Skip to content

الحسن بن علي بن أبي طالب

الإسم

అల్ హసన్ బిన్ అలీ బిన్ అబూ తాలిబ్.

اسم الشهرة

అల్ హసన్ బిన్ అలీ రజియల్లాహు అన్హుమా.

نبذة مختصرة

హసన్ బిన్ అలీ బిన్ అబూ తాలిబ్ హాష్మీ, ఖుర్షీ, అబూ ముహమ్మద్ అల్లాహ్ ప్రవక్త - సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క మనవడు. హిజ్రీ 3లో జన్మించారు. ఖులఫాయే రాషిదీన్ లో ఐదవవారు మరియు చివరివారు కూడా.మదీనా మునవ్వరాలో జన్మించారు. అతని తల్లి ఫాతిమా అజ్జొహ్రా, అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క కుమార్తె. ఇతను ఆమెకు పెద్ద కుమారుడు. మొదటివారు. అతను చాలా వివేకం, సహనం మరియు ప్రేమనిండిన వ్యక్తి. ఆయన చాలా సుస్పష్టమైన అందమైన భాష మాట్లాడేవారు, మరియు అందమైన వ్యక్తిత్వం కలిగి ఉండేవారు. అతను కాలినడకన ఇరవై హజ్'లు చేసారు. 41వ హిజ్రీ సంవత్సరంలో స్వయంగా ఖిలాఫత్ నుండి తొలిగిపోయి దాన్ని ముఆవియాకు అప్పగించారు. ఈ సంవత్సరం ముస్లింల విభేదాలకు ముగింపు అయినందున, దీనిని ఆముల్ జమాఅతుగా(ఏకీకరణ సంవత్సరం) అని పిలుస్తారు. దీని తరువాత అతను మదీనాకు వెళ్లి అక్కడే ఉన్నారు, ఒక అభిప్రాయం ప్రకారం ఆయణ విషం కలిపిన ఆహారం తినడం ద్వారా మరణించారు అని చెప్పబడుతుంది. ఈయన ఖలీఫా కాలం ఆరు నెలల ఐదు రోజులు. మరియు ఈయన హిజ్రీ 50వ సంవత్సరంలో మరణించారు.

المراجع

ఇంకా (1)
مشاهير علماء الأمصار (ص: 24) الاستيعاب في معرفة الأصحاب (1/ 383) تاريخ دمشق (13/ 163) تهذيب الأسماء واللغات (1/ 158) الأعلام للزركلي (2/ 199)