11 : 63
قَالَ يَٰقَوۡمِ أَرَءَيۡتُمۡ إِن كُنتُ عَلَىٰ بَيِّنَةٖ مِّن رَّبِّي وَءَاتَىٰنِي مِنۡهُ رَحۡمَةٗ فَمَن يَنصُرُنِي مِنَ ٱللَّهِ إِنۡ عَصَيۡتُهُۥۖ فَمَا تَزِيدُونَنِي غَيۡرَ تَخۡسِيرٖ
(సాలిహ్) అన్నాడు: "ఓ నా జాతి సోదరులారా! ఏమీ? మీరు చూడరా (ఆలోచించరా)? నేను నా ప్రభువు యొక్క స్పష్టమైన (నిదర్శనంపై) ఉన్నాను. మరియు ఆయన నాకు తన కారణ్యాన్ని ప్రసాదించాడు. ఇక నేను ఆయన (అల్లాహ్) ఆజ్ఞను ఉల్లంఘిస్తే, అల్లాహ్ కు విరుద్ధంగా నాకు ఎవడు సహాయ పడగలడు? మీరు నాకు నష్టం తప్ప మరేమీ అధికం చేయటం లేదు.
Explanation & meanings · 1
- అల్లాహ్ (సు.తా.) ఆజ్ఞను ఉల్లంఘించటం, అంటే ఇక్కడ: "సత్యం వైపునకు మరియు ఏకైక ఆరాధ్యుడు, అల్లాహుతా'ఆలా వైపునకు పిలవటాన్ని మానుకోవటం." ఇదే కదా! సత్యతిరస్కారులు కోరుతున్నది. ఇంకా చూడండి, 4:48.