حذيفة بن حسل بن جابر العبسي
الإسم
హుజైఫా బిన్ హసల్ బిన్ జాబిర్ అల్ అబసీ
اسم الشهرة
హుజైఫా బిన్ అల్ యమాన్ రజియల్లాహు అన్హు.
نبذة مختصرة
హుజైఫా బిన్ యమాన్ అల్-అబసి. అతని తండ్రి ఒక వ్యక్తిని చంపాడు, కాబట్టి ఆయన భయంతో మదీనాకు పారిపోయాడు మరియు బనుఅబ్ద్ అల్-అష్హల్ తో కలిసిపోయాడు. దీని తరువాత ప్రజలు అతన్ని అల్-యమాన్ అని పిలవడం ప్రారంభించారు, ఎందుకంటే అతను యమన్ జాతి ప్రజలతో స్నేహం చేశాడు. ఆ తరువాత హుజైఫా తల్లిని వివాహం చేసుకున్నాడు రజియల్లాహు అన్హు -మరియు హుజైఫా రజియల్లాహు అన్హు మదీనాలోనే జన్మించారు. తరువాత తండ్రీ కొడుకులిద్దరూ ముస్లింలయ్యారు. హుజైఫా రజియల్లాహు అన్హు ఖందకం మరియు ఆ తదుపరి యుద్ధాలలో పాల్గొన్నారు. ఉమర్ - రజియల్లాహు అన్హు - అతన్ని మదాయిన్ గవర్నర్ గా చేసారు మరియు అతను మరణించే వరకు అక్కడే ఉన్నారు. ఉస్మాన్ రజియల్లాహు అన్హు హత్య మరియు అలీ రజియల్లాహు అన్హు బైఅత్ చేసిన తరువాత నలభై రోజుల తరువాత అతను మరణించారు. సహీహ్ బుఖారీ మరియు సహీహ్ ముస్లింలో ఇలా ఉంది అబూదర్దా-రజియల్లాహు అన్హు - అల్ ఖమాను ఇలా అడిగారు:రహస్యం తెలిసిన వ్యక్తి అతనకి తప్ప మరెవరికి తెలియని వ్యక్తి మీ మధ్యలో లేరా? అతను నిజానికి హుజైఫా - రజియల్లాహు అన్హు గురించి అడిగారు. సహీహ్ బుఖారీ మరియు సహీహ్ ముస్లింలలో ఉమర్ - రజియల్లాహు అన్హు హుజైఫా రజియల్లాహు అన్హు -తో ఫిత్నా గురించి అడిగారు. హుజైఫా రజియల్లాహు అన్హు - ఇరాఖ్ లోని అన్నీ యుద్ధాలలో పాల్గొన్నారు. అతను హిజ్రీ శకం 36 వ సంవత్సరంలో మరణించారు.