Skip to content
సూరాల జాబితా /

يُوسُف

يُوسُف is chapter 12 of the Quran and has 111 verses. This page presents it in full in the Uthmani script, with a verse-by-verse translation of its meaning.

111 ఆయతులు సూరా సంఖ్య 12
ఆయత్‌కు వెళ్ళండి
తెలుగు · Muhammad
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ

الٓرۚ تِلۡكَ ءَايَٰتُ ٱلۡكِتَٰبِ ٱلۡمُبِينِ

అలిఫ్ - లామ్ - రా. ఇవి స్పష్టమైన గ్రంథ ఆయతులు.

Explanation & meanings · 1
  1. సూరతుల్ బఖరహ్ లోని మొదటి ఆయతు యొక్క ఫుట్‌నోట్ చూడండి.

إِنَّآ أَنزَلۡنَٰهُ قُرۡءَٰنًا عَرَبِيّٗا لَّعَلَّكُمۡ تَعۡقِلُونَ

వాస్తవంగా, మీరు బాగా అర్థం చేసుకోవాలని, మేము ఈ ఖుర్ఆన్ ను అరబ్బీ భాషలో అవతరింపజేశాము.

Explanation & meanings · 1
  1. ప్రతి దివ్యగ్రంథం ఆ ప్రాంతపు ప్రజల భాషలోనే అవతరింపజేయబడింది. దివ్యగ్రంథాలు ప్రజల మార్గదర్శకత్వం కొరకే అవతరింపజేయబడతాయి. కావు అల్లాహ్ (సు.తా.) ఈ ఉత్తమ దివ్యగ్రంథం (ఖుర్ఆన్), ఉత్తమ భాష 'అరబ్బీలో, ఉత్తమ ప్రవక్త ము'హమ్మద్ ('స'అస)పై, ఉత్తమమైన దైవదూత జిబ్రీల్ ('అ.స.) ద్వారా, ఉత్తమమైన నగరం మక్కాలో, ఉత్తమమైన నెల రమ'దాన్ లో అవతరింపజేశాడు. చూడండి, 13:37, 14:4.

نَحۡنُ نَقُصُّ عَلَيۡكَ أَحۡسَنَ ٱلۡقَصَصِ بِمَآ أَوۡحَيۡنَآ إِلَيۡكَ هَٰذَا ٱلۡقُرۡءَانَ وَإِن كُنتَ مِن قَبۡلِهِۦ لَمِنَ ٱلۡغَٰفِلِينَ

(ఓ ప్రవక్తా!) మేము ఈ ఖుర్ఆన్ ద్వారా అవతరింపజేసిన కథలలో ఉత్తమమైన గాథను నీకు వినిపించ బోతున్నాము మరియు ఇంతకు ముందు నీవు దీనిని ఎరుగవు.

Explanation & meanings · 1
  1. ప్రవక్తలకు అగోచరజ్ఞానం ఉండదని ఇక్కడ మరొకసారి విశదీకరించబడింది. చూడండి, 4:113 మరియు 43:52.

إِذۡ قَالَ يُوسُفُ لِأَبِيهِ يَٰٓأَبَتِ إِنِّي رَأَيۡتُ أَحَدَ عَشَرَ كَوۡكَبٗا وَٱلشَّمۡسَ وَٱلۡقَمَرَ رَأَيۡتُهُمۡ لِي سَٰجِدِينَ

(జ్ఞాపకం చేసుకోండి) యూసుఫ్ తన తండ్రితో: "ఓ నాన్నా! నేను వాస్తవంగా (కలలో) పదకొండు నక్షత్రాలను, సూర్యుణ్ణి మరియు చంద్రుణ్ణి చూశాను; వాటిని నా ముందు సాష్టాంగ పడుతున్నట్లు చూశాను." అని అన్నప్పుడు!

قَالَ يَٰبُنَيَّ لَا تَقۡصُصۡ رُءۡيَاكَ عَلَىٰٓ إِخۡوَتِكَ فَيَكِيدُواْ لَكَ كَيۡدًاۖ إِنَّ ٱلشَّيۡطَٰنَ لِلۡإِنسَٰنِ عَدُوّٞ مُّبِينٞ

(అతని తండ్రి) అన్నాడు: "ఓ నా చిన్న ప్రియకుమారుడా! నీ స్వప్నాన్ని నీ సోదరులకు తెలుపకు. ఎందుకంటే వారు నీకు విరుద్ధంగా కుట్ర పన్నవచ్చు! నిశ్చయంగా, షైతాన్ మానవునికి బహిరంగ శత్రువు.

Explanation & meanings · 1
  1. య'అఖూబ్ ('అ.స.) ఒక ప్రవక్త, కాబట్టి తన కుమారుని స్వప్నాన్ని వెంటనే అర్థం చేసుకున్నారు.