أم كلثوم بنت نبينا محمد بن عبد الله القرشية الهاشمية
الإسم
ఉమ్మె కుల్సూమ్ బిన్తె మన దైవప్రవక్త ముహమ్మద్ బిన్ అబ్దుల్లాహ్ అల్ ఖురషియ్య అల్ హాషిమి సల్లల్లాహు అలైహివ సల్లం.
اسم الشهرة
ఉమ్మె కుల్సూమ్ రజియల్లాహు అన్హా.
نبذة مختصرة
ఉమ్మె కుల్సూమ్ బిన్తె ముహమ్మద్ బిన్ అబ్దుల్లా బిన్ అబ్దుల్'ముత్తలిబ్ ఖుర్షియా హాషిమియా. ఆమె తల్లిపేరు ఖదీజా బిన్తె ఖువైలిద్.ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దైవదౌత్యానికి ముందు ఉతైబా బిన్ అబూ లహబ్'ను ఆమె వివాహం చేసుకున్నారు. ప్రవక్తకు దైవదౌత్యం లభించి అల్లాహ్ సూరె లహబ్ ను వెల్లడించినప్పుడు అతని తండ్రి అబూలహబ్ ఉతైబాతో:నువ్వు ఒకవేళ ముహమ్మద్ కుమార్తెకు విడాకులు ఇవ్వకపోతే మన మధ్య సంబంధం తెగిపోతుంది అని చెప్పాడు. దాంతో ఆమెకు విడాకులు ఇచ్చాడు, కానీ అప్పటికి ఇంకా ఆమె కాపురానికి వెళ్లలేదు. దీని తరువాత ఆమె తన తండ్రి సల్లల్లాహు అలైహి వసల్లంతో మక్కాలో నివసించడం ప్రారంభించారు. ఆమె తన తల్లి ఇస్లాం స్వీకరించినప్పుడే ముస్లిం అయింది. స్త్రీలు ప్రవక్తతో బైఅత్ చేసినప్పుడు ఆమె కూడా తమ సోదరీమణులతో బైఅత్ చేసి, హిజ్రత్ చేసి మదీనాకు వచ్చారు. అప్పుడు ఆమె ఇక్కడ నివసించడం ప్రారంభించారు. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రుఖియా రజియల్లాహు అన్హా మరణించినప్పుడు, దైవప్రవక్త ఆమెను ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ తో వివాహం జరిపించారు. ఇది రబీఉల్ అవ్వల్ 3 హిజ్రీకి సంబంధించిన విషయం. అదే సంవత్సరంలో జమాదిల్అఖిరాలో ఆమె కాపురానికి వెళ్ళింది .మరణం వరకు ఆయన వివాహంలోనే ఆమె జీవించింది. హిజ్రీ 9వ సంవత్సరంలో మరణించింది. ఆమెకు ఉస్మాన్ నుండి సంతానం కలుగలేదు.