الفضل بن العباس
الإسم
అల్ ఫజల్ బిన్ అల్ అబ్బాస్
اسم الشهرة
అల్ ఫజల్ బిన్ అల్ అబ్బాస్ రజియల్లాహు అన్హుమా
نبذة مختصرة
ఫజల్ బిన్ అబ్బాస్ బిన్ అబ్దల్-ముత్తలిబ్ బిన్ హాషిం బిన్ అబ్దుమునాఫ్ ఖుర్షి హాషిమీ ఒక గొప్ప సహాబి. కునియతు అబూముహమ్మద్ మరియు అబూ అబ్దుల్లా. ఆయన దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క బాబాయి కుమారుడు. అతను అబ్బాస్ యొక్క పెద్ద కుమారుడు. అబ్బాస్ కునియత్ ఇతని పేరు మీద ఉంది. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో పాటు హిజ్రీ 8వ సంవత్సరంలో మక్కావిజయంలో పాల్గొన్నారు మరియు ప్రవక్తతో హునైన్ యుద్ధంలో కూడా పాల్గొన్నారు. హునైన్ రోజున ప్రజలు పారిపోయినప్పుడు, ప్రవక్తకు అండగా నిలిచిన తమకుటుంబ సభ్యులు మరియు సహాబాలతో స్థిరంగా ఉన్నారు. హజ్జతుల్ విదా సందర్భంగా ప్రవక్తతో ఉన్నారు. ముజ్దలిఫా నుండి మినా వరకు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వెనుక కూర్చుని ప్రయాణించే అదృష్టం పొందారు. అందుకే అతను దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వెనుక కూర్చునే వ్యక్తిగా పిలువబడ్డారు. ప్రవక్త మరణ సమయంలో కూడా ఉన్నారు. మరియు ప్రవక్తకు గుస్ల్ ఇవ్వడంలో సహాయం అందించారు. అలీ రజియల్లాహు అన్హుకు నీరు అందిస్తూ ఉన్నారు. ఈయన ఎప్పుడు మరణించారు అనే దానిపై కథకులు భిన్నమైన అభిప్రాయాలు కలిగియున్నారు. ఈ విషయంలో చాలా వరకు సరైన కథనం ఏమిటంటే, అతను జిహాద్ నిమిత్తం షామ్ నగరానికి బయలుదేరారు మరియు హిజ్రీ 18వ సంవత్సరంలో ఉమర్ రజియల్లాహు అన్హు ఖలీఫా సమయంలో ఉర్దూన్ ప్రాంతంలో తాఊనే-అమ్వాస్కు (ప్లేగు వ్యాది)కి గురై మరణించారు.