الحسن بن يسار البصري
الإسم
అల్ హసన్ బిన్ యసార్ అల్ బసరి.
اسم الشهرة
అల్ హసన్ బస్రీ.
نبذة مختصرة
హసన్ బిన్ యసార్ అల్ బస్రీ. అబూ సయీద్ ఆయన కునియతు. ఇతను పెద్ద సంఖ్యలో హదీసులను ఉల్లేఖించిన విశ్వసనీయ ఫఖీహ్ మరియు తాబయీగా గతించారు.హిజ్రీ 21న మదీనాలో జన్మించారు. ఇతను బస్రా వాసులకు ఇమామ్ మరియు ఆ కాలంలో మొత్తం ఉమ్మతు యొక్క గొప్ప ఇస్లామిక్ పండితుడుగా ఖ్యాతి ఘటించారు. అతను భాషా ప్రావీణ్యులు, ధైర్యవంతులు, ఫఖీహ్ గా పరింగణించబడ్డారు. బస్రాలో నివసించారు. అతని గంభీరత ప్రజల హృదయాల్లో లోతుగా ఉండేది, అతను పాలకుల వద్దకు వెళ్లి వారికి మంచిని ఆదేశిస్తూ చెడును నిరోధించేవారు. ఎవరనేది పట్టించుకునేవారు కాదు. ఆయన చాలాసార్లు హజ్జాజ్ బిన్ యూసుఫ్ ను కూడా ఎదుర్కొన్నారు, కానీ ప్రతిసారీ అతని దుర్మార్గం నుండి రక్షించబడ్డారు. ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ ఖలీఫా అయినప్పుడు అతను హసన్ బస్రీకి ఇలా లేఖ వ్రాసారు: ఖలీఫా యొక్క భారం నా భుజాలపై మోపబడింది, కాబట్టి నాకు సహాయం చేసే వారిని కొంతమందిని తెలియజేయండి. దానికి హసన్ బస్రీ సమాధానమిస్తూ: ప్రపంచాన్ని కోరుకునే వ్యక్తులకు సంబంధించినంతవరకు, మీకు అలాంటి వ్యక్తుల అవసరం లేదు, పరలోకం కోరుకునే వ్యక్తులు మీ వద్దకు రాడానికి ఇష్టపడరు. కాబట్టి మీరు సహాయం కోసం అల్లాహ్ ను ప్రార్థించండి. అతను హిజ్రీ శకం110 వ సంవత్సరంలో మరణించారు.