Skip to content
هُود /

ఆయత్ 27

11 : 27

ఆయత్ 27 of هُود (11 : 27). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.

هُود ఆయతులు 123
సూరా · هُود
తెలుగు · Muhammad
11 : 27

فَقَالَ ٱلۡمَلَأُ ٱلَّذِينَ كَفَرُواْ مِن قَوۡمِهِۦ مَا نَرَىٰكَ إِلَّا بَشَرٗا مِّثۡلَنَا وَمَا نَرَىٰكَ ٱتَّبَعَكَ إِلَّا ٱلَّذِينَ هُمۡ أَرَاذِلُنَا بَادِيَ ٱلرَّأۡيِ وَمَا نَرَىٰ لَكُمۡ عَلَيۡنَا مِن فَضۡلِۭ بَلۡ نَظُنُّكُمۡ كَٰذِبِينَ

అప్పుడు అతని జాతివారిలో సత్యతిరస్కారులైన నాయకులు: "నీవు కూడా మా మాదిరిగా ఒక సాధారణ మానవుడవే తప్ప, నీలో మరే ప్రత్యేకతను మేము చూడటం లేదు. మరియు వివేకం లేని నీచమైన వారు తప్ప ఇతరులు నిన్ను అనుసరిస్తున్నట్లు కూడా మేము చూడటం లేదు. మరియు మీలో మా కంటే ఎక్కువ ఘనత కూడా మాకు కనబడటం లేదు. అంతేగాక మీరు అసత్యవాదులని మేము భావిస్తున్నాము." అని అన్నారు.

Explanation & meanings · 2
  1. ఈ విషయం ఇంతకు ముందు కూడా విశదీకరించబడింది. సత్యతిరస్కారులకు మానవుడు దైవప్రవక్తగా పంపబడటం ఆశ్చర్యకరంగా ఉంది. ఈ రోజులలో కొందరు బిద్'అత్ చేసేవారికి కూడా ఈ విషయం ఆశ్చర్యకరంగా ఉంది, కావున వారు ము'హమ్మద్ ('స'అస) ను మానవునిగా అంగీకరించరు.
  2. చూడండి, 43:23.