Skip to content
సూరాల జాబితా /

هُود

هُود is chapter 11 of the Quran and has 123 verses. This page presents it in full in the Uthmani script, with a verse-by-verse translation of its meaning.

123 ఆయతులు సూరా సంఖ్య 11
ఆయత్‌కు వెళ్ళండి
తెలుగు · Muhammad
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ

الٓرۚ كِتَٰبٌ أُحۡكِمَتۡ ءَايَٰتُهُۥ ثُمَّ فُصِّلَتۡ مِن لَّدُنۡ حَكِيمٍ خَبِيرٍ

అలిఫ్ - లామ్ - రా. (ఇది) ఒక దివ్యగ్రంథం. దీని సూక్తులు (ఆయాత్) నిర్దుష్టమైనవి మరియు మహా వివేచనాపరుడు, సర్వం తెలిసినవాడు అయిన (అల్లాహ్) తరఫు నుండి వివరించబడ్డాయి;

Explanation & meanings · 1
  1. సూరతుల్ బఖరహ్ లోని మొదటి ఆయతు యొక్క ఫుట్‌నోట్ చూడండి.

أَلَّا تَعۡبُدُوٓاْ إِلَّا ٱللَّهَۚ إِنَّنِي لَكُم مِّنۡهُ نَذِيرٞ وَبَشِيرٞ

మీరు అల్లాహ్ ను తప్ప ఇతరులను ఆరాధించ కూడదని (ఓ ముహమ్మద్) ఇలా అను: "నిశ్చయంగా నేను, ఆయన (అల్లాహ్) తరఫు నుండి మీకు హెచ్చరిక చేసేవాడిని మరియు శుభవార్తలు ఇచ్చేవాడిని మాత్రమే!

وَأَنِ ٱسۡتَغۡفِرُواْ رَبَّكُمۡ ثُمَّ تُوبُوٓاْ إِلَيۡهِ يُمَتِّعۡكُم مَّتَٰعًا حَسَنًا إِلَىٰٓ أَجَلٖ مُّسَمّٗى وَيُؤۡتِ كُلَّ ذِي فَضۡلٖ فَضۡلَهُۥۖ وَإِن تَوَلَّوۡاْ فَإِنِّيٓ أَخَافُ عَلَيۡكُمۡ عَذَابَ يَوۡمٖ كَبِيرٍ

మరియు మీరు మీ ప్రభువును క్షమాభిక్ష వేడుకుంటే, తరువాత ఆయన వైపుకు పశ్చాత్తాపంతో మరలితే, ఆయన మీకు నిర్ణయించిన గడువు వరకు మంచి సుఖసంతోషాలను ప్రసాదిస్తాడు. మరియు అనుగ్రహాలకు అర్హుడైన ప్రతి ఒక్కనికీ ఆయన తన అనుగ్రహాలను ప్రసాదిస్తాడు కానీ, మీరు వెనుదిరిగితే! నిశ్చయంగా, ఆ గొప్ప దినమున మీపై రాబోయే శిక్షకు నేను భయపడుతున్నాను!

إِلَى ٱللَّهِ مَرۡجِعُكُمۡۖ وَهُوَ عَلَىٰ كُلِّ شَيۡءٖ قَدِيرٌ

అల్లాహ్ వైపునకే మీ మరలింపు ఉంది. మరియు ఆయన ప్రతిదీ చేయగల సమర్ధుడు."

أَلَآ إِنَّهُمۡ يَثۡنُونَ صُدُورَهُمۡ لِيَسۡتَخۡفُواْ مِنۡهُۚ أَلَا حِينَ يَسۡتَغۡشُونَ ثِيَابَهُمۡ يَعۡلَمُ مَا يُسِرُّونَ وَمَا يُعۡلِنُونَۚ إِنَّهُۥ عَلِيمُۢ بِذَاتِ ٱلصُّدُورِ

వినండి! వాస్తవానికి వారు ఆయన నుండి దాక్కోవటానికి తమ వక్షాలను త్రిప్పుకుంటున్నారు. జాగ్రత్త! వారు తమ వస్త్రాలలో తమను తాము కప్పుకున్నప్పటికీ, ఆయన (అల్లాహ్) కు వారు దాచే విషయాలు మరియు వెలిబుచ్చే విషయాలూ అన్నీ బాగా తెలుసు. నిశ్చయంగా, ఆయనకు హృదయాలలో ఉన్నవి (రహస్యాలు) కూడా బాగా తెలుసు.

Explanation & meanings · 1
  1. చూడండి, 8:55.