11 : 40
حَتَّىٰٓ إِذَا جَآءَ أَمۡرُنَا وَفَارَ ٱلتَّنُّورُ قُلۡنَا ٱحۡمِلۡ فِيهَا مِن كُلّٖ زَوۡجَيۡنِ ٱثۡنَيۡنِ وَأَهۡلَكَ إِلَّا مَن سَبَقَ عَلَيۡهِ ٱلۡقَوۡلُ وَمَنۡ ءَامَنَۚ وَمَآ ءَامَنَ مَعَهُۥٓ إِلَّا قَلِيلٞ
చివరకు మా ఆజ్ఞ వచ్చింది మరియు పొయ్యి పొంగింది (జల ప్రవాహాలు భూమిని చీల్చుకొని రాసాగాయి). అప్పుడు మేము (నూహ్ తో) అన్నాము: "ప్రతి జాతి (పశువుల) నుండి రెండు (ఆడ మగ) జంటలను మరియు నీ కుటుంబం వారిని - ఇది వరకే సూచించబడిన వాడు తప్ప - మరియు విశ్వసించిన వారిని, అందరినీ దానిలోకి (నావలోకి) ఎక్కించుకో!" అతనిని విశ్వసించిన వారు కొందరు మాత్రమే.
Explanation & meanings · 1
- ఇది ఇబ్నె-కసీ'ర్ తాత్పర్యం. చూడండి, 54:11-12. నూ'హ్ తుపాన్ వచ్చినప్పుడే ఆఫ్రీఖా మరియు యూరోప్ ల మధ్య ఉన్న కొండలోయలో నీరు వచ్చి మెడిటరేనియన్ సముద్రం ఏర్పడి ఉండవచ్చని కొందరు వ్యాఖ్యాతల అభిప్రాయం. నూ'హ్ కుటుంబంవారిలో అతని ముగ్గురు కుమారులు సామ్, హామ్, మరియు యాఫస్ మరియు వారి భార్యలుండిరి. (ఇబ్నె-కసీ'ర్). వారి ప్రార్థనల కొరకు చూడండి, 23:28-29.