11 : 46
قَالَ يَٰنُوحُ إِنَّهُۥ لَيۡسَ مِنۡ أَهۡلِكَۖ إِنَّهُۥ عَمَلٌ غَيۡرُ صَٰلِحٖۖ فَلَا تَسۡـَٔلۡنِ مَا لَيۡسَ لَكَ بِهِۦ عِلۡمٌۖ إِنِّيٓ أَعِظُكَ أَن تَكُونَ مِنَ ٱلۡجَٰهِلِينَ
ఆయన (అల్లాహ్) జవాబిచ్చాడు: "ఓ నూహ్! అతడు నిశ్చయంగా, నీ కుటుంబంలోని వాడు కాడు. నిశ్చయంగా, అతడి పనులు మంచివి కావు. కావున నీకు తెలియని విషయం గురించి నన్ను అడగకు. నీవు కూడా మూఢులలో చేరిన వాడవు కావద్దు. అని నేను నిన్ను ఉపదేశిస్తున్నాను."
Explanation & meanings · 3
- ఎవరైతే విశ్వసించరో వారు ఒక ప్రవక్త ('అ.స.) యొక్క తండ్రి గానీ, కుమారుడు గానీ, లేక భార్య గానీ, అతని కుటుంబానికి చెందిన వారు కాజాలరు.
- ఎవరైతే విశ్వసించి, సత్కార్యాలు చేయరో వారిని అల్లాహ్ (సు.తా.) శిక్ష నుండి, దైవప్రవక్త ('అ.స.) కూడా రక్షించలేరు. అలాంటప్పుడు ఈ కాలంలో కొందరు ఏ విధంగానైతే అపోహలలో పడి ఉన్నారో వారిని, వారి పీర్లు, సజ్జాదాలు, వలీలు రక్షిస్తారని అనేది ఎలా సంభవం కాగలదు?
- దీనితో స్పష్టమయ్యేది ఏమిటంటే దైవప్రవక్తలకు అగోచర జ్ఞానం ఉండదు. అగోచర జ్ఞానం కేవలం అల్లాహుతా'ఆలా కు మాత్రమే ఉంది. ప్రవక్తలకు కేవలం అల్లాహుతా'ఆలా వ'హీ ద్వారా తెలిపిన జ్ఞానం మాత్రమే ఉంటుంది.