్‌ను అన్-నసాయి తన "సహ్వు (నమాజులో తప్పుల గురించి) పుస్తకం" లో "తషహ్హుద్ యొక్క తప్పనిసరి అవటం" అనే అధ్యాయంలో (హదీస్ నం. 1277) ఉల్లేఖించారు, మరియు ఇవి ఆయన పదాలు.అదే హదీస్‌ను అల్-బైహఖీ తన "నమాజు పుస్తకం" లో "చివరి తషహ్హుద్ యొక్క తప్పనిసరి అవటం" అనే అధ్యాయంలో (2/378) ఉల్లేఖించారు. ఈ హదీస్‌కు బుఖారీ మరియు ముస్లింల సహీహ్లలో కూడా షవాహిద్ (అనుకూల ఆధారాలు) ఉన్నాయి, అయితే "ఖబ్ల అన్'యుఫ్రద" (ఇది విధిగా అవ్వడానికి ముందు) అనే వాక్యం లేకుండా ఉన్నాయి.
ప్రశ్న 1: నమాజులో వాజిబ్లను పేర్కొనండి.
ప్ర2: సరైన సమాధానాన్ని సర్కిల్ చేయండి:
ఎ- "సమిఅల్లాహు లిమన్ హమిదహ్" అని వీరు చెప్పాలి:
1- ఇమామ్, అనుసరించే వారి, ఒంటరిగా నమాజ్ చేసేవారి కొరకు 2- ఇమామ్, ఒంటరిగా నమాజ్ చేసేవారి కొరకు 3- కేవలం ఇమామ్, అనుసరించే వారి కొరకు
బి- "రబ్బనా వలకల్ హమ్ద్" అని వీరు చెప్పాలి: ఈ హదీస్‌ను బుఖారీ తన "అహాదీసుల్-అన్బియ" (ప్రవక్తల హదీసులు)పుస్తకం లో (హదీస్ నం. 3370)లో ఉల్లేఖించారు, మరియు ఇవి ఆయన పదాలు. అదే హదీస్‌ను ముస్లిం తన "నమాజు పుస్తకం" లో "దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పై దురూద్ చెప్పడం" అనే అధ్యాయంలో ఉల్లేఖించారు.
1- ఇమామ్, అనుసరించే వారి, ఒంటరిగా నమాజ్ చేసేవారి కొరకు 2- ఇమామ్, ఒంటరిగా నమాజ్ చేసేవారి కొరకు 3- కేవలం ఇమామ్ అనుసరించే వారి కొరకు
సి- "సుబ్హాన రబ్బియల్ అజీమ్" వీటిలో పలకాలి:
1- సజ్దాలలో 2- రెండు సజ్దాల మధ్య కొంచెం సేపు కూర్చోవడం 3 - రుకూ ఈ హదీస్‌ను అబూ దావూద్ తన "సునన్" లో (1/16, హదీస్ నం. 61) ఉల్లేఖించారు. అదే హదీస్‌ను తిర్మిజీ తన "జామిఅ్" లో (1/8, హదీస్ నం. 3) ఉల్లేఖించారు.
ప్ర3: తగిన స్థలంలో గుర్తు పెట్టండి:
రుకున్
వాజిబ్ (తప్పనిసరి) ఈ హదీస్‌ను బుఖారీ తన "అదాన్ పుస్తకం లో", "ప్రతి నమాజులో ఇమామ్ మరియు మక్మూమ్ పై కిరాత్ తప్పనిసరి" అనే అధ్యాయంలో (హదీస్ సంఖ్య 757) ఉల్లేఖించారు. ముస్లిం కూడా "సలాత్ పుస్తకం లో", "ప్రతి రకాత్‌లో ఫాతిహా పఠనము తప్పనిసరి" అనే అధ్యాయంలో (హదీస్ సంఖ్య 397) ఉల్లేఖించారు.
రుకూ నుండి పైకి లేవటం
తక్బీరె తహ్రిమ
రబ్బిగ్ఫిర్లీ పలకటం దీనిని బుఖారీ తన "అధాన్" పుస్తకంలో "ప్రయాణికుల కోసం అధాన్ మరియు ఇఖామత్" అనే అధ్యాయంలో ఉల్లేఖించారు, హదీస్ నంబర్ (631).
సుబహాన రబ్బియల్ ఆలా అని పలకటం
సూరతుల్ ఫాతిహా పఠించడం
మొదటి తషహ్హుద్
దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై దరూద్ పఠించడం
పన్నెండవ పాఠం ([35])
రుక్న్ మరియు వాజిబ్ మధ్య తేడా
రుక్న్ మరియు వాజిబ్ ఒక విషయంలో ఒకేలా ఉంటాయి, మరియు మరో విషయంలో భిన్నంగా ఉంటాయి:
ఎ -రుక్న్ మరియు వాజిబ్ ఒక విషయంలో ఒకేలా ఉండేవి:
రుక్న్ మరియు వాజిబ్ రెండూ ఏకీభవించే విషయం ఏమిటంటే, నమాజ్ చేసే వ్యక్తి ఉద్దేశపూర్వకంగా వాటిలో ఏదైనా విడిచిపెడితే, అతని నమాజు వృధా అవుతుంది.
బి- రుక్న్ మరియు వాజిబ్ భిన్నమయ్యే విషయం:
-రుక్న్ను నమాజ్ చేసే వ్యక్తి మర్చిపోయినా లేదా తెలియకపోయినా, అది రద్దు కాదు కాబట్టి, అతను దానిని చేయాల్సి ఉంటుంది మరియు సహ్వు సజ్దా చేయాలి.
-వాజిబ్ను నమాజ్ చేసే వ్యక్తి మర్చిపోయినా లేదా తెలియకపోయినా, అది రద్దవుతుంది, మరియు దాని బదులుగా సహ్వు సజ్దా చేయాలి.
ప్రశ్నలు:
ప్ర1: ఈ క్రింది వాటిలో తప్పులను సరిచేయటంతో పాటు ఒప్పును (✔) తో లేదా తప్పును (✖) తో సమాధానమివ్వండి: ఉపాధ్యాయుని కొరకు : - అధ్యాపకుడు విద్యార్థులకు ఇమామ్, మామూం మరియు మున్ఫరిద్ల మధ్య తేడాను వివరించాలి: ఇమామ్: ప్రజలకు నమాజులో ఇమామత్ చేసేవాడు, అంటే, వారికి నమాజు చదివించేవాడు. మామూం: ఇమామ్‌ను అనుసరించేవాడు, అంటే, ఇమామ్‌తో కలిసి నమాజు చదివేవాడు. మున్ఫరిద్: ఒంటరిగా నమాజు చదివేవాడు. - రుకూకు తక్బీరు వాజిబ్, కానీ ఎవరికైనా ఇమామ్ రుకూలో ఉన్నప్పుడు చేరితే, అతను నిలబడి తక్బీరు తహ్రీమా చెప్పాలి, రుకూకు వెళ్లేటప్పుడు తక్బీరు చెప్పడం మంచిది - అది సాధ్యమైతే - లేకపోతే తక్బీరు తహ్రీమా సరిపోతుంది.
1- రుక్న్ను నమాజు చేసే వ్యక్తి కావాలని విడిచిపెడితే, అతని నమాజు చెడిపోతుంది.
2- వాజిబ్ను నమాజు చేసే వ్యక్తి కావాలని విడిచిపెడితే, అతని నమాజు చెడిపోతుంది.
3- రుక్న్ను నమాజు చేసే వ్యక్తి మరిచిపోయి విడిచిపెడితే, అతని నమాజు చెడిపోతుంది.
ప్ర2: సరైన సమాధానాన్ని సర్కిల్ చేయండి:
ఎ- వాజిబ్ను నమాజి విడిచిపెడితే, అది రద్దవుతుంది.
1- మరచిపోయి. 2- కావాలని. 3- ఎప్పుడూ రద్దుకాదు
బి- రుక్న్ను నమాజి విడిచిపెడితే, అది రద్దవుతుంది:
1- తెలియక విడిచిపెడితే. 2- మరిచిపోయి విడిచిపెడితే. 3- ఎప్పుడూ రద్దుకాదు.
సి- వాజిబ్ను నమాజి మరిచిపోయి విడిచిపెడితే, అతను:
1- దానిని పూర్తి చేస్తాడు. 2- దాని బదులుగా సహ్వు సజ్దా చేస్తాడు.3- అతనికి ఎలాంటి బాధ్యత ఉండదు.
పదమూడవ పాఠం
సూరతుల్ ఫాతిహా వ్యాఖ్యానం
బిస్మిల్లాహ్ (అల్లాహ్ నామముతో )
అంటే: అల్లాహ్ సహాయంతో ప్రారంభిస్తున్నాను.
అంటే: సకల సృష్టిరాసుల కొరకు విశాలమైన కరుణ కలవాడు.
అర్రహీమ్-అపార కృపాశీలుడు.
అంటే: తన విశ్వాస దాసులపై ప్రత్యేక కరుణ కలవాడు.
స్థుతులన్ని అల్లాహ్ కొరకు.
అల్-హమ్ద్: అల్లాహ్ ను ఆయన పరిపూర్ణ గుణాలు మరియు అపార అనుగ్రహాల కారణంగా పొగడడం.
రబ్బిల్ ఆలమీన్ సర్వలోకాలకు ప్రభువు
అర్-రబ్బ్ అంటే: యజమాని, నిర్వహించువాడు. ఆలమీన్: "ఆలం" యొక్క బహువచనం, అల్లాహ్ తప్ప మిగిలిన సకల సృష్టి "ఆలం" గా పరిగణించబడుతుంది. (రబ్బుల్-ఆలమీన్) అర్థం: వారి యజమాని, పోషించువాడు, మరియు వారి వ్యవహారాలను నిర్వహించువాడు.
అల్లాహ్‌కు చెందిన రెండు నామాలు, ఇవి కరుణ యొక్క గుణాన్ని కలిగి ఉంటాయి:
అంటే: ఆచరణలకు లెక్క తీసుకునే, ప్రతిఫలములను ప్రసాదించే రోజు, అది ప్రళయదినము.
ఇయ్యాకనఅ్బుదు మేము నిన్నే ఆరాధిస్తున్నాము
అంటే: మేము నిన్ను తప్ప మరెవరినీ ఆరాధించము. ఇబాదత్ అంటే – అల్లాహ్‌కు సంపూర్ణ ప్రేమ మరియు సంపూర్ణ వినయం తో కూడిన విధేయత.
వఇయ్యా కనస్తయీన్ మరియు మేము నీ సహాయాన్నే అర్థిస్తున్నాము
అంటే: మేము నిన్ను తప్ప మరెవరినీ సహాయం కోరము. ఇస్తిఆనా అంటే – అల్లాహ్ నుండి సహాయాన్ని కోరుట.
ఇహ్దినా మాకు మార్గదర్శకత్వం చేయి ఉపాధ్యాయుని కొరకు: - ఎవరైనా నమాజులో రుక్న్ను, అంటే రుకూకు లేదా సజ్దాను, మరిచిపోయి లేదా తెలియక విడిచిపెడితే, అతనికి కొన్ని పరిస్థితులు ఉంటాయి: 1- అతడు దాన్ని గుర్తుపట్టడం, కానీ తదుపరి రకఆత్లో ఖిరాత్ ప్రారంభించడానికి ముందు గుర్తు చేసుకోవడం. అప్పుడు అతడు వెనక్కి వెళ్లి దానిని, అలాగే దాని తరువాత ఉన్న వాటిని పూర్తి చేయాలి, నమాజును పూర్తిచేయాలి మరియు సహ్వు సజ్దా చేయాలి. 2- అతడు దాన్ని తదుపరి రకఆత్లో ఖిరాత్ ప్రారంభించిన తరువాత మాత్రమే గుర్తు చేసుకుంటే అప్పుడు, అతడు రుక్న్ను విడిచిపెట్టిన రకఆత్ చెల్లదు, మరియు దాని తరువాతి రకఆత్ దాని స్థానంలో వస్తుంది. చివరిలో సహ్వు సజ్దా చేయాలి.3- అతడు రుక్న్ను నమాజు ముగిసిన తరువాత మాత్రమే గుర్తు చేసుకుంటే ఇది మొత్తం రకఆత్ను విడిచిపెట్టినట్లుగా షుమారు చేయబడుతుంది.అయితే, మధ్య వ్యవధి ఎక్కువ కాలం కాకపోతే, అతడు పూర్తిగా ఒక రకఆత్ను పూర్తిచేయాలి, తషహ్హుద్ చదవాలి, సహ్వు సజ్దా చేయాలి, మరియు సలాం చేయాలి.కానీ మధ్య వ్యవధి ఎక్కువ కాలం అయితే, అతడు నమాజును తిరిగి మొదటి నుండి చేయాలి, మరియు అతనికి సహ్వు సజ్దా అవసరం లేదు.4- విడిచిపెట్టినది చివరి తషహ్హుద్ లేదా సలాం అయితే, అతడు దానిని పూర్తిచేయాలి, సహ్వు సజ్దా చేయాలి, మరియు సలాం చేయాలి. ఇది పూర్తిగా ఒక రకఆత్ను విడిచిపెట్టినట్లుగా లెక్కించబడదు.
అంటే: మాకు మార్గం చూపు, దిశానిర్దేశం చేయి, మరియు మాకు భాగ్యమును కలిగించు.
సిరాతల్ ముస్తఖీమ్ సన్మార్గమును
అంటే: వంకరలేనిది, స్పష్టమైన మార్గం. అది అల్లాహ్ తన ప్రవక్త ﷺ మీద అవతరింపజేసిన ధర్మం.
సిరాతల్లజీన అన్అమ్త అలైహిమ్ నీవు అనుగ్రహించిన వారి మార్గం మాత్రమే (చూపు)
అంటే: నీవు మార్గదర్శనం అనుగ్రహించిన వారి మార్గం, అనగా ప్రవక్తలు, సత్య దాసులు, అమరగతిపొందినవారు మరియు సజ్జనులు.
గైరిల్ మగ్జూబి అలైహిమ్ నీ ఆగ్రహానికి గురి అయిన వారి (మార్గం కానీ)
అంటే: వారు తమ జ్ఞానాన్ని అనుసరించి జీవించని వారు, యూదులు మరియు ఇతరులు వంటి వారు.
వలజ్జాల్లీన్ లేక మార్గభ్రష్టులైన వారి (మార్గం కానీ) కాదు
అంటే: వారు జ్ఞానములేకుండా ఆచరించేవారు, క్రైస్తవులు మరియు ఇతరుల వంటి వారు.
ఆమీన్
అంటే: అల్లాహ్ ఆమోదించుగాక. ఇది ఫాతిహాలోనిది కాదు.
ప్రశ్నలు:
ప్రశ్న 1: "బిస్మిల్లాహ్" అర్థం ఏమిటి?
ప్రశ్న2: క్రింది పదబంధాల అర్థాన్ని వివరిం చేయండి: ( الحمد لله ) అల్హమ్దు లిల్లాహి , ( رَبّ العالَمِين ) రబ్బిల్ ఆలమీన్ ( الصِّراط المستَقِيم ) సిరాతల్ ముస్తఖీమ్.
ప్రశ్న3: ఇబాదత్, ఇస్తిఆనత్ ను నిర్వచించండి
ప్రశ్న4: అల్లాహ్ అనుగ్రహించిన ప్రజలు ఎవరు? అల్లాహ్ వారికి ఏమి అనుగ్రహించాడు?
ప్రశ్న5: అల్లాహ్ ఆగ్రహమును పొందినవారు ఎవరు?
ప్రశ్న6: అల్లాహ్ ఎవరి గురించి తప్పుదారి పడినవారు అని వివరణ ఇచ్చాడు?
పద్నాల్గవ పాఠం
తషహ్హుద్ అర్థం వివరణ:
అత్తహియ్యాతు లిల్లాహి, వస్సలవాతు వత్తయ్యిబాతు, అస్సలాము అలైక అయ్యుహన్నబియ్యు వ రహ్మతుల్లాహి వ బరకాతుహు, అస్సలాము అలైనా వ అలా ఇబాదిల్లాహిస్సాలిహీన్, అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు, వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహూ వ రసూలుహు."సకల శరీర సంబంధమైన, ధన సంబంధమైన మరియు నోటి సంబంధమైన ఆరాధనలు అల్లాహ్ కు మాత్రమే చెందుతాయి. ఓ ప్రవక్తా! అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యాలు మరియు శుభాలు నీపై కురియుగాక! అలాగే మా పైనా మరియు పుణ్యాత్ములైన అల్లాహ్ దాసుల పైనా కురియుగాక. అల్లాహ్ తప్ప నిజమైన ఆరాధ్యుడు ఎవడూ లేడని నేను సాక్ష్యమిస్తున్నాను ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం అల్లాహ్ దాసుడు మరియు సందేశహరుడు అని నేను సాక్ష్యమిస్తున్నాను". )
అత్తహియ్యాతు లిల్లాహి: అల్లాహ్‌కి సమస్త నమస్కారాలు, స్మరణలు, గొప్పతనములు చెందును
అత్తహియ్యాతు "తహియ్యా" పదం బహువచనం. తహియ్యా అంటే గౌరవం, మహిమ. అర్థం: సమస్త గౌరవం, మహిమ, మరియు వందనాలు అల్లాహ్‌కి మాత్రమే చెందును.
సలవాతు అర్థం: ఇక్కడ "సలవాత్" అంటే నమాజులు అని అర్థం. కొంతమంది విశేషించారంటే, దీనికి ప్రార్థనలు (దుఆలు) అని కూడా అర్థం ఉంటుంది.
అత్తయ్యిబాతు: అల్లాహ్ స్వీకరించు శుభపురస్కారమైన మాటలతో మరియు క్రియలతో కూడిన సత్కర్మలు. అర్ధము : అల్లాహ్ పవిత్రమైన వాటిని తప్ప వేరేవాటిని స్వీకరించడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కేవలం పవిత్రమైనవి మాత్రమే అంగీకరిస్తాడు.
అస్సలాము అలైకుమ్ అయ్యుహన్నబియ్యు వరహ్మతుల్లాహి వబరకాతుహు : ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కొరకు సలామతీ కోసం చేసిన దుఆ, అందులో హానికారకమైన వాటి నుండి రక్షణ కలదు.మరియు కారుణ్యము కోసం చేసిన దుఆ, అందులో కావలసినది ప్రాప్తమగుట కలదు. బర్కత్ కొరకు చేసిన దుఆ అది ప్రతి మంచి విషయం యొక్క పెరుగుదల.
అస్సలాము అలైనా వ అలా ఇబాదిల్లాహిస్సాలిహీన : వారు అల్లాహ్ హక్కులు మరియు ఆయన దాసుల హక్కులను అనగా ప్రవక్తలు, దైవదూతలు మరియు విశ్వాసుల హక్కులను పాటించువారు. ఇది నమాజు చేసే వ్యక్తి కొరకు మరియు ప్రతి సత్కార్యశీల దాసుని కొరకు హానికరమైన వాటి నుండి రక్షణ కోసం చేసిన దుఆ.
అష్’హదు అన్’లా ఇలాహ ఇల్లల్లాహ్:
అష్హదు అంటే: నేను హృదయంతో ఒప్పుకొని, నాలుకతో పలికి, అవయవాలతో ఆచరించును.
లా ఇలాహ ఇల్లల్లాహ్: అంటే అల్లాహ్ తప్ప ఆరాధనకు అర్హుడైన నిజ ఆరాధ్యుడెవ్వరూ లేరు.
వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు: అంటే, నేను ఒప్పుకొనుచున్నాను ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క దాసుడు, కావున ఆయనను ఆరాధించరాదు. మరియు ఆయన అల్లాహ్ వద్ద నుండి పంపబడిన రసూల్ (ప్రవక్త), కావున ఆయనను తిరస్కరించరాదు; అంతేగాక, ఆయనకు విధేయత చూపించి ఆయనను అనుసరించాలి.
ప్రశ్నలు:
ప్రశ్న 1: కింది వాటి అర్ధాలను వివరించండి: (అత్తహియ్యాత్),(అస్సలవాతు), (అత్తయ్యిబాతు).
ప్రశ్న 2: మనం పలికే "అన్నబియ్యు" అనే ఈ పదంలో ఉద్దేశించిన అర్థం ఏమిటి? : (అస్సలాము అలైక అయ్యుహన్నబియ్యు వరహ్మతుల్లాహి వబరకాతుహు).
ప్రశ్న3: లా ఇలాహ ఇల్లల్లాహ్ యొక్క అర్ధము ఏమిటి?
ప్రశ్న4: అష్హదు అన్న ముహమ్మదర్రసూలుల్లాహ్ యొక్క అర్ధం ఏమిటి.
పదిహేనవ పాఠం ([36])
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం'పై దరూద్ పఠించడం యొక్క అర్ధం
‘(అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మద్ వ అలా ఆలి ముహమ్మద్,కమా సల్లైత అలా ఇబ్రాహీమ వఅలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదుమ్మజీద్’ అల్లాహుమ్మ బారిక్ అలా ముహమ్మద్ వ అలా ఆలి ముహమ్మద్ కమా బారక్త అలా ఇబ్రాహీమ వఅలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదుమ్మజీద్) (ఓ అల్లాహ్ !నీవు ఇబ్రాహీం పై మరియు ఆయన కుటుంబం వారిపై దరూద్ పంపినట్లే ముహమ్మద్'ను మరియు ఆయన కుటుంబముపై దరూద్ పంపించు. నిశ్ఛయంగా స్తోత్రానికి అర్హుడవు,ఘనత కలవాడవు నీవే. 'ఓ అల్లాహ్ !ఇబ్రాహీం పై ఆయన కుటుంబం పై శుభాలు కరుణించినట్లుగానే ముహమ్మద్' మరియు ఆయన కుటుంబంపై శుభాలు కురూపించు.నిశ్ఛయంగా స్తోత్రానికి అర్హుడవు,ఘనత కలవాడవు నీవే).
అల్లాహుమ్మ అంటే ఓ అల్లాహ్ అని అర్ధం.
సల్లీ అలా ముహమ్మద్" అంటే, అల్లాహ్ మలయిల్ ఆలాలో (పరలోక దైవదూతల సమూహంలో) ఆయనను ప్రశంసించు.
ఆలి ముహమ్మద్" అంటే, ఆయనకు సమీప సంబంధువులు మరియు ఆయన ధర్మాన్ని అనుసరించువారు.
వ బారిక్ అలా ముహమ్మద్" అంటే, ఆయనపై బరాకత్ను (శుభాలను) అవతరింపజేయు, అవి అనేక శ్రేయస్సు మరియు అభివృద్ధి.
హమీద్ అంటే: ప్రశంసించబడినవాడు, ఎందుకంటే ఆయన సంపూర్ణ గుణాలను కలిగి ఉండి, అపారమైన అనుగ్రహాన్ని ప్రదర్శించువాడు.
మజీద్ అంటే: మహిమ కలవాడు అది గొప్పతనము మరియు అధికారం.
ప్రశ్నలు:
ప్రశ్న 1: కింది వాటి అర్ధాలను వివరించండి: (అల్లాహుమ్మ),(హమీద్), (మజీద్).
ప్రశ్న2: ఖాళీలను పూరించండి:
1-ప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం మీద అల్లాహ్ చేసిన సలాత్ (ఆశీర్వాదాల) అర్థం: ..................................................................................................................................................................
2- ఆలి ముహమ్మద్ అంటే: .............................................................................................................................................................................................................
3- బర్కతు అది:.................................................................................................................................
4- (హమీద్),(మజీద్) ఈ రెండు నామములు ............................................................ యొక్క నామములలో నుంచి.
ఉపాధ్యాయుని కొరకు: ఈ పాఠం ద్వారాఉపాధ్యాయుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జీవిత చరిత్ర నుండి కొంత భాగాన్ని వివరిస్తూ, విద్యార్థుల హృదయాలలో ఆయనపైన ప్రేమను నాటాలి, ఆయనకు విధేయత చూపేలా ప్రేరేపించాలి, ఆయనను అనుసరించడం, ఆయనకు విరుద్ధంగా వ్యవహరించకుండా ఉండడం అనే అంశాలను నేర్పుకోవటానికి. ఎందుకంటే ఆయనకు విధేయత మరియు అనుసరణలో మహా విజయముండును, అలాగే ఆయనకు అవిధేయత మరియు వ్యతిరేకతలో స్పష్టమైన నాశనము మరియు తప్పిదము కలుగును. అలాగే, ఉపాధ్యాయుడు ప్రవక్తపై దరూద్ మరియు సలాం అధికంగా పఠించటానికి ప్రోత్సహించాలి, దీని గొప్ప ఫలితాలను విద్యార్థులకు వివరించాలి. చూడండి: పరిశీలించండి: ఇబ్ను ఖయ్యిమ్ అల్-జౌజీ (రహిమహుల్లాహ్) రచించిన "జలాఉల్-అఫ్హామి ఫీ ఫద్లిస్సలాతి వస్సలామి అలా ముహమ్మది ఖైరిల్ అనామి" .
Related books
All books
المناهج التعليمية - الصف الأول13 భాషలుالمناهجالتعليميةالمناهج التعليمية - الصف الأول
గ్రంథ వివరాలను చూడటానికి క్లిక్ చేయండి.
المناهج التعليمية - الصف الثاني12 భాషలుالمناهجالتعليميةالمناهج التعليمية - الصف الثاني
గ్రంథ వివరాలను చూడటానికి క్లిక్ చేయండి.
المناهج التعليمية - الصف الثالث11 భాషలుالمناهجالتعليميةالمناهج التعليمية - الصف الثالث
గ్రంథ వివరాలను చూడటానికి క్లిక్ చేయండి.
శీర్షిక: పాఠ్యాంశాలు, తౌహీద్ పుస్తకం (కితాబుత్తౌహీద్), విభాగము (ఆరు).8 భాషలుశీర్షిక: పాఠ్యాంశాలు, తౌహీద్ పుస్తకం (కితాబుత్తౌహీద్), విభాగము (ఆరు).
సంక్షిప్త సారాంశము: ఈ ధర్మశాస్త్రం సౌదీ అరేబియా రాజ్యంలో విద్యార్థులకు ఉద్దేశించిన పాఠ్యప్రణాళిక యొక్క శుద్ధీకరణ మరియు సంక్షిప్తీకరణగా పరిగణించబడుతుంది మరియు ఇది అనేక స్థాయిలుగా విభజించబడింది. ఈ అంశంలో ఏకేశ్వరోపాసన (తౌహీద్ ) పాఠ్యాంశములకు సంబంధించి విషయాలు ఉంటాయి మరియు ఇది పన్నెండు (12) విభాగములుగా విభజించబడ్డాయి. ఆరవ విభాగములో చేర్చబడిన ముఖ్యమైన అంశాలలో: నాలుగు నియమాల వివరణ, వాటి వెలుగులో కేవలం తౌహీదె రుబూబియత్ ను అంగీకరించటం ఇస్లాంలో ప్రవేశింపజేయదని,తౌహీదె ఉలూహియత్ అంటే ఆరాధన మహోన్నతుడైన అల్లాహ్ కు ప్రత్యేకించడం తప్పనిసరి అని ఒక విధ్యార్ధి తెలుసుకుంటాడు. బహుదైవారాధన నిర్వచనం, దాని రకాల…